fifth phase elections
-
Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల క్రతువులో మరో అంకం ముగిసింది. సోమవారం ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో అక్కడక్కడలా స్వల్ప ఘర్షణలు, ఒడిశాలో కొన్నిచోట్ల ఈవీఎంలలో చిన్న సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 59.06 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 73.14, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూ కశీ్మర్లోని బారాముల్లాలో ఏకంగా 59 శాతం పోలింగ్ నమోదవడం విశేషం! ఇది ఆ లోక్‌సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత నాలుగు విడతల్లో కలిపి 66.95 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారంతో జమ్మూ కశీ్మర్, మహారాష్ట్రల్లో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తమ్మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 428 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న ఆరు, ఏడో విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. బెంగాల్లో ఘర్షణలు పశ్చిమబెంగాల్లో పలుచోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒడిశాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకుని డ్రైవర్‌ను నరికి చంపారు. యూపీలో 14 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఎలాంటి ఘర్షణలూ లేకుండా ముగిసింది. ముంబై సౌత్ పరిధిలో ఒకొ పోలింగ్ బూత్‌లో 56 ఏళ్ల ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, కౌశల్ కిశోర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, ప్రతాప్సింగ్వర్మ తదితరులు ఐదో విడతలో బరిలో ఉన్నారు. -
Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైన వేళ ‘ఎక్స్’లో ఆయన ..‘ఈరోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. బీజేపీని ఓడించి, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నట్లు మొదటి నాలుగు విడతల పోలింగ్‌లో స్పష్టమైంది. విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. యువత ఉద్యోగాలు, రైతులు రుణ మాఫీ, కనీస మద్ధతు ధర, మహిళలు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, కార్మికులు రోజువారీ వేతనాలు వంటి అంశాలపైనే నేటి పోలింగ్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. అమేథీ, రాయబరేలతోపాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, ఐదో దశలో పోలింగ్ జరుగుతున్న రాయ్‌బరేలీలో పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. రాయ్‌బరేలీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించారు. ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అయితే, మీడియాతో మాట్లాడలేదు. -
Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
ముంబై/లక్నో: సార్వత్రిక సమరంలో ఐదో దశకు సంబంధించిన ప్రచారపర్వం శనివారం ముగిసింది. ఐద దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు 20వ తేదీన పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పోటీచేస్తున్న అమేథీ స్థానాల్లోనూ పోలింగ్ జరగనుంది. జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో నిలిచారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్‌ముంబై), సాధ్వి నిరంజన్ జ్యోతి(లక్నో), శంతను ఠాకూర్(పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్‌పాశ్వాన్(బిహార్‌లోని హాజీపూర్), ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సర ణ్) ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటేసే సౌకర్యం కల్పించడంతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ కేంద్రమంత్రి మురళీమనో హర్ జోషిలు ఇప్పటికే ఇంటి వద్దే ఓటేశారు. -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్‌బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్‌పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్‌తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్‌సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్‌ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్‌ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్‌పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్‌ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్‌గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్‌సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్‌ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్‌పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
తొలి నాలుగు విడతల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వీరిలో మహిళలు 82 మందే! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొదటి, రెండో విడతలో 8 శాతం చొప్పున, మూడో విడతలో 9 శాతం, నాలుగో విడతలో 10 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఐదో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 18 శాతం మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి తీవ్ర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పారీ్టలవారీగా చూస్తే మజ్లిస్‌లో 50 శాతం, సమాజ్‌వాదీలో 40 శాతం, కాంగ్రెస్‌లో 39 శాతం, శివసేనలో 33 శాతం, బీజేపీలో 30 శాతం, టీఎంసీలో 29 శాతం, ఆర్జేడీలో 25 శాతం, శివసేన (ఉద్ధవ్)లో 13 శాతం మంది అభ్యర్థులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయి. మొత్తమ్మీద 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 33 శాతం కోటీశ్వరులు ఐదో విడత అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ అత్యధికంగా రూ.212 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బివాండీ స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ భగవాన్ సాంబ్రే రూ.116 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత రూ.110 కోట్లతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (మహారాష్ట్ర ముంబై నార్త్) మూడో స్థానంలో ఉన్నారు. సురేష్ గోపీనాథ్ మాత్రే (ఎన్సీపీ–ఎస్పీ) రూ.107 కోట్లు, కృష్ణానంద్ త్రిపాఠీ (కాంగ్రెస్)రూ.70 కోట్లు, సంగీత కుమారీ సింగ్‌దేవ్ (బీజేపీ) రూ.67 కోట్లు, రవీంద్ర దత్తారాం వైఖర్ (శివసేన) రూ.54 కోట్లు, కపిల్ మోరేశ్వర్ పాటిల్ (బీజేపీ) రూ.49 కోట్లు, కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ) రూ.49 కోట్లు, సంజయ్ మఫత్‌లాల్ మొరాఖియా (స్వతంత్ర) రూ.48 కోట్లతో టాప్ 10లో ఉన్నారు. విద్యార్హతలు 42 శాతం మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి పన్నెండో తరగతిలోపే. వీరిలో 21 మంది ఐదో తరగతి వరకే చదివారు. 64 మంది ఎనిమిదో తరగతి, 97 మంది పదో తరగతి గట్టెక్కారు. 50 శాతం మందికి గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యార్హతలున్నాయి. 26 శాతం మంది డిప్లోమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు. -
Lok Sabha Election 2024: నికమ్ వర్సెస్ వర్షా
ముంబై నార్త్ సెంట్రల్. మినీ ముంబైగా పేరొందిన లోక్‌సభ స్థానం. ఆకాశాన్నంటే హార్మ్యాలతోపాటు మురికివాడలు ఇక్కడి ప్రత్యేకత. సెల్రబిటీలతో పాటు వలస కారి్మకులకూ నివాస స్థానం. మే 20న ఐదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ నుంచి పార్టీ ముంబై చీఫ్ వర్షా గైక్వాడ్ బరిలో ఉన్నారు. గత రెండుసార్లూ గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తుండగా, తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఉవి్వళ్లూరుతోంది...చట్టాలను సవరిస్తా.. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్‌ను పక్కన పెట్టిన మరీ ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌కు టికెటిచి్చంది. పూనం తండ్రి, బీజేపీ దిగ్గజం ప్రమోద్ మహాజన్ హత్య కేసును వాదించింది ఉజ్వలే కావడం విశేషం! ‘‘ఆ సమయంలో పూనంను దగ్గరగా చూశా. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆమె ఈసారి నా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని నికమ్ చెబుతున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడి వంటి హై ప్రొఫైల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నికమ్ వాదించిన తీరును బీజేపీ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. ‘‘రాజకీయాలు నా సెకండ్ ఇన్నింగ్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. అదే నన్ను గెలిపిస్తుంది’’ అని నికమ్ ధీమాతో ఉన్నారు. ‘‘ప్రజల కోసం మేలైన చట్టాలను రూపొందించడానికి కృషి చేయాలనుకుంటున్నా. పారిపోయిన నేరగాళ్లను భారత్‌కు తీసుకువచ్చేలా అప్పగింత చట్టాలను సవరించాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. వంచిత్ బహుజన్ అగాడీ, మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబై నార్త్ సెంట్రల్లో పోటీలో ఉన్నారు. రాజ్యంగ రక్షణ పోరాటంముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తండ్రి ఏక్నాథ్ గైక్వాడ్ గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వర్ష ప్రచారం ప్రారంభించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శివసేన సభ్యులు పారీ్టలో చీలిక తర్వాత ఉద్ధవ్ వెంటే ఉండటం కలిసొచ్చే అంశమని వర్షా అంటున్నారు. ‘‘ముంబై నార్త్ సెంట్రల్ తొలినుంచీ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి నా విజయాన్ని పార్టీకి కానుకగా అందిస్తా’’ అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.వలస ప్రజల నిలయం... ముంబై ‘మినీ ఇండియా’ అయితే ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం ‘మినీ ముంబై’. ఇందులో విలే పార్లే, చండీవలి, బాంద్రా, కలీనా, కుర్లా వంటి ప్రాంతాలున్నాయి. బాంద్రా, ఖర్‌లలో సినీ తారలు, ప్రముఖులు నివసిస్తారు. కుర్లాలో వలస కుటుంబాలు, కారి్మకులు ఎక్కువ. సుమారు 3 లక్షలమంది ఉత్తరాది రాష్ట్రాలవారు, లక్ష మంది దక్షిణాది ప్రజలు, 1.9 లక్షల మంది గుజరాత్, రాజస్థాన్ వాసులు నివసిస్తున్నారు. 3 లక్షలకు పైగా ముస్లింలున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, కాలుష్యం ఇక్కడి ప్రధాన సమస్యలు... – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐదో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
-
కాంగ్రెస్ కొత్త ఖాతా తెరుస్తుందా?
లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ సహా 14 స్థానాలకు మే 6న పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గెలిచిన అమేఠీ, రాయ్‌బరేలీ మినహా మిగిలిన పన్నెండు స్థానాలను కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన అవధ్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలున్న ఈ దశ ఎన్నికల్లో ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అత్యవసరం. దళితులు, బీసీలు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న బహుజన్ సమాజ్‌వాదీపార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూటమికి కూడా ఈ ప్రాంతంలో గట్టి పునాదులున్నాయి. అగ్రనేతలు మళ్లీ పోటీచేస్తున్న రెండు సీట్లతోపాటు మరో మూడు స్థానాలైనా సంపాదించాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని లక్నో నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫతేపూర్ నుంచి కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పోటీ చేస్తున్నారు. మందిర్–మసీదు వివాదానికి కేంద్ర బిందువు అయిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానానికి కూడా గట్టి పోటీ ఉంది. బీజేపీ తర్వాత బలమైన కూటమి మహాగuŠ‡బంధన్ 2014 ఎన్నికల్లో ఈ 14 యూపీ సీట్లలో పది చోట్ల ఎస్పీ, బీఎస్పీలు రెండో స్థానంలో నిలిచాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే అవి బీజేపీకి పడిన ఓట్లను మించిపోతాయి. ధౌరహ్రా, బారాబంకీ, ఫైజాబాద్, సీతాపూర్ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 సీట్లలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో తల్లీ కొడుకుల స్థానాలే కాంగ్రెస్ పరువు నిలబెట్టాయి. లక్నోలో రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నవారిలో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా(ఎస్పీ) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూ మతాచార్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ పోటీచేస్తున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై బహారాయిచ్(ఎస్సీ రిజర్వ్డ్) స్థానం నుంచి గెలిచిన సావిత్రీబాయి ఫూలే ఈసారి కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం చేయడం లేదంటూ సావిత్రీబాయి బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాక పార్టీకి దూరమయ్యారు. లక్నోలో రాజ్‌నాథ్‌కు పోటీయే లేదా? తొలి ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్, కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్, బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనేకసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో. యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరఫున హిందూ పీఠాధిపతి(సంభల్ కల్కి మఠం) ప్రమోద్ కృష్ణం, ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున పూనమ్ సిన్హా పోటీచేస్తున్నారు. అయితే, ఎస్పీ, కాంగ్రెస్ చివరి నిమిషంలో బయటి నుంచి అభ్యర్థులను ‘దిగుమతి’ చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాజ్‌నాథ్‌కు సునాయాసంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్టు భావించాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఠాకూర్ వర్గానికి చెందిన రాజ్‌నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు ఉంది. నియోజకవర్గంలోని 19.6 లక్షల మంది ఓటర్లలో 4 లక్షల మంది కాయస్థులు, లక్ష మంది సింధీలు, నాలుగు లక్షల మంది బ్రాహ్మణులు, మూడు లక్షల మంది ఠాకూర్లు, నాలుగు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పూనమ్ సింధీ కావడం, ఆమె భర్త శత్రుఘ్న కాయస్థ కుటుంబంలో పుట్టిన కారణంగా ఈ వర్గాల ఓట్లన్నీ తమ అభ్యర్థికి పడతాయనే ఆశతో ఎస్పీ నేతలు ఉన్నారు. అమేఠీలో రాహుల్ అమేఠీ అవతరించినప్పటి నుంచీ జరిగిన 15 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు, కోడలు, మనవడు విజయం సాధించిన కాంగ్రెస్ కంచుకోట ఇది. ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1977లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1998లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి అమేఠీ మాజీ సంస్థానాధీశుని కొడుకు సంజయ్‌సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సతీష్‌శర్మను ఓడించారు. 2004 నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడుసార్లు అమేఠీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో రాహుల్ చేతిలో ఓడిన బీజేపీ ప్రత్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగారు. పాత ప్రత్యర్థుల మధ్యే 2019లో ఎన్నికల పోరు జరుగుతోంది. రాహుల్‌పై స్మృతి తొలిసారి పోటీచేసి ఓడినా ఆయన మెజారిటీని 3 లక్షల 70 వేల నుంచి లక్షా ఏడు వేలకు తగ్గించగలిగారు. రాజ్యసభ సభ్యురాలైన స్మృతి మళ్లీ అమేఠీ బరిలోకి దిగడంతో రాహుల్ ఎందుకైనా మంచిదని కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్ కాంగ్రెస్‌కు సురక్షితమైన రెండో సీటు నుంచి పోటీకి దిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ కారణంగానే సంజయ్ ఓడిపోయారుగాని గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ నేడు అమేఠీలో ఓడిపోయే అవకాశం లేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ అగ్రనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. బిహార్‌కు చెందిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాస్వాన్ సైతం అమేఠీలో స్మృతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా ఇక్కడ విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటూ, గెలుపుపై తన అన్నకు అనుమానమే లేదనీ, వయనాడ్ ప్రజల కోరిక మేరకే అక్కడ నుంచి పోటీచేస్తున్నారని ధీమాగా చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా నాలుగోసారి పోటీ మామ ఫిరోజ్ గాంధీ, అత్త ఇందిర, ఇందిర మేనత్త షీలాకౌల్ వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోసారి పోటీచేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్‌సింగ్ పోటీకి దిగారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. అమేథీతోపాటు రాయ్‌బరేలీలో కూడా ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. సోనియా తొలిసారి 1999లో అమేఠీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ సాంకేతిక సమస్య కారణంగా సోనియా 2006లో రాజీనామా చేశాక మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు. కిందటి ఎన్నికల్లో ఆమె తన బీజేపీ ప్రత్యర్థి అజయ్ అగర్వాల్‌పై మూడున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో దాదాపు రెండున్నర లక్షలు, 2006 ఉప ఎన్నికలో 4 లక్షల 17 వేలు, 2009లో 3 లక్షల 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా తన ప్రత్యర్థులపై విజ యం సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి దినేష్ప్రతాప్ సింగ్ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా తరఫున సహాయకునిగా పనిచేసి 2016లో ఎమ్మెల్సీ అయ్యారు. కిందటేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోనియా గెలుపుపై అనుమానాలు లేకున్నా ఈసారి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కూతు రు ప్రియాంక కూడా తల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ధౌరహ్రాలో జితిన్ ప్రసాద మరో ప్రయత్నం! కాంగ్రెస్ దివంగత నేత జితేంద్ర ప్రసాద కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్న స్థానం ధౌరహ్రా. జితిన్ తండ్రి జితేంద్ర గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపై పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జితిన్ తొలిసారి 2004లో షాజహాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఎన్నికయ్యారు. 2008లో అవతరించిన ధౌరహ్రా నుంచి 2009లో గెలిచి 2011 నుంచి 2014 వరకూ మన్మోహన్సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి ఇదే సీటు నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మద్‌ను లక్షా పాతిక వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి కొన్ని వందల ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. బీసీ కులమైన కుర్మీలు ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున అర్షద్ సిద్దిఖీ(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. ఆయన తండ్రి ఇలియాస్ సిద్దిఖీ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఫైజాబాద్‌లో త్రిముఖ పోటీ ప్రాచీన నగరం అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో మరోసారి ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు లల్లూ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి ఆనంద్‌సేన్ యాదవ్(ఎస్పీ) పోటీలో ఉన్నారు. 2014లో లల్లూ సింగ్ తన సమీప ప్రత్యర్థి మిత్రసేన్ యాదవ్‌ను 2 రెండు లక్షల 82 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి ఆనంద్‌సేన్ తండ్రి మిత్రసేన్ మొదటిసారి 1989లో సీపీఐ టికెట్‌పైన, 1998లో ఎస్పీ తరఫున, 2004లో బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తండ్రీకొడుకులిద్దరికీ నేరమయ రాజకీయాలతో సంబంధాలున్నాయి. తండ్రి మాదిరిగానే ఆనంద్‌సేన్ కూడా బీఎస్పీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక మాయావతి కేబినెట్లో మంత్రిగా కొన్ని రోజులు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రీ కూడా గతంలో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఫైజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయోధ్య ప్రాంతంలో నిరుద్యోగం, పరిశ్రమల స్థాపన జరగకపోవడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆయోధ్య ఎన్నిక ప్రచారానికి వచ్చినా రామజన్మభూమి వివాదంపై మాట్లాడలేదు. మహా కూటమి నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ కూడా ఆయోధ్యకు 70 కిలో మీటర్ల దూరంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మోదీపై నియోజకవర్గ ప్రజలకు అభిమానం తగ్గలేదనీ, ఎంపీగా లల్లూ సింగ్ పనితీరును పట్టించుకోకుండా ప్రధానిపై మోజుతోనే బీజేపీకి ఓట్లేస్తారని ఫైజాబాద్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. బహరాయిచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత సావిత్రీబాయి ఫూలే పోటీచేయడంతో బహరాయిచ్ నియోజకవర్గం ఎన్నికపై ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన ఈ స్థానం నుంచి 2014లో సాధ్వీ సావిత్రీబాయి ఫూలే బీజేపీ టికెట్‌పై పోటీచేసి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీపై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హనుమంతుడి కులం గురించి మాట్లాడి సమాజాన్ని చీల్చివేస్తున్నారంటూ సావిత్రీబాయి కిందటి డిసెంబర్లో బీజేపీ నుంచి వైదొలిగారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరగానే బహరాయిచ్ టికెట్ ఇచ్చారు. ఆమె స్థానంలో బీజేపీ టికెట్ అక్షర్‌వర్ లాల్‌కు లభించింది. మొదట బీఎస్పీలో ఉన్న సావిత్రీబాయి బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ప్రజా సేవ ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత బీజేపీలో చేరి 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటికే పేరు సంపాదించిన ఆమెకు కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఎలాంటి ప్రయత్నం లేకుండానే దక్కింది. ఎస్సీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మీకీ రెండోసారి పోటీచేస్తున్నారు. ఎస్పీ కులమైన వాల్మికీ వర్గానికి చెందిన ఆయన పేరులోని మొదటి రెండు పదాల కారణంగా ఆయన హిందూ దళితుడు కాదనీ, ముస్లిం అని కొందరు కోర్టు కెక్కగా నడిచిన కేసులో ఆయన తాను హిందువునని నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త అభ్యర్థి తరఫున ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థికి మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది. పూనమ్ సిన్హా, దినేష్ ప్రతాప్‌సింగ్, అర్షద్ సిద్దిఖీ -
కమలనాథుల పట్టు నిలుస్తుందా?
బీజేపీకి కంచుకోట అయిన మధ్యప్రదేశ్‌లో గత లోక్‌సభ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయపరంపర కొనసాగిస్తుందా? లేక అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ మళ్ళీ తన జవసత్వాలను కూడగట్టుకొని లోక్‌సభ సీట్లు సాధిస్తుందా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోన్న చర్చ. ఇప్పటికి నాలుగోదశలో ఆరు స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, మే 6న జరిగే ఐదో దశలో మరో ఏడు స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 29 స్థానాలకు 27 గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు ఈ అఖండ విజయాన్ని నిలబెట్టుకోవడం పెద్ద అగ్ని పరీక్ష. మోదీ మేజిక్ పైనే బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం, సామాజిక సమీకరణలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మధ్య ప్రదేశ్‌లోని దామోహ్, రేవా, బేతుల్, సత్నా, ఖజురహో, హోశంగాబాద్, టీకంగఢ్ స్థానాలకు మే 6న పోలింగ్ జరగనుంది. దామోహలో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ పటేల్ 56.14 శాతం ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చౌధరీ మహేంద్ర ప్రతాప్ సింగ్ 2,13,299 ఓట్ల మెజారిటీని సాధించారు. 1962లో ఏర్పాటైన ఈ లోక్ సభ స్థానంలో గత 15 ఏళ్ళుగా కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి బీజేపీ నుంచి తిరిగి ప్రహ్లాద్ సింగ్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్లోధి పోటీ చేస్తున్నారు. పార్టీకి గట్టి పునాదులున్న ఈ స్థానంలో ఈసారి కూడా బీజేపీకే విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. రేవా లోక్ సభ స్థానం లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ జనార్ధన్ మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ లాల్ తివారీని ఓడించారు. 2009లో బీఎస్పీ దేవ్‌రాజ్ సింగ్ పాటిల్ ఈ సీటుని దక్కించుకోవడం విశేషం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ షాపై, బీజేపీ అభ్యర్థి జ్యోతీ ధుర్వే 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది, 61.43 శాతం ఓట్లను సాధించుకోగలిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జ్యోతీ ధుర్వే స్థానంలో దుర్గాదాస్ ని బీజేపీ పోటీచేయిస్తోంది. కాంగ్రెస్ నుంచి రామూ టేకామ్ దుర్గాదాస్‌తో ఢీకొనబోతున్నారు. సత్నాలో సత్తా చాటేదెవరు? మజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ సింగ్ కంచుకోట సత్నా లోక్‌సభ స్థానం 2019 ఎన్నికల్లో ఎవరి పరం కానున్నదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వి«ంధ్య ప్రాంతం, బుందేల్ ఖండ్ ప్రాంతాలు ఈ పార్లమెంటు పరిధిలోకే వస్తాయి. ఈ ప్రాంతంలో ఠాకూర్లే దాదాపు సగం మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు సైతం ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. 1998 నుంచి బీజేపీ ఆధిపత్యంలోనే సత్నా పార్లమెంటు స్థానం ఉంది. అయితే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓటింగ్ శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. చివరకు మోదీ వేవ్‌లో 2014లో సైతం ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్ పై బీజేపీ అభ్యర్థి గణేష్ సింగ్ 8,688 ఓట్ల అతితక్కువ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. భారతీయ జనతాపార్టీ మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన గణేష్ సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంత లోతైన పునాదులేర్పర్చుకున్న దాఖలాలైతే లేవన్నది విశ్లేషకుల అంచనా. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ స్పీకర్ రాజేంద్ర సింగ్ పై గణేష్ సింగ్ 83,688 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగిస్తే, 2009లో బీఎస్పీ అభ్యర్థి సుఖ్లాల్ కుశ్వాహ పై కేవలం 4,418 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ప్రాభవం క్షీణిస్తూ వచ్చింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజారాం త్రిపాఠిని బరిలోకి దింపితే ఈసారి కూడా బీజేపీ గణేష్ సింగ్‌ని తిరిగి బరిలోకి దింపింది. అగ్రవర్ణాల ఓట్లు అధికంగా ఉన్న ఈ సీటుని బీజేపీ తిరిగి కైవసం చేసుకోవడం అంత తేలికైతే కాదన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠి స్థానికంగా పేరున్న వ్యక్తి కావడం, ఆయన సామాజిక వర్గం కూడా కాంగ్రెస్‌కి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు గెలుపుబాజా మోగించిన బీజేపీకి ఈసారి కూడా గెలుపు ఖాయమని ఆ పార్టీ అభిమతం. సత్నా పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఖజురహోలో రాణి సాహీబా! ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఖజురహో అందాలకు ఎన్నికల సందడి తోడయ్యింది. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి కి నాలుగుసార్లు పట్టంగట్టిన ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్ రాణి కవితాసింగ్‌ని బరిలోకి దింపింది. స్థానిక రాజకుటుంబానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రం సింగ్ నాటీ రాజా, భార్య అయిన కవితా సింగ్ ‘‘నేను లోకల్’’ తన గెలుపు ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అయితే సేఫ్ సీటుగా భావించే ఖజురహో నుంచి కేంద్ర మంత్రి ఉమాభారతి పోటీచేస్తారంటూ తొలుత వార్తలు వచ్చినా, అంతిమంగా ఈ సీటుని బీజేపీ వి.డి శర్మకి ఇచ్చింది. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ నాగేంద్ర సింగ్, ఈ సీటుని విడిచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. 1989 నుంచి 1998 వరకు మొత్తం నాలుగు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఉమాభారతి ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు. మొత్తం 8 అసెంబ్లీ సీట్లున్న ఈ పార్లమెంటు స్థానం ఛతార్పూర్, పన్నా, కత్నీ ప్రాంతాల కలయికగా ఏర్పడింది. బుందేలా పాలకుడు రాజ్‌పుత్ చాత్రాసాల్, ఛతార్పూర్ ని నిర్మించారు. ఇదే చారిత్రక నేపథ్యంలో ఖజురహో ప్రాంతంలో రాజ్‌పుత్‌ల సాంప్రదాయక ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే జనాభా రీత్యా ఓబీసీ, ఎస్సీ సామాజిక వర్గాలదే ఇక్కడ ఆధిక్యం. ఇక్కడ మొత్తం 17,02,833 మంది ఓటర్లున్నారు. ఇందు లో షెడ్యూల్డ్ కులాల ప్రజలు 18.57 శాతం ఉంటే, షెడ్యూల్డ్ తెగలవారు 15.13 శాతం ఉన్నారు. ‘‘ఛతార్పూర్ కోడలినీ, పన్నా కూతురిని అయిన నన్ను ఈ ప్రాంత ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు రాణి కవితా సింగ్. సాంప్రదాయ ఓటింగ్ దండిగా ఉన్న బీజేపీ సైతం తమ ఖాతాలోదే ఖజురహో అన్న ధీమాతో ఉంది. హోశంగాబాద్‌లో బీజేపీ విజయపరంపర... మధ్య ప్రదేశ్‌లోని నర్మదా నదీతీరాన ఉన్న çహోశంగాబాద్ లోక్ సభ స్థానంలో 6 పర్యాయాలుగా బీజేపీ విజయపరంపర కొనసాగించింది. ఇక్కడ 2009 మినహా 1991 నుంచి, 2014 వరకూ అన్ని సార్లూ ఈ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా హోశంగాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన ఉదయ్ ప్రతాప్ సింగ్ 2013లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో బీజేపీ ఇదే స్థానం నుంచి ఉదయ్ ప్రతాప్‌సింగ్‌ని పోటీకి దింపి విజయపరంపర కొనసాగించింది. ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్ మళ్ళీ ఇక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర పటేల్ (గుడ్డూభయ్యా)తో పోటీపడి బీజేపీ అభ్యర్థి ఉదయ్ ప్రతాప్ సింగ్ 64.90 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగారు. 15 లక్షలకు పైగా ఓటర్లున్న ఈ లోక్‌సభ స్థానంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 16.65 శాతం ఉంటే, ఆదివాసీల జనాభా 12.53 శాతం ఉంది. ఈసారి కాంగ్రెస్ నుంచి శైలేంద్ర దివాన్ చంద్రభాన్ సింగ్ పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎంపీ.చౌధురీ పోటీచేస్తున్నారు. హోశంగాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో నర్సింగ్‌పూర్, టెండూఖేదా, గదర్వారా, సియోని మాల్వా, హోశంగాబాద్, సోహాగ్పూర్, పిపారియా, ఉదయ్‌పూర్ సహా మొత్తం 8 అసెంబ్లీ సీట్లున్నాయి. టీకంగఢ్ లో టఫ్ ఫైట్? కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు, విద్యార్థి దశనుంచీ భారతీయ జనతాపార్టీ భావజాలాన్ని భుజస్కందాలపై మోస్తోన్న వీరేందర్ కుమార్ టీకంగఢ్ నుంచి ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వంలో వీరేందర్ కుమార్ పట్ల ఉన్న అసంతృప్తిని తోసిరాజంటూ అతనికే ఈ సీటు కేటాయించడం ఆయనపట్ల బీజేపీ కి ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి వీరేందర్ కుమార్‌తో కాంగ్రెస్ నుంచి కిరణ్ అహిర్వార్ తలపడబోతున్నారు. అయితే సాంప్రదాయకంగా బీజేపీకి పట్టున్న ఈ స్థానంలో గెలుపు ఖాయమన్న ధీమాతో బీజేపీ ఉంది. గత ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన వీరేందర్ సింగ్ ఈసారి అంతకంటే అధిక మెజారిటీ సాధిస్తానంటున్నారు. మొత్తం 8 అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ లోక్‌సభ స్థానంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ మూడు, సమాజ్‌వాదీ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ప్రధానంగా యాదవులు, ఆహిర్వార్ల సంఖ్య అధికంగా ఉన్న టీకంగఢ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది. కవితా సింగ్, రాజరాం త్రిపాఠి, ప్రహ్లాద్ సింగ్ -
అతిరథుల పోరుగడ్డ
ఐదో దశలో మే 6న పోలింగ్ జరిగే బిహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలు, జార్ఖండ్‌లోని నాలుగు సీట్లకు రెండు రాజకీయ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బిహార్‌లోని మొత్తం 40 సీట్లకు ఏడు దశల్లో, జార్ఖండ్‌లోని 14 స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్‌లోని మిథిలా, చంపారణ్ ప్రాంతాలకు చెందిన సీతామఢీ, మధుబనీ, ముజఫ్ఫర్‌పూర్, సారణ్, హాజీపూర్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ, ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవామ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) భాగస్వామ్యపక్షాలుగా ఉన్న మహాకూటమి మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ వియ్యంకుడు చంద్రికా రాయ్ లాలూ పాత స్థానం సారణ్ నుంచి పోటీ చేస్తుండగా, లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జీపీ) నేత రామ్‌విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్ అన్న నియోజకవర్గం హాజీపూర్ నుంచి పోటీకి దిగారు. ఆర్జేడీ కూటమిలోని వీఐపీ ముజఫ్ఫర్‌పూర్, మధుబని నుంచి పోటీచేస్తోంది. బిహార్ బిహార్ మ్యాప్ లాలూ వియ్యంకుడితో రాజీవ్ రూడీ పోటీ లాలూ ‘కుటుంబ నియోజకవర్గం’ సారణ్‌లో ప్రతిష్టాకరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ సభ్యుడు రాజీవ్‌ప్రతాప్ రూడీతో లాలూ వియ్యంకుడు(పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ మామ) చంద్రికా రాయ్ ఆర్జేడీ తరఫున తలపడుతున్నారు. 2014లో లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిని రూడీ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ అనే స్వతంత్ర అభ్యర్థి వేల సంఖ్యలో ఓట్లు చీల్చుకున్నారు. ఆయన వల్లే రబ్రీ ఓడిపోయారని ఆర్జేడీ భావించింది. ఈ స్వతంత్ర అభ్యర్థి మళ్లీ ఈసారి కూడా పోటీలో ఉన్నారు. 2004కు ముందు ఛప్రా పేరుతో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి లాలూ మూడుసార్లు, రాజీవ్ రూడీ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చంద్రికా రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ 2009లో సారణ్‌గా అవతరించాక లాలూ ప్రసాద్ విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో ఆయన భార్య తొలిసారి లోక్‌సభకు ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తన మామ చంద్రికా రాయ్‌కి ఆర్జేడీ టికెట్ ఇవ్వడాన్ని లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన రాజీవ్ రూడీ బీజేపీ తరఫున మరోసారి రంగంలోకి దిగి ఆర్జేడీ అభ్యర్థి చంద్రికా రాయ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో మాదిరిగా మోదీ గాలి లేకున్నా ఆయనకు ఈసారి జేడీయూ మద్దతు ఇస్తున్నందున మెరుగైన స్థితిలో ఉన్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన లాలూ వియ్యంకుడి గెలుపునకు మహా కూటమి గట్టి ప్రయత్నమే చేస్తోంది. సీతామఢీలో ఆర్జేడీతో జేడీయూ పోటీ పూర్వ మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతున్న స్థానం సీతామఢీ బీజేపీ–జేడీయూ కూటమి అభ్యర్థిగా మొదట ప్రకటించిన డా.వరుణ్‌కుమార్ పోటీకి విముఖత ప్రదర్శించడంతో రాష్ట్ర మంత్రి, బీజేపీ మాజీ నేత సునీల్ కుమార్ పింటూ జేడీయూ తరఫున పోటీకి దిగారు. ఆర్జేడీ అభ్యర్థిగా అర్జున్‌రాయ్ పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉన్న ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి రాంకుమార్ శర్మ కుష్వాహా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి సీతారాం యాదవ్‌ను లక్షా 47 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. అర్జున్ రాయ్, సునీల్ కుమార్ పింటూ అప్పుడు జేడీయూ అభ్యర్థిగా పోటీచేసిన అర్జున్‌రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్డీయే నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలిగి ఆర్జేడీ కూటమిలో చేరింది. అయితే, ఈ సీటును ఆ పార్టీకి కేటాయించలేదు. బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి పింటూ బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. అయితే, సీతామఢీ ఆర్జేడీకి గతంలో కంచుకోట. 2004లో ఈ పార్టీ తరఫున సీతారాం యాదవ్, 2009లో అర్జున్‌రాయ్ విజయం సాధించారు. ఆర్జేడీ, జేడీయూ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. మధుబనిలో హుకుందేవ్ కుమారుడు ఆర్జేడీ కూటమి భాగస్వామ్యపక్షమైన వీఐపీకి కేటాయించిన స్థానం ఇది. గతంలో మధుబని నుంచి నాలుగుసార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ సభ్యుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ ఈసారి పోటీచేయడం లేదు. బీజేపీ టికెట్ ఆయన కొడుకు అశోక్‌కుమార్ యాదవ్‌కు ఇచ్చారు. మాజీ సోషలిస్ట్ అయిన హుకుందేవ్ 1990ల చివర్లో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున కూడా సీతామఢీ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన కొడుకు అశోక్ లోక్‌సభకు పోటీచేయడం ఇదే మొదటిసారి. బద్రీకుమార్ పూర్బే, అశోక్‌కుమార్ యాదవ్ బాలీవుడ్ మాజీ సెట్ డిజైనర్, నిషాద్(మత్స్యకారులు) వర్గానికి ముకేష్ సహనీ స్థాపించిన వీఐపీ పార్టీకి మహా కూటమి ఈ సీటు కేటాయించింది. ఈ పార్టీ తరఫున బద్రీకుమార్ పూర్బే పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన హుకుందేవ్ తన సమీప ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బారీ సిద్దిఖీని 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి బీసీలు, ముస్లింల ఓట్లు భారీగా కూటమి అభ్యర్థి పూర్బేకు పడితే బీజేపీ గెలుపు కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జేడీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎంఏఏ ఫాత్మీ మొదట బీఎస్పీ తరఫున నామినేషన్ వేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. 2004లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన కాంగ్రెస్, ముస్లిం ఓట్లు చీల్చుకుంటే వీఐపీ పార్టీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గే ప్రమాదముంది. జార్ఖండ్‌లో హోరాహోరీ జార్ఖండ్ మ్యాప్ ఐదో దశలో పోలింగ్ జరిగే జార్ఖండ్‌లోని నాలుగు సీట్లు–కోడర్మా, రాంచీ, ఖూంటీ(ఎస్టీ), హజారీబాగ్ సీట్లలో బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, జేవీఎం(ప్రగతిశీల్), ఆర్జేడీ ఉన్నాయి. రాజధాని రాంచీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్ సహాయ్(కాంగ్రెస్) పోటీ చేస్తుండగా, హజారీబాగ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా(బీజేపీ) మళ్లీ బరిలోకి దిగారు. కోడర్మా నియోజకవర్గం నుంచి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) కాంగ్రెస్ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన ఖూంటీ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 2014 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి మెజారిటీ సాధించింది. బీజేపీ నేత రఘువర్ దాస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉంది. రాంచీలో సహాయ్దే పైచేయి! 1989 నుంచీ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి సుబోధ్‌కాంత్ సహాయ్, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామ్‌తహల్ చౌధరీ ఇప్పటి వరకూ రాంచీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి చౌధరీ రాంచీ నుంచి ఐదుసార్లు బీజేపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి ఆయనకు పార్టీ టికెట్ లభించపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచారు. వరుసగా రెండుసార్లు గెలిచిన సహాయ్ కిందటి ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో జనతాదళ్ తరఫున గెలిచిన సహాయ్ మళ్లీ కాంగ్రెస్ టికెట్ సంపాదించి పోటీలో ఉన్నారు. సుబోధ్ సహాయ్, సంజయ్ సేఠ్ బీజేపీ తరఫున ఖాదీ గ్రామోద్యోగ్ మాజీ చైర్మన్ సంజయ్ సేuŠ‡ పోటీచేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీకి దిగడం ఇదే తొలిసారి. బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ వర్గీయుడని, 85 ఏళ్లు దాటాయనే కారణాలతో తహల్కు టికెట్ నిరాకరించడం వల్ల ఆయన వర్గమైన కుర్మీ కులస్తుల ఓట్లు గతంలో మాదిరిగా బీజేపీకి పడవని చెబుతున్నారు. మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ నేత సహాయ్ గతంలో వీపీసింగ్, చంద్రశేఖర్, మన్మోహన్సింగ్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రాంచీ నుంచి తనను నాలుగోసారి లోక్‌సభకు పంపితే నాలుగో ప్రధాని కేబినెట్లో మంత్రినవుతానని సహాయ్ ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలో కీచులాటలు, కుల సమీకరణల్లో మార్పుల వల్ల సహాయ్‌కు అనుకూల వాతావరణం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. హజారీబాగ్‌లో జయంత్ సిన్హా వర్సెస్ గోపాల్ సాహూ గతంలో కేంద్ర మాజీ యశ్వంత్ సిన్హా మూడుసార్లు గెలిచిన హజారీబాగ్ నుంచి ఆయన కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడైన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా రెండోసారి పోటీచేస్తున్నారు. తండ్రి బీజేపీకి రాజీనామా చేసినా ఆయన మోదీ కేబినెట్లో కొనసాగుతున్నారు. జయంత్ సిన్హా, గోపాల్ సాహూ కాంగ్రెస్ తరఫున కొత్త అభ్యర్థి గోపాల్ సాహూ రంగంలోకి దిగారు. తండ్రికి బదులు తొలిసారి రాంచీ నుంచి పోటీచేసిన జయంత్ కిందటిసారి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సౌరభ్ నారాయణ్‌సింగ్‌ను భారీ ఆధిక్యంతో ఓడించారు. 1991, 2004లో సీపీఐ తరఫున విజయంసాధించిన భువనేశ్వర్ ప్రసాద్ మెహతా మళ్లీ సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2004లో ఆయన యశ్వంత్ సిన్హాను ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థికి జేఎంఎం, జేవీఎం(పీ) వంటి మిత్రపక్షాల మద్దతు ఉంది. తండ్రి యశ్వంత్ ఆశీస్సులున్నాయని చెబుతున్న జయంత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కోడర్మా పోటీలో బాబూలాల్ మరాండీ జార్ఖండ్‌లో మరో కీలక స్థానమైన కోడర్మాలో బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్, కాంగ్రెస్–జేఎంఎం కూటమి అభ్యర్థి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) మధ్య గట్టి పోటీ జరుగుతోంది. రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నికల ముందు పార్టీలో చేరిన అన్నపూర్ణాదేవి యాదవ్‌కు బీజేపీ టికెట్ లభించింది. బీజేపీ తరఫున జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మరాండీ గతంలో బీజేపీలో ఉండగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేఎంఎం నేత, మాజీ సీఎం శిబు సొరేన్‌ను ఓడించారు. బీజేపీ తరఫున 2014లో ఇక్కడ నుంచి గెలిచిన రవీంద్రరాయ్కు ఈసారి టికెట్ ఇవ్వకపోయినా అన్నపూర్ణ తరఫున ప్రచారం చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన తన సమీప సీపీఐ(ఎంఎల్–లిబరేషన్) ప్రత్యర్థి రాజ్‌కుమార్ యాదవ్‌ను దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్ పోటీచేస్తున్నారు. బాబూలాల్ మరాండీ, అన్నపూర్ణాదేవి బిహార్ సమస్తీపూర్‌లో ఓటు వేసిన ఆనందంలో ఓ మహిళ సోమవారం లోక్‌సభ ఎన్నికల 4 విడత పోలింగ్ ముగిసింది. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మహిళలు, వృద్ధులు, ఆదివాసీలు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రాజాస్తాన్లోని బ్యావర్ ప్రాంతంలో వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన ఓ పెద్దాయన ఓటు వేసి సిరా చుక్కను చూపిస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని ఇల్లంబజార్ ఆదివాసీ మహిళలు జమ్మూ శివారు ప్రాంతమైన కుల్గాం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రవాసి కశ్మీరి పండిట్ మహిళ శ్రీనగర్‌లో ఓటు వెయ్యడానికి వచ్చిన వృద్ధుడికి సాయం చేస్తున్న భారత పారామిలిటరీ జవాను ముంబైలోని ఒక పోలింగ్ స్టేషన్లో క్యూలో నిలబడి ఓటర్ ఐడీ కార్డులు చూపిస్తున్న ఓటర్లు రాజస్తాన్ అజ్మేర్ శివార్లలో పోలింగ్ క్యూలో నిల్చున్న మహిళలు ఓటు వేశానంటూ ఇంకు వేసిన వేలు చూపిస్తున్న వృద్ధుడు. -
యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్‌లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి. తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్‌ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్‌లలో తుది దశ పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి అయిదవ, తుది దశ పోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్: తుది దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి తారాచంద్తోపాటు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్ లోయలో ఇంతకుముందు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో భారీ ఓటింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. జమ్మూ, కుధువా, రాజౌరీ జిల్లాలో నేడు జరిగే పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సాధారణ పోలీసులతోపాటు 400 కంపెనీల భద్రత సిబ్బందిని మోహరించారు. భారత్, పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్: తుది దశలో ఆరు జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ... డుమ్కా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌తోపాటు మరో మంత్రి కూడా ఈ ఎన్నికల బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో అయిదు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన లెక్కిస్తారు. -
ఓటేసిన షిండే, సుప్రియా సూలే
సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో ఉదయాన్నే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే, బారామతి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, కర్ణాటక షిమోగాలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటేశారు. ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ సతీసమేతంగా వచ్చి ఓటేశారు. ఐదో విడతలో భాగంగా బీహార్ -7, ఛత్తీస్‌గఢ్-3, జమ్మూకాశ్మీర్-1, జార్ఖండ్-6, కర్ణాటక-28, మణిపూర్-1, మధ్యప్రదేశ్-10, మహారాష్ట్ర-19, ఒడిశా-11, రాజస్థాన్-20, ఉత్తర్‌ప్రదేశ్-11, పశ్చిమబెంగాల్-4 స్థానాల్లో ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి.