end campaign
-
ఢిల్లీ ప్రచారానికి... నేటితో తెర
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అగ్రనేతలంతా ఢిల్లీ ప్రచారంలోనే ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్లు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ సాగుతోంది. ప్రధాని మోదీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్‌పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డుపడుతోందంటూ దుయ్యబడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మొదలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీలు భారీ బహిరంగ సభలతో పాటు, మూడేసి నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందంటూ ప్రచార సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంగా పేరొందింన ఆప్ మరోసారి ఢిల్లీ పీఠం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరెన్ని హామీలు ఇచ్చినా, గెలిచేది మాత్రం తామేనంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆప్‌కు మద్దతుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో మమేకం అవుతూ.. పదేళ్లలో ఆప్ ఇచ్చిన ప్రతి వాగ్థానాన్ని అమలు చేసిందని గుర్తు చేస్తూ, మరోసారి ఆప్‌కు అవకాశం ఇవ్వాలని భగవంత్‌మాన్ అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నడుంబిగించారు. పదేళ్లలో ఢిల్లీ అభివృద్ధి చెందలేదని, బీజేపీ వచ్చినా అభివృద్ధి సూన్యమేనంటూ ప్రచారసభల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మాత్రమే ఢిల్లీ అభివృద్ధిలో పరుగులు తీసిందని గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.సోషల్ మీడియాలో హోరాహోరీబీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుంటుందని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు ఆప్ నేతలు ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చే వరకూ బలహీన వర్గాల వారిని పట్టించుకున్న వారు లేరని, ఢిల్లీ లాంటి మహానగరంలో పాఠశాలల రూపురేఖలు మార్చి ప్రైవేటుగా ధీటుగా విద్యను అందిస్తున్నామంటూ ఆప్ బదిలిస్తుంది. మెట్రో, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీలో జరిగిందని కాంగ్రెస్ చెప్పుకుంటుడగా.. బీజేపీ, ఆప్‌లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ బీజేపీ ఆరోపిస్తుండగా.. అంతుపట్టని అవినీతి, ఈవీఎంల ట్యాంపరింగ్, మతకల్లోహాలకు బీజేపీ కేరాఫ్ అంటూ ఆప్, కాంగ్రెస్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రతిఘటిస్తున్నాయి. నేటితో ఆఖరు5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సొమవారంతో ప్రచారం పర్వం ముగియనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలకనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లకు చెందిన పార్టీల నేతలంతా వారి వారి బాధ్యతలలో నిమగ్నమైయ్యారు. సుమారు 50కి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరీ ఎన్నికల హీట్‌ను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు 8న వెల్లడవుతాయి. -
Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో ఆరో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో ప్రచారం గురువారంతో ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్ శనివారం జరగనుంది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హరియాణాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు. -
Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
ముంబై/లక్నో: సార్వత్రిక సమరంలో ఐదో దశకు సంబంధించిన ప్రచారపర్వం శనివారం ముగిసింది. ఐద దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు 20వ తేదీన పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పోటీచేస్తున్న అమేథీ స్థానాల్లోనూ పోలింగ్ జరగనుంది. జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో నిలిచారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్‌ముంబై), సాధ్వి నిరంజన్ జ్యోతి(లక్నో), శంతను ఠాకూర్(పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్‌పాశ్వాన్(బిహార్‌లోని హాజీపూర్), ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సర ణ్) ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటేసే సౌకర్యం కల్పించడంతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ కేంద్రమంత్రి మురళీమనో హర్ జోషిలు ఇప్పటికే ఇంటి వద్దే ఓటేశారు. -
మైకులు కట్.. ప్రచార బృందాల తిరుగుముఖం
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం గడువు శనివారం సాయంత్రం ముగిసింది. సుమారు 20 రోజులుగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు తిరుగుముఖం పట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, టీడీపీతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండటంతో.. ప్రచార పర్వంలో ఆయనే అంతా తానై వ్యవహరించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని 70 మంది ఇన్చార్జీలు శానంపూడి సైదిరెడ్డి పక్షాన ప్రచార, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగించినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న హుజూర్నగర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు శ్రమిస్తున్న బీజేపీ కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు మూలంగా పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం కూడా ప్రస్తుత ఉప ఎన్నికలో పోటీ చేస్తుండగా,నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు.28 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో..ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇదిలాఉంటే సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్న బాబీ జిందాల్
లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. 2016లో జరగనున్న అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఆయన.. మంగళవారం తన ప్రచారాన్ని నిలిపివేశాడు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ తరపున మరో అభ్యర్థిని తాను బలపరచదలచుకోలేదన్నారు. అయితే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. అధ్యక్ష రేసు కోసం ఎంతో సమయాన్ని విధానాల తయారీకి, ఇతరత్రా విషయాల కోసం వెచ్చించినట్లు వెల్లడించాడు. అయితే ఇది తనకు సరైన సమయం కానందున రేసు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలిపాడు. బాబీ జిందాల్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున ఇంకా బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. బాబీ జిందాల్ తన ప్రచారంలో మొదటగా ఎన్నికలు జరిగే లోవా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అయితే అక్కడి ఓటర్ల నుంచి ఆశించినంత మేర ఆదరణ జిందాల్‌కు లభించలేదు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న బలమైన ఇతర అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ల నుంచి ఎదురవుతన్న పోటీలో జిందాల్ వెనుకబడ్డాడు. నిధుల సమీకరణలో కూడా జిందాల్‌కు నిరాశ తప్పలేదు. వీటన్నింటి దృష్ట్యా ప్రాక్టికల్‌గా ఆలోచించి జిందాల్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.