పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం | Young Man Molestation Minor Girl Kodavaluru PSR Nellore District | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం

Published Tue, Apr 12 2022 11:02 AM | Last Updated on Tue, Apr 12 2022 11:06 AM

Young Man Molestation Minor Girl Kodavaluru PSR Nellore District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు(కొడవలూరు): పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్న ఈ ఘటన మండలం తలమంచి ఎస్సీ కాలనీలో సోమవారం వెలుగుచూసింది. కోవూరు సీఐ కె.రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు.. ఆ కాలనీకి చెందిన ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈశ్వరయ్యను భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళకు మొదటి భర్తకు జన్మించిన పన్నెండేళ్ల కుమార్తెతో పాటు మరో కుమారుడున్నారు.

ఈశ్వరయ్య ఇద్దరు కుమారులు, ఆ మహిళ ఇద్దరు పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరయ్యతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె (12)పై ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19) కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గిరిజనులు కావడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ బాలికకు 9 నెలలు నిండాయి. దీంతో కాన్పు నిమిత్తం ఆ బాలికను నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అంత చిన్న వయస్సులో బాలిక గర్భం దాల్చడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన సీఐ రామకృష్ణారెడ్డి ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19)పై అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.   

చదవండి: (హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement