lovers sucide
-
పెళ్లయి విడాకులు.. కలిసి బతకలేమని.. కడకు ఊపిరి తీసుకుని..
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ యువతి, యువకుడి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఇద్దరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. సీఐ కిషన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్ (24), పోతుల జ్యోతి (22) సమీప బంధువులు. మూడేళ్ల క్రితం జ్యోతికి వివాహమైంది. కొద్ది రోజులకే భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలో గత నెల జ్యోతి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జ్యోతికి శ్యామ్‌తో అప్పటికే స్నేహం, ప్రేమ నేపథ్యంలో అతను కూడా ఇటీవల నగరానికి వచ్చాడు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని 7వ ఫేజ్ ఎల్ఐజీ గృహంలో ఉంటున్నాడు. స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకుని.. శ్యామ్ స్నేహితుడు వంశీకి ఈ నెల 20న వివాహ నిశి్చతార్థం ఉండటంతో 9న ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాడు. శుక్రవారం వంశీ ఇంట్లో లేకపోవటంతో శ్యామ్ అతనికి ఫోన్ చేసి ఇంటి తాళాలు తీసుకున్నాడు. అనంతరం హాస్టల్లో ఉంటున్న జ్యోతిని ఇదే ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరి నడుమ గత ప్రేమానుబంధాలతో పాటు ఇరు కుటుంబ పెద్దల వ్యతిరేకత నేపథ్యంలో కలిసి బతకలేమనుకున్నారు. దీంతో శ్యామ్ ఉరి వేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మాదాపూర్‌లో ఉంటున్న జ్యోతి సోదరుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో హాస్టల్‌కు వచ్చి చూశాడు. హాస్టల్లో జ్యోతి లేకపోవటంతో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని స్నేహితుడైన వంశీ ఇంటికి వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా గదిలో శ్యామ్ ఉరివేసుకొని, జ్యోతి పురుగుల మందు తాగి విగతజీవులుగా కనిపించారు. ఇరువురి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులను భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. స్నేహితుడి రూమ్‌కు వెళ్లి ఆత్యహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ప్రేమోన్మాదం: ప్రేయసి హత్య.. ప్రియుడి ఆత్మహత్య
వేలూరు: ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వేలూరులో చోటు చేసుకుంది. వివరాలు.. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాశన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె సాధన(16) ప్లస్‌వన్ చదువుతోంది. వేలూరు సమీపంలోని కరుగంబత్తూరు మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన రామ్‌కుమార్(22) కార్మికుడు. శనివారం రాత్రి సాధన ఇంటిలో సాధన మృతి చెంది ఉండగా రామ్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని భారతిదాశన్, దీపలక్ష్మి గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సాధనను.. రామ్‌కుమార్ గొంతు నులిమి హత్య చేసి అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. రామ్‌కుమార్, సాధన ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం సాధన తల్లిదండ్రులకు తెలియడంతో ఖండించారు. దీంతో సాధన.. రామ్‌కుమార్‌తో మాట్లాడటం లేదు. ఆగ్రహించిన రామ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య
-
ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గ్రామానికి చెందిన కనకయ్య(21), తార(19) అనే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. రెండేళ్ల క్రితం ఇదే విషయంలో గ్రామపెద్దలు కనకయ్యకు 30వేలు జరిమానా విదించారు. అయినా కనకయ్య, తార మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి..ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలం కావడంతో...వారి వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం స్కూల్లోని ఓ గదిలో వెళ్లి ఒకే తాడుతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కాజీపేట అర్బన్: భక్తులంతా శివనామ స్మరణలో లీనమైపోగా ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రియురాలు మార్గ మధ్యంలో మృతిచెందగా, ప్రియుడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాఠశాలలోనే సాన్నిహిత్యం.. హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన మేర్గు రమేశ్‌కుమార్, శ్రీదేవి దంపతుల కుమార్తె హరిప్రియ(17)కు, సమీపంలోని దీన్దయాళ్నగర్కు చెందిన పైండ్ల సమ్మయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్(17)కు మధ్య వరంగల్ నగరంలోని ఓ పాఠశాలలో చదివే సమయంలో సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి పూర్తయ్యాక వేర్వేరు కళాశాలల్లో పాలిటెక్నిక్ చదువుతున్న వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలిసిన హరిప్రియ తండ్రి గత కొద్దిరోజుల కిందట ఆమెను మందలించాడు. కాగా, సోమవారం మధ్యాహ్నం హరిప్రియ దీన్‌దయాళ్‌నగర్‌లోని సాయికుమార్ ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి కాళేశ్వరం వెళ్లారు. కాళేశ్వరాలయం వద్ద వారిద్దరు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి నురగులు కక్కుతూ పడిపోగా గమనించిన భక్తులు, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే చేరుకొని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మహదేవపూర్‌కు చేరుకునే సరికే హరిప్రియ మృతిచెందింది. సాయికుమార్ ప్రస్తుతం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
కదిలే రైలుకు ఎదురుగా వెళ్లి..ప్రేమికుల ఆత్మహత్య
అల్వాల్ : అల్వాల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం...కార్ఖానకు చెందిన శిరీష (20)తో లోతుకుంట సర్వెంట్ కాలనీలో నివాసముండే నర్సింగ్ అలియాస్ సోను (23)కు ఏడాది క్రితం లోతుకుంట బస్టాప్‌లో పరిచయం అయ్యారు.వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. రోజూ మాదిరిగా శనివారం ఉదయం లోతుకుంట బస్టాప్ వద్ద కలిశారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అనంతరం అల్వాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. కాసేపు మాట్లాడుకున్న అనంతరం పట్టాలపై వెళుతున్న రైలుకు అడ్డంగా వెళ్లారు. శిరీష అక్కడికక్కడే మృతి చెందగా నర్సింగ్ ను స్థానికులు 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింగ్ మృతి చెందాడు. నర్సింగ్ తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడితో కలసి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కార్ఖానలోని కాకాగూడలో నివసించే హరిశంకర్ కూతురు శిరీష అల్వాల్‌లోని వందన కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కళాశాలకు వెళ్లిన శిరీష రైల్వే ఫ్లాట్ ఫాంపై విగత జీవిగా పడి ఉండటంతో శిరీష తల్లిదండ్రులను కలచి వేసింది.