కోవూరులో సైకో కలకలం | Psycho hulchul in kovvur | Sakshi
Sakshi News home page

కోవూరులో సైకో కలకలం

Published Sat, Mar 3 2018 11:20 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Psycho hulchul in kovvur - Sakshi

నిందితుడి ఊహాచిత్రం, పరిసరాలను పరిశీలిస్తున్న పోలీసు జాగిలం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోవూరు: ప్రశాంతతకు మారుపేరైన కోవూరులో శుక్రవారం తెల్లవారుజామున సైకో మహిళలపై దాడులు చేసి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాయిబ్రహ్మణ వీధిలో జలదంకి విజయమ్మ (50) ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో రవి అనే యువకుడు రావడంతో ఒక్కసారిగా సైకో అతడిని తోసివేసి పరారయ్యాడు. తర్వాత పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఒంటేరు అంకమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై కూడా తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం పూలతోట వారి వీధిలో ఓ వివాహిత ముగ్గు వేస్తుండటంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

లైబ్రరీ వీధిలో ఓ వివాహిత నిద్రిస్తుండగా అత్యాచారయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అంకమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా మహిళలపై జరిగిన అఘాయిత్యం జరిగిన ప్రాంతాల నుంచి బ యలుదేరిన పోలీసు జాగిలం రైల్వేస్టేషన్, అక్కడి నుంచి ఇనమడుగు సెంటర్‌కు వెళ్లింది. ఓ ఆటో వద్ద కు చేరుకుని ఆగిపోయింది. వెంకమ్మ, అంకమ్మ గృహా ల్లో క్లూస్‌ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. పోలీసులు సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పరిశీలించిన ఎస్పీ
విషయం తెలుసుకున్న ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బాధితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. అనంతరం రవితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతుంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైకోలను నియంత్రించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలన్నారు. ఆయన వెంట రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి, కోవూరు, కొడవలూరు ఎస్సైలు వెంకట్రావు, అంజిరెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement