6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 49 స్థానాల్లో ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల క్రతువులో మరో అంకం ముగిసింది. సోమవారం ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో అక్కడక్కడలా స్వల్ప ఘర్షణలు, ఒడిశాలో కొన్నిచోట్ల ఈవీఎంలలో చిన్న సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 59.06 శాతం పోలింగ్ నమోదైంది.
పశి్చమబెంగాల్లో అత్యధికంగా 73.14, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూ కశీ్మర్‌లోని బారాముల్లాలో ఏకంగా 59 శాతం పోలింగ్ నమోదవడం విశేషం! ఇది ఆ లోక్‌సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత నాలుగు విడతల్లో కలిపి 66.95 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారంతో జమ్మూ కశీ్మర్, మహారాష్ట్రల్లో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తమ్మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 428 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న ఆరు, ఏడో విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
బెంగాల్లో ఘర్షణలు
పశ్చిమబెంగాల్లో పలుచోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒడిశాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకుని డ్రైవర్‌ను నరికి చంపారు. యూపీలో 14 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఎలాంటి ఘర్షణలూ లేకుండా ముగిసింది. ముంబై సౌత్ పరిధిలో ఒకొ పోలింగ్ బూత్‌లో 56 ఏళ్ల ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, కౌశల్ కిశోర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, ప్రతాప్‌సింగ్‌వర్మ తదితరులు ఐదో విడతలో బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment