సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు. మెట్రోస్టేషన్ వద్ద ప్రయాణికులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు భయంతో చల్లాచెదురుగా పరుగులు తీశారు. దీని కాణంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే కొంత మంది యువకులు, స్థానికులు ఇద్దరు సైకోలను పట్టుకొని తాళ్లతో బంధించారు. రాళ్లదాడితో ఆగ్రహించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు వీరేవు కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment