'అఫ్జల్గురుని అందుకు ఉరితీయలేదు' | Afzal Guru not hanged for 'political reasons': Sushil Kumar Shinde | Sakshi
Sakshi News home page

'అఫ్జల్గురుని అందుకు ఉరితీయలేదు'

Published Sun, May 24 2015 6:03 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

'అఫ్జల్గురుని అందుకు ఉరితీయలేదు' - Sakshi

'అఫ్జల్గురుని అందుకు ఉరితీయలేదు'

ముంబయి: పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్గురుని ఉరితీసింది రాజకీయ ప్రయోజనాలకోసం కాదు అని కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. కోర్టు తీర్పులకనుగుణంగానే తాము నడుచుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకోసమే యూపీఏ ప్రభుత్వం అఫ్జల్ గురుని ఉరితీశారని నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు.

'సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానంలో అఫ్జల్ కేసుపై అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. క్షమాభిక్ష కూడా తిరస్కరించబడింది. ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా ఉరితీసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రాజకీయ నిర్ణయం కాదు' అని ఆయన వివరణ ఇచ్చారు. కాశ్మీర్లో రాజకీయాలను పెడద్రోవ పట్టించాలని ఒమర్ ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతుండొచ్చని షిండే చెప్పారు. ఉరి తీసే సమయంలో ఇలాంటి ఆరోపణలేవి ఆయన ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement