Sushil Kumar Shinde
-
సుశీల్‌కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ రాజకీయాల్లోకి!
సోలాపూర్: పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ నెలకొంది. ఇంతలో గణేశ్ ఉత్సవాల కోలాహలం వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అనేకమంది ఆశావాహులు భవిష్యత్‌లో తమకు అందరూ అండగా ఉండాలనే అభిలాషతో పలు మండపాలలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ కానుకలు విరాళాలు అందజేయడంలో మొగ్గు చూపారు. అయితే సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గత మూడు పర్యాయాలు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ప్రణతీ శిందే ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలనే తపనతో దాదాపు 19 మంది ఆశావాహులు అభ్యర్థిత్వం కోసం ఆసక్తిగా కలలు కంటున్నారు.గత కొన్ని రోజులుగా సుశీల్ కుమార్ శిందే మనవడు శిఖర్ పహారియా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే తన పిన్ని ఎంపీ ప్రణతీ ప్రాతినిధ్యం వహిస్తున్న సోలాపూర్ సిటీ సెంట్రల్ స్థానానికి లేక పక్కనే గల సోలాపూర్ సౌత్ రూరల్ స్థానం ద్వారా రాజకీయ వారసుడిగా ముందుకు వస్తారనే వార్తలు గుప్పు మంటూ తెర మీదికి వస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని గణేశ్ ఉత్సవ మండలాలను సందర్శించడం అందరితో చనువుగా మెలగడం, తన తాత ఫామ్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన గణేశ్ ఉత్సవాన్ని సందర్శించడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించడం మొదలైన ప్రక్రియ ఆయన్ను సుశీల్ కుమార్ శిందే కుటుంబం రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకురాగలరనే భావనను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించిన పట్టణ ప్రజలకు రాజకీయ వారసుడిని అందించాలని సుశీల్ కుమార్ శిందే కుటుంబంతో పాటు ఆయన్ను అభిమానించే వారు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. -
కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డా
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్‌కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్‌లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు. -
ఓటమికి నాదే బాధ్యత
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల ఆ లేఖను ట్విట్టర్లో పెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన రెండు రోజులకు తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించింది. పార్టీ శ్రేణులు రాజీనామా చేయవద్దని కోరాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ఓటమికి తాము నైతిక బాధ్యత వహిస్తామని చెప్పారు. తాను రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని వేయాలని రాహుల్ ఆ లేఖలో పార్టీ వర్కింగ్ కమిటీని కోరారు. కాంగ్రెస్ పార్టీకి సేవచేయడం తనకు గౌరవప్రదమన్నారు. విలువలు, ఆదర్శాలే జీవనాడులుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సేవ చేసిందని భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. ఈ దేశానికి, పార్టీకి తాను ఎంతో కృతజ్ఞుడినన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేశా’అని రాహల్ తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. ఎన్నికల ఓటమికి అనేక మందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని, అయితే, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతను విస్మరించి ఇతరులను బాధ్యుల్ని చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రధాని మోదీతోనూ, ఆరెస్సెస్‌తోనూ, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతోనూ శక్తివంచన లేకుండా పోరాడానన్నారు. ‘భారత దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే వారితో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా’అని రాహుల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ దేశాన్ని గుప్పిట్టో పెట్టుకోవాలన్న ఆరెస్సెస్ లక్ష్యం దీంతో పూర్తయిందన్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఊహించని స్థాయిలో హింస చెలరేగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు జాతి మొత్తం ఏకం కావాలని, దీనికి కాంగ్రెస్ ఆయుధం అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను పూర్తిగా సంస్కరించుకోవాలి. ప్రస్తుతం బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ప్రజల గొంతు నొక్కేస్తోంది. ప్రజావాణిని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. భారత దేశమెప్పుడూ ఒకే గొంతు కాదు..కాబోదు. అది అనేక గొంతుల సమాహారం. అదెప్పటికీ అలాగే ఉండాలి. అదే భారత మాత అసలు స్వరూపం’ అని రాహుల్ భావోద్వేగంతో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం తాను పోరాడుతూనే ఉంటానని, తన సేవలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని రాహల్ పార్టీ శ్రేణుల నుద్దేశించి అన్నారు. ‘నేను కాంగ్రెస్‌వాదిగా పుట్టాను. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం. అదెప్పటికీ నాతోనే ఉంటుంది’ అని ఉద్ఘాటించారు. ట్విట్టర్లో హోదా తొలగింపు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్ ఖాతాలో ‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్ కాంగ్రెస్ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను రాజీనామా చేశా ఎన్నికల్లో మోదీతో, ఆరెస్సెస్‌తో, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా కొత్త అధ్యక్షుడిగా ఖర్గే లేదా షిండే! సుశీల్ కుమార్ షిండే (77) లేదా మల్లికార్జున ఖర్గే(76)ల్లో ఒకరు కొత్త అధ్యక్షుడయ్యే చాన్సుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన షిండే గతంలో ఓసారి కేంద్ర మంత్రిగా చేశారు. 2002లో కాంగ్రెస్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ ఏడాదే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనుండటం, ఆయనకు గాంధీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో షిండేను తదుపరి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు ఖర్గే కూడా పార్టీలో సీనియర్ నాయకుడే. ఆయనా గాంధీల కుటుంబానికి సన్నిహితుడే. గత లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేతగా ఆయన పనిచేశారు. ఖర్గే ప్రతిపక్షంలో ఉండి మోదీని సమర్థవంతంగా ఎదుర్కోగలడనే అభిప్రాయం ఉంది. గతంలో ఆయన ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఓ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆయనే మా నాయకుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా రాహులే మా నేత అని రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారో మాకు తెలుసు. అందుకే రాజీనామాను వెనక్కు తీసుకోమని కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. ‘ కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మేవారికి ఆయనే నాయకుడు. రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారు’ అని మరో నేత అజయ్ మాకెన్ అన్నారు. ఇదో కొత్త నాటకం రాహల్ గాంధీ రాజీనామా మరో కొత్త నాటకమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామాతో తమకే సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలా కాకుండా తమ పార్టీలో సంస్థాగత వ్యవస్థ పటిష్టంగా ఉందని, సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు వంటివి ఉన్నాయని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
మీరాకుమార్ లేదా షిండే!
♦ బీజేపీ దళిత బాణానికి విపక్ష సమాధానం ♦ రేపు ప్రతిపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థిపై నిర్ణయంస న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత అభ్యర్థి ప్రకటనతో బీజేపీ విసిరిన సవాలుకు అదే రూట్లో సమాధానమిచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం దళిత అభ్యర్థినే రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ దళిత నేతలే కావడంతో... కోవింద్‌కు మద్దతు ప్రకటించిన కొన్ని ప్రతిపక్షాల్ని తమ వైపు తిప్పుకునేలా ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు సమాచారం. బిహార్‌కు చెందిన మీరాకుమార్ మాజీ ఉపప్రధాని, ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె. ఆమెను బరిలో దింపితే... బిహార్ సీఎం నితీష్ కుమార్ తప్పకుండా మద్దతిస్తారనేది కాంగ్రెస్ అంచనా.. మాయావతి కూడా మీరాకుమార్‌కు మద్దతిచ్చే వీలుంటుంది. అయితే ఆమె ఎంపిక విషయంలో కొన్ని ప్రతికూలతలున్నాయి. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా వైదొలిగాక కూడా అధికార నివాసాన్ని మీరాకుమార్ ఖాళీచేయకపోవడం వివాదా స్పదమైంది. ఆమె ఆస్తులకు సంబంధించి కొన్ని ఆరోపణలు విన్పించాయి. స్పీకర్‌గా మీరాకుమార్ పనితీరు అంతగా ఆకట్టుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఆమెను అభ్యర్థిగా నిలబడితే నితీష్ మద్దతు కూడగట్టడం సులభమవుతుందనేది వ్యూహంలా కన్పిస్తోంది. మరోవైపు షిండేను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. 2007లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ను అభ్యర్థిగా నిలపడంతో ఆమెకు శివసేన మద్దతివ్వక తప్పని పరిస్థితి.. అదే ఎత్తుగడను ఇప్పుడు కూడా అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షిండేకు కూడా మాయావతితో పాటు మరికొన్ని పార్టీలు తప్పకుండా మద్దతిస్తాయనేది అంచనా.. గురువారం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. బీజేపీ ప్రయోగించిన దళిత కార్డుకు అదే స్థాయిలో సమాధానమిచ్చేలా అభ్యర్థి ఎంపికపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అదే సమయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తకుండా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండేలా చూడటం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. 2019 పార్లమెంట్ ఎన్నికల వరకూ ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొనసాగాలనేది ఆ పార్టీ ఆలోచన.. ఈ రెండింటి ప్రాతిపదికగా భేటీలో మీరాకుమార్, షిండేల పేర్లపై చర్చించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం. -
కాంగ్రెస్ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా?
న్యూఢిల్లీ: దెబ్బకు దెబ్బ అన్నట్లు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి ఝలకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరుపున దళిత వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో కేంద్ర హోమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే, లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీరాకుమార్‌లలో ఎవరినో ఒకరిని అధ్యక్ష అభ్యర్థిగా కాంగ్రెస్ తెరమీదకు తీసుకురావాలనుకుంటుందట. దీనిపై జూన్ 22న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండేను ముందుకు తెస్తే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినందున తమకు శివసేన మద్దతు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, స్పీకర్ మీరాకుమార్ను తెరమీదకు తెస్తే బిహార్‌లోని జేడీయూ మద్దతు లభిస్తుందని భావిస్తోందట. ఇదిలా ఉండగా, ఈ విషయంపై తనకు అసలు సమాచారమే లేదంటూ షిండే కొట్టి పారేశారు. అసలు ఇలాంటిది అసాధ్యం అని, ఆ ప్రశ్నే లేదని అన్నారు. -
‘యూపీఏ జమానాలో 3 సర్జికల్ దాడులు’
ముంబై: యూపీఏ పాలనా కాలంలో 2009–13 మధ్య మూడు సర్జికల్ దాడులు జరిగాయని కానీ ప్రభుత్వం వాటిని బయటికి రానీయలేదని మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్మీ చర్యలతో ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేస్తోందన్నారు. మహారాష్ట్రలో త్వరలో జరగబోయే 25 జిల్లా పరిషత్ ఎన్నికలకు ఆయన శనివారం ఉస్మానాబాద్ జిల్లాలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. -
అటు కూంబింగ్.. ఇటు విచారణ
-
అటు కూంబింగ్.. ఇటు విచారణ
పఠాన్‌కోట్ రంగంలోకి ఎన్ఏఐ చీఫ్ ♦ సాయంత్రం ఎయిర్‌బేస్ వద్ద కలకలం ♦ ఎస్పీ సల్విందర్ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్ఏఐ పఠాన్‌కోట్: ముష్కర మూకలు దాడి చేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తుపాకుల మోతతో హోరెత్తిన ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు మిగిలున్నారా అనే అనుమానంతో భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనను విచారించేందుకు ఎన్ఐఏ చీఫ్ శరద్‌కుమార్ రంగంలోకి దిగారు బుధవారం ఎయిర్‌బేస్‌లో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పఠాన్‌కోట్ ఘటనకు సంబంధించి.. ఇప్పటివరకు మొత్తం మూడు కేసులను ఎన్ఐఏ నమోదు చేసింది. జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి చెందిన 20 మంది సభ్యుల బృందం ఎయిర్‌బేస్‌లో ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. మరోవైపు పఠాన్‌కోట్ ఘటనకు ముందు కిడ్నాపై విడుదలైన ఎస్పీ సల్విందర్ సింగ్నుకూడా ఎన్ఐఏ విచారించింది. ఎస్పీ, గాయాలతో ఉన్న అతని మిత్రుడు వర్మ చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవటంతో ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. గురుద్వారా పూజారిని కూడా ఎన్ఐఏ విచారించింది. కిడ్నాప్ విషయంలోనూ ఎస్పీ, డ్రైవర్, వర్మ చెబుతున్న దానికి పొంతన కుదరలేదు. బుధవారం సాయంత్రం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ వద్ద కలకలం రేగింది. గడ్డంతో, ఖాకీ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌బేస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించిన బలగాలు.. అప్రమత్తమయ్యాయి. ‘బ్యాగును దూరంగా పడేసి.. నేలపై పడుకోవాల’ని ఆర్మీ చేసిన హెచ్చరికలను ఆ వ్యక్తి పట్టించుకోలేదు. 15-20 నిమిషాల హైడ్రామా తర్వాత భద్రతా బలగాలు ఆయన్ను పట్టుకున్నాయి. కాగా, ఆర్మీ, ఎన్ఎస్జీ సంయుక్తంగా పఠాన్‌కోట్ ఆపరేషన్‌ను నిర్వహించాయని.. లెఫ్టినెంట్ జనరల్ కమల్జిత్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు ఎయిర్‌ఫోర్సు స్టేషన్ లోపల ఉన్న రెండస్తుల భవంతిలో దాక్కోవటం వల్ల ఆపరేషన్ తొందరగా ముగిసిందన్నారు. కాగా, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పఠాన్‌కోట్ ఉదంతాన్ని కేబినెట్ సహచరులకు వివరించారు. మరోవైపు, సరిహద్దుల్లో భద్రతా లోపాల కారణంగానే ఉగ్రవాదులు భారత్‌లోకి వచ్చారన్న విమర్శలతో భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు 2వేల మంది జవాన్లను పంపించారు. అటు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంచెలవారిగా సీఐఎస్ఎఫ్, క్విక్ రియాక్షన్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది భద్రతా వైఫల్యమే: కాంగ్రెస్ పఠాన్‌కోట్ దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, బాధ్యులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే అన్నారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు దాడికి తెగబడినా.. దానిని లెక్కచేయకుండా ఇరు దేశాలు ముందుకెళ్లడాన్ని హురియత్ కాన్ఫరెన్స్ స్వాగతించింది. నిరంజన్ కుటుంబానికి రూ. 50 లక్షలు పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. -
'అప్పుడు కార్గిల్.. ఇప్పుడు పఠాన్‌కోట్'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆకస్మికంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు సంధించింది. గతంలో ప్రధాని హోదాలో వాజ్‌పేయి పాక్ పర్యటనకు వెళ్లాక కార్గిల్ యుద్ధం జరిగిందని, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్‌కు వెళ్లొచ్చాక పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి జరిగిందని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. యూపీఏ హయాంలో మంత్రులు బిరియానీని పాక్‌కు పంపుతున్నారని గతంలో మోదీ విమర్శలు చేశారని, ఆయన లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలసి వచ్చారని, ఇప్పుడు ఏం జరిగిందని షిండే ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో మోదీ పరిష్కార చర్యలు తీసుకోవాలని షిండే సూచించారు. మోదీ అప్ఘానిస్తాన్ నుంచి నేరుగా లాహోర్‌కు వెళ్లి షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయన మనవరాలి వివాహ వేడుకలో పాల్గొని వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశారు. -
కేసీఆర్ అబద్ధాల కోరు
సాక్షి, హన్మకొండ: కేసీఆర్ అబద్ధాల కోరు అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని, ఆయనో మోసకారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా వర్థన్నపేటలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో షిండే ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జటిల సమస్యగా మారినా, కొన్ని పార్టీలు వ్యతిరేకించినా, ఎన్ని కష్టాలు ఎదురైనా... చేసిన వాగ్దానం మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా, తెలంగాణను ఏర్పాటు చేస్తే మహారాష్ట్రలో విదర్భ సమస్య ఎదురవుతుందని తెలిసినా... సోనియాగాంధీ తన మాటకు కట్టుబడ్డారన్నారు. కేంద్ర హోం మంత్రిగా తెలంగాణ బిల్లు ఆమోదం కోసం చివరిగా సంతకం చేసింది తానేనని, అందుకు ఎంతగానో గర్విస్తున్నానని షిండే చెప్పారు. కొత్త రాష్ట్రంలో దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పాడని విమర్శించారు. మోసం చే సి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం నీతిమాలిన పని అని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఇక్కడి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల బలవనర్మణాలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని... హామీ మేరకు రుణమాఫీ చేయడంతోపాటు సకాలంలో రుణాలిప్పించాలని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా సమర్థుడు, యోగ్యుడైన సర్వే సత్యనారాయణను సోనియాగాంధీ ఎం పిక చేశారని, ఆయనను గెలిపిస్తే వరంగల్ అభివృద్ధికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. తల్లిని సైతం మోదీ అవమానిస్తున్నారు ఎన్నికల సమయంలో తాను చాయ్ వాలా అంటూ చెప్పుకున్న ప్రధాని మోదీ.. విదేశీ పర్యటనలో తన తల్లి పనిమనిషి అంటూ ప్రచారం చేసుకుంటున్నారని షిండే విమర్శించారు. విదేశాల్లో తన తల్లిని మోదీ అవమానిస్తున్నారన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ అనుసరించిన విధానాలకు బిహార్ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, అదే ఫలితం ఇక్కడ టీఆర్ఎస్కు వస్తుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల జోలికి వస్తే బీజేపీ పుట్టగతులు లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, నంది ఎల్లయ్య, భట్టివిక్రమార్క, బలరాంనాయక్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజలే బుద్ధి చెప్పాలి: దిగ్విజయ్ వరంగల్: అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీనీ నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం డీసీసీ భవన్లో గౌడ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలతో ఆయన సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పెంపు, రెంటల్ తగ్గింపు, సొసైటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టామని దిగ్విజయ్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు, తండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పిన కేసీఆర్... ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. హామీలు విస్మరించిన టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశం సందర్భంగా గీత కార్మికులు అందించిన కల్లును దిగ్విజయ్ తాగారు. -
'అఫ్జల్‌గురుని అందుకు ఉరితీయలేదు'
ముంబయి: పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరితీసింది రాజకీయ ప్రయోజనాలకోసం కాదు అని కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. కోర్టు తీర్పులకనుగుణంగానే తాము నడుచుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకోసమే యూపీఏ ప్రభుత్వం అఫ్జల్ గురుని ఉరితీశారని నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. 'సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానంలో అఫ్జల్ కేసుపై అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. క్షమాభిక్ష కూడా తిరస్కరించబడింది. ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా ఉరితీసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రాజకీయ నిర్ణయం కాదు' అని ఆయన వివరణ ఇచ్చారు. కాశ్మీర్లో రాజకీయాలను పెడద్రోవ పట్టించాలని ఒమర్ ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతుండొచ్చని షిండే చెప్పారు. ఉరి తీసే సమయంలో ఇలాంటి ఆరోపణలేవి ఆయన ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు పునర్వైభవం ఖాయం
కేంద్ర మాజీమంత్రి షిండే ఆశాభావం ముంబై: కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబై సబర్బన్‌లో ఉన్న తిలక్ భవన్లో ఆదివారం జరుపుకున్నారు. ఐదేళ్ల తర్వాత తమ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని షిండే అన్నారు. ఈ మేరకు పార్టీని పునర్మించేందుకు అధిష్టానం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ మంత్రి నారాయణ్ రాణే, అసెంబ్లీ విపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. -
కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు ఉండదు
కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే సాక్షి, తిరుమల: కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమేనని, అధినాయత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ పునర్జీవం సాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా తర్వాత సమసిపోతాయని చెప్పారు. తమ నాయకత్వంలో ఏర్పాటైన రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. -
ఐదో తేదీవరకు ముసాయిదా మేనిఫెస్టో
ముంబై: వచ్చే నెల 5వ తేదీ వరకు తమ పార్టీ మ్యానిఫెస్టోను సిద్ధం చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ సుశీల్‌కుమార్ షిండే ఆధ్వర్యంలో గురువారం తిలక్‌భవన్‌లో సమావేశం నిర్వహించారు. కమిటీని మూడు విభాగాలుగా విభిజించి ఒక్కో విభాగానికి ఒక్కో పని అప్పగించారు. నగర సమస్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్ధన్ చతుర్వేది, ఆరోగ్య సంబంధ విషయాలపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి సురేష్ శెట్టి, యువతకు సంబంధించిన అంశాలపై ఎంఎల్సీ అనంత్ గాడ్గిల్ ఆధ్వర్యంలోని విభాగాలు సెప్టెంబర్ రెండో తేదీవరకు సమాచారాన్ని అందించాలని షిండే సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 5వతేదీనాటికి ముసాయిదా మ్యానిఫెస్టో సిద్ధమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘వార్ రూం’గా మారిన ఆస్పత్రి గది నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి గది కాంగ్రెస్ పార్టీ ‘వార్ రూం’గా మారిపోయింది. రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మోహన్ ప్రకాశ్ ఒక కాలుజారి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అతడి కాలులో రాడ్ వేశారు. కాగా, త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆస్పత్రిలోనే రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. మోహన్ ప్రకాశ్ ఆస్పత్రి పాలవ్వడం తమ పాలిట వరంగా మారిందని, లేదంటే తామంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేదని సరదాగా వ్యాఖ్యానించాడు. -
కేంద్ర మాజీ మంత్రులకు వారంట్లు
అనంతపురం: సమన్లు అందినా వాయిదాలకు గైర్హాజరైన కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్‌లకు శుక్రవారం అనంతపురం ఏడవ ఫాస్ట్‌ట్రాక్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వై. విజయకుమార్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో పాటు మంత్రులు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, కావూరి సాంబశివరావు, ఎస్.జైపాల్‌రెడ్డిలు చేసిన ప్రకటనలు రాష్ట్రంలో అల్లర్లకు కారణమయ్యాయని, ఇది దేశద్రోహం కన్నా తీవ్రమైనదని పేర్కొంటూ 2013లో అనంతపురానికి చెందిన న్యాయవాదులు మల్లికార్జున, నాగన్న మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు సరైన ఆధారాలు లేవంటూ.. పిటిషన్‌ను రిజిష్టర్ చేయకుండానే 2013 డిసెంబర్లో కేసును కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2013 డిసెంబర్ 24న వారు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అర్జీదారుల వాదనలు విన్న కోర్టు ప్రతివాదుల సమాధానం కూడా విన్న మీదటే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడం సబబని పేర్కొంటూ..ప్రతి వాదులైన ఎనిమిది మందికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. -
సత్తా అన్వేషణ
సాక్షి ముంబైః శాసనసభ ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. సమర్థులైన అభ్యర్థుల కోసం అధ్యయనం ప్రారంభించాయి. పార్టీలు బలోపేతంగా ఉన్నప్పటికీ సమర్థులైన అభ్యర్థులు దొరకడం కష్టసాధ్యమేనని పార్టీల సీనియర్లు అంటున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం వేటను తీవ్రతరం చేశాయి. గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ నాయకులు కొందరు ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి రావాలంటే సమర్థులైన అభ్యర్థులు అవసరమని ఇరు కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. పార్టీలు బలంగానే ఉన్నప్పటికీ గెలిపించే సత్తా కలిగిన అభ్యర్థులు కాంగ్రెస్, ఎన్సీపీలో కరువయ్యారని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2009లో కాంగ్రెస్ 174 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఈ సారి కనీసం 130 సీట్లు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో 10 స్థానాలు అధికంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పటికీ, 16 సీట్లయినా ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు పోటీ చేసేందుకు ఆసక్తికనబరిచిన అభ్యర్థుల్లో గెలుపు గుర్రాల సంఖ్య తక్కువేనని అంచనా. గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన అభ్యర్థులు మాత్రం ఈసారి పోటీకి పెద్దగా ఆసక్తిచూపలేదు. పవార్-తట్కరేదే ఆధిపత్యం... ఎన్సీపీ పరిస్థితి గమనిస్తే పార్టీ అధ్యక్షుడి సోదరుని కుమారుడైన ప్రస్తుత ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే ఆధిపత్యం కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నాయకులు ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, గణేష్ నాయక్, భాస్కర్ జాధవ్, బబన్‌రావ్ పాచ్‌పుతే వంటి వారికి ప్రాధాన్యం లభించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు శివసేన, బీజేపీలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు వినికిడి. బీజేపీ త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. హైదరాబాద్‌లో గట్టి ప్రాబల్యం ఉన్న ఎంఐఎం కూడా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. ఓడిపోయేపార్టీలో తాను బాగస్వామిని కాలేననని ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి నారాయణ రాణేను ఇటీవలే బుజ్జగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో ఆధిపత్యం కోసం పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తుండడంతో వర్గ రాజకీయాలు కాంగ్రెస్‌లో అధికమయ్యాయని చెబుతున్నారు. నారాయణరాణే, అశోక్ చవాన్, పతంగ్‌రావ్ కదంతోపాటు మరి కొందరు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారని సమాచారం. ఈ భారీ పోటీ వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. -
ఎన్నికలకు సన్నద్ధం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పార్టీని సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రచార, సమన్వయ కమిటీలకు నారాయణ్ రాణే, అశోక్ చవాన్ పేర్లను ప్రకటించింది. అలాగే కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమించింది. పై అన్ని కమిటీల్లోనూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినడంతో కాంగ్రెస్ కార్యకర్తలు డీలాపడిపోయారు. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో డీలాపడిన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు, తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే రాణే, అశోక్ చవాన్ వంటి అసంతృప్తివాదులను బుజ్జగించి వారికి సముచిత పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకు యత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాణే, అశోక్చవాన్లకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఘోరపరాజయం తర్వాత ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్‌కు వీరిద్దరూ వంతపాడారు. అలాగే నెల రోజుల కిందట నారాయణ్ రాణే సీఎం పనితీరుపై ఆరోపణలు చేస్తూ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. పార్టీని సైతం విడుస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. అయితే అధిష్టానం అతడిని బుజ్జగించి పార్టీని గాడిలో పెట్టే బాధ్యత అప్పగించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ప్రచార కమిటీలో 33 మంది సభ్యులుంటారు. వీరిలో మాజీ మంత్రులు అనంత్‌రావ్ థోప్డే, రోహిదాస్ పాటిల్, ఎంపీలు రజ్నీ పాటిల్, అవినాష్ పాండే, మాజీ ఎంపీ మిలింద్ దేవరా వంటివారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సమన్వయ కమిటీలో షిండే, ముకుల్ వాషిక్, రాణే, మురళీ దేవరా, గురుదాస్ కామత్, జనార్ధన్ చందూర్కర్, పతంగ్‌రావ్ కదమ్, హుస్సేన్ దల్వాయీ, కమల్‌తాయి వ్యవహరే, శరద్ రన్పిసే వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అలాగే 39 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు బాలా సాహెబ్ థరోట్, హర్షవర్ధన్ పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్, నితిన్ రావుత్, పార్టీ ఎంపీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, పార్టీ అధికారి ప్రతినిధి అనంత్ గాడ్గిల్ తదితరులున్నారు. పీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్యమంత్రితోపాటు సీనియర్ నాయకులు షిండే, వాస్నిక్, కామత్, అశోక్ చవాన్, రాణే, విలాస్ ముత్తెంవార్ సతావ్, ప్రియాదత్ సభ్యులుగా ఉంటారు. అలాగే మీడియా, ప్రచార కమిటీకి హర్షవర్ధన్ పాటిల్ చైర్మన్‌గా ఉంటారు. ఇందులో సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, సంజయ్ నిరుపమ్, అమిత్ దేశ్‌ముఖ్, రాష్ట్ర హోం సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉంటారు. కాగా ఈ కమిటీకి సంజయ్ దత్, సచిన్ సావంత్, ఆశిష్ కులకర్ణి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. -
రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన
ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం సీఎం రేసులో షిండే, ఎంపీసీసీ అధ్యక్షుడి రేసులో అశోక్‌చవాన్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు కాగానే సీఎంను తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు ముందే సీఎం పృథ్వీరాజ్ చవాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడిని కూడా మారుస్తారని, ఈ రెండు స్థానాలను అనుభవం ఉన్న నేతలకు అప్పగిస్తారని చెబుతున్నారు. పవార్‌తో చర్చించిన సోనియా..? ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమిని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై కూడా సోనియా పవార్‌ను అడిగినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు. మొదలైన ఫైరవీలు... ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పదవులను దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు అప్పుడే ఫైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులతోపదవుల కోసం రాయబారాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రేసులో ఎవరెవరు? ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందన్న ప్రశ్నలకు పార్టీ నేతల నుంచి హర్షవర్ధన్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, రాధాకృష్ణ విఖేపాటిల్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ వీరివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అధిష్టానం తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లయితే ఈ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను కూర్చుండ బెట్టే సూచనలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం పదవిని పోగొట్టుకున్న అశోక్ చవాన్‌ను పెయిడ్ న్యూస్ కేసు వెంటాడుతోంది. దీనిపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 20లోపు విచారణ పూర్తిచేసి నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 20 తర్వాత ఒకవేళ అశోక్ చవాన్‌కు క్లీన్ చిట్ లభిస్తే పీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు ఆయనకే కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. -
అస్సాంలో పేట్రేగిన మిలిటెంట్లు... 23 మంది మృతి
* ఏకే 47 తుపాకులతో విరుచుకుపడ్డ ముష్కరులు * చివురుటాకుల్లా వణికిన కోక్రాఝర్, బక్సా జిల్లాలు * కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశం.. గువాహటి: అస్సాంలో బోడోలాండ్ తీవ్రవాదులు పేట్రేగిపోయారు. బోడోలాండ్ ప్రాంతం పరిధిలోని రెండు అత్యంత సున్నితమైన జిల్లాల్లో భీకర దాడులకు తెగబడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో మొత్తం 23 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, 11మంది మహిళలు ఉన్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. వివరాలు.. ఎన్డీఎఫ్బీ-ఎస్(నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్-సొంగ్‌బిజిత్)కు చెందిన 40 మంది మిలిటెంట్లు శుక్రవారం తెల్లవారుజామున కోక్రాఝర్ జిల్లాలోని బలపరా-1 గ్రామంలోని మూడు ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. పొరుగున ఉన్న బక్సా జిల్లాలో గురువారం అర్ధరాత్రే తొలుత దాడులకు దిగిన మిలిటెం ట్లు.. జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఇదే జిల్లాలో మరో వ్యక్తిని కూడా మిలిటెంట్లు కాల్చి చంపారు. బక్సా జిల్లాలోని నాంకేఖాద్రాబరి, నయాంగురి గ్రామాల్లో బుల్లెట్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారన్నారు. ఇదే జిల్లాలోని మానస్ జాతీయ పార్కు సమీపంలో బేకి నదీ ఒడ్డున ఉన్న మైనార్టీ వర్గాలకు చెందిన 70 ఇళ్లను మిలిటెంట్లు తగలబెట్టారు. ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా చిరాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే బక్సా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఫోన్లో మాట్లాడి అదనపు బలగాలను పంపాలని కోరారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తామని షిండే చెప్పారు. దాడులకు పాల్పడిన ఎన్డీఎఫ్బీ మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం ఆదేశించింది. -
ఓటేసిన షిండే, సుప్రియా సూలే
సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో ఉదయాన్నే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే, బారామతి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, కర్ణాటక షిమోగాలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటేశారు. ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ సతీసమేతంగా వచ్చి ఓటేశారు. ఐదో విడతలో భాగంగా బీహార్ -7, ఛత్తీస్‌గఢ్-3, జమ్మూకాశ్మీర్-1, జార్ఖండ్-6, కర్ణాటక-28, మణిపూర్-1, మధ్యప్రదేశ్-10, మహారాష్ట్ర-19, ఒడిశా-11, రాజస్థాన్-20, ఉత్తర్‌ప్రదేశ్-11, పశ్చిమబెంగాల్-4 స్థానాల్లో ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. -
ఇదే నా చివరి పోటీ
షోలాపూర్, న్యూస్‌లైన్: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి అని, ఇకపై తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల్లో వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు రూ. 25 వేలు మాత్రమే ఖర్చు కాగా, అదిప్పుడు ఎన్నోరెట్లు పెరిగిపోయిందన్నారు. ఎన్నికల్లో వ్యయం పెరిగిపోవడం వల్ల సామాన్యులు పోటీ చేసి గెలిచే అవకాశం లేకుండా పోయిందన్నారు. షిండే షోలాపూర్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, తనకు హైటెక్ ప్రచారం అవసరం లేదని, షోలాపూర్ అభివృద్ధి కోసం తాను ఎన్నో పనులు చేశానని, వాటిని కార్యకర్తలు ప్రజల వద్దకు చేరవేస్తారని చెప్పారు. -
కాంగ్రెస్, ఎన్సీపీ
దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వల్ల ఈ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలూ తప్పేట్టులేదు. మిత్రపక్షమైన ఎన్సీపీని దూరంగా ఉంచాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి విన్పిస్తోంది. శరద్ పవార్ ఆయన పరివారంపై వస్తున్న అవినీతి ఆరోపణలు తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. స్థానిక సమస్యలు.. ముఖ్యంగా ఇటీవల మళ్లీ పెరిగిన రైతుల ఆత్మహత్యలు, జలవనరుల ప్రాజెక్టుల కుంభకోణాలు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మొదలైనవి కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్గత కలహాలు, అసంతృప్త నాయకుల కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయితే, రాష్ట్రంలో 48 శాతం ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఇవి సానుకూలం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధానంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు చూస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్గజాల్లో సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ సీఎం అశోక్ చవాన్(నాందేడ్), మిలింద్ దేవరా(దక్షిణ ముంబై), ప్రియాదత్(ముంబై నార్త్ సెంట్రల్), గురుదాస్ కామత్(ముంబై నార్త్‌వెస్ట్)లు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న సురేష్ కల్మాడీకి పూణె టికెట్ ఇవ్వకపోవడంపై అక్కడ మంచి పట్టున్న కల్మాడీ అసంతృప్తితో ఉన్నారు. ఆదర్శ్ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్‌ను బరిలోకి దింపడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలోకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్సీపీ కొందరు రాష్ట్ర సీనియర్ మంత్రులను కూడా బరిలోకి దింపింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే, సోదరుని కుమారుడు అజిత్ పవార్లు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో పార్టీకి పట్టుండడంతో ఆ ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇటీవల శివసేన సిట్టింగ్ ఎంపీలు పలువురు ఎన్సీపీలో చేరారు. -
షోలాపూర్‌లో ద్విముఖ పోటీ
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్, మాడా లోక్‌సభ నియోజక వర్గాల ముఖచిత్రం స్పష్టమైంది. షోలాపూర్ స్థానంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థి సుశీల్ కుమార్ షిండే, అడ్వొకేట్ శరద్ బన్సోడే మధ్య పోటీ జరగనుంది. అలాగే మాడా స్థానంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరఫున బరిలోకి దిగిన మాజీ ఉపముఖ్య మంత్రి విజయసింహ మోహితే పాటిల్, మహాకూటమి అభ్యర్థి సదాబహు ఖోత్, స్వతంత్ర అభ్యర్ధి ప్రతాప్ సింహ మోహితే పాటిల్‌లు పోటీ పడుతున్నారు. షోలాపూర్ స్థానం నుంచి సుశీల్‌కుమార్ షిండే నాలుగోసారి బరిలోకి దిగారు. గతంలో 1998, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు. 2009 నాటి ఎన్నికల్లో కాషాయ కూటమికి చెందిన బీజేపీ అభ్యర్ది అడ్వకేట్ శరద్ బన్సోడేతోనే ఆయన తలపడ్డారు. ఆనాటి ఎన్నికల్లో షిండేకి 3 లక్షల 87 వేల 592, బన్సోడేకి 2 లక్షల 87 వేల 457 ఓట్లు వచ్చాయి. దీంతో షిండేకి 99 వేల 652 ఓట్ల మేర మెజారిటీ వచ్చింది. ఈసారికూడా షిండే, బన్సోడేలే బరిలో నిలిచారు. కాగా సుశీల్ కుమార్ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఒక పర్యాయం నియోజకవర్గాన్ని చుట్టేశారు కూడా. మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఆయనకు అన్నివిధాలుగా సహకరిస్తోంది. మరోవైపు ఇక్కడి నుంచి బరిలోకి దిగిన శరద్ నామినేషన్ దాఖలు తర్వాత ప్రచారం జోరు పెంచారు. వాస్తవానికి ఆయనకు ఇప్పటిదాకా బీజేపీకి చెందిన అసంతృప్తులను బుజ్జగించడానికే సమయమంతా గడిచిపోయింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లలిత్ బాయిర్ ముంబై నివాసి. అందువల్ల షోలాపూర్ స్థానం ఓటర్లు ఆయనను ఏ మేర ఆదరిస్తారనే విషయం ప్రశ్నార్ధకంగానే వుంది. పట్టణంలో అప్ కార్యకర్తల సంఖ్య అంతంతే. ఇక మాడా నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన విజయసింహ మోహితే పాటిల్, మహాకూటమి తరపున సదాబాహు ఖోత్, స్వత్రంత్ర అభ్యర్థి ప్రతాప్ సింహ మోహితే పాటిల్‌ల మధ్యనే పోటీ నెలకొంది. విజయసింహ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పార్టీలో సగానికి పైగా నాయకులను బుజ్జగించడంలో సఫలమైనప్పటికీ సంజయ్షిండే, మణ సెగ్మెంట్ ఎమ్మెల్యే జయకుమార్ తటస్థంగా ఉండడం, స్వయానా సోదరుడు ప్రతాప్సింహ మోహితే పాటిల్ స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలవడం లాంటివి విజయ్సింహకు మరీ తలనొప్పిగా మారింది. ఇదిలాఉంచితే మహాకూటమికి చెందిన సదాబహు ఖోత్ ైరె తుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాగే ప్రతాప్సింహ మాడా... లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో అభివృద్ధిని ఏకరువు పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ స్థానంలో ఆప్ తరపున అడ్వొకేట్ సవితా షిండే బరిలో ఉన్నారు. ఆమెకు ఎన్ని ఓట్లు లభిస్తాయేది వేచిచూడాల్సిందే. షోలాపూర్ లోక్‌సభ నియోజక వర్గంలో 2009 నాటి ఎన్నికల్లో మొత్తం 13 అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జాతీయ పార్టీల తరఫున ముగ్గురితోపాటు 10 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. మాడా లోక్ సభ నియోజక వర్గంలో 2009 నాటి ఎన్నికల్లో 15 మంది అభ్యర్దులు పోటీపడగా ఈసారి 24 అభ్యర్దులు బరిలో ఉన్నారు. జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇరువురు, అలాగే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులతోపాటు 17 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజక వర్గాలలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. షోలాపూర్ స్థానంలో సునీత ఉగడే, మాడా స్థానంలో అప్‌కి చెందిన సవితా షిండే, స్వతంత్ర అభ్యర్ధి నాగమణి జక్కన్, సుజాతా తుపు సౌందర్యలు ఇక్కడ బరిలో ఉన్నారు. విశేషమేమిటంటే తెలుగు మహిళ అయిన నాగమణి జక్కన్ 2004లో ఇక్కడినుంచి పోటీ చేశారు. 2009 లో ఆమె మాడా స్థానం నుండి ఎన్నికల బరిలో దిగారు. ఆమెకు 2,799 ఓట్లు లభించాయి. ఆమె మళ్లీ ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. -
సీనియర్లను గౌరవించాలి
షోలాపూర్ : హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన ప్రత్యర్థి పార్టీ నాయకులైన ఎల్కే అద్వానీ, జస్వంత్సింగ్లపై ప్రశంసలు కురిపించారు. సీనియర్లను కించపరచకూడదన్నారు. వారు సీనియర్లని, అందువల్ల వారిని గౌరవించాలని హితవు పలికారు. పార్టీలో వారిని అవమానపరచకూడదని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జస్వంత్ సింగ్ చాలా అద్భుతంగా పని చేశారని కొనియాడారు. దేశం మొత్తం ఆయనను గౌరవిస్తుందని చెప్పారు. బీజేపీ అధినాయకత్వం తనకు టికెట్ కేటాయించకపోవడంతో రాజస్థాన్‌లోని బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో దేశం సురక్షితంగా మారిందని చెప్పుకున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సమస్యగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నక్సల్స్‌ను అదుపు చేశామని అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రెండు దట్టమైన అడవులున్నాయని, అక్కడే రెండు విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఓ ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ, నక్సల్స్‌ను అదుపు చేసేందుకు రెండంచల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురూ, ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లను ఉరి తీసే విషయంలో తాను ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని చెప్పారు. మరోసారి తాను హోం మంత్రిని అవుతానో లేదో తెలియదన్నారు. -
భారీ ఊరేగింపుతో షిండే నామినేషన్
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయనతో పాటుగా మాడా స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి విజయసింహ మోహితే పాటిల్ భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ పత్రాలను ఈసీ రిటర్నింగ్ అధికారులకి సమర్పించారు. వీరి వెంట ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అనంతరం నగరంలోని హోం మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థులు షిండే, విజయసింహ మోహితే పాటిల్‌లను ఈసారి కూడా గెలిపించాలని సీఎం చవాన్, కేంద్ర మంత్రి పవార్ పిలుపునిచ్చారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను నరేంద్ర మెడీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లప్పుడు ఇరు కాంగ్రెస్ పార్టీల వైపే మొగ్గు చూపుతూ వచ్చిన స్థానికులు ఈసారి కూడా ఆదరించాలని అభ్యర్థించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడి నుంచే ప్రారంభమైందో తెలియని మోడీ ఇక దేశాన్ని ఎలా పాలించగలరని ప్రశ్నించారు. మత కలహాలు జరగకుండా ఉండాలంటే లౌకిక పార్టీలను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. ఊరేగింపు సాగిందిలా... నామినేషన్ దాఖలు కంటే ముందు నాయకులు ఊరేగింపుగా వెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వాహనాల ద్వారా జనం బస్టాండ్ సమీపంలోని శివాజీ విగ్రహం వరకు చేరుకున్నారు. అక్కడ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత ఊరేగింపును ప్రారంభించారు. పలు మార్గాల మీదుగా కొనసాగిన ఊరేగింపు రంగ్‌భవన్ చౌక్ వరకు చేరుకుంది. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేశారు. -
ప్రజల కోరిక మేరకే ఏపీ విభజన
షోలాపూర్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సమానమేనని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి అక్కల్కోట్ రోడ్వైపున ఉన్న పూజాల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా విధులు నిర్వహించానని, ఆ రాష్ర్టం రెండుగా చీలిపోవడంలో తన పాత్ర కూడా ఉండడం కొంత బాధాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ డిమాండ్ మేరకే రాష్ట్రాన్ని విభజించినట్లు ఆయన తెలిపారు. అయితే విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా తన దృష్టిలో తెలుగువారంతా సమానమేనని ఆయన తెలిపారు. నీలకంఠ, జండ్రా, కురుహిణ్శేట్, కోష్టి సమాజాల మహాసంఘం నిర్వహించిన ఈ సదస్సులో శ్రీమద్గురు నీలకంఠ పట్టాయచాన్య సమక్షంలో సదరు నాలుగు కులాల వారు దీక్ష బూనారు. తమ కులవృత్తి, గోత్రాలు, కులదైవం ఒక్కటే అయినా వేర్వేరు కులాలుగా ఉండే బదులు ఒకే కులం పేరుతో ఉందామని ప్రతిజ్ఞ బూనారు. కాగా, రామకృష్ణ భగుడే అతిథులకు స్వాగతం పలకగా, నాగేష్ మల్వాల్ ప్రాస్తవికోపన్యాసం గావించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రణతి షిండే, మహేష్కోటే, ధర్మన్న సాదులు, విజయకుమార్ ద్యావరకొండ, శివకుమార్ బండా, బాలాజీ అబాత్తిని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, రాయలసీమ అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి శాశ్వతంగా స్థిరపడ్డవారు ఎక్కువ మంది ఉన్నారు. -
మావోయిస్టులపై జాయింట్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేట్రేగిపోతున్న మావోయిస్టు కార్యక్రమాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల యాంటీ నక్సల్ విభాగాలతో కలిసి సంయుక్త కార్యాచరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విభాగాల సమన్వయ బాధ్యతను ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌కు చెందింన ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించాలని భావిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రెండు రోజుల కిందట మావోయిస్టులు విరుచుకుపడి సీఆర్పీఎప్ జవాన్లతో సహా మొత్తం 16 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే ప్రాంతంలో కాంగ్రెస్ నేత మహేంద్రకర్మతో సహా 36 మందిని మట్టుపెట్టారు. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఈ మేరకు ఒకవైపు సీఆర్పీఎఫ్లోని యాంటీ నక్సల్స్ విభాగం కోబ్రా దళాలతో కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తూనే, మరోవైపు తొమ్మిది నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలమధ్య మరింత సమన్వయాన్ని సాధించి మావోయిస్టులను అణిచివేసే ఆపరేషన్లను నిరంతరం కొనసాగించేందుకు హోం శాఖ సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి, సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ మావోయిస్టులను నిరోధించేలా వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి చర్చించారని తెలిసింది. ముఖ్యంగా యాంటీ నక్సలైట్ ఇంటెలిజెన్స్విభాగాలకు అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం జరపడానికి త్వరలోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులను అక్కడకు పంపించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
దాడి చేసిన నక్సల్స్‌ను వేటాడతామన్న హోం మంత్రి ఛత్తీస్‌గఢ్‌లో షిండే పర్యటన.. నక్సల్స్ దాడి మృతులకు నివాళులు ఎన్ఐఏతో దర్యాప్తు జరిపిస్తాం చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు సహా 16 మందిని బలితీసుకున్న నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శపథం చేశారు. మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. షిండే, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, గవర్నర్ శేఖర్దత్లు.. నక్సల్స్ దాడిలో మృతిచెందిన 15 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలకు జగ్దల్పూర్లో నివాళులర్పించారు. దర్బాఘాట్కు వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జగ్దల్పూర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఘటన పూర్వాపరాలపై చర్చించారు. సీఎం, గవర్నర్, ఇతర సీనియర్ అధికారులతో షిండే సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, భద్రతా దళాలు మోహరించటం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతుండటం వల్ల ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నారని తమకు నివేదికలు అందాయని చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో ఈ దాడికి తెగబడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు... ‘‘మేం తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం ఎలా తీర్చుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘గతంలో చేసినట్లుగానే కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి.. ఈ దాడిలో ప్రమేయం ఉన్న మావోయిస్టులను వేటాడతాయి. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు’’ అని షిండే బదులిచ్చారు. గత ఏడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల తరహాలోనే.. రాష్ట్రం లో లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని.. తగినన్ని భద్రతా దళాలను అందిస్తామని చెప్పారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి... నక్సల్స్ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తుందని షిండే తెలిపారు. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘ఇలాంటి ఘటన ఇది రెండోది. దీనిపై ఇప్పటికే చర్చించాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు బలగాలు చేయాల్సిన పని చేస్తాయని మాకు విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు. పౌరుడి ప్రాణం తీసిన హెడ్ ఫోన్! ఇదిలావుంటే.. మంగళవారం మావోయిస్టుల దాడిలో భద్రతా సిబ్బందితో పాటు చనిపోయిన పౌరుడు విక్రమ్నిషాద్.. తన చెవులకు హెడ్ ఫోన్ పెట్టుకుని మొబైల్ ఫోన్ నుంచి పాటలు వింటూ బైక్‌పై వచ్చి ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెప్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్ ఉండటం వల్ల అతడు కాల్పుల శబ్దం వినలేదని, సమీపంలోని వారు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. దాడిలో పాల్గొన్న నక్సలైట్ల ఆచూకీ కోసం కూంబింగ్ ఆపేషన్ మొదలుపెట్టినట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. దాడి నేపధ్యంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ విభాగం 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. 9వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్స్ హింస వల్ల గత రెండు దశాబ్దాల్లో 12,183 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో 9,471 మంది పౌరులు కాగా.. 2,712 మంది భద్రతా సిబ్బంది. ఛత్తీస్‌గఢ్ సంతలో నక్సల్స్ కాల్పులు చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో గ్రామీణుల వేషధారణలో వచ్చిన నక్సల్స్ పేట్రేగిపోయా రు. జనసమ్మర్ధంగా ఉండే వారాంతపు సంతలోకి బుధవారం ప్రవేశించిన మావోయిస్టులు అన్నదమ్ములైన వ్యా పారులు రూపేంద్ర కాశ్యప్, కేదార్నాథ్ కాశ్యప్లపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. రూపేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా కేదార్ పరిస్థితి విషమంగా ఉంది. -
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
భద్రతాదళాలపై దాడిచేసి వారి ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను ఊరికే వదిలేది లేదని.. ఇంతకింత ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే హెచ్చరించారు. మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్ల మృతదేహాలకు షిండే నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించి, విఫలమయ్యారని, తమ ప్రాధాన్యం తగ్గిపోతోందని భయపడే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. మంగళవారం నాడు బలగాలు ఎన్నికలు సజావుగా సాగేందుకు మార్గం తనిఖీ చేయడానికే వెళ్లాయన్నారు. ఇలాంటి దాడులతో ఎన్నికలను వాయిదా వేసేది లేదని, లోక్‌సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే యథాతథంగా జరుగుతాయని అన్నారు. మావోయిస్టులను అణిచేసేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్త ఆపరేషన్ చేస్తయాని షిండే వెల్లడించారు. ఇక మంగళవారం నాటి కేసును దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు అప్పగిస్తామన్నారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇక మరో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా మావోయిస్టుల దాడిని ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీనిపై పోరాడాలని అన్నారు. -
షిండేని గెలిపించండి: పవార్
షోలాపూర్: సుశీల్ కుమార్ షిండేను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ స్థానం నుంచి మళ్లీ గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పార్టీ కార్యకర్తలను కోరారు. షిండే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు లోక్‌సభ సభాధ్యక్షుడిగా ఉన్నందుకు షోలాపూర్ ప్రజలు గర్వపడాలని ఆయన శనివారం పండరీపూర్‌లో మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రజాస్వామ్య కూటమి ఎన్నికల కమిషన్ అనుమతి అడగనుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వారి అనుమతి తప్పనిసరి అని వివరించారు. ఇదిలావుండగా పవార్ ప్రధానమంత్రి అయితే సంతోషపడతానని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
హోం, ఆర్థిక మంత్రులతోనూ నరసింహన్ సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివిధ అంశాల్లో తాజా స్థితిగతులను వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న కమిటీల వివరాలను, వచ్చే మూడు నెలల్లో కార్యాచరణను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసే నాటికి సీమాంధ్రకు రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు అవసరమైన నిధులపై కూడా అంచనాలను ఆర్థిక శాఖ మంత్రికి వివరించినట్టు సమాచారం. అయితే తన పర్యటన సాధారణమైనదేనని, ఎలాంటి ప్రాధాన్యం లేదని నరసింహన్ పేర్కొన్నారు. ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన ఆయన మధ్యాహ్నం హోం మంత్రి, ఆర్థిక మంత్రితో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, సాధారణ పర్యటనలో భాగంగానే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలతో పాటు పలు అంశాలను కేంద్ర హోం, ఆర్థిక మంత్రులకు వివరించినట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటానని వివరించారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన కొందరు అధికారులను వెనక్కి పంపిన నేపథ్యంలో ఇంకా ఎవరినైనా మార్పు చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... సాధారణ బదిలీల్లో భాగంగానే అవి జరిగాయని నరసింహన్ చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చివరిలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత? అని ప్రశ్నించగా... అవి మీకే (మీడియాకే) తెలియాలంటూ సమాధానం దాటవేశారు. బాధ్యతలు తీసుకుని రెండే రోజులైనందున మిగతా విషయాలను త్వరలోనే పరిశీలిస్తానని, వీలును బట్టి ప్రధానమంత్రితో భేటీ అవుతానని చెప్పారు. -
కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(75) నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించా యి. గవర్నర్‌గా ఆమె నియామకానికి సంబంధించిన విషయాన్ని మంగళవారం ఉదయం ఇక్కడ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసిన సందర్భంలోనే షీలాకు వివరించారని తెలిపాయి. ఇదిలావుంటే, దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, ప్రస్తుత కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి తలపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత డిసెంబర్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం. -
అబ్బే.. అలా అనలేదు: షిండే
షోలాపూర్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గాన్ని అణచేస్తామంటూ హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి షిండే.. తన మాటలను సవరించుకున్నారు. నలువైపులా విమర్శలు రావడంతో.. సోషల్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించానే గానీ, జర్నలిస్టులను తానేమీ అనలేదని షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలోని తన సొంత నియోజకవర్గమైన షోలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా గురించి.. హైదరాబాద్‌లో, కర్ణాటకలో ఈశాన్య ప్రజలపై జరిగిన హింసను ఉద్దేశించి మాట్లాడానని వివరించారు. నిజానికి షిండే ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించే ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాలుగు నెలలుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక వర్గం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. నా పరిధిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఎవరు అలా చేస్తున్నారో నాకు తెలుసు. అలాంటి శక్తులను అణచివేస్తాం’’ అని షిండే హెచ్చరికగా మాట్లాడారు. ఇటీవల కొన్ని జాతీయ చానెళ్లు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ హవా గురించిన సర్వే ఫలితాలను ప్రముఖంగా ప్రసారం చేస్తుండడంతో షిండే ఇలా మాట్లాడటం గమనార్హం. ‘పార్టీ ఆఫీసుల్లోని పెళ్లిళ్లు చెల్లవు’ కోచి: రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిపే వివాహాలు చట్టపరంగా చెల్లబోవని కేరళ హైకోర్టు తీర్పుచెప్పింది. వివాహ నమోదు అధికారి (రిజిస్ట్రార్) ముందు లేదా మతపరమైన సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహాలకే చట్టపరంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. -
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు: షిండే
-
కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే విషయంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్నది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని షిండే చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని షిండే చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. కాగా ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా, తెలంగాణ, సీమాంధ్రకు వేర్వేరు పీసీసీలతో పాటు రెండు ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ నుంచి వలసలు ఊపందుకోవడంతో రాష్ట్రపతి పాలన తప్పదనే వాదనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని షిండే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పీఠం కోసం ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆదివారం హస్తినబాట పట్టారు. -
‘టీ’కి మహా అండ
తెలంగాణ బిల్లు ఆమోదంలో షిండే, పవార్ల కీలకపాత్ర హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక తెలంగాణవాదులు తెలంగాణ పోరులో వలసబిడ్డల మరవలేని కృషి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావడానికి మహారాష్ట్ర ఉద్ధండులు చేయూతనిచ్చారు. ఉభయసభల్లో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసవచ్చి రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణవాదులు వీరి మద్దతుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ నాయకులకు అండగా ఉంటామని ప్రకటించారు. సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో మహారాష్ట్ర నాయకులు కీలకపాత్ర పోషించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలంగాణవారి 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేయడంలో తమదైన పాత్ర పోషించారు. తమిళనాడుకు చెందిన పి.చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించినా అంత వేగంగా బిల్లు ముందుకు కదలలేదు. రాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవమున్న షిండే, తెలంగాణ వెనుకబాటుతనంపై కొంత అవగాహన ఉండటం కూడా ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై షిండే తీసుకున్న చొరవపై రాష్ట్రంలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో అనేక మంది షిండే మద్దతుదారులుగా కూడా ఉన్నారు. మరోవైపు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా తెలంగాణకు మద్దతు పలికారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో తమదైన పాత్ర పోషించారు. తెలంగాణ పోరులో వలసబిడ్డలు... ప్రత్యేక తె లంగాణ పోరాటంలో ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు కూడా క్రియాశీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల క్రితమే ఉద్యమాలు జరిగినా, 13 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పుట్టాకే ఇవి మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు తమదైన శైలిలో నిరసనకు దిగారు. వీళ్ల బాటలోనే ముంబైలోని తెలంగాణ వలసబిడ్డలు నడిచారు. పలు కార్యక్రమాలు... 2007 జనవరిలో గోరేగావ్‌లో జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమం అనంతరం ముంబైలోని తెలంగాణవాదుల్లో చైతన్యం వచ్చింది. ఉద్యమంలో ముందుకు దూసుకెళ్లారు. 2008 సంవత్సరంలో అనేక మంది తెలంగాణవాదులు సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. వేర్వేరు సంఘాల పేర్లతో ప్రత్యేక తెలంగాణ కోసం కృషిచేసిన వీరు ఒక బ్యానర్ కింద ఉద్యమం చేపట్టాలని భావించారు. ముంబైలో ‘తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’లను స్థాపించుకున్నారు. ఈ రెండు సంస్థలు వాటి వాటి అనుబంధ సంస్థలు, ఇతర సంఘాలు, కార్మిక యూనియన్ల ద్వారా తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలన్నింటిపై దృష్టిసారించి ప్రతి అంశాన్ని ఇక్కడి తెలంగాణ ప్రజలకు తెలిపి ఆందోళనలో పాల్గొనేలా చైతన్యవంతం చేశాయి. వలసబిడ్డలైన వీరు పలుమార్లు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఆందోళనలలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఇప్పటివరకు ముంైబె లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో 2007లో గోరేగావ్, బాంద్రాలో జరిగిన ధూంధాం కార్యక్రమాలున్నాయి. ఆజాద్‌మైదాన్‌లో కూడా నిరాహారదీక్షలు చేశారు. 2013లో ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా జీవోఎంతో భేటీ అయ్యారు . 2013 నవంబర్‌లో గోరేగావ్‌లో జరిగిన తెలంగాణ సాధన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణవాదులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో సంస్థ సభ్యులులు సఫలీకృతమయ్యారు. ఢిల్లీలోని నాయకులు, ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులతోపాటు మహారాష్ట్రలోని మంత్రులు, నాయకులతో భేటీ అయి తెలంగాణకు మద్దతివ్వాలని వినతిపత్రాలను కూడా సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తూనే, ప్రత్యేక తెలంగాణలో వలస బిడ్డలకు ప్రాధాన్యం లభించాలని కూడా పోరాడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వలసబిడ్డల భవిష్యత్‌పై చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ముంబైలో తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకపాత్ర పోషించినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలనివాస మాల, ముంబై టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్, తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక కన్వీనర్లు శేఖర్ గ్యారా, అక్కినపెల్లి దుర్గేష్, రమేష్ గొండ్యాల, పొట్ట వెంకటేష్‌లతోపాటు ముంబై టీజేఏసీ పదాధికారులు కాసుల నర్సింహగౌడ్, గంగాధర్ గంగపుత్ర, నాగెల్ల దేవేందర్, ద్రవిడ్ మాదిగ, భోగ సుదర్శన్ పద్మశాలి తదితరులు ఉన్నారు. చిగురించిన కొత్త ఆశలు... తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌తోపాటు రాజ్యసభలో ఆమోదం లభించడంతో ముంబైలోని వలసబిడ్డలలో కొత్త ఆశలు చిగురించాయి. అందరూ సంబరాలు జరుపుకున్నారు. ముంబైలో నివసించే తెలంగాణ ప్రజలలో అనేక మంది పొట్టచేత పట్టుకుని వలస వచ్చిన కూలీలు, అసంఘటిత కార్మికులున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర అవతరణతో మంచిరోజులు వచ్చినట్టేనని భావిస్తున్నారు. ముంబైలోని వలసబిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా క్రియశీలపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వలసజీవులకు చేయూతనిచ్చేలా తెలంగాణ నాయకులు చొరవ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, ఇప్పటికే ఎన్నో వ్యయాప్రయాసలకు గురవుతున్నామని అంటున్నారు. -
'ఐపీఎల్-7 కు భద్రత ఇవ్వలేం'
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించటం కష్టమని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఐపీఎల్-7ను మరోదేశంలో నిర్వహించుకుంటే మంచిదని షిండే అభిప్రాయపడ్డారు. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ట్వెంటీ20 క్రికెట్ టోర్నిని ఈసారి భారత్ లో నిర్వహించడానికి అనుకూలంగా లేనందున దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని ఐపీఎల్ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు శ్రీలంకను కూడా పరిశీలిస్తోంది. కాగా సాధారణ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా 2009 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నిని నిర్వహించిన సంగతి తెలిసిందే. -
'తెలంగాణ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టాం'
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టామన్నారు. గవర్నర్ నరసింహన్ పంపిన నివేదిక ఇంకా తమకు అందలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలా.... లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు విషయంపై చర్చించేందుకు కమల్ నాథ్ కూడా సోనియాగాంధీతో విడిగా సమావేశం అయ్యారు . -
షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అనూహ్యంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను కొద్దిసేపు నిలిపివేశారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వారిని నియంత్రించేందుకు మార్షల్స్న ప్రయోగించింది. షిండేకు రక్షణగా నిలబడిన మార్షల్స్ ఆందోళనలు చేస్తున్న సభ్యులను అడ్డుకున్నారు. సీమాంధ్ర సభ్యులతో పాటు సీపీఎం, సమాజ్‌వాది పార్టీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షిండేను చుట్టుముట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వి. హనుమంతరావు.. షిండేకు రక్షణగా నిలబడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. -
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే
న్యూఢిల్లీ: సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన మధ్య కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు పోడియం వద్ద నిరసన తెలుపుతున్నప్పటికీ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ అనుమతితో షిండే బిల్లును సభలో చదవడం మొదలుపెట్టారు. షిండేకు రక్షణగా విహెచ్ హనుమంతరావు, ఇతర ఎంపిలు, మార్షల్స్ నిలబడ్డారు. బిల్లు రాజ్యాంగ విరుద్దం, బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని, బిల్లును తిరస్కరించాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను డిప్యూటీ స్పీకర్ కురియన్ చదివి వినింపారు. నోటీస్ ఇచ్చిన నరేష్ గుజ్రాల్, డెరిక్ ఒబెరాయ్ ఉన్నారు. బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని సభ్యులు బిగ్గరగా అరుస్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో రాజ్యసభను అయిదవసారి వాయిదా వేశారు. -
రాజ్యసభలో తెలంగాణపై గందరగోళం
తెలంగాణ బిల్లు అంశం గురువారం నాడు రాజ్యసభలో గందరగోళానికి కారణమైంది. రాజ్యసభ నాలుగోసారి వాయిదా పడటానికి ముందు తెలంగాణ బిల్లు ఎక్కడంటూ సుజనా చౌదరి అడిగారు. దాంతో బిల్లు గురించి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడుగుతున్నారంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని రాజ్యసభలో బీజేపీ ఆందోళన చేసింది. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ అరగంట వాయిదాపడింది. వియ్ వాంట్ తెలంగాణ బిల్లు అంటూ సుజనాచౌదరి నినాదాలు చేశారు. ఈలోపు.. కాంగ్రెస్-బీజేపీ మధ్య సమాలోచనలు కొలిక్కి రాకపోవడంతో చాలాసేపు రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదు. దీంతో తెలంగాణ బిల్లు ఎక్కడని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. తనను అడుగుతారేంటి, ప్రభుత్వాన్ని అడగండని...బీజేపీ సభ్యులకు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సూచించారు. తర్వాత ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు షిండేకు అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించగా, అచ్చం లోక్‌సభలో జరిగినట్లే, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది సభ్యులు వారిని వెనక్కి తోసేశారు. ఇక రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి చాటుకుంది. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని గుండు సుధారాణి బ్యానర్ పట్టుకుని నిలబడగా, సుజనా చౌదరి తదితరులు మాత్రం వుయ్ వాంట్ యునైడెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ డిప్యూటీ ఛైర్మన్‌తో పదే పదే వాదిస్తూ వచ్చారు. మరోవైపు ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం మళ్లీ పొందిన కేవీపీ రామచంద్రరావు కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డు పట్టుకుని వెల్‌లో నిలబడ్డారు. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి ఎప్పటిలాగే తన స్థానంలోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. -
'కిరణ్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు'
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కు రాజీనామా మినహా మరో ప్రత్యామ్నాయం ఏం ఉందని ప్రశ్నించారు. కిరణ్ రాజీనామా దురదృష్టకరం సీఎం కిరణ్ రాజీనామా దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి పల్లంరాజు. రోశయ్య తర్వాత క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రానికి సీఎంగా వచ్చారని పలు పథకాలు చేపట్టారన్నారు. ఏది ఏమైనా సీఎం రాజీనామా చేయడం విచారించాల్సిన విషయం అన్నారు. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ : కాగా కిరణ్ రాజీనామా కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగమని కమలనాధులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనల్లో భాగంగానే సీఎం తన పదవికి రాజీనామా చేశాడని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సెన్ అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ ఏర్పాటుచేయడం తర్వాత విలీనం చేయడమే కాంగ్రెస్ ప్రణాళిక అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కూడా ఇలాగే ప్రవర్తించారని షానవాజ్ విమర్శించారు. -
తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పరిశీలించి ఆమోదించాలని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళశారం లోక్‌సభను కోరారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో 41వ అంశంగా తెలంగాణ బిల్లు వ్యవహారం వచ్చింది. సీమాంధ్ర సభ్యుల తీవ్ర నినాదాలు, గందరగోళం మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టిన విభజన బిల్లును పరిశీలించి ఆమోదం తెలపాలని షిండే సభకు విజ్ఞప్తి చేశారు. కీలకమైన బిల్లు పరిశీలనకు వచ్చిందని... ఈ సమయంలో సభలో శాంతియుత వాతావరణం ఉండాలని స్పీకర్ మీరా కుమార్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులెవరూ వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు వాయిదా వేశారు. -
ఏం జరుగుతుందో వేచిచూద్దాం:షిండే
-
ఘోరం... దారుణం!
సంపాదకీయం: ప్రజాస్వామ్యాన్ని స్వీయ ప్రయోజన చట్రంలో బంధించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో గురువారం లోక్‌సభలోని విషాదకర పరిణామాలు వెల్లడించాయి. సభలో మైక్రోఫోన్లు విరిగాయి. కంప్యూటర్ను విసిరేశారు. పత్రాలు చించేశారు. కొన్నేళ్లుగా...మరీ ముఖ్యంగా గత ఏడు నెలలుగా రాష్ట్రంలో సంభవిస్తున్న అనేకానేక ఘటనలకు ఇవి పరాకాష్ట. తీవ్ర గందరగోళం మధ్య, కనీవినీ ఎరుగని తోపులాటలు, పెప్పర్‌స్ప్రే వినియోగం, ముష్టిఘాతాలు, పరస్పర దూషణలమధ్య విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనను ఎవరూ నిరోధించకుండా చూసేందుకు ఇతర రాష్ట్రాల ఎంపీలను షిండేకు రక్షణగా ఉంచారు. మరికొందరిని సభలో ఇతరచోట్ల మోహరించారు. ‘మీరు మీ సభ్యులను అదుపు చేసుకోండి. సభను సజావుగా నడపండి. బిల్లు ప్రవేశపెట్టేందుకు మేం సహకరిస్తా’మని బీజేపీ ఇచ్చిన హామీకి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ‘ఫ్లోర్ మేనేజ్మెంటు’ఇది! దేశంలోనే అత్యున్నతమైన చట్టసభను గ్రామ పంచాయతీ సమావేశం స్థాయికి దిగజార్చిన ఈ నేరంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్. సభలో షిండే బిల్లు ప్రవేశపెట్టడాన్ని దేశ ప్రజలకు చూపలేని దుస్థితికి పార్లమెంటు చేరుకున్నదంటే అది యూపీఏ ప్రభుత్వ పాలనా నిర్వహణకు బండగుర్తు. బిల్లు ప్రవేశపెడుతూ షిండే మాట్లాడిన నాలుగు ముక్కలూ వినబడటమే తప్ప దృశ్య మాధ్యమంలో ఆయన జాడలేదు. అలా చూపవలసివస్తే చుట్టూ రక్షణగా ఉన్న ఎంపీలూ కనబడతారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. గతంలో ఇటలీ, బల్గేరియా, ఉక్రెయిన్ పార్లమెంట్లలో సంభవించిన పరిణామాలను మన పార్లమెంటుకు కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అన్నది దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్య. అలాంటి జటిలమైన అంశాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఆదినుంచీ అత్యంత అప్రజాస్వామికంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఈ విషయంలో వచ్చే పేరుప్రతిష్టలూ, ఓట్లూ తనకు మాత్రమే లభించాలన్న కుట్రపూరిత ధోరణిని ప్రదర్శించింది. పార్టీ అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయక వేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలియజేసే ముందు పార్టీలో అందరినీ కలుపుకుపోదామనుకోలేదు. పోనీ, తీర్మానం ఆమోదించాకైనా ఆ విధానానికి కట్టుబడితీరాల్సిందేనని సభ్యులకు చెప్పలేదు. ఇందుకు భిన్నంగా రెండు ప్రాంతాల నేతలనూ ఎగదోశారు. ఆయా ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా చేతనైనంత చేయమని, డ్రామాను సాధ్యమైనంతగా రక్తికట్టించమని నూరిపోశారు. సరిగ్గా తెలుగుదేశం కూడా ఈ విషయంలో కాంగ్రెస్ అడుగుజాడల్లో నడిచింది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి అభ్యంతరంలేదంటూ ఆ పార్టీ అధినేత స్పష్టమైన లేఖ ఇచ్చికూడా ఇరువైపులా ఉన్న నేతలను భిన్నస్వరాలు వినిపించమని ప్రోత్సహించారు. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలుండటం తప్పేమీ కాదు. అయితే, సూత్రబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే ఏ పార్టీ అయినా ఆ భిన్నాభిప్రాయాలను పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకుంటుంది. వ్యతిరేకిస్తున్న నాయకులకు నచ్చజెప్పటమో, వారిని వెళ్లగొట్టడమో...ఏదో ఒకటి చేస్తుంది. ప్రజల ముందు ఒకే స్వరాన్ని వినిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటున్న సీపీఎం, వైఎస్సార్కాంగ్రెస్లు... రాష్ట్రాన్ని విభజించాలని కోరుతున్న టీఆర్ఎస్, సీపీఐలు ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వారి వైఖరిలో లోటుపాట్లుండవచ్చు. అవగాహనలో లోపాలుండవచ్చు. కొందరి మనోభావాలను వారు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. కానీ...అలాంటి వైఖరి ప్రజాస్వామ్యయుతమైనది. ఇందుకు భిన్నంగా... పార్టీ నిర్ణయమేదైనా ప్రాంతీయ వాదనలను వినిపించవచ్చునని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, పరస్పరం తలపడినట్లు నటించమనడం అవకాశవాదానికి, దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట. ఇలాంటి రాజకీయానికి కాంగ్రెస్, టీడీపీలు బరితెగించిన పర్యవసానమే గురువారంనాటి లోక్‌సభ పరిణామాలు. ఇందులో సన్నాయినొక్కులు నొక్కిన బీజేపీ బాధ్యతా ఉంది. బుధవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు వెల్‌లోకి రావడాన్ని గమనించాకైనా ముందు సొంతింటిని చక్కదిద్దుకోమని చెప్పాల్సిన బీజేపీ...కాంగ్రెస్ కపటనాటకాన్ని కొనసాగించేందుకు దోహదపడింది. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని స్పీకర్ మీరా కుమార్ వ్యాఖ్యానించడంతోపాటు 16మంది ఎంపీలను సస్పెండ్ కూడా చేశారు. అయితే, కాంగ్రెస్ పన్నిన ‘ఫ్లోర్ మేనేజ్మెంటు’ వ్యూహంలో ఈ దుస్థితికి బీజాలున్నాయి. తనకు సొంతంగా బలం లేదనుకున్నప్పుడు విపక్షంనుంచి అరువు తెచ్చుకోవడం తప్పుకాదు. కానీ, తన సభ్యులను నిభాయించుకోలేకపోవడం, బౌన్సర్లను నియమించుకున్నట్టు హోంమంత్రి రక్షణార్ధం రాష్ట్రేతర ఎంపీలను తెచ్చుకోవడం కూడా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చే. ఆ విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని అభిశంసించాకే తప్పుచేశారనుకుంటున్న సభ్యులపై చర్యలకు ఉపక్రమించాలి. అసలు ఇంత గొడవ జరుగుతుందని సర్కారు ముందే ఊహించిందా? అందుకు అనుగుణంగా ఇతరేతర దృశ్యాలు మాత్రమే తెరపై సాక్షాత్కరించాయా? అదే నిజమైతే, అది లోక్‌సభ నిర్వహణా తీరును సైతం సంశయించేలా చేస్తుంది. అందుకే, కొందరు సభ్యులు డిమాండు చేస్తున్నట్టు అన్ని దృశ్యాలనూ సంపూర్ణంగా వీక్షించి, సమగ్రమైన చర్యకు ఆమె పూనుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనుకుంటే ఇది తప్పనిసరి. -
లోక్‌సభలో ‘అనూహ్య’ కేసు: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గురువారం వైఎస్ జగన్ 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనూహ్య హత్యకు సంబంధించిన వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ‘అనూహ్య హత్య కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల తీరు బాధాకరం. సరైన రీతిలో కేసు విచారణ చేపట్టలేదు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని స్వయంగా వారి కుంటుంబసభ్యులు కేంద్ర హోంశాఖను కోరినా వారు పట్టించుకోలేదు. కేసు విచారణలో వారితీరు బాధాకరం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అనూహ్య కుటుంబ సభ్యులు కనుగొనేంత వరకు ముంబై పోలీసులు శవాన్ని కూడా కనుక్కోలేకపోయారు. దీన్నిబట్టి మహారాష్ట్ర పోలీసులు విచారణలో ఎంత శ్రద్ధ పెట్టారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దృష్ట్యా ఇప్పటికైనా హత్య కేసు నిందితులను త్వరగా పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలి. అనూహ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నాట్యపరిషత్‌కు ఐదెకరాలు : కేంద్ర హోం మంత్రి షిండే
పండరీపూర్‌లో అఖిలభారత మరాఠీ నాట్య సమ్మేళనం ప్రారంభం షోలాపూర్, న్యూస్‌లైన్: నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. పండరీపూర్‌లో జరిగిన 94వ అఖిల భారత మరాఠీ నాట్య సమ్మేళనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకుండా ఉన్నట్లయితే కళారంగంలో కొనసాగేవాడినని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. తాను చదువుకునే రోజుల్లో పలు నాటకాలలో పాల్గొనేవాడినని బాల్యస్మృతులను నెమరువేసుకున్నారు. అదేవిధంగా నాటక రంగంలో కృషిచేసిన పాతతరం కళాకారులను కొనియాడారు. ‘నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోరేగావ్‌లోని ఫిలింసిటీలో ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. అలాగే ఇంతకు ముందు ప్రకటించిన రూ.ఐదు కోట్ల సహాయ నిధితోపాటు రూ.మూడున్నర కోట్లు, ఈ నాట్య సమ్మేళనం కోసం రూ.25 లక్షల నిధిని అందజేశామన్నారు. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం ఏడు గంటలకు తిలక్ స్మారక్ మైదానం నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. నాట్య సమ్మేళనం ప్రస్తుత అధ్యక్షుడు అరుణ్ కాకుడే, మాజీ అధ్యక్షుడు మోహన్ అగాశే, నాట్యపరిషత్ అధ్యక్షుడు మోహన్ జోషి, రాష్ట్ర సంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దేవతాళే, సహకార శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ అథవాలే, సమ్మేళనం స్వాగతాధ్యక్షుడు, ఎమ్మెల్యే భారత్ బాల్కే, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
అవరోధమేమీ ఉండదు: సుశీల్‌కుమార్‌షిండే
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ-2 సర్కారు హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో ఎలాంటి అవరోధమూ ఉండదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఉద్ఘాటించారు. షిండే శుక్రవారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధులతో చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ చివరి నిమిషంలో మూజువాణి ఓటుతో తీర్మానం చేసిన నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా షిండే స్పందిస్తూ.. ‘‘బిల్లు ఆమోదం పొందుతుంది. అందుకు ఎలాంటి సమస్యా ఉండదు’’ అని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పునర్వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అందనే లేదని.. దీనిపై తాము అటార్నీ జనరల్ న్యాయ అభిప్రాయాన్ని కోరనూ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా షిండే తెలిపారు. తుది బిల్లుపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రభావం ఏమీ ఉండదని.. తెలంగాణ ప్రక్రియను పూర్తిచేయటానికి న్యాయపరమైన అడ్డంకులేమీ రావని ఆయన చెప్పారు. కిరణ్ వాదనను తిరస్కరించిన హోంశాఖ! అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసంపూర్ణంగా ఉందంటూ ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వాదనను తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో.. విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు తేదీ కోసం పార్లమెంటును సంప్రదించాలనే యోచనలో హోంశాఖ ఉన్నట్లు సమాచారం. విభజన బిల్లుకు సంబంధించి రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సిన తదుపరి కార్యాచరణపై కేంద్ర మంత్రుల బృందం ఫిబ్రవరి 4న భేటీ అయ్యే అవకాశముందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. -
ఫిబ్రవరి 11న లోక్‌సభలో టి- బిల్లు?
-
ఫిబ్రవరి 11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై అసలు చర్చ పూర్తి కాలేదు. గట్టిగా మాట్లాడితే అసలు సభ కూడా సజావుగా సాగడంలేదు. బిల్లుకు ఇప్పటికే వేల సంఖ్యలో సవరణలు వచ్చాయి. వాటిని ఇంకా క్రోడీకరించలేదు. ఈలోపే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సమాయాభావం వల్ల, లోక్‌సభ సమావేశాలు ముగిసిపోయే అకాశం ఉన్నందున ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, తెలంగాణపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఇదే ఆ బృందం చిట్టచివరి సమావేశం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవోఎం బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా బిల్లుపై జీవోఎం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తుది చర్చలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందుకు ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ బిల్లు వెళ్తుందని సమాచారం. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలలో తెలంగాణ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈసారి కూడా బిల్లును సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. సవరణల గురించి ఆయనతో ప్రస్తావించగా, బిల్లుకు తప్పకుండా వేల సంఖ్యలో సవరణలు వస్తాయని, వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరు ఎంతగా అభ్యంతరాలు చెబుతున్నా, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు సైతం కాదంటున్నా కూడా వడివడిగా అడుగులు వేస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు తాము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. -
న్యాయం చేయండి: అనూహ్య తండ్రి
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: ముంబైలో దారుణహత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో మహారాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అనూహ్య తండ్రి ప్రసాద్ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి 15 రోజులు దాటిపోయినా నిందితులను గుర్తించలేదని.. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అయితే, ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందని అనంతరం మీడియా వద్ద ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజానా చౌదరి కలిసి ప్రసాద్‌ను వెంటపెట్టుకొని షిండేను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్ తన కూతురు హత్య కేసును నీరుగార్చేందుకు ముంబైకి చెందిన ఒక కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ దృష్ట్యా విచారణను సీబీఐకి అప్పగిస్తే తమకు న్యాయం జరుగుతుందని వేడుకున్నారు. దీనికి షిండే స్పందిస్తూ.. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. అయితే, భేటీ అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... తమ బాధ చెప్పుకొనేందుకు వెళితే షిండే కేవలం రెండు నిమిషాల సమయమే ఇచ్చారన్నారు. ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. అనూహ్య హత్య ఘటనకు సంబంధించి అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను కలుస్తామని ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బందెల థామస్ నోబుల్, అనూహ్య సోదరుడు దీపక్ ఉన్నారు. వీడని చిక్కుముడులు... అనూహ్య వద్ద రెండు ఫోన్లు ఉండగా ఒకటే లభించింది. కానీ, దొరికింది ఏ ఫోన్ అనేది పోలీసులు వెల్లడించడం లేదు. ఆమె వద్ద ఉండే ల్యాప్‌ట్యాప్, లగేజీ వివరాలు ఇంకా తెలియలేదు. సామ్సంగ్ గెలాక్సీ ఫోన్‌తోపాటు లాప్టాప్లో నిందితులకు సంబంధించిన వివరాలు ఉండే అవకాశముందని, అవి దొరికితే వారినిగుర్తించేందుకు ఆస్కారముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్య హత్య కేసుకు సంబంధించి కొన్ని పత్రికల్లో తొమ్మిదో తేదీన సెల్‌ఫోన్‌ను ఎవరో ఆన్ చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. వెంటనే చర్యలు చేపట్టండి: షిండే అనూహ్య దారుణ హత్య ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని.. నిందితులను వెంటనే పట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అనూహ్య హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి నన్ను కలిసి వేడుకున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపడతారని, ఆ దారుణానికి ఒడిగట్టినవారిని అరెస్టు చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అందులో షిండే పేర్కొన్నారు. -
రాత్రంతా చలిలో కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రి.. నడి రోడ్డుపై ధర్నాకు దిగడమే ఒక వింత అయితే.. ఆయన తన నిరసనను కొనసాగించడంలో భాగంగా సోమవారం రాత్రంతా రోడ్డుపక్కనే పడుకున్నారు. విజయ్ చౌక్-రైల్ భవన్‌కు మధ్యలో ఉన్న ధర్నా ప్రాంతానికి దగ్గరలోనే తన వ్యాగన్-ఆర్ కారు ఉన్నప్పటికీ కూడా ఆయన రోడ్డుపక్కనే నిద్రించారు. ప్రస్తుతం ఢిల్లీలో చలికి మనుషులు చనిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఆయన సోమవారమంతా తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. 11.30 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమించిన ఆయన.. చలికి తట్టుకోలేక ఒక పరుపును, ఏడు దుప్పట్లను కప్పుకొన్నారు. కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో వ్యక్తిగత వైద్యులు మధ్యలో పలుమార్లు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆయన నిద్రకు భంగం కలగకుండా ఉండడానికి ‘ఆప్’ కార్యకర్తలు వంతుల వారీగా రాత్రంగా కాపలా కాశారు. ఫొటోలు తీయడానికి యత్నించిన ఫొటో గ్రాఫర్లను కూడా ఆయన దరికి రానివ్వలేదు. కేజ్రీవాల్ ఇలా రోడ్డుపై పడుకోగా.. ఆయన కేబినెట్లోని పర్యావరణ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మాత్రం సమీపంలోని తన కారులో నిద్రించారు. రాత్రి 1.12 గంటల ప్రాంతంలో ఒకసారి లేచిన కేజ్రీవాల్.. తనపై దుప్పట్లను తొలగించాల్సిందిగా వాలంటీర్లకు సూచించారు. వందల మంది ‘ఆప్’ వాలంటీర్లు.. రాత్రంతా దేశభక్తి పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ఉన్నారు. ఉదయం 5.20 గంటలకు లేచీ లేవగానే కేజ్రివాల్.. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై మండిపడ్డారు. ‘‘ఢిల్లీలో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటే.. హోం మంత్రికి నిద్ర ఎలా పడుతోంది? ఆయనేమైనా నియంతనా? మేం ఆయనతో చర్చలు జరపం.. ఇదేమీ కిరాణా కొట్టు కాదు’’ అని మండిపడ్డారు. మహిళల టాయ్లెట్లో మంత్రి సోమనాథ్ దేశవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న టాయ్‌లెట్ సమస్య.. ధర్నాలో ఉన్న కేజ్రీవాల్ కేబినెట్‌కు కూడా ఎదురైంది. ధర్నా ప్రాంతానికి సమీపంలోని టాయ్లెట్లన్నింటినీ కేంద్రం మూసేయడంతో మంత్రి సోమనాథ్ భారతి మంగళవారం సమీప ప్రెస్ క్లబ్‌లోని మహిళల టాయ్‌లెట్‌నే వినియోగించారు. పక్కనే పురుషుల సౌచాలయం ఉన్నప్పటికీ.. కేంద్రంపై తన నిరసన తెలియజేయడానికి ఆయన అందులోకి వెళ్లలేదు. దీంతో ఆయన బయటకు వచ్చే వరకు మహిళా రిపోర్టర్లు.. వేచి ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్ మంగళవారం ఉదయం నిద్రలేచి మీడియాతో మాట్లాడాక 6 గంటల ప్రాంతంలో ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం సమీప ప్రెస్‌క్లబ్‌లోని టాయ్‌లెట్‌నే ఉపయోగించుకోవాల్సి వచ్చింది. తనకు జెడ్ కేటగిరీ భద్రత వద్దని కేజ్రీవాల్ తిరస్కరించినప్పటికీ.. ధర్నా సందర్భంగా మాత్రం ఆయన కాదన్నా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అరాచక వైఖరితో తమ ఓపిక నసిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రందీప్ సూరజ్వాలా వ్యాఖ్యానించారు. ఆప్ ప్రవర్తనపై తాము అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. -
హొం మంత్రి షిండేకు శశిథరూర్ లేఖ
-
హొం మంత్రి షిండేకు శశిథరూర్ లేఖ
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి శశిథరూర్ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) ఈ నెల 17న ఢిల్లీలోని లీలా హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను వివాహం చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్టు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో శశిథరూర్ హొం మంత్రికి లేఖ రాశారు. -
ఓం నమఃశివాయః
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్‌వాసుల ఇలవేల్పు అయిన శ్రీ సిద్ధరామేశ్వర్ కల్యాణోత్సం పట్టణంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం బాలివెస్లోని హీరెహబ్బు మఠం నుంచి ఊరేగింపుగా బయలు దేరిన నందికోలులు సిద్ధేశ్వర ఆలయం వద్ద ఉన్న సమ్మతి కట్ట వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ గంగా పూజ, సుగడి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి కురిసిన పూలవర్షంతో భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో ‘ఓం నమోః శివాయః’ ‘శ్రీ సిద్ధరామేశ్వర్ మహారాజ్‌కీ జై’ అనే నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయం వరకు కొనసాగిన ఊరేగింపు సమీప గ్రామాల ప్రజలతోపాటు షోలాపూర్ వాసులతో కన్నులపండువగా సాగింది. ఈ కల్యాణోత్సవంలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా స్వామివారి కల్యాణోత్సవానికి హాజరవుతున్నానని చెప్పారు. స్వామివారి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఈ జాతరలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని, ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని ఆ సిద్ధేశ్వరుణ్ని ప్రార్థించానన్నారు. పట్టణం మరింత అభివృద్ధి చెంది త్వరలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తృత ఏర్పాట్లు... నందికోలుల ఊరేగింపు కోసం పట్టణ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని నగల వ్యాపారులు, శివసేన పట్టణ కన్వీనర్ ప్రతాప్ చవాన్ భక్తులకు వాటర్ ప్యాకిట్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, మేయర్ ఆల్కా రాథోడ్, ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ , ఎమ్మెల్యే దిలీప్ మానేలతో పట్టణంలోని వివిధ పార్టీల పదాధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 68 శివలింగాలకు తైలాభిషేకం ఆదివారం శ్రీ సిద్ధరామేశ్వర్ పట్టణవ్యాప్తంగా స్వయంగా ప్రతిష్టించిన 68 లింగాలకు తైలాభిషేకం చేశారు. ఈ తైలాభిషేకంలో పాల్గొనేందుకు తెల్లని దుస్తులు ధరించిన సిద్ధేశ్వరుడి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు సాగిందని శ్రీ సిద్ధరామేశ్వర్ దేవస్థానం కమిటీ చైర్మన్ ధర్మారాజు కాడాది తెలిపారు. -
'సుశీల్ కుమార్ షిండేవి ఓటు బ్యాంకు రాజకీయాలు'
ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతున్నారని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండేపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటి కమ్యూనిటి సభ్యులపై ఉన్న ఉగ్రవాద కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష జరపాలని షిండే చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. చట్టాన్ని అతిక్రమిస్తే కులమతాలకు సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తిస్తున్న ముస్లీంలపై కేసులు పెట్టకూడదా అని మోడీ ఓ ర్యాలీలో ప్రశ్నించారు. దేశానికి సంబంధించినంత వరకు ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండకూడదు అని ఆయన సూచించారు. గోవా రాజధాని పనాజీలో జరిగిన ఓ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. -
పవార్ ప్రధాని అయితే సంతోషం: షిండే
షోలాపూర్: ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ ప్రధాని అయితే సంతోషిస్తానని, అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. పవార్ తన రాజకీయ గురువని.. ఆయనవల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. కానీ, తన వ్యాఖ్యల ప్రభావాన్ని ఆలస్యంగా గుర్తించిన షిండే వివాదం పెద్దది కాకుండా రాహుల్ గాంధీకి జైకొట్టారు. రాహుల్‌ను తదుపరి ప్రధానిని చేయడమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమన్నారు. షిండే శనివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మరాఠీ పత్రికల ఎడిటర్లతో మాట్లాడారు. ప్రధాని కావాలన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. 1992 నుంచి పవార్ కూడా దాని కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలిపారు. కానీ, ఢిల్లీ రాజకీయాలకు ఆయన బాధితుడిగా మారారన్నారు. కాగా, షిండే వ్యాఖ్యలతో ప్రధాని మన్మోహన్ సింగ్ వారసుడు కాంగ్రెస్ అభ్యర్థి కాదని కాంగ్రెస్ అంగీకరించినట్లయిందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పవార్ ప్రధాని కావడమన్నది షిండే పగటికల అని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్‌కు తెలీకుండానే భద్రత కల్పించాం: షిండే
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయనకు తెలియకుండానే పటిష్టమైన భద్రత కల్పించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. తనకు భద్రత అవసరం లేదని కేజ్రీవాల్ పదేపదే చెబుతున్నప్పటికీ సీఎంగా ఎన్నికైన వ్యక్తి వీవీఐపీ పరిధిలోకి వస్తారని, అలాంటి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం అటు రాష్ట్రాలు, ఇటు కేంద్రంపై ఉంటుందని షిండే పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబంధిత అధికారులు కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తామని ఇప్పటికే మూడుసార్లు ప్రతిపాదించారని, అయినప్పటికీ ఆయన నిరాకరించడంతో తామే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా, ఘజియాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో తనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామన్న పోలీసుల ప్రతిపాదనను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారు. ‘నాప్రాణాలకు ముప్పులేదు. నాకెలాంటి భద్రతా అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సభ్యత్వానికి భారీ స్పందన: ‘మై భీ ఆమ్ ఆద్మీ’ పేరిట జాతీయ స్థాయిలో శుక్రవారం కేజ్రీవాల్ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని ఆప్ మీడియా టీం వెల్లడించింది. కేవలం 3గంటల్లోనే 47,500 మంది ఇంటర్నె ట్ ద్వారా, 1950 మంది ఎంఎంఎస్, మిస్డ్కాల్స్ ద్వారా సభ్యత్వం స్వీకరించినట్టు టీం తెలిపింది. సభ్యత్వ నమోదుకు 07798220033లో సంప్రదించవచ్చని పేర్కొంది. -
షిండే సొంతూరులో బాంబుల కలకలం
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సొంత ఊరైన షోలాపూర్ పట్టణంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం సృష్టించింది. ఈ కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఉగ్రవాదులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని మహ్మద్ సాదిక్ అబ్దుల్ వహబ్ (32), ఉమర్ అబ్దుల్ హఫీజ్ దండోతి (35)లుగా గుర్తించారు. ఈ కేసు వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్తో పాటు ఔరంగాబాద్ ఏటీఎస్ చీఫ్ నవీన్ చంద్రారెడ్డి వివరించారు. తగిన సమాచారం మేరకు సాదిక్ ఇంటిపై దాడిచేయగా 81 జిలెటిన్ క్యాండీలు, 102 డిటోనేటర్లు, రివాల్వర్, ఏడు బుల్లెట్లు, కంప్యూటర్, స్కానర్ ప్రింటర్, మెమరీకార్డులు, 200 సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు దొరికాయన్నారు. తర్వాత ఉమర్ దండోతి ఇంటిపై దాడి చేయగా, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. మరో ముగ్గురి ఇళ్లపై కూడా దాడులు చేసినా అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వివరించారు. ఇదిలావుండగా ఉగ్రవాదుల కోసం ఏటీఎస్ బృందం దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారం మేరకు అబ్దుల్ ఫజల్, పట్టణానికి చెందిన సిమి కార్యకర్త ఖలీద్ ముచాలేలను ఖండ్వా బార్డర్లో ఈ బృందం అరెస్టు చేసింది. ఖలీద్‌కు ఒక నేరం విషయంలో ఇండోర్ న్యాయస్థానం గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఖలీద్ విడుదలయ్యాడు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చి తన సోదరులతో నహిజిందగి ప్రాంతంలో ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఖండ్వా బార్డర్ సమీపంలో ఏటీఎస్‌కు పట్టుబడ్డాడని కమిషనర్ వివరించారు. అతడిని విచారించగా ఉగ్రవాదులకు సాయం చేసేవారు పట్టణంలో ఇంకా ఉన్నారని తేలడంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల పాటు పట్టణంలో ఉన్న ఖలీద్‌కు సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. బోగస్ డ్రైవింగ్ లెసైన్సులు, ఎన్నికల గుర్తింపు కార్డులు అందజేస్తూ ఖలీద్‌కు సాదిక్ సాయం చేసేవాడని పోలీసులు తెలిపారు. -
‘పాల’కులపై కేసు
ముంబై: కాంగ్రెస్ నాయకులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు. ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇరుక్కపోగా...తాజాగా రాష్ట్ర పాల కుంభకోణంలో మరో ఇద్దరు మాజీ ముఖ్య నేతలపై కేసు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి రూ.3.18 కోట్ల నష్టాన్ని మిగిల్చారని 144 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, తొమ్మిది మంది మంత్రులు, 12 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. జల్గావ్కు చెందిన రైతు నాగరాజ్ జనార్ధన్ పాటిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆరు నెలలు లేదా ఏడాదిలోపు జల్గావ్ పాల ఉత్పాదక సంఘం బోర్డు డెరైక్టర్లకు అప్పగించాల్సి ఉన్న జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తోనే కొనసాగేలా 118 మంది గూడుపుఠాణి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల ఎన్డీడీబీకి రూ.3.18 కోట్లు లాభం వచ్చిందన్నాడు. ఈ మేరకు చూసుకుంటే జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి ఆ మేరకు నష్టం కలిగించినట్టేనని అందులో పేర్కొన్నాడు. అయితే ఈ కుంభకోణంపై ఈ ఏడాది జూన్‌లోనే పాటిల్ కోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో పాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. -
వచ్చే సమావేశాల్లో తెలంగాణ బిల్లు : షిండే
ఢిల్లీ: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు)ను ప్రవేశపెడతామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రస్తుతం ఈ బిల్లు ముసాయిదా రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లిన విషయం తెలసిందే. ఈ బిల్లు విషయమై అసెంబ్లీలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మత హింస నిరోధక బిల్లు కూడా తీసుకొస్తామని షిండే చెప్పారు. -
కేబినెట్లో మరోసారి తెలంగాణ బిల్లుపై చర్చ: షిండే
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నిర్ణయం రాగానే తిరిగి బిల్లు కేంద్రానికి చేరుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కేబినెట్లో మరోసారి బిల్లుపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతామని షిండే తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును-2013 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రమంత్రి మండలి ఆమోద ముద్ర వేసి పంపిన విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత...శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోరుతూ దాన్ని యథాతథంగా రాష్ట్రానికి పంపారు. -
..ఇంకా ఉంది
* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ * నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం * రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు * పరిణామాలను అంచనా వేసేందుకే?.. రేపు కేంద్ర మంత్రివర్గ భేటీ * అప్పటిదాకా నాన్చి, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం * 371డీ పై చర్చ, ఇరు రాష్ట్రాలకూ వర్తింపజేసే దిశగా యోచన? * రాయల తెలంగాణ గురించి తెలియదన్న షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం మంగళవారం అసంపూర్ణంగా ముగిసింది. కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించే ముందు ఇదే చివరి భేటీ అని భావించినప్పటికీ ఆ నివేదిక తుది రూపు సంతరించుకోనందున బుధవారం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తాలూకు పరిణామాలను అంచనా వేసేందుకు, గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేదాకా విషయాన్ని నాన్చడానికే జీవోఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటలకు జీవోఎం మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. అదే ఆఖరు సమావేశం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం కసరత్తు చేస్తోంది. అయితే ఆలోగా పరిష్కరించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి’’ అని చెప్పారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం... బిల్లు ముసాయిదా సిద్ధమైందని, చట్టపరమైన అడ్డంకులు రాకుండా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు. విభజన ప్రక్రియలో కీలకమైన అంకంగా అంతా భావిస్తున్న 371డీ అధికరణను రెండు రాష్ట్రాలకూ వర్తింపజేసే మార్గాంతరాలపై భేటీలో లోతుగా చర్చ జరిగిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు’ను ‘ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు’గా మార్చాలని, అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్టు కూడా తెలిపింది. ‘‘హైదరాబాద్ శాంతిభద్రతలు, రెవెన్యూ అంశాలను కేంద్రంచేతికి అప్పగించడంపై కూడా మల్లగుల్లాలు పడ్డారు. బిల్లు, జీవోఎం నివేదిక కలిపి 70 పేజీల దాకా ఉంటాయని జీవోఎం వర్గాలు తెలిపాయి’’ అని వివరించింది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం భేటీలో సభ్యులు పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. జీవోఎం ఏర్పాటయ్యాక ఇలా మొత్తం సభ్యులు సమావేశం కావడం ఇదే తొలిసారి! జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణలతో పాటు జీవోఎం సిఫార్సులను ముసాయిదా బిల్లులో ఎలా చేర్చాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై స్పందనను బట్టి పరిణామాలను అంచనా వేయడానికి వీలుగా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నట్టు సమాచారం. అంతిమంగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాల అమలును ఖరారు చేయడానికే జీవోఎం పరిమితమవుతుందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు సాగించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించిన తెలంగాణ, తాజాగా తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణల్లో దేనిపైనా తుది నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం వరకు నాన్చి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని జీవోఎం సభ్యులు భావిస్తున్నారు. రెండు ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అక్కడ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ముగించకుండా, విరామమిచ్చి జనవరి వరకు పొడిగించడానికి సమాయాత్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాగే సాగతీత ధోరణి కొనసాగిస్తే తెలంగాణ బిల్లును 2014లోనే పార్లమెంటు ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే రాయల తెలంగాణపైనా హడావుడిగా ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం దాకా సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరి సాంబశివరావు తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే రాయల తెలంగాణపై జీవోఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ మేరకే ముసాయిదా బిల్లు తయారవుతోందని కూడా చెబుతున్నారు. జీవోఎం నివేదిక కూర్పుపై కసరత్తు సిఫార్సులను ముసాయిదా బిల్లులో పొందుపరచడంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జీవోఎం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రత, జన వనరుల పంపిణీ పర్యవేక్షణకు బోర్డులు, శాంతిభద్రతల సమస్య, మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఉమ్మడి కార్యాచరణ తదితరాలు ముసాయిదాలో ఎలా ఉండాలనే దానిపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటిపై సభ్యుల సూచనల మేరకు జైరాం సాంకేతిక కసరత్తు చేస్తున్నారు. సాయంత్ర 6.20కి జీవోఎం భేటీ ముగిశాక కూడా ముసాయిదా బిల్లు రూపకల్పన కసరత్తులో షిండే, జైరాం తనమునకలుగా గడిపారు. ఈ కసరత్తు భేటీ తర్వాత రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు బిల్లు ముసాయిదా ప్రతిలో పొందుపరిచిన భాష, వాక్య నిర్మాణం సముచితంగా లేవని చిదంబరం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతకుముందు విభజన అనంతరం తెలంగాణ శాంతిభద్రతల అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులతో ఉదయం 11 గంటలకు షిండే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారి శశిధర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నక్సలిజం పెరిగే అవకాశాలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం జైరాంతో గంట పాటు షిండే భేటీ అయ్యారు. నివేదికకు తుదిరూపు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడ్డారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, న్యాయపరమైన చిక్కులను దాటడం, జల వనరుల బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించారు. అనంతరం న్యాయ, జలవనరుల శాఖల అధికారులను జైరాం పిలిపించుకుని మాట్లాడారు. 371డి, 371ఇ అధికరణాలపై కూడా చర్చ జరిపారు. 371ను ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాయల తెలంగాణ గురించి తనకు తెలియదని జైరాంతో భేటీ అనంతరం షిండే విలేకరులతో అన్నారు. ‘విభజనపై ఇదే చివరి భేటీ. ఈ రోజు జీవోఎం నివేదికను ఆమోదిస్తాం. 5న కేబినెట్ సమావేశం ఉంటుంది. నివేదికను కేబినెట్‌కు అందించాక అంతా ప్రధానే చూసుకుంటారు’ అంటూ వెళ్లిపోయారు. సీమాంధ్ర మంత్రుల ‘యూటీ’ యత్నాలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్‌పై తాము కోరుతున్న మేరకు ఆంక్షలు విధించేలా చేసేందుకు తుది ప్రయత్నాలు చేశారు. జీవోఎం సమావేశానికి ముందు షిండేను కేంద్ర మంత్రి చిరంజీవి ఆయన కార్యాలయంలో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను శాశ్వత యూటీ చేయాలని మరోసారి ప్రతిపాదించారు. మరో మంత్రి జేడీ శీలం కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్‌ను కలిసి, హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్‌ను పరిగణించాలని కోరినట్టు తెలిసింది. కానీ వారి విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ‘యూటీతో ఏ ప్రాంతానికీ పెద్దగా లాభం ఉండకపోవచ్చు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అప్పగించే కసరత్తు చేస్తున్నాం’ అని షిండే, సిబల్ చెప్పారంటున్నారు. ఇక జీవోఎం భేటీ అనంతరం షిండే, జైరాంలతో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, శీలం సమావేశమై, ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరారు. అనంతరం బయటికొచ్చిన కావూరి, మీడియాతో మాట్లాడేందుకు ఆస్తకి చూపలేదు. కేంద్రం రాయల తెలంగాణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందంటూ వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని శీలం అన్నారు. -
రాయల తెలంగాణ గురించి నాకు తెలియదు: షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది. -
త్వరలోనే పార్లమెంటు ముందుకు టి.బిల్లు: షిండే
ముంబై: తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం తన పనిని దాదాపు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. టీ.బిల్లు అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు. ముందుగా టీ.బిల్లు నివేదికను కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. అనంతరం న్యాయశాఖ నుంచి రాగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని షిండే తెలిపారు. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
తేజ్‌పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే
ముంబై: తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడట్టు ఆరోపణలు రావడంతో తేజ్‌పాల్‌కు గోవా కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. తేజ్‌పాల్ అరెస్టు, కేసు విషయాల్లో కాంగ్రెస్ సంబంధం లేదని షిండే తెలిపారు. ఈ అంశంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అత్యాచార ఆరోపణల అనంతరం తేజ్‌పాల్ అరెస్టు ఆలస్యం కావడంతో కాంగ్రెస్‌పై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. తేజ్పాల్ను కాంగ్రెస్ కాపాడుతుందంటూ బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో స్పందించిన షిండే.. అటువంటి ఘటనలకు కాంగ్రెస్ ఎప్పుడూ వంతపాడదని తెలిపారు. తేజ్ పాల్ అంశం వేరే రాష్ట్రానికి సంబంధించింది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదన్నారు. -
ఒకరోజు ముందుగానే కేంద్ర కేబినెట్ భేటీ
-
3న కేంద్ర, రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ : డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరుగుతుందని కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. జీవోఎం ప్రతిపాదనలు కేబినెట్‌కు వివరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అదే రోజు జీవోఎం నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని షిండే తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంకానుంది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం రూపొందించిన ముసాయిదా బిల్లుపై సమావేశంలో చర్చించే అవకాశముంది. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశంలో నివేదికపై చర్చించిన తర్వాత కీలకాంశాలపై స్పష్టత ఏర్పడుతుందని... ఆపై అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో చర్చించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
4న కేబినెట్ భేటీ
మర్నాడే రాష్ట్రపతి పరిశీలనకు? నేడు కోర్‌కమిటీ ముందు టీ ముసాయిదా 100 పేజీల జీవోఎం నివేదిక సిద్ధం విభజన ప్రక్రియ అమల్లో మార్పులు వెనకబడ్డ ప్రాంతాలన్నింటికీ ప్యాకేజీ చివరి నిమిషం దాకా మార్పులు: షిండే న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం రూపొందించుకున్న ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై చర్చించనుంది. కోర్ కమిటీ ఆమోదం పొందాకే వాటిని కేంద్ర కేబినెట్‌కు పంపాలని హస్తిన పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక వంటివేవీ చర్చకు రాలేదని తెలిసింది. భేటీ ఎజెండాలో ఇవేవీ లేని విషయం తెలిసిందే. హోంశాఖ వర్గాలు చెబుతున్న ప్రకారం డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజన బిల్లును, జీవోఎం నివేదికను ప్రవేశపెడతారు. కేబినెట్లో ఆమోదం పొందిన మర్నాడే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించే అవకాశాలున్నాయి. అయితే విభజన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై శుక్రవారం కోర్‌కమిటీ చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చిదంబరంతో షిండే, జైరాం భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ భేటీలో తెలంగాణ, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు బుధవారం నాటి జీవోఎం భేటీ అనంతరం 11 అంశాలకు సంబంధించి జైరాం రూపొందించిన 100 పేజీల నివేదికలోని మంచిచెడులు, అందులో పొందుపరచాల్సిన ఇతరత్రా అంశాలను పరిశీలించారు. కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అంశాలు నివేదికలో ఉన్నట్టు చెబుతున్నా, నిజానికి నివేదికలో ఏమేమున్నాయన్నది మాత్రం చిదంబర రహస్యంగానే ఉంది. భేటీ అనంతరం షిండే తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ గానీ, భద్రాచలం గానీ జీవోఎంకు ప్రతిబంధకాలు కానే కావు. ఇతర సమస్యలేమిటనేది చెప్పలేను. ముసాయిదా బిల్లులో లోపాల్లేకుండా చర్చిస్తున్నాం. సూక్ష్మస్థాయి లోపాలపైనా దృష్టి పెట్టాం. నివేదికను వీలైనంత తొందరగా కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతాం’’ అని పేర్కొన్నారు. చివరి నిమిషం దాకా మార్పుచేర్పులుండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. న్యాయశాఖ పరిశీలనలో టీ బిల్లు హోం శాఖ రూపొందించిన విభజన బిల్లు గురువారం కేంద్ర న్యాయ శాఖకు వెళ్లింది. శాఖలోని లెజిస్లేచర్ విభాగం అధికారులు బిల్లును నిశితంగా పరిశీలిస్తున్నారు. బిల్లు డిసెంబర్ 3న సాయంత్రం జరిగే జీవోఎం సభ్యుల సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం అనంతరం ముసాయిదా బిల్లు, జీవోఎం సిఫార్సులను 4న జరిగే కేబినెట్లో ప్రవేశపెడతారు. అయితే తెలంగాణ బిల్లును వీలైనంత తొందరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సోనియాగాంధీ భావిస్తున్నందున శని లేదా సోమవారాల్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కూడా లేకపోలేని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జైపాల్‌తో శీలం, దిగ్విజయ్‌తో మర్రి భేటీలు విభజన అనివార్యమైనందున హైదరాబాద్‌ను కొద్ది కాలమైనా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర మంత్రి జేడీ శీలం గురువారం కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌ను యూటీ చేసేలా సోనియాకు సూచించాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాజకీయ అస్థిరత ఉండొద్దంటే వాటిని 119 నుంచి 153కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లి ముసాయిదా బిల్లులో పొందుపరిచేలా చూడాలన్నారు. తెలంగాణకు సోనియా పేరు: శంకర్రావు తెలంగాణ రాష్ట్రానికి సోనియాగాంధీ పేరు పెట్టాలని మాజీ మంత్రి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. ఆమె వల్లే రాష్ట్రం ఏర్పడుతోందని మీడియాతో ఆయనన్నారు. విభజనను అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగులుతారన్నారు. -
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
-
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో చిన్న చిన్న సమస్యలున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విభజన సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర హోంమంత్రి.. చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ నివేదిక ఇంకా తయారవుతూనే ఉందని ఈరోజు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణపై చర్చ ఉండదని ఆయన వెల్లడించారు. తెలంగాణ బిల్లు తయారీకి ఇంకా సమయం పడుతుందనికూడా అన్న షిండే .. విభజనతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దనేదే తమ తాపత్రయమని ఢిల్లీ మీడియాకు వివరించారు. హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదన్న ఆయన .. నిజమైన సమస్యలేంటో తాను ఇప్పుడు చెప్పననడం విశేషం. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు విషయాలపై ఢిల్లీ మీడియాతో షిండే చిట్‌చాట్ మాట్లాడారు. -
జీవోఎం భేటీలు ఇంకా ఉన్నాయ్: షిండే
రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశాలు ఇంకా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదిక తయారీ పూర్తయిందా? మీ కసరత్తు అయిపోయినట్టేనా?’ అన్న ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘ఇంకా కొన్ని సమావేశాలుంటాయి. ఎన్ని అనేది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు. ‘గురువారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై నివేదిక, బిల్లు చర్చకు వస్తాయా?’ అని అడగ్గా.. ‘‘రేపు కేబినెట్లో ఈ అంశం లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘నివేదిక ఎప్పటికల్లా తయారవుతుంది? ఎప్పుడు కేబినెట్‌కు అందజేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘‘మొత్తం పూర్తయినపుడు కేబినెట్‌కి ఇస్తాం. అప్పుడు మా పని పూర్తయినట్టు లెక్క. ఆ సంగతి మీకు ముందే చెప్తాం... సరేనా!’’ అని నవ్వుతూ బదులిచ్చారు. -
తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోదు: మర్రి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలిసి తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజవర్గాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని షిండేని కోరామని, చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత్వాన్ని పోగొట్టడానికే ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తాము పది జిల్లాలలో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణనే కోరుతున్నామని మర్రి స్పష్టం చేశారు. నాగాలాండ్ లాంటి చోట ఒక్క పార్లమెంట్ స్థానంలో 60 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోతుందనుకోవద్దని ఆయన అన్నారు. చాలా సమస్యలు ఉంటాయని.... వాటిని పరిష్కరించడానికి ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ప్రతిపాదనపై టీఆర్ఎస్లోని ఓ ముఖ్యనేత తనతో మాట్లాడి.... మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయటం సాధ్యమేనని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. -
షిండేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
-
షిండేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని షిండేకు టీ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని షిండేకు శశిథర్‌రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ పరిధిలో 17 లోక్‌సభ సీట్లు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ అస్థిరతకు ఆస్కారం లేకుండా సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి చొప్పున అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలని, దీనితో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తన లేఖలో తెలిపారు. -
రాజకీయం కోసమే రాష్ట్ర విభజన
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోండి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సాక్షి, హైదరాబాద్: అవసరం లేకపోయినా రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సి.జయపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెజెండ్ల సుబ్బారావులు వీటిని దాఖలు చేశారు. వీటిలో ప్రధానమంత్రి, ఆయన ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే,ఆ శాఖ కార్యదర్శిని వ్యక్తిగతహోదాలో ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, జీవోఎం ఏర్పాటును రద్దు చేయాలని జయపాల్‌రెడ్డి తన పిటిషన్లో కోరారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్లో చర్చించాలని, ఈమేరకు కేంద్రాన్ని ఆదేశించాలని సుబ్బారావు తన పిటిషన్లో కోరారు. కాగా రాష్ట్ర విభజనపై స్టే విధించాలని కోరుతూ, విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి డి.సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా, గార్ల మండలానికి చెందిన సర్పంచ్‌లు అంబటి అంబిక, మరో నలుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సోమవారం మరోసారి విచారించారు. అనంతరం దీనిని ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పాక్ ప్రేరణతోనే హైదరాబాద్ పేలుళ్లు: సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ: ఈ ఏడాది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది జరిగిన మొత్తం నాలుగు పేలుళ్లకుగాను మూడింటి వెనుక ఐఎం హస్తముందని తెలిపారు. బుద్ధగయ, పాట్నా పేలుళ్లు కూడా దాని దుశ్చర్యేనన్నారు. బెంగళూరు పేలుడు దారితప్పిన కొందరు ఛాందసవాద యువకులు, అల్-ఉమాహ్కు చెందినవారి పనిగా తేల్చారు. పాకిస్థాన్‌లోని ప్రతీఘాత శక్తుల నుంచి ఐఎంకు ప్రేరణ లభిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల మూడు రోజుల సదస్సును షిండే గురువారం ప్రారంభించారు. లేనిపోని సమస్యలు సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం చెప్పారు. -
వచ్చేవారం మరోసారి జీవోఎం భేటీ
26 లేదా 27న సమావేశానికి అవకాశం: షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) భేటీ గురువారం అసంపూర్తిగా ముగిసింది. ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మరోసారి సమావేశం అనివార్యమైంది. నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశానంతరం హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. ‘‘జీవోఎం భేటీ ముగిసింది. ఇద్దరు సహచరులు హాజరుకాలేదు. చిదంబరం విదేశాల్లో ఉన్నారు. గులాంనబీ ఆజాద్ కూడా లేరు. అందువల్ల వచ్చేవారం మరోసారి సమావేశం జరుగుతుంది. ఎప్పుడనేది చిదంబరం వచ్చాక మాట్లాడి నిర్ణయిస్తాం. సాధ్యమైనంత త్వరగానే ప్రక్రియను ముందుకు తీసుకువెళతాం..’’ అని చెప్పారు. గురువారం నాటి సమావేశానికి హాజరైన మంత్రి వీరప్పమొయిలీ.. తదుపరి జీవోఎం భేటీ ఈనెల 27వ తేదీన ఉండవచ్చంటూ మీడియా అడిగిన ఒకప్రశ్నకు జవాబిచ్చారు. తదుపరి జీవోఎం సమావేశం 26 లేదా 27 తేదీన ఉండవచ్చని షిండే కూడా విలేకరులతో ఇష్టాగోష్టిలో చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెడతామని పునరుద్ఘాటిం చారు. అయితే బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందీ, కచ్చితంగా ఏ రోజున పార్లమెంటులో పెడతారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ‘అవ న్నీ నిర్ణయం అవుతాయి’ అని మాత్రమే చెప్పారు. -
తెలంగాణపై పాతపాటే పాడిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ''సాధ్యమైనంత త్వరలో మా ప్రక్రియ పూర్తి చేస్తాం'' అని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే పాతపాటే పాడారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఈ ఉదయం సమావేశమై తెలంగాణ బిల్లు ముసాయిదాపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. కేంద్రానికి తుది నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేసింది. ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోయింది. సమావేశం ముగిసిన తరువాత షిండే విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి కేంద్ర మంత్రులు చిదంబరం, గులామ్ నబీ ఆజాద్ హాజరుకాలేదని తెలిపారు. చిదంబరం విదేశీ పర్యటనకు వెళ్లినందున హాజరుకాలేకపోయినట్లు చెప్పారు. జిఓఎం మళ్లీ ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ రోజు జరుగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం వాయిదాపడిన విషయం తెలసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కారణంగా ఈ సమావేశం వాయిదాపడింది. -
తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే
రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో నవంబర్ 18న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అవుతారు అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవాలు జరుగుతున్న కారణంగానే జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి భేటి కాలేకపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు గురించి చర్చకు వస్తుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేను అని షిండే మరో ప్రశ్నకు జవాబిచ్చారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ బిల్లును ప్రవేశ పెడుతాం అని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా వివరణ ఇచ్చారు. -
షిండేతో బొత్స భేటిలో ఆంతర్యమేమిటి!
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జీవోఎం సమావేశానికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో బొత్స ఒకరు కాకపోగా, షిండేతో 20 నిమిషాలపాటు భేటి కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జీవోఎం సమావేశానికి కాంగ్రెస్ తరపున మంత్రి వట్టి వసంతకుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు బుధవారం సాయంత్రం సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో షిండేను కలువడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజనపై పలు పార్టీలతో జరుగుతున్న కీలక జీవోఎం సమావేశానికి ముందు షిండేతో బొత్స సమావేశం కొంత వివాదానికి తెర తీసింది. ఇదే విషయంపై బొత్సను మీడియా అడిగితే.. 'హోం మంత్రి షిండే రమ్మంటేనే ఢిల్లీ వచ్చాను', కాంగ్రెస్ నుంచి మంత్రి వట్టి వసంతకుమార్, దామోదర రాజనర్సింహ ఏం నివేదిక ఇస్తారో నాకు తెలియదు అని అన్నారు. -
త్వరలోనే తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణ బిల్లు త్వరలోనే వస్తుంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. దేశ శాంతి భద్రతల సమీక్షపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలపరిమితి ముగియకముందే తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతాం అని అన్నారు. హైదరాబాద్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిశీలనలో ఉంది అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పరిధి ఎంత ఉండాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. జీవోఎం నివేదిక కేబినెట్ కు వెళ్తుంది.. ఆతర్వాత రాష్ట్రపతికి.. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును పంపుతామని విభజన ప్రక్రియను మరోసారి షిండే తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమకు పోటీ కాదని అన్నారు. కాంగ్రెస్ కు మోడీ సవాల్ కాదు అని.. ఇలాంటి సవాళ్లను కాంగ్రెస్ చాలా ఎదుర్కొందని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. -
ఒక్కో పార్టీ నుంచి ఒక్కరే వస్తే మంచిది: షిండే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) మూడో సమావేశం ముగిసింది. ఈ సాయంత్రం గంటన్నరపాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే జీవోఎంకు 29 పేజీల నివేదిక సమర్పించారు. జీవోఎంకు 18వేల సలహాలు, సూచనలు వచ్చాయని భేటీ ముగిసిన తర్వాత షిండే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 11న కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జీవోఎం సమావేశం ఉంటుందన్నారు. 12,13 తేదీల్లో 8 రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని తెలిపారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కరు లేదా ఇద్దరు రావొచ్చన్నారు. సమావేశానికి ఒక్కరే వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమయం కేటాయించామన్నారు.18న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రులతో సమావేశమవుతామని షిండే వెల్లడించారు. -
ఒక్కో పార్టీ నుంచి ఒక్కరే వస్తే మంచిది: షిండే
-
'ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి టీ. బిల్లు పంపుతాం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఈ నెల చివరికల్లా రాష్ట్ర ఏర్పాటు అంశంపై జీఓఎం నివేదిక సమర్పిస్తుందని ఆయన తెలిపారు. జీఓఎం సమావేశానికి హాజరై ముందు షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి తప్పక పంపుతామని తెలిపారు. హైదరాబాద్ నగర అంశాన్ని కూడా ఇందులోనే పొందుపరిచి బిల్లును పంపుతామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీని కేంద్రం ఇస్తుందని షిండే తెలిపారు. అంతకు ముందు పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నుంచి తప్పక సహకారం లభిస్తుందని తెలిపారు. ఆమోదకరమైన ప్యాకేజీని ఇచ్చి సీమాంధ్ర ప్రజలను విభజనకు ఒప్పిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. -
మోడీ భద్రతకు రాజకీయ రంగు!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భద్రత అంశం రాజకీయ రంగు పులుముకుంది. కేంద్రం, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. మోడీని హత్య చేసేందుకే పాట్నాలో పేలుళ్లకు పాల్పడ్డారని, ఆయన భద్రతను మరింత పెంచాలని బీజేపీ డిమాండ్ చేయగా.. గుజరాత్ సీఎంకు ఇప్పటికే అవసరమైన భద్రత కల్పిస్తున్నామని, ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) భద్రత ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టంచేసింది. మోడీకి ఎస్పీజీ భద్రత కల్పించాలన్న బీజేపీ డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తోసిపుచ్చారు. చట్టాలకు అనుగుణంగానే ఈ భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. పశ్చిమబెంగాల్లోని పెట్రాపోలెలో బుధవారం జరిగిన కార్యక్రమంలో షిండే మాట్లాడుతూ, మోడీకి ఇప్పటికే ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తున్నామన్నారు. కాగా పాట్నా పేలుళ్లకు కేంద్రం, నితీశ్‌కుమార్ ప్రభుత్వాలదే బాధ్యత అని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పాట్నా సభకు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కాగా, మోడీకి ఇప్పటికే ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తున్నామని, ఆయనకు ఎస్పీజీ భద్రత ఇవ్వడం కుదరదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. ‘మోడీ ఎక్కడకు వెళ్లినా ఆ ప్రాంతంలో ముందస్తు భద్రత డ్రిల్ చేపట్టాలని ఆదేశించాం. ఆయనకున్న ముప్పు తీవ్రత బట్టే భద్రత ఇస్తున్నాం’ అని చెప్పారు. చట్ట ప్రకారం ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుందన్నారు. రాజీవ్ భద్రతపై సింగ్ పొరపాటు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ భద్రత అంశంలో బీజేపీపై ఆర్పీఎన్ సింగ్ పొరపాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉండగా, రాజీవ్ భద్రత విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని, కనీసం సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు. దీంతో 1991 మేలో తమిళనాడులో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ ప్రాణాలు కోల్పోయారన్నారు. అయితే, రాజీవ్ హత్య సమయంలో చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. జనతాదళ్(ఎస్) అధినేత అయిన చంద్రశేఖర్.. కాంగ్రెస్ మద్దతుతో 1990 నవంబర్ 10న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రాజీవ్‌గాంధీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1991 మార్చి 6న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు రావడంతో 1991 జూన్ 21 వరకు చంద్రశేఖర్ ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. -
సీమాంధ్రుల భద్రతకు ‘ప్రజా రక్షణ కమిటీ’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలన సాధ్యం కాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జీవోఎంకు స్పష్టంచేశారు. దేశ రాజధాని, రాష్ట్రం కలిసే ఉన్నందున అక్కడ కేంద్ర పాలన సాధ్యమని, కానీ హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఈ దృష్ట్యా హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిని దీనికి ఛైర్మన్‌గా నియమంచి, ఇరు ప్రాంత డీజీపీలను ఇందులో సభ్యులను చేయాలని విన్నవించారు. ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా చర్యలు తీసుకొని, దోషులకు శిక్షపడేలా చేస్తుందని వెల్లడించారు. ఇక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కాకుండా కేవలం ట్రాన్సిషన్ క్యాపిటల్‌గా మాత్రమే పరిగణించాలని జీవోఎంకు పంపిన నివేదికలో కోరారు. జీవోఎం సభ్యులను కలిసి నివేదికను అందించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో నివేదికను అందరికీ ఈ మెయిల్ చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను గురువారం ఉదయం కలిసి స్వయంగా అందించనున్నారు. మొత్తం 100 పేజీల నివేదికలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్షుణ్ణంగా వివరించారు. ఇదే సమయంలో రాజధాని, ఉద్యోగుల విభజన, నదీ జలాల పంపిణీ, ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన ఎలా జరగాలో సవివరంగా నివేదించారు. నివేదికలో పొందుపర్చిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.... ఠ జాతీయ హోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్టు కాకుండా 10 డ్యామ్‌లు నిర్మిస్తే ముంపు ప్రాంతం తగ్గడంతో పాటు నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. ఠ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృష్ణా జలాల మీద వాటా తేల్చాలి. ఠ తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టికల్ 371(డి)ని కొనసాగించాలి. అయితే దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరంలేదని ఇదివరకే సుప్రీం తీర్పునిచ్చింది. ఠ ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్‌లో పొందుపరిచిన స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన, పెన్షనర్ల విభజన చేయాలి. -
అఖిలపక్షంలో వైఖరి చెబుతాం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలన్నిటితో మాట్లాడేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తామే కోరామని, దానికి విధిగా హాజరవుతామని సీపీఐ స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము ఇప్పటికే కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు నివేదిక ఇచ్చామన్నారు. జీవోఎంకు నివేదించాల్సిన సూచనలు, సలహాలపై కూడా నివేదికను తయారుచేశామని, పార్టీ రాష్ట్ర కౌన్సిల్లో చర్చించి మంగళవారం సమర్పిస్తామని చెప్పారు. కాగా, సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నగర శివార్లలోని యాప్రాల్‌లోని ఒక ప్రైవేటు క్లబ్లో జరుగనున్నాయి. -
తెలంగాణ ఏర్పాటు పై మళ్ళీ అఖిలపక్షం
-
తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’
విశ్లేషణ: ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి చూస్తే సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! సునామీలు, కుంభవృష్టి, పెనుతుపానులు, టార్నా డోలు, టార్పీడోలు వాటికి తెలియకుండానే దిశలూ దిక్కులూ మార్చుకుంటాయి. ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ కూడా అగమ్యగోచరంగా మారి భిన్నమైన దిక్కులలో ప్రయాణిస్తూ అన్నిటినీ ప్రశ్నార్థకం చేస్తోం ది! ‘విభజన’ ప్రతిపాదనకు ఎలాంటి ప్రత్యామ్నా యాలతో పరిష్కారం వెతకాలా అన్న మీమాంసలో యూపీయే కొట్టుమిట్టాడుతోంది! ఏ పరిష్కారమూ దొరకక చేస్తున్న పని - తల్లినీ తండ్రినీ చంపిన ఓ ప్రబుద్ధుడు ‘అయ్యా నేను తల్లీ తండ్రీ లేనివాణ్ణి, భిక్షపెట్ట’మని అడుక్కున్న ట్టుగా ప్రభుత్వ శాఖలలోని గడప గడపా తిరుగుతోంది! స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి సాహసించిన కాంగ్రెస్ పాలకులు నేడు దిక్కు తోచని ‘కంగారు’ల్లాగా పరుగులు పెడుతున్నారు! సుశీల్ కుమార్ షిండేకు ఆయన హోంశాఖ అధికారులే విచిత్రమైన ‘గమనిక’ను (‘నోట్’ను) సమర్పిం చబోవటం ఈ కంగారులో భాగమే. ‘నోట్’లో పంచదార! ‘హోం’వర్క్ ఫలితంగా మంత్రికి సమర్పించిన ఆ ‘నోట్’లో మూడు ప్రతి పాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో విచిత్రమైన ప్రతిపాదన కూడా ఉంది. మొదటి పరిష్కారం ‘తెలంగాణలోని పది జిల్లాలకు తోడుగా స్వచ్ఛం దంగా వచ్చి చేరగోరే ఇతర జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుని అన్నిం టినీ కలిపి తెలంగాణగానే ఏర్పాటు చేయండి!’ అంటే మొదటి ఎస్ఆర్సీ (ఫజల్ అలీ), శ్రీకృష్ణ కమిటీల మొదటి ప్రతిపాదన సమైక్యాంధ్రనే హోంశాఖ అభిలషిస్తోందా?! ఈ ‘నోట్’ను ఎవరు తయారు చేశారోగాని సదరు పత్రకా రుడు మహా‘సరసుడే’ కాదు, హోంశాఖలో బహుశా ప్రజలను విభజించి పాలిం చడం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! బహుశా రాష్ట్ర మెజారిటీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఈ ‘నోట్’ డ్రాఫ్టింగ్ జరిగినట్టుంది. ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పు డున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! పేరు మార్చుకుందాం! ఈ సందర్భంగా రాజ్యాంగ పరిశీలకులందరి దృష్టికీ రావలసిన అంశం ఉంది. ఏ కేంద్ర పాలక పక్షం, ఏ‘3’వ అధికరణ ఆధారంగా ఏ తెలుగు జాతిని చీల్చా లని ఉవ్విళ్లూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని ‘ఇ’ క్లాజు అవసరాన్ని బట్టి ‘రాష్ట్రం పేరును మార్చకునే’ హక్కును కూడా ప్రసాదించిందని మరచిపోరాదు! అంటే, తెలంగాణ పది జిల్లాలతో పాటు ఎన్ని జిల్లాలు వచ్చి చేరితే అన్ని జిల్లా లూ కలిసిన ‘తెలంగాణ రాష్ర్టం’గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించి నట్టయింది! ఆ లెక్కన మిగిలిన 13 జిల్లాలూ, ఆ పది జిల్లాలతోనూ కలిసి వెరసి - అక్షరాలా ‘తెలంగాణ’యే అవుతుందిగదా! నిజానికి యావత్తు రాష్ట్రమూ ‘తెలంగాణ’యే. ‘తెలంగాణ’ అంటే, తెలుగులకు (తెలుగు వారికి) ఆణెము / ఆణియము, అంటే తెలుగు వారు నివసించే చోటు అనీ, ప్రాంతం అనీ, స్థిర నివాసమనీ అనే అర్థం. సుమారు 300 ఏళ్లు సీమాంధ్ర ప్రాంతాలతోపాటు దక్కన్ వరకూ ఏలిన మహమ్మదీయ (ముసల్మాన్) పాలకులు (చరిత్ర జ్ఞాన శూన్యులైన నేటి నేతలకంటె) నాడేతెలివిగా వ్యవహరించారు కాబట్టే ఈ తెలుగు ప్రాంతాన్ని ‘తెలంగాణ’ అని పిలిచారు. (చూ: ఇండియా; ఎ హిస్టరీ ‘గ్రంథంలో జాన్కేయి 2000, హార్వర్ కాలిన్స్ పబ్లిషర్స్ ప్రచురించిన దేశ పటం: పేజీ:280)! బహుశా హోంశాఖ ‘నోట్’ కూడా తెలంగాణలో అన్ని జిల్లాలూ (ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ కమ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఇన్ తెలంగాణ విల్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ టు ఫామ్ తెలంగాణ) వచ్చి చేరమని ఆహ్వానం పలికి ఉంటుంది! అర్థవంతంగా ఉంటుంది! రాజ్యాంగంలోని 3వ అధికరణం ‘ఇ’ సెక్షన్ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్’ను కృత్రి మంగా విభజించకుండానే అర్థవంతంగానూ, సహజంగానూ, చారిత్రికంగానూ జాతి-భాషాపరంగానూ సుఖంగా అమరగల ‘తెలంగాణ’ అని పేరు మార్చు కోవచ్చుగదా! దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఏర్పడి నప్పుడు - అకారాది క్రమం కోసమని అటు ఇంగ్లీష్ వర్ణమాలకు, ఇటు తెలుగు వర్ణమాలకు సమస్థాయిలో ఉన్న తొలి అక్షరాలతో ‘ఎ’ / ‘ఆ’ ఆంధ్రప్రదేశ్ ఏర్ప డటం శుభదాయకం అనుకున్నారు నాటి పెద్దలు. ఆ ఆశతోనే (ఆంధ్రప్రదేశ్) తప్పు సమాసం అయినా ఎంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధుల’ వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలక పక్షాలు, ముఖ్యం గా కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్లుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి కూడా వెనుదీయలేదు. వాటిల్లో కొన్ని రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రూట్ మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి రేపటి పాలక పక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలే! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేద్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవి కావు! స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధ విరుద్ధమైన సవరణ చట్టాలూ తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ, 4వ అధికరణలు. దేహభక్తే తప్ప దేశభక్తి ఏది! కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు, ఈడేర్చుకోవడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు ‘డి’ క్లాజు ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చట్టం తీసుకొచ్చి, దానికి భాష్యం చెప్పా లన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్టుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే ఇతర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలు గాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371(డి) సవరణ చట్టానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దాని ద్వారా కేంద్ర కేబినెట్కూ, సాధ్యమవుతుందిగాని అడ్డదారుల్లో కాదు! పైగా హోంశాఖ చూపిస్తున్న ‘నోట్’లో నేడు వ్యతిరేకులుగా మారి ప్రజల కోసం పదవుల్ని త్యాగం చేయలేని ‘దేహభక్తి’కి తప్ప దేశభక్తికి దూరమైన నాయకులకు తెలియని రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి ఇచ్చిన ‘ఒకటవ వివరణ’లోనే ఉంది. ఇది రెండు రకాల భాష్యాలకి అవకాశమిస్తోంది. ఎలా అంటే, 3వ అధికరణలో ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకూ ఉన్న క్లాజుల్లో ‘రాష్ట్రం’ అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యూటీ) ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! మిగిలిన సూత్రాలు అందుకే, ఇదే అదననుకొని రాజధాని యూటీగా మార్చి క్రమంగా అన్ని హం గుల్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలన్నది హోంశాఖ రెండవ సూత్రం! అయితే, జనాన్ని పాలక పక్షాలు గందరగోళపరచడం కోసం చేసిన ప్రయత్నం - మినహాయింపు ‘క్లాజు’ పేరిట ’రాష్ట్రం’ అనే పదంలో ‘కేంద్రపాలిత ప్రాంతం ‘చేరి ఉండగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్ర ప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ‘కేంద్రపాలిత ప్రాంతం’గానో (యూటీ) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ర్ట ‘విభజన’ గురించి ఆలోచించాలి గాని అంతకుముందు కాదని ప్రతిపాదించడానికి కారణం 3వ అధికరణంలోని ఈ అయోమయపు ‘వివరణ-1’ కాబట్టి - ఇంతకూ రాజ్యాం గం సాధికార షెడ్యూల్‌కు బద్ధమై మైదాన ప్రాంతాల మోతుబరుల దోపిడీకి గురవుతున్న ఆదివాసీ గిరిజన తెగలు తమ లిపి, ప్రత్యేక సంస్కృతి పరిరక్షణకు విశాఖ, తూర్పుగోదావరి, ఉత్తర తెలంగాణలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ విడగొట్టి భద్రాచలం రాజధానిగా మన్య రాష్ట్రం ఏర్పరచాలన్న డిమాండ్‌ను మరి ఎందుకు నిరాకరిస్తున్నట్లు? అర్థం తెలియకే... కాబట్టి మొత్తం తెలుగు జాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోవడానికి గాను, ‘ఆంధ్ర’ అనే పదం (తెలుగు అనేది తెలి యక) పట్ల అజ్ఞానంతో కొందరు ‘ఎలర్జీ’ పెంచుకున్నారు. తద్వారా తెలుగు జాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగానే 3వ అధికరణలోని ‘ఇ’ క్లాజు ప్రకారం ‘తెలంగాణ’ అని గానీ, ‘తెలుగు నాడు’ అని గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగు వాడికీ అభ్యంతరం ఉండదు. మనసారా ఆహ్వానించి తీరుతాడు! -
ఇప్పటికైనా మేల్కొంటారా?!
సంపాదకీయం: ఉగ్రవాద చర్యలు మనకు కొత్తగాదు. దేశంలో ఏదో ఒక మూల అలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినుంచీ గుణపాఠాలు తీసుకుని పాలనా యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ఉంటుందని, ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. కానీ, ఆ ఆశ అడియాసేనని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం బీజేపీ బహిరంగ సభకు కొన్ని నిమిషాల ముందు సంభవించిన పేలుళ్లు నిరూపించాయి. ఈ పేలుళ్లలో సాధారణ పౌరులు అయిదుగురు, బాంబు పేల్చడానికి ప్రయత్నించిన ఉగ్రవాది ఒకరు మరణించారు. మరో 98మంది గాయపడ్డారు. సభకు చాలాముందు పేలుళ్లు జరగడంవల్ల తొక్కిసలాట చోటుచేసుకోలేదుగానీ... లేనట్టయితే మృతుల సంఖ్య చాలా ఎక్కువుండేది. పేలుళ్లు జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్న కొందరిలో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారిద్దరున్నట్టు పోలీసులు చెబుతున్న సమాచారం. ఏడుచోట్ల జరిగిన పేలుళ్లలోనూ ఉగ్రవాదులు టైమర్లు వాడారు. పేలుళ్లు పాట్నాకు కొత్త కావొచ్చు. కానీ, కొన్ని నెలలక్రితమే ఆ రాష్ట్రంలోని బుద్ధ గయలో ఇవి సంభవించాయి. అంతేకాదు... పొరుగునే ఉన్న నేపాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టు, వారు బీహార్‌ను రక్షితప్రాంతంగా పరిగణిస్తున్నట్టు ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. దేశంలో పలు ఉగ్రవాద ఘటనలతో సంబంధం ఉన్న యాసిన్ భత్కల్ బీహార్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోనే పోలీసులకు చిక్కాడు. సాధారణ పరిస్థితుల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసు కోవాల్సి ఉండగా పాట్నాలో ఆదివారం బీజేపీ బహిరంగసభ నిర్వహిస్తున్నందు వల్ల మరింత అప్రమత్తతతో మెలగవలసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటినుంచో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. అలాంటి నాయకుడు హాజరవుతున్న సభ సందర్భంగా ఒకటికి రెండుసార్లు భద్రతా ఏర్పాట్లను సరిచూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, పాట్నాలోని ఏడుచోట్ల పేలుళ్లు జరగడాన్ని చూస్తే ఆ తరహా చర్యలు తీసుకోలేదని అర్ధమవుతోంది. బీజేపీ సభ కోసం 5,000 మంది పోలీసులను నియమించామని ప్రభుత్వం చెబుతున్నా... వారంతా ట్రాఫిక్‌ను చక్కదిద్దడంలోనే గడిపారు. సభకు హాజరవుతున్న సామాన్య పౌరుల, వీఐపీల భద్రత గురించి, ముందస్తు ఏర్పాట్ల గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం సభా స్థలివద్ద ఉండాల్సిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ దరిదాపుల్లో లేదు. భారీ బహిరంగ సభ జరుగుతున్నచోట కనీసం ఒక్క అంబులెన్స్‌ను అయినా అందు బాటులో ఉంచాలని పోలీసులకు తోచలేదు. ఘటన జరిగిన వెంటనే అందులో గాయపడినవారిలో కొందరిని మోసుకుపోవడం, మరికొందరిని ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. పేలుళ్లకు వారు స్పందించిన తీరే చిత్రాతిచిత్రం. మొదటి పేలుడు పాట్నా రైల్వే స్టేషన్లో ఉదయం 9.30 సమయానికి జరిగింది. అటు తర్వాత వేర్వేరుచోట్ల వరసపేలుళ్లు సంభవించాయి. చిట్టచివరి పేలుడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గాంధీమైదాన్ ఆవరణలో జరిగింది. అప్పటికి మోడీ తన ప్రసంగాన్ని ఇంకా ప్రారంభించలేదు. తొలి పేలుడు జరిగాక ఒకటి రెండుచోట్ల బాంబులను కనుగొని నిర్వీర్యంచేసిన మాట వాస్తవమేగానీ భారీగా జనం గుమిగూడుతున్న గాంధీమైదాన్‌లో మాత్రం దుండగులు దాడికి దిగవచ్చన్న అనుమానం ఏ దశలోనూ పోలీసులకు రాలేదు! అక్కడ అయిదుచోట్ల పేలుళ్లు జరిగిపోయాయి. అయితే, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పోలీసుల వైఫల్యాన్ని అంగీకరించడం లేదు. తమకు సంబంధించినంతవరకూ భద్రతాపరమైన లోపాలు ఏమీ లేవని ఆయనంటున్నారు. అసలు అటు కేంద్ర నిఘా సంస్థగానీ, రాష్ట్ర నిఘా సంస్థలుగానీ ముందస్తు హెచ్చరికలేమీ చేయలేదని ఆయన వివరిస్తున్నారు. కేంద్ర గూఢచార సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) దీనికి భిన్నమైన కథనాన్ని చెబుతోంది. పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నదని తాము ముందే అప్రమత్తం చేశామని అంటున్నది. బీహార్ ప్రభుత్వ ప్రకటనకూ, ఐబీ వివరణకూ పొంతనే లేదు. మన ప్రారబ్ధం ఇదే. అంతా అయిన తర్వాత మేం చెప్పామని వారూ... చెప్పలేదని వీరూ అంటారు. ఎందుకింత గందరగోళం నెలకొంటున్నదో, సమన్వయం కొరవడుతున్నదో అంతుపట్టదు. ఆమధ్య జరిగిన హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలోనూ ఇలాగే పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. ముందే చెప్పామని ఐబీ... లేదు లేదని స్థానిక పోలీసులు భిన్న కథనాలు వినిపించారు. అటు తర్వాత బుద్ధగయలో పేలుళ్లు జరిగినప్పుడూ ఇదే పునరావృతమైంది. ఆచరణలో ఇలా వరస వైఫల్యాలు సంభవిస్తున్నప్పుడు ఏ దశలో తలెత్తిన లోపాలు అందుకు దారితీస్తున్నాయో సమీక్షించుకోవాలి. మరోసారి అవి జరగకుండా ఏంచేయాలో ఆలోచించాలి. మార్గదర్శకాలు రూపొందించాలి. కానీ, అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఇలాంటి కసరత్తులు జరుపుతున్నట్టు లేవు. అందుకే, పదే పదే అవే పొరపాట్లు... అదే గందరగోళం... అవే దుష్ఫలితాలు వస్తున్నాయి. అసలు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన కొద్దిసేపటికే ఒక చలన చిత్రం ఆడియో ఉత్సవానికి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరయ్యా రంటేనే మన నేతల్లో నిర్లిప్త ధోరణి ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతుంది. ఆరుగురు మరణించి, దాదాపు వందమంది గాయపడిన ఉదంతం జరిగిన నగరంలోనే ఈ తరహా కార్యక్రమంలో ఆయన ఎలా పాల్గొనగలిగారో ఊహించ లేం. నేతల్లో ఉండే ఇలాంటి ధోరణే కిందిస్థాయి యంత్రాంగంలో అలసత్వాన్ని పెంచుతున్నది. తమను తాము సరిచేసుకోవడమే కాదు... కిందిస్థాయిలో సమూల ప్రక్షాళనకు పూనుకోనట్టయితే పాట్నా ఘటనల వంటివి పునరావృతమవుతాయని ఇప్పటికైనా నేతలు గుర్తించాలి. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. -
తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎందుకీ తొందర?
రాష్ట్రంలో సగానికి పైగా ప్రజలు వద్దంటున్నా, సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నా, కొంతమంది కేంద్ర మంత్రులు సైతం విభేదిస్తున్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రాష్ట్రాన్ని విభజించకుండా వదిలేది లేదంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ఆంటోనీ కమిటీ అంటూ ఒక కమిటీని నియమించి దాంతో సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటూ కబుర్లు చెప్పినా, ఆ కమిటీ కాస్తా మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లు నాలుగు రోజులకే చాప చుట్టేసింది. ఈ కమిటీ అసలు రాష్ట్రంలో పర్యటించిన పాపాన పోలేదు. అసలు రాష్ట్రంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర రాజధాని నగరం విషయాన్ని ఏం చేయాలో నిర్ణయించలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైతే దాని రాజధాని నిర్మాణం ఎలాగో, ఎక్కడో స్పష్టం చేయలేదు. ఇవేమీ లేకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ నిమిషానికో ప్రకటన చేసి పారేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తనవంతుగా ఓ ప్రకటన చేసి పారేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యేలోపే మంత్రుల బృందం తన నివేదికను అందజేస్తుందని చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణ విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నట్లయింది. విభజనకు వ్యతిరేకంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, రాష్ట్రపతిని కలిసి విభజనకు వ్యతిరేకంగా తాము తమ వాదన వినిపించినట్లు చెబుతున్న దాదాపు 60 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గానీ.. తాము ఏం సాధించామన్న విషయాన్ని మాత్రం బయట పెట్టడంలేదు. అసలు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వాసంలోకి తీసుకుందన్న నమ్మకం ఎవరికీ కలగడంలేదు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నారు. రాష్ట్రంతో అధికారికంగా ఎలాంటి సంబంధం లేని దిగ్విజయ్ సింగ్ సహా, రాజకీయ పెద్దలందరినీ ఆయన కలుస్తున్నారు. రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి గురించి, పరిపాలనా తీరు గురించి కూడా నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఎలాంటి భారీ ప్యాకేజీలు ఇవ్వలేదు. కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దాంతో కొత్తగా రాజధాని, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాల్సిన 'ఆంధ్రప్రదేశ్'కు ఏం ఇస్తారన్నది అనుమానంగానే కనపడుతోంది. సీమాంధ్రుల సందేహాలను నివృత్తి చేసే కనీస ప్రయత్నం కూడా చేయని కాంగ్రెస్.. ఎందుకింత తొందరపడుతోందో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. -
శీతాకాల సమావేశాలకు ముందే జీవోఎం నివేదిక: షిండే
తెలంగాణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈరోజపు సాయంత్రం 4.30 గంటలకు హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో అధికారులు భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హోం శాఖ అధికారులతో చర్చించారు. కాగా, శీతాకాల సమావేశాలకు ముందే మంత్రుల బృందం తన నివేదికను అందజేస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చెప్పారు. దాదాపు సగానికి పైగా రాష్ట్ర ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా.. కేవలం తన మొండి పట్టుదల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో ముందుకెళ్తోందని సీమాంధ్ర ప్రాంత వాసులు అంటున్నారు. -
ఢిల్లీలో గవర్నర్.. మూడు రోజుల్లో ముఖ్య భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పెద్దల పిలుపుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయున ఢిల్లీలో మూడు రోజులుంటారని, శుక్రవారం సాయంత్రం లేదా శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన ప్రక్రియను మంత్రుల బృందం(జీవోఎం) ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గవర్నర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్ ప్రభృతులతో గవర్నర్ కీలక చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, సీమాంధ్రలో ఆందోళనల తీరు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి తదితర అంశాలపై ఆయన కేంద్ర నేతలకు నివేదికలిస్తారని సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని స్వదేశం చేరిన అనంతరం ఆయునతో గవర్నర్ భేటీ అవుతారు. ఇక బుధ, గురువారాల్లో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ‘విభజన’ నేపథ్యంలో వివాదాస్పదమైన ప్రధాన అంశాలు, వివిధ పరిష్కారాలపై గవర్నర్ అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలు తెలుసుకుంటారని, ఆ సమాచారం ఆధారంగానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
జమ్మూ కాశ్మీర్లో చోరబాట్లపై కేంద్రం ఆందోళన
జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ప్రవేశిస్తున్న చోరబాటుదారులు సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది చోరబాట్ల సంఖ్య అంత లేవు, కానీ ఈ ఏడాది ఆ సంఖ్య అధికం కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్ర కలత చెందుతున్నట్లు వెల్లడించారు. భారత్, పాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో షిండే మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా సాంబ సెక్టర్లోని భద్రత దళాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... చోరబాట్ల సంఖ్య అధికమవడానికి గల కారణాలపై తమ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2003లో భారత్ - పాక్ దేశాల మధ్య చేసుకున్న కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని పాక్ తరుచుగా ఉల్లంఘిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. దాంతో ఆ అంశంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో షిండే మంగళవారం భారత్, పాక్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లోని పహారా కాస్తున్న సెంట్రల్ ఆర్మడ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బందికి మాజీ సైనికుల హోదా కల్పించేందుకు కృషి చేస్తానని షిండే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానితో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని సీఏపీఎఫ్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి ఆ విషయం బిల్లుగా రూపాంతరం చెందుతుందని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాల్పుల ఉల్లంఘనపై కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పాటు పలువురు నేతలు, ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్పీఎఫ్, సశస్త్ర సీమ బల విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద షిండే తదితరులు నివాళి అర్పించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాళి అర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అఖిలేష్.... ఖాకీల సేవల వల్లే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని కొనియాడారు. పాకిస్తాన్ దళాలు ఎల్వోసీ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. కాల్పుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇరు వైపుల నుంచి స్పందన ఉంటేనే చర్చలు సాధ్యం అవుతాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాగా పాక్ కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న జమ్మూకాశ్మీర్‌లో జాతీయ పోలీసు దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. రాజధానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు.ఖాకీల సేవలను కొనియాడారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. -
షిండేపై పిటిషన్‌ను విచారించనున్న ముంబై హైకోర్టు
మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం.. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను వెంటాడుతోంది. షిండేను నిందితుడిగా చేర్చాలంటూ ఓ సామాజిక ఉద్యమకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో షిండే ప్రమేయముందంటూ ప్రవీణ్ వాటెగాన్కర్ అనే వ్యక్తి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆదర్శ్ బిల్డింగ్‌లో షిండే బినామీ పేర్లతో ప్లాట్లను పొందారని ఆరోపించారు. దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ఫిర్యాదు దారు కోరారు. కాగా బినామీ దారులపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో షిండే పాత్ర లేదని తేలినట్టు కోర్టుకు తెలిపారు. కాగా కేసు విచారణ పూర్తయిన అనంతరం పిటిషన్‌ను విచారించనున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణకు వచ్చే నెల 26కు వాయిదా వేసింది. -
'తెలంగాణ బిల్లా.. తీర్మానమా.. షిండేతో మాట్లాడి చెబుతా'
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపాలా లేక తీర్మానమా అన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడాక స్పందిస్తానని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ ప్రకటించారు. షిండేతో మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు. బిల్లు విషయంలో ఏఐసీసీ నాయకులు భిన్నమైన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటవుతుందన్న కాంగ్రెస్ నేత చాకో వ్యాఖ్యలతో తనకు సంబంధంలేదని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. -
సీఎం తప్పుదారి పట్టించారు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆగ్రహం అసెంబ్లీ తీర్మానం అడ్డుకుందామని చెప్తున్న సీఎం అసలు తీర్మానమే రాదని తేల్చిచెప్పిన షిండే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విభజనకు సంబంధించి రాష్ట్ర శాసనసభ తీర్మానం కోరడం లేదనీ, కేవలం బిల్లుపై అభిప్రాయం మాత్రమే కోరుతూ పంపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టంగా చెప్పడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో పడిపోయారు. ఇంతకాలం అసెంబ్లీలో తీర్మానం అడ్డుకుందామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాటలను నమ్మిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తాజా పరిణామాల్లో ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జన మొదలైంది. తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సాకు చూపి ఇంతకాలం నెట్టుకురాగా ఇప్పుడేం చేయాలన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి తమను తప్పుదోవ పట్టించారని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై జూలై 30 న సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, తెలంగాణ నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన తర్వాత తీర్మానం చేయమని కోరే సంప్రదాయం ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి ఇంతకాలం చెబుతూ వచ్చిందంతా ఒక పథకం ప్రకారమే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేబినేట్ నోట్ ఆమోదం పొందడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేసి పంపిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను పట్టించుకోకుండా ఆరోజు ప్రతిష్టకు పోయినందుకు ఈరోజు ఇరకాటమైన పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సైతం అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని ప్రతిచోటా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే మాట చెబుతూ వస్తుంటే తీర్మానాన్ని అడ్డుకోవచ్చని భావించాం. రెండు రోజుల కిందట ఏపీఎన్జీవోలతో జరిపిన చర్చల్లోనూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే అడ్డుకోవడం సాధ్యమవుతుందని భావిస్తూ వచ్చాం. షిండే ప్రకటన, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత ఇప్పుడు అలాంటిదేమీ లేదని, కేవలం అభిప్రాయం కోసమే బిల్లు అసెంబ్లీకి వస్తుందని తెలిసిన తర్వాత ఏం చేయాలో మా వాళ్లకు అర్థం కావడం లేదు’’ అని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడమే మేలు: గాదె అసెంబ్లీకి తెలంగాణ తీర్మానమే రాదని కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సుమోటోగా అసెంబ్లీని సమావేశపరిచి విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే మేలని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా కేంద్రం పునరాలోచనలో పడే అవకాశాలున్నాయన్నారు. మంత్రి ఎస్.శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ పద్మరాజు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో తాజా పరిణామాలపై చర్చించారు. దీనిపై సీఎంను కలిసి తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవడమే మేలని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతకుముందు వివిధ పనుల నిమిత్తం మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, టీజీ వెంకటేశ్, పార్ధసారథి, కొండ్రు మురళీమోహన్, దానం నాగేందర్, మహీధర్రెడ్డిసహా పలువురు ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. వీరిలో కొందరు నేతలు షిండే ప్రకటనను సీఎం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం కేంద్రం నుంచి వచ్చిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తేనే ప్రయోజనం ఉంటుందే తప్ప అసెంబ్లీ తనంతట తాను విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం పంపితే లాభం ఉండదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. షిండే ప్రకటననే అంతిమమని అనుకోవాల్సిన పనిలేదని, దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని తాను శుక్రవారం ఉదయం దిగ్విజయ్‌సింగ్‌కు ఫోన్ చేసినట్లు వారితో చెప్పారు. కేంద్ర పెద్దలు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నప్పటికీ చివరకు విభజన తీర్మానం రాక తప్పదని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంమంత్రి విభజన తీర్మానం అసెంబ్లీకి రాదని కరాఖండిగా చెబుతున్నా సీఎం మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతుండటం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. సీఎం ఎందుకిలా మాట్లాడుతున్నారో తమకు అర్థం కావడం లేదని సీనియర్ మంత్రి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజలంతా సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తూ రోడ్లపైకి వస్తుంటే సీఎం మాత్రం చివరివరకు పదవిలో కొనసాగాలనే భావనతో దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని భావన కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్విజయ్‌సింగ్‌కు సీఎం ఫోన్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌కు ఫోన్ చేసి రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ‘‘మీరేమో అసెంబ్లీకి విభజన తీర్మానం రెండుసార్లు వస్తుందని నాతో చెప్పారు. షిండే గారేమో తీర్మానం రాదని, ముసాయిదా బిల్లును మాత్రమే అసెంబ్లీకి పంపి అభిప్రాయం కోరతామంటున్నారు. అసలు విభజనపై ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు? ఒకే మాటగా చెప్పండి’’ అని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు చెప్పారు. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నందున ఢిల్లీ వెళ్లిన తరువాత హైకమాండ్‌తో మాట్లాడి విభజన తీర్మానంపై స్పష్టమైన ప్రకటన చేయిస్తానని దిగ్విజయ్‌సింగ్ సీఎంకు హామీనిచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. -
మంత్రల బృందం మొదటి భేటీ
తెలంగాణపై సమావేశమైన మంత్రుల బృందం ఆంటోనీ, చిదంబరం మినహా ఐదుగురు మంత్రుల హాజరు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో పునర్వ్యవస్థీకరించిన కేంద్ర మంత్రుల బృందం శుక్రవారంనాడిక్కడ తొలిసారిగా సమావేశమైంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో నిష్పాక్షికంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తామని ప్రకటించింది. నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో దాదాపు 45 నిమిషాలసేపు జరిగిన ఈ సమావేశానికి విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా మిగిలిన అయిదుగురు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, వి.నారాయణసామి హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయడంలో జీవోఎంకు కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన 11 పరిశీలనాంశాలకు సంబంధించిన వివరాలతో సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖల నుండి నివేదికలను కోరాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సమాచారాన్ని కోరాలని నిర్ణయించింది. ప్రాథమిక చర్చ మాత్రమే జరిగింది: షిండే జీవోఎంకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులపైనే తొలి సమావేశంలో ప్రాథమికంగా చర్చ జరిగిందని కేంద్ర హోం మంత్రి షిండే, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌లు వెల్లడించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో అనుసరించాల్సిన మౌలిక విధివిధానాలను పరిశీలన మినహా ప్రధాన నిర్ణయాలేమీ తీసుకోలేదని తెలిపారు. జీవోఎం పరిశీలనాంశాల్లో పొందుపరిచిన అంశాలపై కేంద్రంలోని జలవనరుల మంత్రిత్వశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి, రవాణా వంటి సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటి నుండి నివేదికలను కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు షిండే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అవసరమైన సమాచారాన్ని కోరాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించడంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అయితే సీమాంధ్ర ప్రజల భయాందోళనలు, సమస్యలను పరిష్కరించడంలో జీవోఎం నిష్పక్షపాతంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆ తర్వాత విడుదలైన అధికార ప్రకటన హామీ ఇచ్చింది. పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాల్సిన హైదరాబాద్ నగర ప్రతిపత్తి, రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, నదీజలాలు, విద్యుచ్ఛక్తి, ఆదాయ వనరుల పంపిణీ, సహజ వనరులు, సిబ్బంది పంపిణీ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పరిష్కరించాల్సిన 11 అంశాలతో జీవోఎం పరిశీలనాంశాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై సమర్పించే స్టేటస్ రిపోర్టులను అధ్యయనం చేసి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించే నివేదికలో పొందుపరిచే సిఫార్సులను పర్యవేక్షించేందుకు జీవోఎం సభ్యుల మధ్య పని విభజన కూడా జరిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆరు వారాల్లో జీవోఎం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం మొదట నిర్దేశించినా ఆ తర్వాత గడువును తొలగించడం తెలిసిందే. జీవోఎం నివేదిక సమర్పణకు ఎలాంటి గడువు లేదని ఆజాద్ స్పష్టంగా చెప్పడం గమనార్హం. అలాగే కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం లేదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ? ఎన్ని అవరోధాలు ఎదురైనా రాష్ట్ర విభజన నిర్ణయంతోనే ముందుకు సాగాలని కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలను బుజ్జగించేందుకు భారీగా ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విభజనానంతరం రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల సత్వరాభివృద్ధికి అవసరమైన సిఫార్సులు చేయాలన్న అంశాన్ని మంత్రుల బృందం పరిశీలనాంశాల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం కోసం భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రమంత్రుల బృందం సిఫార్సు చేయవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీమాంధ్రకు రాజధానిని ఆ ప్రాంత నేతలతో సంప్రదించిన తర్వాతే కేంద్రం ఎంపిక చేస్తుందని, కొత్త రాజధానిని అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేసుకొనేందుకు భారీగా నిధులు సమకూర్చే అవకాశం లేకపోలేదని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జీఓఎంను కలవనున్న సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్:రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన జీఓఎం(కేంద్ర మంత్రుల బృందం)ను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలవనున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించేందుకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలనే సీమాంధ్ర ఉద్యోగులకు కూడా వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీరికి మధ్యంతర భృతిని కూడా అందజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. ఈ భేటీ అనంతరం జీఎంవో సభ్యులకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన జీఎంవో సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. వివిధ శాఖలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులను సీమాంధ్ర ఉద్యోగులు కలిసి విభజన వల్ల సమస్యలను వివరిస్తారు. -
జీఎంవో సభ్యులకు బాధ్యతల కేటాయింపు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన జీఎంవో(కేంద్ర మంత్రుల బృందం) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. ఈ భేటీ అనంతరం జీఎంవో సభ్యులకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అనారోగ్య కారణాలతో ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం ఈ భేటీకి అందుబాటులో లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన జీఎంవో సభ్యుల బాధ్యతల వివరాలు.. ఆంటోనీ - సరిహద్దులు, రక్షణ సంస్థల వ్యవహారాలు షిండే - హైదరాబాద్, ఉమ్మడి రాజధాని యంత్రాంగం ఏర్పాటు మొయిలీ - న్యాయవ్యవహారాలు ఆజాద్ - విద్య, వైద్య, ఉపాధి నారాయణస్వామి - ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహారాలు జైరాం రమేష్ - వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు, స్పెషల్ ప్యాకేజీ , జలవనరుల పంపిణీ చిదంబరం - ఆర్థిక వ్యవహారాలు -
'దిగ్విజయ్ , షిండేల విరుద్ధ ప్రకటనల వెనుక ఉద్దేశ్యమేమిటి?
హైదరాబాద్: విభజన అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఓ ప్రకటన చేస్తే..కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో ప్రకటన చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదని ఏపీ ఎన్జీవోలు ప్రశ్నించారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి రాజ్యాంగ పరమైన అహగాహన ఏమీ లేనట్లుందని ఎద్దేవా చేశారు. ఈ రకంగా ముందుకెళితే కాంగ్రెస్ కు సీమాంధ్రలో రాజకీయ భవిష్యత్ ఉండదని ఏపీఎన్జీవోలు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఎంవో విధానం లోప భూయిష్టంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. విభజనను అడ్డుకుంటామంటున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యాంధ్ర కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. . విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీఎన్జీవోలు ఎమ్మెల్యేలకు లేఖలు విడుదల చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కేంద్ర కార్యాలయాల ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కలిసి సమైక్య నినాదం వినిపించాలని కోరతామన్నారు -
తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: షిండే
-
తెలంగాణ బిల్లు మాత్రమే అసెంబ్లీకి: సుశీల్‌కుమార్ షిండే
కేంద్ర మంత్రివర్గ తీర్మానం రాదు స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి షిండే సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు మాత్రమే రాష్ట్ర అసెంబ్లీ ముందుకు వస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్పష్టం చేశారు. అదీ రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం నివేదిక అందించిన తరువాత, ఆ నివేదిక ప్రాతిపదికగా రూపొందించిన బిల్లును రాష్ట్రపతికి పంపిస్తే, ఆయన అసెంబ్లీ పరిశీలన కోసం రాష్ట్రానికి పంపిస్తారని వివరించారు. హోం మంత్రిత్వ శాఖ నెలవారీ నివేదికను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ తీర్మానాన్ని శాసనసభకు పంపుతారని, ఆ తర్వాత తెలంగాణ బిల్లు మరోసారి అసెంబ్లీకి వెళ్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చేస్తున్న ప్రకటనలకు విరుద్ధంగా షిండే వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘సాధారణంగా అయితే, రాష్ట్ర శాసనసభల తీర్మానాల ఆధారంగా రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ అంశాన్ని పెండింగ్‌లో ఉంచింది. దాంతో కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ జీవోఎం రూపొందించిన నివేదిక ఆధారంగా తయారయ్యే బిల్లును రాష్ట్రపతికి పంపిస్తాం. ఆయన దానిని రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అసెంబ్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతాం’ అని షిండే వివరించారు. కాగా, తెలంగాణ నిర్ణయం హడావుడిగా తీసుకున్నది కాదని, సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామని షిండే పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై వెనక్కుతగ్గబోమని, సాధ్యమైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరిస్తే ఏం చేయాలన్నదానికి రాజ్యాంగంలోనే పరిష్కార మార్గాలున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే చెప్పలేం..! పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే విషయంపై హోంమంత్రి స్పష్టత నివ్వలేదు. ఆ విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంపై కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. నివేదిక రూపకల్పనపై మొదట్లో విధించిన 6 వారాల గడవును జీఓఎం విధివిధానాల జాబితా నుంచి తొలగించడంపై షిండే వివరణ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేసేందుకే గడవు అంశాన్ని తొలగించామన్నారు. జీఓఎం ఎవరెవరితో సంప్రదింపులు జరపాలన్న విషయాన్ని త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ఏడుగురు కేంద్రమంత్రులతో ఏర్పాటైన జీవోఎం శుక్రవారంనాడు సమావేశం కానున్నదని తెలిపారు. బాబు మాటకు విలువిచ్చే ఆ నిర్ణయం! ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై షిండే వ్యంగంగా స్పందించారు. ‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని విస్పష్టమైన తీర్మానం చేసింది. అదే అభిప్రాయాన్ని అఖిలపక్షంలోనూ పునరుద్ఘాటించింది. వారి మాటకు విలువిచ్చే మా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది’ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఏపీభవన్ ఆవరణలో దీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడును అక్కడి నుండి తొలగించేందుకు కేంద్రం చొరవ తీసుకునేందుకు హోం మంత్రి విముఖత వ్యక్తం చేశారు. ‘ఎవరైనా తమ ప్రాంగణంలో అనుమతి లేకుండా చొరబడ్డారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తే వారు కోర్టుకు వెళ్లి బయటకు పంపేందుకు ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు. ఆ ఆదేశాలను అమలుకు అవసరమైన సహాయం చేస్తాం’ అన్నారు. రాష్ట్ర ప్రాతినిధ్యం లేకపోయినా నష్టం లేదు మంత్రుల బృందం, ఆంటోనీ కమిటీ వేరువేరని షిండే తెలిపారు. ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగా, జీఓఎంను ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వమని వివరించారు. విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై ప్రశ్నించగా..దాని వల్ల నష్టమేమీ లేదని, ఎవరికి స్థానం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. సీమాంద్రుల అన్ని సమస్యలకు జీఓఎం పరిష్కారం చూపిస్తుందన్న విశ్వాసాన్ని షిండే వ్యక్తం చేశారు. రాజధాని ఎక్కడో.. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు అది ఆ ప్రాంత ప్రజలు, నేతలు నిర్ణయించుకోవాల్సిన విషయమని స్పష్టంచేశారు. ‘గతంలో ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది, గుంటూరులో హైకోర్టు ఉండేదని మంత్రివర్గానికి సమర్పించిన కేబినెట్ నోట్లో పేర్కొన్నాం, కానీ, ఇప్పుడు రాజధానిని ఎక్కడ నెలకొల్పుకోవాలనుకొంటారో చూద్దాం’ అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజకీయ కారణాలతో తీసుకున్నదిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. విభజన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని, జస్టిస్ శ్రీకష్ణ కమిటీ అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిందని, సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత అన్నీ ఆలోచించి తీసుకొన్న నిర్ణయమని షిండే వివరించారు. తాను హోంశాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించానని, అక్కడ కూడా ఎవరూ విభజనను వ్యతిరేకించలేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి,భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు పెరిగాయని, అయితే వాటిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమన్నారు. -
రాహుల్ ప్రధాని కావాలి: షిండే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని హోంమంత్రి సుశీల్ కుమార్‌షిండే అన్నారు. గురువారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో యువత చేతుల్లోకే అధికారంలోకి వస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘అవును. ఆయన సరిగ్గా చెప్పారు. మా కోరిక కూడా అదే. రాహుల్‌ను దేశ ప్రధానిగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు..’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో యువతదే అధికారమని ప్రకటించిన రాహుల్ వ్యాఖ్యలపై షిండే ను ప్రశ్నించగా తాము కూడా అదే కోరుకుంటున్నామని తెలిపారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి యువతకు అధికారమివ్వాలని రాహుల్ వ్యాఖ్యనించిన తెలిసిందే. 2014 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అప్పుడు కూడా పేదలు, సామాన్య ప్రజల ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. యువకులతో కూడిన ప్రభుత్వం వస్తుంది. అది దేశ గతినే మార్చేస్తుంది. ప్రతి ఒక్కరూ సాధికారత సాధించేలా మార్పును తీసుకొస్తుంది’ అని పేర్కొన్నారు. -
'దిగ్విజయ్,షిండేలు నిజాలు వక్రీకరిస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలైన దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు నిజాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు గురువారం న్యూఢిల్లీలో ఆరోపించారు. తెలంగాణాకు అనుకూలమని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని వారు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మాత్రం ప్రస్తావించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్పార్సీ గురించి మాత్రమే చెప్పారని వారు గుర్తు చేశారు. కోర్ కమిటీలో ఉన్న నేతలంతా కేంద్ర మంత్రివర్గ బృందంలో ఉన్నారని చెప్పారు. తమకు మంత్రుల కమిటీపై నమ్మకం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోబియాలో ఉన్నారని ఎద్దెవా చేశారు. సమైక్యమా లేక తెలంగాణాకు అనుకూలమా అనేది ముందుగా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రపతి పాలన.. ఇప్పటికైతే లేదు: సుశీల్ కుమార్ షిండే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్ర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు. మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని షిండే పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి, భద్రతల పరిస్థితి కేంద్రం జోక్యం చేసుకోవాల్సినంతగా విషమించలేదన్నదే తన అభిప్రాయమని చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నామని, విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని షిండే వివరించారు. అవసరమైతే ఇందుకోసం విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) ప్రయోగిస్తామని అన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ కుప్పకూలవచ్చన్న భయాందోళనలు అవసరం లేదన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతాం విభజన అనంతరం తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని షిండే చెప్పారు. సీమాంధ్ర యువతీ, యువకులకు విద్య, ఉద్యోగ అవకాశాలకు చట్టబద్ధమైన గ్యారంటీలు కల్పిస్తామని తెలిపారు. నదీజలాలు, విద్యుదుత్పత్తి, పంపిణీ, ఉద్యోగుల ఆందోళనలు.. తదితర సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే ప్రక్రియను కేంద్ర మంత్రుల బృందం ప్రారంభించిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు అంగీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పుడు నిరాహారదీక్షలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తావనకు రాని ‘ఉద్రిక్త పరిస్థితి’ ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి ప్రస్తావనకు రాలేదని తెలిసింది. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి సోమవారం ప్రధానితో సమావేశమైన హోం మంత్రి షిండే రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయనకు నివేదికను సమర్పించినట్లు సమాచారం. -
షిండే ఆదేశాలను తుంగలో తొక్కండి
తమ సీఎంలకు బీజేపీ సూచన బెంగళూరు: ఉగ్రవాదం పేరుతో అమాయకులైన ముస్లిం యువతను వేధించవద్దని కేంద్ర హోంమంత్రి షిండే ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడవేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. షిండే దేశానికి హోం మంత్రా లేక ఒక మతానికి హోంమంత్రా అని బీజేపీ సూటిగా ప్రశ్నించింది. బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, షిండేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విభజించి పాలించే ఎజెండాతో పనిచేస్తున్నదని విమర్శించారు. షిండే ఆదేశాలు లౌకికవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనవన్నారు. దేశంలో అమాయకులెవరూ అరెస్ట్ కాకుండా చూడడమే సరైన విధానమన్నారు. షిండే మాత్రం అమాయకులైన ముస్లింలను మాత్రమే అరెస్ట్ చేయవద్దని సూచించడం, పైగా దానిని సమర్థించుకోవడం దారుణమన్నారు. అందుకే షిండే ఆదేశాలను చెత్తబుట్టలో వేయాలని సూచిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు. -
సీమాంధ్రుల మనోభావాలను గౌరవిస్తాం : సుశీల్ కుమార్ షిండే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రజాందోళన కేంద్రాన్ని తీవ్రంగా కలవరపరుస్తోం ది. సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ తీవ్రతరమౌతుండడం, విద్యుత్ సమ్మెతో దక్షిణాది గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉండడంతో సీమాం ధ్రుల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని, విభజనానంతరం ఎదురయ్యే వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణపై మంత్రుల బృందం (జీఓఎం) ప్రాథమిక చర్చల అనంతరం ఆర్థిక మంత్రి చిదంబరం, సిబ్బంది శాఖ మంత్రి నారాయణ స్వామితో కలిసి ప్రధానితో సమావేశమైన అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశం అత్యంత సున్నితమైనదని అంగీకరించిన ఆయన సీమాంధ్ర ప్రజల భయాందోళనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొంటుందని హామీ ఇచ్చారు. విభజన కారణంగా సీమాంధ్రుల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, ప్రభుత్వోద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, సీమాంధ్ర విద్యార్థు లు, యువతకు హైద్రాబాద్‌లో విద్య, ఉద్యోగ అవకాశాలు, మరీముఖ్యంగా హైద్రాబాద్‌లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకొన్న సీమాంధ్రులకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని షిండే వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన స్టేక్హోల్డర్లతో అన్ని అంశాలపై మంత్రుల బృందం సంప్రదింపులు జరిపి అత్యుత్తమ పరిష్కారమార్గాలను కనుగొనేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వోద్యోగులు సమ్మె విరమించి ప్రభుత్వంతో సహకరించాలని షిండే విజ్ఞప్తి చేశారు. -
విభజనపై చర్చకు వచ్చిన మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సోమవారం తొలిసారిగా సమావేశమైంది. అయితే, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునితో ఏర్పాటైన జీఓఎం సమావేశానికి ముగ్గురు మాత్రమే హాజరు కావడంతో పరిశీలనాంశాలపై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి మాత్రమే పాల్గొన్నారు. ఈ కమిటీ సభ్యుడైన మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి పల్లంరాజు మంత్రి పదవికి రాజీనామా సమర్పించినందున ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. రాష్ట్రవిభజన ప్రక్రియలో రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడంతో పాటు ఆస్తులు, అప్పుల పంపకం, సిబ్బంది, నిధుల కేటాయింపులు, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీతో పాటు ఉమ్మడి రాజధాని నగర పరిపాలనా వ్యవస్థ స్వరూప స్వభావాలు, అన్ని ప్రాంతాల ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం, తగిన భద్రత కల్పించడం వంటి పలు అంశాలను లోతుగా అధ్యయనం చేసి మంత్రుల బృందం ఆరు వారాల్లో కేంద్ర మంత్రివర్గానికి నివేదించా ల్సి ఉంది. జీఓఎం అధ్యయనం చేయాల్సిన వివిధ అంశాలపై ఆయా మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన నిపుణులతో కూడిన ఉపసంఘాలను ఏర్పాటు చేసే విషయమై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గానికి జీఓఎం సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర విభజన బిల్లును రూపొందిస్తారు. మంత్రివర్గం ఆమోదించే బిల్లు ముసాయిదాను రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా తిప్పిపంపాలనే ఆదేశంతో రాష్ట్రపతి దానిని రాష్ట్ర శాసనసభకు పంపుతారని, అసెంబ్లీ అభిప్రాయాలతో కేంద్రానికి తిరిగి వచ్చే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాదీ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమై డిసెంబర్ 24లోగా ముగిసే శీతాకాల సమావేశాల షెడ్యూలులో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల దృష్ట్యా స్వల్పమార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. -
సీమాంధ్ర కేంద్రమంత్రుల రాజీనామా?
ఢిల్లీ: తెలంగాణ నోట్ పై కేంద్రమంత్రి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ మింగుడుపడని అంశంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ విడుదలకు ముందు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావుల మాత్రమే పాల్గొన్నారు. మిగతా సీమాంధ్ర మంత్రులు సమావేశానికి దూరంగా ఉండి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, చిరంజీవిలు రాజీనామా చేసి కాంగ్రెస్ పై నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమంలో పయనిస్తుండటంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో అత్యధికం శాతం మంది రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. ఒకప్రక్క ప్రజలు, మరోప్రక్క ఏపీఎన్జీవోల నుంచి అధిక స్థాయిలో ఒత్తిడి ఉండటంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయలేనపుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్‌గా తెలంగాణ నోట్‌పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్‌పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ నోట్ ను ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి
-
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. సమావేశం రెండు గంటలసేపు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను పల్లంరాజు, కావూరి సాంబశివరావులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ముఖ్య అంశాలు: *తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది *29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం * సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మండలి యథాతథంగా ఆమోదించింది. *నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్రం ఏర్పాటు *హైదరాబాద్‌తోపాటు పది జిల్లాలతో కూడిన తెలంగాణ *తెలంగాణకు 17, ఆంధ్ర ప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలు తెలంగాణకు 8, ఆంధ్ర ప్రదేశ్‌కు 10 రాజ్యసభ స్థానాలు *పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ *ఆస్తులు, అప్పులపై బ్లూప్రింట్‌లో ప్రస్తావన * విభజన సమస్యల పరిష్కరానికి మంత్రుల బృందం ఏర్పాటు *త్వరలో మంత్రుల బృందం ఏర్పాటు కేంద్ర మంత్రి మండలి తీర్మానాన్ని హొం శాఖ రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తరువాత అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ: షిండే ప్రతిపాదన
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందు ఉంచారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటన్నరసేపు జరిగింది. సమావేశానికి రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్‌గా తెలంగాణ నోట్‌పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్‌పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆ నోట్లో ప్రతిపాదించారు. అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు పది సంవత్సరాలపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉండేటట్లు నోట్ రూపొందించారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరాలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. నోట్‌పై చర్చించిన తరువాత దీనిని మంత్రుల బృందం పరిశీలనకు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రుల బృందం పరిశీలించిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ బయటకు వచ్చారు. సమావేశంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ధృవీకరించారు. -
టీ.నోట్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు
వైఎస్సార్ జిల్లా: తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సమైక్య ఆందోళన కారులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. సీమాంధ్రలో తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా.. కేంద్రం వాటిని పట్టించుకోకుండా తెలంగాణ నోట్ ను రూపొందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో సమైక్య వాదలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నేటి అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు బంద్ పాటించడానికి మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మల్లికార్జున రెడ్డిలు పిలుపునిచ్చారు. కాగా, కమలాపురం, రాజంపేటలలో శుక్రవారం నుంచి బంద్ పాటించనున్నారు. ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ కు సమైక్య వాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సంతకం చేసిన వెంటనే చిత్తూరు జిల్లా తిరుపతి రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రవాణా వ్యవస్ధకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీనోట్‌కు వ్యతిరేకంగా కడప ఏడు రోడ్ల సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మానవహారం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేశారు. టీనోట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం రణస్థలం వద్ద జాతీయరహదారిని దిగ్బంధించారు. పలాసలో సమైక్యవాదుల ఆందోళనలు చేపట్టి ఆ నోట్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మంత్రి పితాని సత్యనారాయణ కారును సమైక్యవాదులు అడ్డుకుని రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్‌పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్‌పై చర్చిస్తారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ నోట్‌పై సంతకం చేసిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్‌పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షిండే సంతకం చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్‌పై చర్చిస్తారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ నోట్‌పై సంతకం చేయలేదు: షిండే
ఢిల్లీ: కేబినెట్ నోట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు ఊహాగానాలేనన్నారు. తెలంగాణ నోట్‌పై తానింకా సంతకం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ అనుమతి కోసం వేచి చూస్తున్నామని షిండే పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేయటం.... నోట్‌పై తాను సంతకం చేయలేదనటంతో.... సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందా....లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. -
తిరస్కారమే పురస్కారమా?
ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి వారంతా దానికి మద్దుతు పలికినవారే. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం. ఎన్నికల మహా సంరంభపు జాతరలో గలీజు గణాం కాలు ఊరేగటం మనకు సుపరిచితమే. ఇక కుయుక్తుల మాటకొస్తే అది మరో కథ. మిట్టమధ్యాహ్నపు ఎండలో గారడీవాడు ప్రదర్శించే కనికట్టుకూ, అమాస రాత్రి స్మశానంలో భూత మాంత్రికుడు సాగించే అన్వేషణకూ ఉన్నంత తేడా ఆ రెంటికీ మధ్యన ఉంది. బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాలుకు ప్రతిగా కాంగ్రెస్ సమన్వయంతో సాగిస్తున్న ఎదురుదాడిలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం గణాంకాల చేత శీర్షాసనం వేయించారు. ఆ విషయంలో బీజేపీ తాను ఒంటరిన ని భావించనవసరం లేదు. దానికి తోడు ప్రణబ్‌ముఖర్జీ ఉన్నారు. చిదంబరం తనకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అలాంటి ఎత్తుగడలనే ప్రయోగించారు. అయితే ఈసారి చిదంబరం చూపిన హస్తలాఘవం విభిన్నమైనది. ఎన్డీఏ, యూపీఏ పాలనా కాలాల వృద్ధి రేట్లను ఆయన... వృద్ధి ఊర్ధ్వ ముఖంగా సాగుతున్నదా లేక అథోముఖంగా పయనిస్తున్నదా అనే ప్రస్తావనే లేకుండా మధ్యంతర కాలపు సగటులను సరిపోల్చారు. కొండమీదికి ఎక్కుతున్నా, దిగువకు పోతున్నా సగటు ఎత్తు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఎన్డీఏ తనకు సంక్రమించిన అధ్వాన్నపు వృద్ధి రేట్లను 8 శాతానికి పైకి తీసుకుపోయింది. ఉన్నతస్థాయి వృద్ధి రేట్లతో ప్రారంభించిన యూపీఏ ఎగుడు దిగుడుల మధ్య వాటిని కిందకు దిగజార్చింది. చిదంబరం వాదనలు కాంగ్రెస్ పక్షపాతుల కేరింతలను దాటి పయనించలేవు. విలువ కోల్పోయిన ఆదాయాలతో కూరగాయలను కొనుక్కునే ఓటర్‌కు అసలు నిజం తెలుసు. అధికార పక్షపు కుయుక్తుల శాఖ నడిపేది మరింత విషపూరితమైన వ్యవహారం. జల్లిన బురద కొద్దిగానైనా అంటుకోకపోతుందా అనే భావనతో అది ఆరోపణలను తయారుచేస్తుంది. అయితే బురదను జల్లేప్పుడు మీ చేతులు కూడా మలినం కాక తప్పవు. కుయుక్తుల శాఖ జిత్తులమారి ఎత్తుగడలు ప్రజల్లో చెల్లుబాటు కావు. ఇవి యూపీఏ పోరాడుతున్న మొదటి ఎన్నికలేమీ కావు. నేటితో పోలిస్తే 2009 ఎన్నికల ప్రచారం దివ్యమైన పరిశుద్ధతను నేర్పే పాఠం లాంటివి. శత్రువుల జాబితాను తయారుచేసి, వారిపైకి బురదజల్లే బ్రిగేడ్‌ను సమీకరించక తప్పని స్థితిలో నేడు అధికార పార్టీ ఉంది. 2009లో సైతం యూపీఏకు ఆందోళన కలిగించిన అంశాలు లేకపోలేదు. వాటిలో ‘ఓటుకు నోటు’ కుంభకోణం తక్కువదేమీ కాదు. అయినాగానీ ఆనాడు కాంగ్రెస్ వద్ద చెప్పుకోడానికి సానుకూలమైన కథనం కూడా ఉండేది. యువతరంలో అది ఆశలను రేకెత్తించగలిగింది. ఆ ఆశలన్నీ ఇప్పుడు బుగ్గయి పోయాయి. ఎన్నికలపరమైన దాని పర్యవసానాలు రోజురోజుకు ప్రస్ఫుటమవుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు హానికరమైన నష్టాన్ని కలుగజేస్తున్నది అధికార వ్యవస్థలో నెలకొన్న పూర్తిస్థాయి గందరగోళమే. ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్‌పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. శిక్షలుపడ్డ రాజకీయ నేతల ఆర్డినెన్స్ విషయంలో ఆ పార్టీలో నెలకొన్న అయోమయం, హఠాత్తుగా పార్టీ వైఖరి తలకిందులు కావడం ఆ గందరగోళంలోని ఒక సంచలనాత్మక ఘటన మాత్రమే. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి భారీ వస్తాదులంతా దానికి మద్దుతు పలికినవారే. రాహుల్ భాషను చూస్తే ఒకింత ముందస్తుగా సన్నద్ధమై మాట్లాడినట్టుఉంది. ఆయన మాటలు అత్యున్నత విధానపరమైన వివాదంగా కంటే క్రీడా మైదానంలో మాటకు మాట విసరడం లాగే ధ్వనించాయి. ఏదేమైనా, అదే కాంగ్రెస్ అభిప్రాయం. అయితే మన్మోహన్ తన మంత్రివర్గ సహచరులతో సహా వెంటనే రాజీనామా చేయాలి. ప్రధాన మంత్రికి, అధికార పార్టీకి మధ్య అలాంటి యుద్ధం ఇంతకు మునుపెన్నడూ ఎరుగనిది. అయితే వ్యవహారం అంతవరకు రాకపోవచ్చు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరిలోని మార్పునకు కారణం రాజకీయాలే తప్ప సూత్రబద్ధత కాదు, మంత్రివర్గం ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు రాహుల్‌గాంధీ దానిని వ్యతిరేకించ లేదు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారిన తరువాత, ఆ ఆర్డినెన్స్‌పై హడావిడిగా సంతకం చేయాల్సిన అవసరం లేదని నమ్మడానికి తగిన కారణాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపిన తర్వాత ఆయన దాన్ని వ్యతిరేకించారు. దాదాపు దశాబ్ద కాలంగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ వ్యక్తిగత ప్రతిష్టలోని చివరి పెచ్చులు కూడా నుగ్గునుగ్గు కావడం చూడాల్సిరావడం ఇబ్బందికరమే. పాకిస్థాన్‌తో శాంతిని సాధించడానికి, అమెరికాతో గతిశీలమైన నూతన సంబంధాలను నెలకొల్పడానికి మన్మోహన్ చొరవ చూపారు. ఆ రెండు దిశలుగా ఆయన చేసిన కృషి ఒక్కసారే బోర్లపడింది. ఈ వారం అమెరికాలోనే అది తారస్థాయికి చేరడం కాకతాళీయమే. మన్మోహన్ శ్వేతసౌధ సందర్శన ఎలాంటి లక్ష్యాలు లేని పదవీ విరమణ విందులాగా సాదరపూర్వక మైనదే. ఇక నవాజ్ షరీఫ్‌తో ఆయన సంభాషణలు ప్రారంభం కావడానికి ముందే జమ్మూలోని ఉగ్రవాద రక్తపాతంతో నెత్తురోడాయి. మొదటిది ఏ ప్రాధాన్యమూ లేని ఘటన కాగా, రెండోది అసలు మొదలు కానే లేదు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ప్రధానికి భంగపాటు కలిగించేదిగా లేదా కలిగించాల్సిందిగా ఉంది. పాకిస్థాన్‌తో చర్చల నుంచి కాంగ్రెస్ దూరంగా జరిగింది. అంబికాసోనీ వంటి నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని తెలిపారు. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, ప్రధాని మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం. మన్మోహన్ ఒక విరాగా లేక గాయాల బాధను ప్రేమించే విపరీత మనస్తత్వం గలవారా? ప్రతిపక్షం చేతిలో దండనకు గురికావడం ఇచ్చిపుచ్చుకునే ప్రజాస్వామిక రాజకీయాల్లో భాగం. సొంత పార్టీ సహచరుల నుంచే తిరస్కార అస్త్రాలకు గురి కావడాన్ని అంగీకరించడం సామాన్యం కాదు. అంత తేలికగా అంతుపట్టని స్వభావం అందుకు అవసరం. మన్మోహన్ బహుశా తాను పయనిస్తున్న నావను కల్లోలానికి గురిచేయరాదని భావిస్తుండవచ్చు. కానీ ఆ నావను నడిపే నావికులే దాన్ని పెను తుఫానులోకి నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా మిగిలి లేదు. మనకు ఉన్నదల్లా అనిశ్చితితో కూడిన వాదోపవాదాల్లో తాము ఎక్కడ నిలిచి ఉన్నారో లేదా ఎక్కడ నిలవాలో ఏ మంత్రికీ ఖచ్చితంగా తెలియని పరిస్థితి మాత్రమే. ఒక సాంకేతికమైన నిర్మాణం మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా ఎన్నికల్లో ఘోర పరాజయన్ని నివరించే అద్భుతం ఏదైనా జరగాలని ఇంకా ఆశిస్తూనే ఉంది. అద్భుతాలు జరగాలంటే పరమ పవిత్రులు కావాలి. రాజకీయాల్లో పరమ పవిత్రులు ఉండరు. -
ఎవరి వాదన వారిదే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే వద్ద మరోమారు ఇరు ప్రాంత నేతలు ఎవరి వాదనలు వారు వినిపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు షిండేను గట్టిగా కోరగా, సీమాంధ్ర అభ్యంతరాలను పరిశీలిస్తున్న ఆంటోనీ కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు ప్రక్రియపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్రమంత్రులు విన్నవించారు. ప్రక్రియ నెమ్మదించడంతో తెలంగాణ ప్రాంతంలో లేని అపోహలు కలుగుతున్నాయని, ఈ దృష్ట్యా వీలైనంత త్వరగా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మాత్రం కమిటీ నివేదించే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేబినెట్ నోట్‌పై ఓ నిర్ణయానికి రావాలని కోరారు. షిండే మాత్రం ఇరు ప్రాంత నేతల్లో ఎవరికీ ఏ హామీ ఇవ్వలేదు. కాకపోతే నోట్ ఇప్పటికే తయారైందనే సంకేతం మాత్రం ఇచ్చారు. అయితే నోట్లో ఏముందో తాను చూడలేదని, దానిపై తానింకా సంతకం కూడా చేయలేదని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌పై మూడు రకాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయంటూ వస్తున్న వార్తలను తెలంగాణ నేతల వద్ద షిండే తోసిపుచ్చినట్టు కూడా తెలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని షిండే చెప్పినట్టు తెలంగాణ నేతలు తెలిపారు. షిండేతో మొదట తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడి 55 రోజులు గడుస్తున్నా ప్రక్రియపై కేంద్రం స్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంతో తెలంగాణలో ఆందోళనలు నెలకొన్నాయని, అపోహలు కలుగుతున్నాయని దామోదర, జానా చెప్పారు. ఇక ఆలస్యం చేయకుండా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించారు. ‘దానిపై మూడు ప్రతిపాదనలు హోంశాఖ ముందున్నాయంటూ భిన్న వార్తలు వస్తున్నాయి. కానీ సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణే ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఏది చేసినా తెలంగాణకు నష్టమే’ అని వివరించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా హైదరాబాద్ రెవెన్యూ పరిధికే పరిమితం చేయాలని కోరారు. మూడు ప్రతిపాదనలు మీడియా సృష్టేనని షిండే చెప్పారు. ‘అలాంటి ప్రతిపాదనలేవీ మా ముందు లేవు. అసలు కేబినెట్ నోట్‌ను నేనింకా చూడలేదు. దానిపై సంతకమూ చేయలేదు’ అని అన్నట్టు సమాచారం. తెలంగాణ నోట్‌ను వీలైనంత త్వరగా కేబినెట్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తామని కూడా అన్నారని చెబుతున్నారు. విభజన తర్వాత శాసనమండలి రద్దవుతుందన్న వార్తలను కొందరు ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. యూపీ, బీహార్‌ల్లో విభజన తర్వాత కూడా మండలిని కొనసాగించారని, రాష్ట్రంలోనూ అలాగే చేయాలని కోరారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం జిల్లా నేతలు కోరారు. అనంతరం కొందరు తెలంగాణ నేతలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిశారు. తారసపడ్డ కిరణ్, తెలంగాణ నేతలు: షిండేతో భేటీ ముగించుకుని తెలంగాణ నేతలు బయటకు వస్తున్న తరుణంలో కిరణ్, మంత్రులు బాలరాజు, పితాని సత్యనారాయణ హోం శాఖ కార్యాలయంలోకి వెళ్లారు. డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి మినహా మరెవరూ కిరణ్‌ను పలకరించలేదు. సీమాంధ్రలో సమైక్యోద్యమం ఉధృతంగా ఉన్నందున విభజనపై ఎలాంటి ముందడుగేసినా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని షిండేకు కిరణ్ వివరించారు. కాబట్టి ప్రక్రియను మరికొంత కాలం ఆపాలని, కనీసం ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకానైనా ముందుకు పోరాదని కోరినట్టు తెలిసింది. హైదరాబాద్‌పైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. అన్ని హంగులతో అభివృద్ధి చెందిన హైదరాబద్‌ను వదులుకునేందుకు సీమాంధ్రులు ఏమాత్రం సిద్ధంగా లేరని కిరణ్ చెప్పారంటున్నారు. భేటీకి ముందు సీమాంధ్ర ఎంపీలు, బొత్స ఏపీభవన్‌లో కిరణ్‌తో చర్చించారు. ‘రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రయోజనముండదు. విభజనపై కేంద్రం వెనక్కు తగ్గదని స్పష్టంగా తెలుస్తున్న తరుణంలో రాజీనామాలెందుకు?’ అని కిరణ్ అన్నట్టు తెలిసింది. భేటీ సమయంలోనే బయటకు వచ్చిన సీబీఐ డెరైక్టర్: షిండేతో కిరణ్ భేటీ అయిన కాసేపటికే సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా హోంశాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చారు. పలు కేసుల విషయమై హోం శాఖ కార్యదర్శి గోస్వామితో ఆయన భేటీ అయ్యారని తెలిసింది. కిరణ్‌కు దొరకని సోనియా అపాయింట్మెంట్: కిరణ్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ లభించలేదు. ఎన్ఐసీ సమావేశంలో, రాజస్థాన్ ఎన్నికల ప్రచారం తదితరాలతో ఆమె తీరిక లేకుండా ఉండటమే కారణమని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. సోనియాను కలవకుండానే మంగళవారం సాయంత్రం కిరణ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు. -
తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయండి: జానారెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో హోం మంత్రి షిండేను కలిశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయనకు సూచించినట్లు జానారెడ్డి చెప్పారు. గతంలో తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న తీర్మానం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని షిండేకు విన్నవించినట్లు జానారెడ్డి చెప్పారు. -
బాబూ.. తెలంగాణకు లేఖ ఇచ్చారుగా!
* ఎన్ఐసీలో చంద్రబాబును నిలదీసిన షిండే * అసహనంతో బాబు వాకౌట్ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సమగ్రతా మండలి సమావేశం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాకౌట్ చేశారు. దీనికి కారణం.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రసంగిస్తున్న చంద్రబాబును.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆయన కేంద్రానికి రాసిన లేఖ గురించి హోంమంత్రి షిండే ప్రస్తావించటమేనని తెలియవచ్చింది. ఎన్ఐసీ సమావేశానికి హాజరైన చంద్రబాబు తనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయాన్ని ఎజెండాలోని అంశాలపై మాట్లాడేందుకు వినియోగించుకున్న తర్వాత.. రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు మరో రెండు నిమిషాల సమయాన్ని కేటాయించాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఇందుకు సభాధ్యక్షుని అనుమతి కోసం వేచిచూడకుండానే.. కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని, ఎవరితోనూ సంప్రదించకుండా రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించినట్లు సమాచారం. షిండే జోక్యం చేసుకొని ఎజెండాలో లేని అంశాలపై ఎన్ఐసీలో చర్చ జరపటం సంప్రదాయం కాదంటూ ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. అయినా చంద్రబాబు వినకపోవటంతో ఆర్థికమంత్రి చిదంబరం జోక్యం చేసుకుని తెలంగాణ అంశాన్ని మరో వేదికపై చర్చిద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. అప్పటికీ చంద్రబాబు వినకుండా తన వాదనను కొనసాగిస్తుండటంతో షిండే మరోసారి కల్పించుకొని.. ‘చంద్రబాబు నాయుడు గారూ.. గతంలో మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు గదా! ఇప్పుడు ఇలా మాట్లాడతారేమిటి?’ అని నిలదీయటంతో పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఫక్కున నవ్వారని తెలిసింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన చంద్రబాబు రాష్ట్ర విభజన అంశంపై తానిప్పుడు ఎలాంటి కొత్త వైఖరిని చేపట్టటం లేదని చెప్పారని.. తెలుగు ప్రజల భవితవ్యానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతించకుండా తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నానని చెప్పి నిష్ర్కమించినట్లు తెలియవచ్చింది. అయితే.. సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్ఐసీ అజెండాలో లేని అంశంపై మాట్లాడటాన్ని తప్పుపడుతూ ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి షిండేలు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని తప్పుపట్టారు. రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితులు తొలిగించటానికి తాను మాట్లాడే ప్రయత్నం చేయగా సోనియాగాంధీ సైగలు చేశారని.. చిదంబరం, షిండేలు అడ్డుకున్నారని ఆరోపించారు. -
‘టీ నోట్’ ముసాయిదా మాత్రమే సిద్ధమైంది: షిండే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను ఇంకా ఖరారు చేయలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. దాని తాలూకు ముసాయిదా మాత్రమే సిద్ధమైందని సోమవారం వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం చోటుచేసుకోలేదన్నారు. దాంతో ఈ భేటీలో నోట్ ప్రస్తావన గానీ, దానిపై చర్చ గానీ ఉండబోవని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ విదేశీ పర్యటన తర్వాత అక్టోబర్‌లో మాత్రమే తెలంగాణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. సాధారణంగా కేంద్ర కేబినెట్ ప్రతి గురువారం సమావేశమవుతుంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని బుధవారం న్యూయార్క్ బయల్దేరుతున్నందున దాన్ని ముందుగానే నిర్వహిస్తున్నారు. మరోవైపు... ఎజెండాలో లేకపోయినా తెలంగాణ నోట్ ముసాయిదాను మంగళవారం నాటి భేటీలోనే మంత్రులందరికీ పంచుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానిపై చర్చ కూడా జరుగుతుందని కాంగ్రెస్ నేతల్లో మరికొందరు అంటున్నారు. ఇప్పటికే తయారైన 6, 7 పేజీల ముసాయిదాను వీలైనంతగా సంక్షిప్తీకరించి కేబినెట్ ముందు పెడతారని వారు చెబుతున్నారు. ఈ ముసాయిదానే కేంద్ర హోం మంత్రి సంతకంతో తుది నోట్ రూపంలో బహుశా అక్టోబర్ 3న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచుతారన్నది వారు చెబుతున్న మాట. ‘‘రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఎంతటి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. నోట్ కేబినెట్ ముందుకు వెళ్తే తక్షణం రాజీనామా చేసేందుకు కనీసం అరడజను మంది సీమాంధ్ర ఎంపీలతో పాటు ఆ ప్రాంతాలకు చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... అలాంటి పరిణామానికి కూడా అధిష్టానం సిద్ధంగానే ఉంది’’ అని ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సదరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీపైనే నెలకొంది. -
తెలంగాణ నోట్ ఇంకా రెడీ కాలేదు: హోం మంత్రి షిండే
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అంశానికి సంబంధించి నోట్ ఇంకా సిద్ధం కాలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. టీ.నోట్ సిద్దమైందని ఇక కేబినెట్ కు రేపో మాపో పంపుతామని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన షిండే మాట మార్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో షిండే సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణపై నోట్ ఇంకా రెడీ కాలేదని, కేవలం డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందన్నారు. తుది నోట్ ఇంకా సిద్ధం కాలేదన్నారు. తెలంగాణ నోట్ తన దగ్గరకు సంతకం కోసం రాగానే ఆ విషయాన్నిమీడియాకు చెబుతానాని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని గతంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించి సీమాంధ్ర నేతల్లో అలజడి రేపారు. దీంతో హస్తిన బాట పట్టిన నేతలు తెలంగాణ నోట్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో షిండే పెదవి విప్పారు. టీ.నోట్ ఇంకా సిద్ధం కాలేదని సీమాంధ్ర నేతలకు కాస్త ఊరట కల్గించారు. -
'తెలంగాణ రాష్ట్రం రాదు.... రాబోదు'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉద్యమం మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను వారు ఈ సందర్భంగా షిండే దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారు. భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను మరోసారి షిండేకు తెలిపామని, తెలంగాణపై ఇంకా నోట్ తయారు కాలేదని షిండే తమతో చెప్పారన్నారు. మరి కొద్దిరోజుల్లో ఆంటోనీ కమిటీ మరిన్ని చర్చలు జరుపుతుందన్నారు. ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకు వెళ్తామని షిండే తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదు, రాబోదని సీమాంధ్ర ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రత షిండేకే ముందే తెలుసునన్నారు. -
ఆదర్శ్ కేసులో సుశీల్‌కుమార్ షిండేకు క్లీన్చిట్
ముంబై: సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. షిండే 2003-2004 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొంది. ఈ మేరకు గురువారం బాంబే హైకోర్టుకు అఫిడవిట్ అందజేసింది. కార్గిల్ యుద్ధ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ముంబైలోని 32 అంతస్తుల ఆదర్శ్ సొసైటీ భవంతిలో షిండేకు రెండు బినామీ ఫ్లాట్లు ఉన్నాయని, ఆయనను నిందితుడిగా చేర్చాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ వతేగావ్కర్ గతంలో పిటిషన్ వేశారు. దివంగత మేజర్ ఎన్.డబ్ల్యూ ఖాంకోజీని సొసైటీ సభ్యుడిగా చేర్చుకోవాలని షిండే సిఫార్సు చేశారని తెలిపారు. షిండేకు, ఖాంకోజీ కుటుంబంతో సంబంధమున్నట్లు తమ దర్యాప్తులో తేలలేదని చెప్పింది. కేసు విచారణను కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. -
తెలంగాణ నోట్ రెడీ: షిండే
నేను ఇంకా ఆ ముసాయిదాను పరిశీలించలేదు.. వీలైతే శుక్రవారం హోంశాఖ అధికారులతో చర్చిస్తా హైదరాబాద్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నోట్ రూపొందించినా.. అది నేటి కేబినెట్ భేటీ ముందుకు రాకపోవచ్చంటున్న అధికారులు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. వైద్య పరీక్షలు, గణపతి నిమజ్జనోత్సవాల కోసం వారం రోజులకు పైగా ముంబైలో గడిపిన అనంతరం గురువారం ఢిల్లీ తిరిగి వచ్చిన షిండే నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదు. వీలైతే నోట్‌పై రేపు (శుక్రవారం) హోంశాఖ అధికారులతో చర్చిస్తా..’’ అని చెప్పారు. హైదరాబాద్ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించడం గమనార్హం. అత్యున్నత స్థాయిలో చర్చ తర్వాతే కేబినెట్ ముందుకు.. హోం శాఖ తెలంగాణపై ముసాయిదా నోట్ రూపొందించినప్పటికీ శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో జరగబోయే కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై అత్యున్నత స్థాయిలో లోతైన చర్చ జరిగిన తర్వాత, వివాదాస్పద అంశాలపై రాజకీయ నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే నోట్‌కు తుది రూపమివ్వడం సాధ్యమని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోట్ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు వెళ్తుందని చెబుతున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రమే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ప్రధాని అందుబాటులో లేని కారణంగా రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు సర్కులేట్ చేసిన సమావేశ అజెండాలో తెలంగాణ అంశం లేకపోయినప్పటికీ.. చివరి నిమిషంలో అనుబంధ చర్చనీయాంశాల జాబితాలో లేదా టేబుల్ ఐటమ్‌గా దీన్ని మంత్రివర్గం ముందుంచే అవకాశం లేకపోలేదని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. హోంశాఖ సమర్పించే ప్రాథమిక నివేదికను పరిగ ణనలోకి తీసుకున్న తర్వాత.. విభజన విషయంలో లోతైన అధ్యయనం, సంప్రదింపుల కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్‌పై మూడు ప్రత్యామ్నాయాలు? హైదరాబాద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షిండే వెల్లడించిన నేపథ్యంలో.. హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్లో ఏముందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలోనే షిండే ప్రకటించిన మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచి ఉంటారని, దీనిపై రాజకీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచించినట్లుగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చండీగఢ్ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలా లేదా ఢిల్లీ మాదిరిగా రాజధానిలో శాంతి భద్రతలు, రెవెన్యూ, పన్ను వసూళ్లను కేంద్రం అధీనంలో ఉంచాలా లేదా హైదరాబాద్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించి దేశానికి రెండో రాజధాని చేయాలా అన్న ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వెలువడడం తెలిసిందే. -
రేపు కేబినెట్లో తెలంగాణపై చర్చ లేదు
శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తన మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్ ముసాయిదా పరిశీలనకు తనకు సమయం లేదని, కేబినెట్ నోట్ ముసాయిదా మాత్రం సిద్ధమైందని ఆయన చెప్పారు. రేపు నోట్ ముసాయిదాను చూస్తానని వెల్లడించారు. అలాగే, తెలంగాణ నోట్‌ను కేంద్ర న్యాయశాఖకు కూడా పంపిస్తానని చెప్పారు. ఆంటోనీ కమిటీ నివేదికను కూడా కేబినెట్ సీరియస్‌గానే పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. కేబినెట్ నోట్‌ను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌ల ఆమోదం కోసం షిండే వారివద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ చాలా సమయం పడుతుంది కాబట్టి, శుక్రవారం నాటి సమావేశంలో తెలంగాణపై చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
తెలంగాణపై కేబినెట్ నోట్ రెడీ: షిండే
-
తెలంగాణపై కేబినెట్ నోట్ రెడీ: షిండే
ఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఆ నోట్‌ను ఈ రోజు పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెప్పారు. ఈ రోజు సాయంత్రం జరగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యమైన కేంద్ర మంత్రులు కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశం రేపటికి వాయిదాపడింది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. ఈ నోట్‌ను రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో పరిశీలనకు వస్తుందో, రాదో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత ప్రధానంగా హైదరాబాద్‌పైనే చర్చ జరుగుతోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ విషయంలోనే పీటముడి పడింది. ఆరు దశాబ్దాలుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌పై హక్కులు ఎవరివనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షిండే చెబుతున్నారు. హైదరాబాద్ విషయం తేలకుండా విభజన అంశం తేలడం కష్టం. -
షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్ర ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం తదితరులు దీనికి హాజరయ్యారు. రాష్ట్ర విభజన విషయమై ఆంటోనీ కమిటీ ఇప్పటికే ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో సమావేశం కావడం, ఆ వివరాలను కోర్ కమిటీ చర్చించాల్సి రావడం, మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించే అవకాశం ఉండటంతో కోర్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
'విద్రోహులకు నిర్భయ తీర్పు ఓ మరణశాసనం'
విద్రోహులకు నిర్భయ కేసు తీర్పు ఓ మరణశాసనమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. నిర్భయ సామూహిక అత్యాచార కేసులో నిందితులకు శుక్రవారం న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ సందర్భంగా హోం మంత్రి షిండేపై నిర్భయ కేసులో న్యాయస్థానం విధించిన తీర్పు పైవిధంగా స్పందించారు. క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి ఆ శిక్ష ఓ హెచ్చరికా లాంటిందని ఆయన తెలిపారు. నిర్భయ కేసులో న్యాయం జరిగిందన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. నిర్భయ కేసులో నిందితులు అమానవీయమైన చర్యలకు పాల్పడ్డారన్నారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ అధికారి ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు షిండే వివరించారు. మహిళలపై అత్యాచార కేసులు తమ శాఖ వద్ద ఏవి పెండింగ్‌లో లేవని హోం శాఖ మంత్రి షిండే తెలిపారు. -
విభజన ఆపమని షిండేకు విజయమ్మ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉన్నత పదవిలో ఉన్న మీరు వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని విజయమ్మ షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబర్ 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ ఎలా చెప్పగలదు? అని విజయమ్మ ప్రశ్నించారు. రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు. -
షిండేపై ధిక్కార నోటీసును తిరస్కరించిన కోర్టు
నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష పడొచ్చంటూ వ్యాఖ్యానించినందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై డిఫెన్స్ న్యాయవాదులు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసును కోర్టు తిరస్కరించింది. నిందితులు ముఖేష్, పవన్ గుప్తాల తరఫున వాదించిన డిఫెన్స్ న్యాయవాది ఈ మేరకు ఇచ్చిన నోటీసులను సాకేత్ ప్రాంతంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి యోగేశ్ ఖన్నా ఈ నోటీసును తిరస్కరించారు. నలుగురు నిందితులకు శిక్ష విధించే అంశంపై ఇరుపక్షాల వాదనలను సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం వింది. ఈ సందర్భంలోనే ముఖేష్ తరఫు న్యాయవాది వి.కె. ఆనంద్ షిండేపై కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చారు. కానీ అదనపు సెషన్స్ జడ్జి ఖన్నా మాత్రం ఆ పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించడంతో దాన్ని న్యాయవాది ఉపసంహరించుకున్నారు. -
అల్లర్ల వెనక రాజకీయ పార్టీల పాత్ర: షిండే
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ అల్లర్ల వెనక రాజకీయ పార్టీల పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ముజఫర్ నగర్ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 48కి చేరిన విషయం తెలిసిందే. కాగా అల్లర్లను అదుపు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించనున్నట్లు షిండే తెలిపారు. ముజఫర్‌నగర్‌లో శనివారం చోటు చేసుకున్న అల్లర్లలో దాదాపు 48 మంది మరణించగా, మరో 1000 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ తన కుమారుడు అఖిలేష్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
ఒకే మాట... ఒకే వైఖరి!
సందర్భం: ‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’ అని 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో స్పష్టంగా చెప్పాం. మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కి పోలేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది. గడిచిన నాలుగేళ్లుగా ఈ రాష్ట్రం దిక్కూ మొక్కూ లేని అనాధగా మిగిలింది. ఎప్పుడు ఏం జరు గుతుందో అంతుబట్టని పరిస్థితి. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఢిల్లీకి చెక్కర్లుకొట్టే నాయకులు... అం తా అనిశ్చితి. జనం గోడు పట్టిం చుకోకుండా నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండతో సర్కారును నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. అన్ని లెక్కలూ వేసుకుని కాంగ్రెస్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విభజన అంశం తెర మీదకు తెచ్చింది. ఆగమేఘాలపై యూపీఏ సమావేశం, అటు తర్వాత సీడబ్ల్యూసీ తీర్మానం పూర్తిచేసి రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించింది. ఇన్నాళ్లనుంచి తెలంగాణపై సమావేశాలు జరుగుతున్నా ఎక్కడా తన వైఖరేమిటో, దానికి ప్రాతిపదికేమిటో చెప్పని కాంగ్రెస్ ఉన్నట్టుండి నిర్ణయం వెల్లడించడంతో కోస్తా, రాయలసీమ ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాంతో ఆ నిందను ఇతర పార్టీలపై వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మీరు ఒప్పుకోబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం కావడం... ఎన్నికల్లో ప్రయోజనం ఆశించి తీసుకున్న నిర్ణయం తిరగబెట్టడంతో ఏంచేయాలో తోచక... రాజకీయంగా ఆ రెండు పార్టీలు కొత్త నాటకానికి తెరతీశాయి. ఇక ప్రజలకు దగ్గరకాలేమని, వారు తమను విశ్వసించరని తెలుసుకుని ఆ రెండు పార్టీలు తెరవెనుక కుట్రలు మొదలుపెట్టాయి. తీసుకున్న నిర్ణయంపై వక్రభాష్యం చెప్పడం ప్రారంభిం చాయి. తెలంగాణ ఏర్పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని, వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూలంగా లేఖ ఇచ్చిందనీ...అది యూ టర్న్ తీసుకుందని... విషప్ర చారానికి దిగాయి. మేం చెప్పని విషయాన్ని చెప్పినట్టు దుష్ర్పచారం చేస్తున్నాయి. వైఎస్‌పైనా... మా పార్టీపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. నిజానికి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీల మాదిరి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఆది నుంచి ఒకే మాట చెబుతోంది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి సమైక్య శంఖారావం వరకు ఒక మాటపై నిలబడింది. ప్లీనరీలో మేం చెప్పిందేమిటి...? వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జూలై 8 న ఇడుపు లపాయలో జరిగిన తొలి ప్లీనరీ ప్రజాప్రస్థానం ముగిం పులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లా డుతూ, తెలంగాణ అంశంపై పార్టీ వైఖరేంటో విడమ రిచారు. ‘‘సున్నితమైన అంశం మీద.. ఒక అభిప్రా యమంటూ చెప్పాలి కాబట్టి చాలా ఆలోచనలు చేశాం. ఇవాళ ఇటువంటి జటిలమైన సమస్యకు అభిప్రాయం చెప్పాల్సివస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మేం తెలం గాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని నేను చెబు తున్నా. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు. తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. ఈ రాష్ట్రం అత లాకుతలామవుతుందన్నా, ఇన్ని వందల మంది చని పోయినా, ఆస్తులు నష్టమయ్యాయన్నా దీనికి కారణం.. కేంద్ర ప్రభుత్వమే. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకా రం రాష్ట్రాలను విభజించాలన్నా, కలిపి ఉంచాలన్న పూర్తి హక్కులు కేంద్రానికే ఉన్నాయని తెలిసినప్పటికీ కేంద్రం మనతో చెలగాటమాడుతోంది. కనీసం ఇప్పటికైనా మన జీవితాలతో చెలగాటమాడడం మానేసి మన మధ్య వైష మ్యాలు పెంచకుండా అందరి మనోభావాలు పరిగణ నలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా వెంటనే ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్పవలసిన బాధ్యత పూర్తిగా ఈ కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే ఉందని చెబుతున్నా. ఒక పంచా యతీలో కేంద్ర ప్రభుత్వం పెద్దమనిషిగా కూర్చుని ఉంది. ఆ పంచాయతీ చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ పంచాయతీ పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది’’. ఇదే ప్లీనరీ తీర్మానం కూడా. అంటే దీనర్థం తెలంగాణకు అంగీ కరిస్తున్నట్టా? సమస్యకు విభజనే పరిష్కారమా? ఇప్పుడు అడ్డగోలుగా చేసిన నిర్ణయం అందరి ప్రయోజనాలు పరిరక్షిస్తున్నాయా? ఇది అందరి మనోభావాలు పరిగ ణలోకి తీసుకున్నాక చేసిన నిర్ణయమా? షిండేకిచ్చిన లేఖలో ఏముంది? 28 డిసెంబర్ 2012 న కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమా వేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టంగా లేఖ రూపంలో తెలియజేసింది. ఆ లేఖలో ఏముందంటే... ‘‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అలాగే అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో తమ జీవనవిధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ - భారత రాజ్యాంగంలో అనేక అధికరణ లను పొందుపరిచారు. అధికరణలను అమలుపరిచే అధి కారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో భాగం గానే ఆర్టికల్ 3 ను రాజ్యాంగంలో పొందుపరిచి, రాష్ట్రా లను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా ఆ అధికా రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేంద్రానికే సర్వాధికారాన్ని ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా, ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియజేస్తున్నాం.’’ ‘‘ఇంతకుముందు 2011 జూలై 8, 9 తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్టుగా- తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగ ణలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరి తగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమో దయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరు తు న్నాం.’’ ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ లేఖలను ఇంగ్లీషులో రూపొందించగా, ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఎలాంటి గందరగోళం లేకుండా తెలు గులో అందజేసింది. ఇంత స్పష్టంగా వైఖరి విడమరిచిన తర్వాత కూడా ఈ లేఖలో తెలంగాణ ఏర్పాటు కోసం అం గీకరించామన్న దానికి లేశమాత్రమైనా ఆస్కారముందా? విభజనే పరిష్కారమని మేమెక్కడైనా చెప్పామా? మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏంటి? కీలకమైన అంశంపై నిర్ణయం తీసుకునేప్పుడు దానికి ప్రాతిపదిక, ప్రతి పాదనలు, అన్ని పక్షాలతో చర్చలు అవసరం లేదా? అం దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలని అన్న మా పార్టీ వైఖరికి, తెలంగాణకు సానుకూలం అని లేఖ ఇచ్చిన టీడీపీ వైఖరికి మధ్య ఉన్న తేడా ఎందుకు కని పించడంలేదు? ఏ సమస్య ఉత్పన్నమైనా... ఒక ప్రాం త ప్రజల ఆకాంక్షను గుర్తించడం ప్రజాస్వామ్యంలో పార్టీల కనీస ధర్మం. సమస్య ఉత్పన్నమైనప్పుడు ఒక ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం సమ్మతం కాదు. ఆనాడు వైఎస్ ఏమన్నారు... 2009 ఫిబ్రవరి 11 ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్ర శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏకాభిప్రాయానికి యత్నించినా సాధ్యంకాలేదు. మరికొన్ని పార్టీలు మద్దతివ్వడానికి నిరాకరించాయి. అప్పటి నుంచి ఈ సమస్యనెలా పరిష్కరించాలనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈలోగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ భద్రతకు ఇబ్బంది కలుగుతుందని ముస్లిం మైనారిటీలు చెప్పారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలి. గత 30. 40, 50, 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఇక్కడ స్థిరపడ్డామని కోస్తా, రాయలసీమ ప్రజలు అంటున్నారు. రాష్ట్రానికి రాజధాని అయినందునే హైదరాబాద్ వచ్చా మని అంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిం చాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు, మూడు, నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అంటు న్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ఏర్పా టుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ నివేదిక సమ ర్పిం చాక... దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది.’’ అని స్పష్టంగా చెప్పారు. ఏది వైఎస్ కల...? ఈ ప్రకటన చేసిన తర్వాత రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు జరగడం, వైఎస్ నేతృ త్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, కొద్ది రోజులకే వైఎస్ మృతిచెందడం తెలిసిన పరిణామాలే. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే ముందు దానితో సంబంధం ఉన్నవారు లేవనెత్తిన అభ్యంతరాలు, వారి ఆందోళనలను పరిష్కరించాల్సి ఉందని వైఎస్ తన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ... తెలంగాణ ఏర్పాటు రాజశేఖరరెడ్డి ‘కల’ అని ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి దిగ్విజయ్‌సింగ్ ఎలా చెబుతారు? ఈ ప్రాంతం, ఆ ప్రాంతమని తేడా లేకుండా రాష్ట్రాన్ని మొత్తంగా సస్యశ్యా మలం చేయాలన్నదే వైఎస్ స్వప్నం. అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే ఆయన కల. అందుకే ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు, రెండు రూపా యలకే కిలో బియ్యం, అర్హులైన అందరికీ సంతృ ప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీకే రుణాలు, సంతృప్తస్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు... ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ అనేక వినూత్న సంక్షేమ పథకాలు చేపడితే... ఉన్నంత కాలం కొనియాడి ఆయన మరణించగానే మాట మార్చిందెవరు? అబ్బ బ్బే... అవన్నీ కాంగ్రెస్ పథకాలే అని, అధిష్టానం ఆమో దంతోనే చేపట్టారని రకరకాల మాటలు చెప్పారు. పథ కాలైతే మీవి, తెలంగాణ అయితే వైఎస్ కలా? తెలంగాణ అంశంపై వైఎస్ ఆనాడు నిండు శాసనసభలో ప్రకటన చేయడం అబద్ధమా? రోశయ్య నేతృత్వంలో కమిటీ వేయడం అవాస్తవమా? వైఎస్ మరణం తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటవడం, ఆయనను మద్దాయిగా చూపిం చడం ఎవరికి తెలియనిది? ఆఖరికి ఎఫ్ఐఆర్లో సైతం ప్రభుత్వాలు ఆయన పేరు నమోదుచేయించాయి. ఆయన వల్ల లాభం కలుగుతుందంటే ఒకలా, లేదనుకుంటే మరో లా మాట్లాడినంత మాత్రాన చరిత్ర చెరిగిపోతుందా? వైఎస్సార్సీపీ అభ్యంతరం... జూలై 12 న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిని కూడా పిలిచారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్వి జయ్సింగ్ మాట్లాడుతూ, చర్చలు, సంప్రదింపులు ముగి శాయనీ ఇక నిర్ణయమే తరువాయి అని ప్రకటించారు. దాంతో కీలకమైన, సున్నితమైన అంశంపై కాంగ్రెస్ చేస్తు న్న డ్రామా, గందరగోళం, ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ జూలై 17న (అంటే సీడబ్ల్యూసీ సమావేశానికి పక్షం రోజుల ముందే) వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక లేఖరాశారు. అందులో విభజన అంశం, డిసెంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశ వివరాలను గుర్తుచేశారు. ఆ లేఖలో... ‘‘విభజన అంశంపై ప్రభుత్వం ముందుగా తన వైఖరిని స్పష్టం చేయాలి. అలా ప్రకటించిన వైఖరిపై అన్ని భాగస్వామ్య పార్టీలను ఆహ్వా నించి చర్చలు జరపాలి. విభజన అంశంపై చర్చలు సంప్ర దింపులు అయిపోయాయని దిగ్విజయ్ చెప్పడంలో అర్థం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తే అన్ని ప్రాంతాలవారికి ఆమోద యోగ్యమైన పరిష్కారాలను చూపాలి. అలాంటివేమీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణ యం జరిగిపోయిందని ఎలా ప్రకటిస్తారు? అది న్యాయస మ్మతం కాదు. విభజన అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పారదర్శకంగా వ్యవహరించాలి. ముందు కేం ద్రం తన వైఖరేమిటో ప్రకటించాలి. ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాలి. అప్పు డు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసు కోవాలి.’’ అని కోరారు. మా ఎమ్మెల్యేల రాజీనామాలు రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం తీర్మానించింది. అంతకుముందు 12 వ తేదీన జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం నుంచి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హడావిడి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వేస్తున్న అడుగులను గమనించి, ఏకపక్ష నిర్ణయం తీసుకోబోతోందని ఆ పార్టీ నేతల చేష్టలను గ్రహించిన తర్వాత కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు జూలై 25న స్పీకర్ ఫార్మేట్లో తమ పదవులకు రాజీనామాలు చేశారు. అటుతర్వాత ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ‘‘తానే పార్టీ, తానే ప్రభుత్వమన్న విధంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తోంది. ఓట్లు, సీట్లు లెక్కలేస్తూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ బేరసారాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మొదట కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించాలి. ఆ తర్వాత కేంద్రం అందరికీ అమోదయోగ్యమైన రీతిలో, ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా ఒక ప్రతిపాదనను అందరి ముందుంచాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు’’ అని హెచ్చరించిన విషయాన్ని గమనించాలి. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజనామాలు సమర్పించడం... తెలంగాణకు అనుకూలమవుతుందా? విభజన చేయమని చంద్రబాబు లాగా బ్లాంక్ చెక్‌పై సంతకం పెట్టినట్టవుతుందా? ఐదు పార్టీలదే ఏకాభిప్రాయమా? సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత సీమాంధ్ర ప్రజల ఆవే దనను, ఆక్రందనను, వారికి జరగబోయే అన్యాయాలను వివరిస్తూ మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగస్టు 27న ప్రధాని మన్మోహన్ సింగ్గారికి లేఖ రాశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం జరగనప్పుడు రాష్ట్రా న్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏకపక్ష నిరంకుశ వైఖరికి నిరసన విజయమ్మ నిరవధిక నిరాహారదీక్ష చేయగా, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జైలులోనే దీక్ష చేపట్టారన్న విషయాన్ని కూడా ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఇక్కడి పార్టీల మధ్య దాదాపుగా వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిందని కాంగ్రెస్ చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంద న్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీలు మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు అంగీకారం తెలి యజేయలేదని విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలి. ఎవరిది వక్రభాష్యం? మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కిపో లేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం జరగాలంటే ఎం చేయాలి? అందరి మనో భావాలు పరి గణలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్ప వలసిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని చెప్పిన విష యంలో ఎక్కడైనా... ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్క లు చేయాలనిగానీ, నిరంకుశ వైఖరితో నిర్ణయం తీసుకో మనిగానీ... కనబడుతోందా? అలాంటప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నది తప్పుడు ప్రచారం కాదా? విభ జన నిర్ణయాన్ని తీసుకున్నాక దాన్ని దిగ్విజయ్‌సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించి ఆ వెంటనే ఇది వైఎస్ కల అని చెప్పడమంటే... ఒక కుట్రపూరిత ప్రకటనకాక మరేమవుతుంది? వైఎస్ మరణించిన నాలుగేళ్ల తర్వాత ఈ మాట ఎలా చెప్పగలరు. ఆయన ఎక్కడైనా ఆ మాట అన్నారా? దిగ్విజయ్ చెప్పిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పదో రోజున బాబు అవే మాటలు మాట్లాడారు. ప్రజల అభిమానం కూడగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ బలమైనశక్తిగా ఎదిగిన పరిస్థితిని చూసి ఓర్వలేక, కాంగ్రెస్, టీడీపీలు తమ రాజకీయ మను గడ ప్రశ్నార్థకంగా మారడంతో అడ్డగోలు ప్రచారాన్ని మొదలు పెట్టాయని అందరికీ అర్థమవుతోంది. వైఎస్ ఉన్నప్పుడు 2001లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ, విదర్భ ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఎస్సార్సీ వేయాలని తీర్మానం చేసింది. అదే విషయాన్ని వైఎస్ అనేకసార్లు ప్రస్తావించారు. ఒక అంశంపై సమగ్రంగా మాట్లాడినప్పుడు, ఒక పార్టీ తన వైఖరిని ప్రకటించినప్పుడు తమకు అనుకూలమైన వాటినే ప్రస్తావించి నిందలు మోపడం ఏం నీతి? తెలంగాణపై టీడీపీ తీర్మానం 2008 అక్టోబర్ 8న జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. అందు లో ఏముందంటే... ‘‘రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిరంతరం నిశితంగా సమీక్షించే టీడీపీ తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి మొదటి నుంచి గౌర విస్తూనే ఉంది. ప్రజల మనోభావం బలపడటాన్ని గుర్తిం చి రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణ అంశంపై సరైన సమ యంలో సరైన నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ప్రక టించింది. అనంతరం సూత్రప్రాయంగా తెలంగాణకు వ్యతిరేకం కాదని కూడా ప్రకటించింది. ఈ అంశంపై విసృ్తతంగా చర్చజరగాలని కూడా నిర్ణయించింది. అయితే ఇది సున్నితమైన అంశం కనుక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసే ఉద్ధేశంతో పార్టీ సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఐదు నెలలుగా విసృ్తతస్థాయిలో అభి ప్రాయ సేకరణ జరిపి ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నదని పొలిట్‌బ్యూరోకి తెలి యచేసింది. కోర్ కమిటీ తెలియ చేసిన అభిప్రాయంపై కూలంకషంగా చర్చించిన టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది.’’ టీడీపీ ఏం చెప్పింది? బాబు పాదయాత్రలో భాగంగా 2012 డిసెంబర్ 27న కరీంనగర్ జిల్లా పొల్కపల్లి గ్రామంలో బసచేశారు. సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖ రిని తెలియజేయడానికి అక్కడే పొలిట్ బ్యూరో సమా వేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే తెలంగాణకు అనుకూలంగా గతంలో చేసిన తీర్మానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అదే విషయాన్ని పొందు పరుస్తూ షిండేకు లేఖ రాశారు. ఆ లేఖలో ‘‘... ఈ నేపధ్యంలో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే, మా పార్టీ తన అభిప్రా యాన్ని 18-10-2008న అప్పటి విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ ద్వారా తెలియచేసింది. ఆ లేఖను మేం ఉపసంహరించుకోలేదు. మరోవైపు మాజీ హోం మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో 2013 మే 5 న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని ప్రకటించారు. ఇప్ప టికీ కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించలేదు. అనిశ్చితిని తొల గించేందుకు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవా ల్సిం దిగా కేంద్రాన్ని మాపార్టీ కోరుతోంది.’’ ఇలా చెప్పడమం టే తెలంగాణకు అనుకూలమని స్పష్టంచేయడం కాదా? ఎవరిది యూ టర్న్? ఇరు ప్రాంతాలకు న్యాయం పాటించాలని, అలా చేయలే నప్పుడు... రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పష్టమైన వైఖరిని చెబితే... మా పార్టీ యూ టర్న్ తీసుకున్నట్టు కొం దరు ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం చేయమన్నాం. సీమాంధ్ర ప్రజల్లో వెల్లువెత్తిన ఉద్యమం చూసైనా అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోలేదన్న విషయం కాం గ్రెస్‌కు అర్ధంకాదా? తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి కూడా ఇప్పుడు తగుదునమ్మా... అంటూ బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడాన్ని ఎలా చూడాలి? ఇంత జరి గాక కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ వేయడమేంటి? విభజన అంశం కాంగ్రెస్ సొంత వ్యవహారంగా చూస్తుందన్న విష యం తెలియడం లేదా? ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమ వుతున్న తరుణంలో వారిని పక్కదారి పట్టించడా నికి వేసిన కమిటీ కాక మరేమనాలి? తెలంగాణ నిర్ణయం తీసుకున్నదే అధికార కాంగ్రెస్ అయినప్పుడు... అదీ అయిదు (కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ) పార్టీల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఆ పార్టీలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీ యూ టర్న్ తీసుకున్నదనీ, సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాలని... ఇలా రకరకాలుగా మాట్లాడటంలో ఆంతర్యమేంటి? వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని అనేక సందర్భాల్లో విడమరిచి స్పష్టంగా తెలియజేసింది. అయినా ఈ పార్టీలు అర్ధంకానట్టు నటిస్తున్నాయి. తమ గేమ్‌ప్లాన్ కొనసాగిస్తున్నాయి. - పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు -
యాసిన్ భత్కల్ చిక్కాడు
ఇంటెలిజెన్స్ వలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన బీహార్ పోలీసులు దేశవ్యాప్తంగా 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, పాత్రధారి ఇతనే వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్‌లో స్వయంగా బాంబులు పెట్టిన యాసిన్ ఇదే కేసులో మరో నిందితుడు తబ్రేజ్ కూడా అరెస్టు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/పాట్నా: రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనేత అయిన యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించనున్నారు. బీహార్‌లోని మోతిహరి మేజిస్ట్రేట్ వీరిని మూడురోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించారు. ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదుల అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ధ్రువీకరించారు. ‘బుధవారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దులో ఉన్న యాసిన్ భత్కల్ను ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు..’ అని షిండే గురువారం పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు. యాసిన్ పట్టుబడిన విషయం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి తన సంబంధీకులను కలుసుకోవాలని యాసిన్ ప్రయత్నించాడని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని భారత్-నేపాల్ సరిహద్దులో తూర్పుచంపారన్ జిల్లా రక్సువల్ సబ్ డివిజన్లోని నహర్ చౌక్ సమీపంలో యాసిన్‌ను, తబ్రేజ్‌ను అరెస్టు చేసినట్లు బీహార్ అదనపు డీజీపీ రవీంద్రకుమార్ పాట్నాలో విలేకరులకు చెప్పారు. యాసిన్ మరో పేలుడుకు కుట్ర చేస్తున్నట్టుగా సమాచారం ఉందన్నారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మాస్టర్‌మైండ్, బాంబుల నిపుణుడిగా భావించే అబ్దుల్ కరీమ్ తుండా పట్టుబడిన పక్షం రోజులకే యాసిన్ భత్కల్ సైతం చిక్కడం అనేక బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తులో కీలకమలుపు కాగలదని భావిస్తున్నారు. ముప్పై ఏళ్ల యాసిన్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ ప్రభుత్వం, ఎన్ఐఏలు రూ.10 లక్షల చొప్పున, ముంబయి పోలీసులు రూ.15 లక్షలు రివార్డు ప్రకటించారు. -
షిండే వచ్చేదాకా సాగదీత..!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: ఓవైపు రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో మిన్నంటుతున్న నిరసనలు.. మరోవైపు హోంమంత్రి షిండే ఆసుపత్రిలో ఉండడంతో తెలంగాణపై ముందుకు వెళ్లలేని పరిస్థితి..! ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలతో చర్చలు, సంప్రదింపుల పేరుతో వీలైనంత మేర కాలాన్ని సాగదీసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. అంతేగానీ సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలకు సమాధానం చెప్పడానికిగానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల డిమాండ్లను ఆలకించడానికి కాదని తెలుస్తోంది. పార్టీలోని అత్యున్నతస్థాయి వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. షిండే ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల చివరకు కూడా ఆయన ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదు. అప్పటిదాకా చర్చలు, సంప్రదింపుల పేరుతో సాగదీతను కొనసాగించాలని ఆంటోనీ కమిటీకి అధిష్టానం పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధ్యయనం పూర్తయింది. షిండే రాగానే తెలంగాణపై ముసాయిదా రూపొందిస్తాం. ఇందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముసాయిదా తయారయ్యే వరకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామన్న భావన కల్పించేందుకు ఆంటోనీ కమిటీ దోహదపడుతుంది’’ అని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రభుత్వ కమిటీ అనవసరం: దిగ్విజయ్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే విభజనపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలు చెప్పాక ఇప్పుడు ప్రభుత్వ పరమైన మరో కమిటీని ఏర్పాటు చేయాలని కోరటం అనవసరమని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వపరంగా కమిటీ ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర విభజన అంశంలో వివిధ పార్టీలకు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు చెప్పుకోవచ్చన్నారు. అలా కుదరని పక్షంలో అసెంబ్లీలో విభ జన అంశం చర్చకు వచ్చిన సందర్భంలో లేదా బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు పార్టీలకు తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దిగ్విజయ్ బుధవారం ఉదయం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ ఎవరెవరిని కలవబోతోందని ప్రశ్నించగా.. ‘‘బుధవారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులను పిలిచాం. వారితో మాట్లాడతాం. అభ్యంతరాలన్నీ వింటాం’’ అని బదులిచ్చారు. అలాగే కమిటీ ముందు కాంగ్రెస్ నేతలే కాకుండా, కాంగ్రెసేతరులు సైతం హాజరై వారి అభ్యంతరాలను చెప్పుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని చాలా పార్టీలు ప్రభుత్వపరంగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని ప్రస్తావించగా.. ‘‘అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణబ్ కమిటీకి అభిప్రాయాలు చెప్పాయి. తర్వాత హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్షంలోనూ వారి అభిప్రాయాలను చెప్పాయి. దీంతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటే.. వారికి రెండు వైఖరులు ఉంటే మేమేం చేస్తాం? అయినా పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే హోంమంత్రి వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనను కలవొచ్చు. అలా కానిపక్షంలో అసెంబ్లీలో తీర్మాన సమయంలోనూ, పార్లమెంట్లో బిల్లు ముసాయిదా సమయంలోనూ వారి అభిప్రాయాలను వివరించొచ్చు. అలాకాకుండా ఇప్పుడు ప్రభుత్వ కమిటీ అడగటం అసమంజసం’’ అని వ్యాఖ్యానించారు. ‘శాంతిభద్రత’ల్లోనే మార్పు: ‘‘రాష్ట్రంలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. మా నిర్ణయంలోనూ ఎలాంటి మార్పులేదు. అక్కడ మార్పు కేవలం శాంతిభద్రతల పరమైందే. దాన్ని అక్కడి ప్రభుత్వ వ్యవస్థ చూసుకుంటుంది’’ అని దిగ్విజయ్ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. విభజనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఇరు పక్షాలపైనా తాము ఆంక్షలు పెట్టామని చెప్పారు. ‘‘విభజన ప్రక్రియ భావోద్వేగాలతో కూడుకున్నది.. చాలా సున్నితమైన అంశం. ఈ దృష్ట్యా ఎవరూ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఇరు ప్రాంత నేతలకు కఠినంగానే చెప్పాం. ఈ అంశంపై ఎవరూ మాట్లాడకపోవటమే మంచిది’’ అని సూచించారు. -
ఆ నలుగురు...!
సంపాదకీయం: దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి పూనుకునే ముందు ఎలా ప్రవర్తించాలో, ఆ పరిష్కార ప్రక్రియలో అందరి భాగస్వామ్యమూ తీసుకోనట్టయితే ఏమవుతుందో తల వాచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చినట్టుంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. కొంపలంటుకున్నాక బావి తవ్వడానికి ప్రయత్నించినట్టున్న ఈ కమిటీ ఏం చేస్తుంది, పరిస్థితిని ఎలా చల్లారుస్తుందన్న సంగతలా ఉంచితే... రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు ‘నలుగురి’ అవసరం పడిందని స్పష్టంగానే తెలుస్తోంది. గత పది రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదంటే కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాకు సిద్ధపడాల్సివచ్చింది. పార్లమెంటులో గళం ఎత్తాల్సివచ్చింది. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని వాదించేవారు సైతం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుబట్టక తప్పడంలేదు. తీసుకున్న నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనదనుకున్నా, తమ ప్రయోజనాలకు మరెంతగా ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నా... దాన్ని అమలుచేయడానికి పూనుకునేముందు ఒక పద్ధతిని పాటించాలని, ఆ ప్రక్రియలో అందరి సహాయసహకారాలూ తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు అనుకోలేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించగల వర్గాల అభిప్రాయాలేమిటో తెలుసుకోవడానికి లేదా వారి అపార్థాలనూ, అపోహలనూ పోగొట్టడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండుపై తమకు అలవాటైన కుట్రపూరిత మనస్తతత్వంతోనే వారు ఆలోచించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తున్నవారి మనోభావాలతో తమ స్వీయ ప్రయోజనాలను రంగరించి ఎవరూ అడగని ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకురావడం వెనకున్నది ఈ కుట్ర బుద్ధే. తెలంగాణ సమస్యపై భిన్న పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయని, అదేవిధంగా తామూ చెప్పామని అంటున్న కాంగ్రెస్ నేతల వాదన నయవంచన తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఊరుకోలేదు. అధికారంలో ఉన్నది గనుక ఆ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అసలు అధికారికంగా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందే తాము ఏం చేయబోతున్నారో వారు లీకులు ఇచ్చారు. తమ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీలో చర్చించకముందే, యూపీఏలో తమ భాగస్వామ్యపక్షాల వారితో మాట్లాడకముందే ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారని... ఆ రెండు సమావేశాలూ లాంఛనప్రాయమైన ముద్రలు వేయించుకోవడానికేనని పత్రికలు చదువుతున్నవారికి, చానెళ్లు చూస్తున్నవారికి అర్ధమైంది. ఇక్కడి నాయకులకు ఆ మాత్రం విలువైనా ఇవ్వలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకులైతే, అధికారంపై మమకారం లేనివారే అయితే వీరందరూ ఆ క్షణంలోనే పదవులనుంచి వైదొలగేవారు. అలా చేయలేకపోయారు సరిగదా... ఆంటోనీ కమిటీకి అలవిమాలిన ప్రాముఖ్యతనిస్తూ ఇప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయిందట. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకూ తదుపరి చర్యలు ఉండవట. ఆ కమిటీకి ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర పార్టీలవారూ అభిప్రాయాలు చెప్పవచ్చునట. ఇంతవరకూ వచ్చాక కూడా తమ కబుర్లతో ఇంకా జనాన్ని మభ్యపెట్టగలమని వారనుకుంటున్నారు. ఆంటోనీ కమిటీ మౌలికంగా కాంగ్రెస్ కమిటీ. ఆ కమిటీకి ‘హై పవర్’ అని విశేషణం తగిలించినంతమాత్రాన దానికి అధికార ప్రతిపత్తి రాదు. విభజనవల్ల సమస్యలున్నాయనుకునేవారు ప్రభుత్వంతో మాట్లాడాలని చూస్తారు. తమ మనోభావాలను అది పట్టించుకోవాలని ఆశిస్తారు. అది వినడం లేదనుకున్నప్పుడు దాని మెడలు వంచడానికి ప్రయత్నిస్తారు. అంతేతప్ప కాంగ్రెస్‌కు చెందిన కమిటీని కలవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఏముంటుంది? కలిసి ఏమి మాట్లాడతారు? కొంతవరకూ కాంగ్రెస్ పార్టీకి అది ఉపయోగపడవచ్చు. ఉద్యమాల పర్యవసానంగా పార్టీకి ఉత్పన్నమైన సంకటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దానికి వివరించడానికి ప్రయత్నించవచ్చు. లేదా రాయల తెలంగాణ వంటి తమ రహస్య అజెండాకు దీన్ని వేదికగా చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏర్పాటుచేసుకున్న కమిటీని లోకకల్యాణం కోసం ఆవిర్భవించిన సంస్థగా చిత్రించబోవడం నయవంచన. ఇంతకూ కమిటీలో ఉన్నవారికి విభజనానంతర పరిణామాలపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న భయాలపైగానీ, మొత్తంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైగానీ అవగాహన ఉందనడానికి దాఖలాలు లేవు. అంతటి అవగాహన, శక్తి వీరికుంటే సీడబ్ల్యూసీలోనో, కోర్ కమిటీలోనో విభజన ప్రక్రియకు సంబంధించి మెరుగైన విధానం రూపుదిద్దుకునేది. ముఖ్యంగా గత నాలుగేళ్లలోనూ అన్ని వర్గాల వారితోనూ, అన్ని స్థాయిల్లోనూ చర్చించే ప్రజాస్వామిక ప్రక్రియ అమలయ్యేది. ఇదేమీ లేదు సరిగదా... రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తూ అసలే ఆగ్రహంతో రగులుతున్న రాష్ట్రాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక అస్తిత్వమూ కలిగిన రాయలసీమ ప్రాంత ప్రజలను ఇలాంటి ప్రతిపాదనలతో తాము అపహాస్యం చేస్తున్నామని, వారి మనోభావాలను గాయపరుస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరిచి పోతున్నారు. అడిగింది తెలంగాణ అయితే, పనిలో పనిగా రాయలసీమను విడదీసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందులో భాగంగానే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పోకడలు తెలిసినవారందరూ సరిగానే అంచనా వేస్తున్నారు. ఇలాంటి చేష్టలవల్ల కాంగ్రెస్ మరింత అధోగతిపాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. కనీసం అవసానదశలోనైనా ఈ సంగతిని గ్రహించడం ఆ పార్టీ పెద్దల ఆరోగ్యానికి మంచిది. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రక్రియ: షిండే