Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం | Lok Sabha Election 2024: Campaigning ends for phase 6 of Lok Sabha polls | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం

Published Fri, May 24 2024 5:21 AM | Last Updated on Fri, May 24 2024 5:22 AM

Lok Sabha Election 2024: Campaigning ends for phase 6 of Lok Sabha polls

6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 స్థానాలకు శనివారం జరగనున్న పోలింగ్‌

న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో ఆరో విడత పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో ప్రచారం గురువారంతో ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్‌ శనివారం జరగనుంది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హరియాణాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్‌ జరగనుంది.  

బరిలో ముఖ్య నేతలు 
బీజేపీ నేతలు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(హరియాణాలోని కర్నాల్‌), ధర్మేంద్ర ప్రధాన్‌(ఒడిశాలోని సంబల్‌పూర్‌), అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్‌), నవీన్‌ జిందాల్‌   (కురుక్షేత్ర), రావు ఇందర్‌జిత్‌ సింగ్‌( గురుగ్రామ్‌), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌)తోపాటు పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్‌ తివారీ, కాంగ్రెస్‌ నేత కన్హయ్య కుమార్‌ పోటీ పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement