కదిలే రైలుకు ఎదురుగా వెళ్లి..ప్రేమికుల ఆత్మహత్య | lovers sucide in railway track | Sakshi
Sakshi News home page

కదిలే రైలుకు ఎదురుగా వెళ్లి..ప్రేమికుల ఆత్మహత్య

Published Sun, Dec 13 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

కదిలే రైలుకు ఎదురుగా వెళ్లి..ప్రేమికుల ఆత్మహత్య

కదిలే రైలుకు ఎదురుగా వెళ్లి..ప్రేమికుల ఆత్మహత్య

అల్వాల్ : అల్వాల్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య  చేసుకున్నారు. రైల్వే సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం...కార్ఖానకు చెందిన శిరీష (20)తో లోతుకుంట సర్వెంట్ కాలనీలో నివాసముండే నర్సింగ్ అలియాస్ సోను (23)కు ఏడాది క్రితం లోతుకుంట బస్టాప్‌లో పరిచయం అయ్యారు.వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. రోజూ మాదిరిగా శనివారం ఉదయం లోతుకుంట బస్టాప్ వద్ద కలిశారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
 
  అనంతరం అల్వాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. కాసేపు మాట్లాడుకున్న అనంతరం పట్టాలపై వెళుతున్న రైలుకు అడ్డంగా వెళ్లారు. శిరీష అక్కడికక్కడే మృతి చెందగా నర్సింగ్ ను స్థానికులు 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింగ్ మృతి చెందాడు.  నర్సింగ్ తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడితో కలసి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కార్ఖానలోని కాకాగూడలో నివసించే హరిశంకర్ కూతురు శిరీష అల్వాల్‌లోని వందన కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కళాశాలకు వెళ్లిన శిరీష రైల్వే ఫ్లాట్ ఫాంపై విగత జీవిగా పడి ఉండటంతో శిరీష తల్లిదండ్రులను కలచి వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement