సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో ఉదయాన్నే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అలాగే, బారామతి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, కర్ణాటక షిమోగాలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటేశారు. ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ సతీసమేతంగా వచ్చి ఓటేశారు. ఐదో విడతలో భాగంగా బీహార్ -7, ఛత్తీస్‌గఢ్-3, జమ్మూకాశ్మీర్-1, జార్ఖండ్-6, కర్ణాటక-28, మణిపూర్-1, మధ్యప్రదేశ్-10, మహారాష్ట్ర-19, ఒడిశా-11, రాజస్థాన్-20, ఉత్తర్‌ప్రదేశ్-11, పశ్చిమబెంగాల్-4 స్థానాల్లో ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి.
ఓటేసిన షిండే, సుప్రియా సూలే
Published Thu, Apr 17 2014 8:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement