49 స్థానాలకు 20న పోలింగ్
ఇంటి వద్దే ఓటేసిన అద్వానీ, మన్మోహన్
ముంబై/లక్నో: సార్వత్రిక సమరంలో ఐదో దశకు సంబంధించిన ప్రచారపర్వం శనివారం ముగిసింది. ఐద దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు 20వ తేదీన పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పోటీచేస్తున్న అమేథీ స్థానాల్లోనూ పోలింగ్ జరగనుంది. జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో నిలిచారు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్‌ముంబై), సాధ్వి నిరంజన్ జ్యోతి(లక్నో), శంతను ఠాకూర్(పశ్చిమబెంగాల్‌లోని బంగావ్), ఎల్‌జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్‌పాశ్వాన్(బిహార్‌లోని హాజీపూర్), ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సర ణ్) ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటేసే సౌకర్యం కల్పించడంతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, మాజీ కేంద్రమంత్రి మురళీమనో హర్ జోషిలు ఇప్పటికే ఇంటి వద్దే ఓటేశారు.
Comments
Please login to add a commentAdd a comment