Psycho attacks
-
నెల్లూరుజిల్లా కోవూరులో సైకో కలకలం
-
కోవూరులో సైకో కలకలం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోవూరు: ప్రశాంతతకు మారుపేరైన కోవూరులో శుక్రవారం తెల్లవారుజామున సైకో మహిళలపై దాడులు చేసి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాయిబ్రహ్మణ వీధిలో జలదంకి విజయమ్మ (50) ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో రవి అనే యువకుడు రావడంతో ఒక్కసారిగా సైకో అతడిని తోసివేసి పరారయ్యాడు. తర్వాత పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఒంటేరు అంకమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై కూడా తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం పూలతోట వారి వీధిలో ఓ వివాహిత ముగ్గు వేస్తుండటంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. లైబ్రరీ వీధిలో ఓ వివాహిత నిద్రిస్తుండగా అత్యాచారయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అంకమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా మహిళలపై జరిగిన అఘాయిత్యం జరిగిన ప్రాంతాల నుంచి బ యలుదేరిన పోలీసు జాగిలం రైల్వేస్టేషన్, అక్కడి నుంచి ఇనమడుగు సెంటర్‌కు వెళ్లింది. ఓ ఆటో వద్ద కు చేరుకుని ఆగిపోయింది. వెంకమ్మ, అంకమ్మ గృహా ల్లో క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. పోలీసులు సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిశీలించిన ఎస్పీ విషయం తెలుసుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బాధితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. అనంతరం రవితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతుంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైకోలను నియంత్రించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలన్నారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, కోవూరు, కొడవలూరు ఎస్సైలు వెంకట్రావు, అంజిరెడ్డి ఉన్నారు. -
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
-
కేపీహెచ్బీలో సైకోల వీరంగం
సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు. మెట్రోస్టేషన్ వద్ద ప్రయాణికులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు భయంతో చల్లాచెదురుగా పరుగులు తీశారు. దీని కాణంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే కొంత మంది యువకులు, స్థానికులు ఇద్దరు సైకోలను పట్టుకొని తాళ్లతో బంధించారు. రాళ్లదాడితో ఆగ్రహించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు వీరేవు కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. -
ఖమ్మం జిల్లాలో సూదిగాడి కలకలం
-
రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్య చేసిన ఉన్మాది
-
6ఏళ్ల బాలికపై ఉన్మాది దాడి
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్యచేసిన ఉన్మాది
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఘోరం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రియదర్శిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఈ దారుణం చోటుచేసుకుంది. అడ్డు వచ్చినవారిపై కూడా ఉన్మాది దాడి చేశాడు. మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన దంపతులు వివాహ వేడుకకు హాజరవడానికి షోలాపూర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ ఉన్మాది వీరంగం సృష్టించడంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.