సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్యచేసిన ఉన్మాది | Psycho attacks on a six years old girl in secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్యచేసిన ఉన్మాది

Published Tue, Dec 10 2013 3:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

Psycho attacks on a six years old girl in secunderabad railway station

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఘోరం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రియదర్శిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై  తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఈ దారుణం చోటుచేసుకుంది. అడ్డు వచ్చినవారిపై కూడా ఉన్మాది దాడి చేశాడు. మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన దంపతులు వివాహ వేడుకకు హాజరవడానికి షోలాపూర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు.

ఆ ఉన్మాది వీరంగం సృష్టించడంతో రైల్వే స్టేషన్లో  ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్గా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement