Lovers Commit Suicide Kukatpally Housing Board, Details Inside - Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి..

Published Mon, May 15 2023 11:46 AM | Last Updated on Mon, May 15 2023 1:45 PM

Lovers Commit Suicide Kukatpally Housing Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మృతులను భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చారు. స్నేహితుడి రూమ్‌కు వెళ్లి ఆత్యహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement