Kukatpally Housing Board
-
కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులను భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. స్నేహితుడి రూమ్‌కు వెళ్లి ఆత్యహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
-
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు. మెట్రోస్టేషన్ వద్ద ప్రయాణికులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు భయంతో చల్లాచెదురుగా పరుగులు తీశారు. దీని కాణంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే కొంత మంది యువకులు, స్థానికులు ఇద్దరు సైకోలను పట్టుకొని తాళ్లతో బంధించారు. రాళ్లదాడితో ఆగ్రహించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు వీరేవు కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. -
మాల్లో పూనమ్‌పాండే సందడి
-
మాల్లో మాలిని
ప్రముఖ మోడల్, నటి పూనమ్‌పాండే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మంజీర మాల్లో గురు వారం సందడి చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మాలిని అండ్ కో’ చిత్రం ప్రచారంలో భాగంగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చిత్ర బృందం ఆలస్యంగా వచ్చినా అభిమానులు ఓపికతో నిరీక్షించారు. పూనమ్ పాండే రాకతో వారిలో సంతోషం ఉప్పొంగింది. - మలేషియా టౌన్షిప్