kodavaluru
-
Nalco: రెండేళ్లలో పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం
సాక్షి, నెల్లూరు(కొడవలూరు): పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్న ఈ ఘటన మండలం తలమంచి ఎస్సీ కాలనీలో సోమవారం వెలుగుచూసింది. కోవూరు సీఐ కె.రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు.. ఆ కాలనీకి చెందిన ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈశ్వరయ్యను భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళకు మొదటి భర్తకు జన్మించిన పన్నెండేళ్ల కుమార్తెతో పాటు మరో కుమారుడున్నారు. ఈశ్వరయ్య ఇద్దరు కుమారులు, ఆ మహిళ ఇద్దరు పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరయ్యతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె (12)పై ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19) కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గిరిజనులు కావడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ బాలికకు 9 నెలలు నిండాయి. దీంతో కాన్పు నిమిత్తం ఆ బాలికను నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అంత చిన్న వయస్సులో బాలిక గర్భం దాల్చడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన సీఐ రామకృష్ణారెడ్డి ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19)పై అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం) -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
కొడవలూరు: మహిళ హ్యాండ్ బ్యాగ్‌లోని బంగారు, వెండి నగలు చోరీ చేసిన కేసులో నిందితుడైన బిట్రగుంటకు చెందిన గుర్రంకొండ రాజేష్ అలియాస్ బుడ్డను ఆదివారం కొడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉ న్నాయి. తిరుపతికి చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సూర్యనారాయణ కుటుం బసభ్యులతో కలిసి జనవరి 23వ తేదీన గుంటూరుకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించి తిరిగి తిరుపతికి వస్తూ రాత్రి కావడంతో కమ్మపాలెం వద్ద కారును ఆపి నిద్రకు ఉపక్రమించారు. సూర్యనారాయణ భార్య హ్యాండ్ బ్యాగ్‌ను నిందితుడు దొంగిలించి అందులో ఉన్న బంగారు చైన్, వెంకటేశ్వరస్వామి డాలర్, రెండు జతల వెండి కాళ్ల పట్టీలు అపహరించాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గుర్రంకొండ రాజేష్ అని నిర్ధారిం చారు. ఆదివారం కోవూరు బస్టాండ్‌లో ఉన్న అతడిని అరెస్ట్ చేశారు. బంగా రు, వెండి నగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ జీపీపీ రామరాజు తెలిపారు. -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
స్టేటస్కోను ధిక్కరించి ఆక్రమణ తొలగింపు ఖండించిన ప్రసన్న నార్తురాజుపాళెం (కొడవలూరు): హై కోర్డు స్టేటస్కో ఉత్తర్వులున్నా ధిక్కరించి ఆక్రమణ తొలగించిన సంఘటన నార్తురాజుపాళెంలో గురువారం చోటు చేసుకుంది. అయితే వైఎస్సార్ సీపీకి చెందిన వారివి మాత్రమే తొలగించడం అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. నార్తురాజుపాళెం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను బుధవారం నుంచి తొలగిస్తుండటం విదితమే. అయితే గురువారం నాటి తొలగింపులో అధికారులు హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేశారు. ఆక్రమణదారుల్లో కె.శ్రీనివాసులు, మల్లికార్జున, వెంకటలక్ష్మి హైకోర్టు నుంచి స్టేటస్కో ఉత్తర్వులు (యథా స్థితిని కొనసాగించడం) తెచ్చుకున్నారు. ఉత్తర్వులు గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నాయకుడు ఫజురుల్లా స్థానిక తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఆక్రమణలను కూల్చేశారు. హై డ్రామా : ఉత్తర్వులను ఆర్అండ్బీ అధికారులకు అందజేయాల్సి ఉండగా, సర్వేయర్ పత్తాలేకుండా పోయారు. స్టేటస్కో ఉత్తర్వులు తనకందలేదంటూ ఆర్అండ్బీ జేఈ కృష్ణ ఆక్రమణను కూల్చివేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే హైడ్రామా నడిచిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కారమే : హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధికారులు హైడ్రామా నడిపి కూల్చడం కోర్టు ధిక్కారమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం కూల్చివేతను స్వయంగా పరిశీలించారు. ఆర్అండ్బీ జేఈ, సర్వేయర్లను పిలిచి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెబితే ఏమైనా చేస్తారా? కోర్టును కూడా ధిక్కరిస్తారా అంటూ వారిపై మండి పడ్డారు. కోర్టు ధిక్కారణ కేసు పెడితే అధికారులే సమాధానం చెప్పుకోవాలని హెచ్చరించారు. అధికార ప్రతినిధి చలపతిరావు మాట్లాడుతూ అధికారుల వైఖరిపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యల్లాయపాలెం(కొడవలూరు) : బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని యల్లాయపాలెంలో శనివారం రాత్రి చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మసీదు వీధికి చెందిన ఓ బాలికకు (15) మేనమామ వరుసైన వ్యక్తితో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. వివాహ శుభలేఖలు ముద్రించి పంపిణీ ప్రారంభించారు. వివాహ విషయం ఐసీడీఎస్ సూపర్వైజర్ సాయికుమారి దష్టికి వెళ్లడంతో ఆమె ఐసీపీఎస్ అధికారిణి సుజాతతో కలిసి శనివారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని, అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేసి వివాహం జరిపితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహం రద్దు చేసుకునేందుకు అంగీకరించి అందుకు కట్టుబడి ఉంటామని అధికారులకు ఒప్పంద పత్రం రాసిచ్చారు. -
ట్రిపుల్ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
రామన్నపాలెం(కొడవలూరు) : ట్రిపుల్ ఈ బ్రాంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెండుగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయని ఏపీ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. రామన్నపాలెంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తక్కువనే భావన ఉందన్నారు. దీనికి పక్కనపెట్టాలన్నారు. ప్రతి పరిశ్రమ విద్యాధారమైనందున ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రమేష్‌బాబు, ట్రì పుల్ ఈ హెచ్ఓడీ రత్నజ్వోతి, ఏఓ ఎస్.వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ.. స్టేషన్ మాస్టర్ మృతి
కొడవలూరు : ట్రాక్టర్ - బైక్ ఢీకొని రైల్వేస్టేషన్ మాస్టర్ మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన మునిస్వామి(50) తలమంచిలో రైల్వేస్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆయన డ్యూటీకి బైక్‌పై వెళ్తుండగా కొడవలూరు రైల్వే గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గౌతమిలో చోరీకి యత్నం, గాలిలో కాల్పులు
-
గౌతమిలో చోరీకి యత్నం, గాలిలో కాల్పులు
నెల్లూరు : దోపిడీ దొంగలు మరోసారి హల్చల్ చేశారు. నెల్లూరు జిల్లా వద్ద రైలు దోపిడీకి విఫలయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి వద్ద దుండగులు ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుంచి గౌహతి వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగి చోరీకి ప్రయత్నించారు. ఎస్-6 బోగీలోని ప్రయాణికుల్ని బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించగా వారు ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు పెట్టారు. దాంతో పక్క బోగీలో ఉన్న రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరిపటంతో వారు రైలు దూకి పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. చెన్నైకి చెందిన దొంగల ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తుండటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగల భయంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా సోమవారం కూడా ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్‌లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులను బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. సింహపురి, శేషాద్రి, యశ్వంతపూర్ రైళ్లలో దోపిడీ విఫలయత్నం చేశారు. -
చీటీల పేరుతో టోపీ
కొడవలూరు, న్యూస్‌లైన్: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు. ఐదేళ్ల వ్యవధిలోనే అందరికీ నమ్మకస్తుడిగా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ బిల్డప్ ఇచ్చాడు. నగదు లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించడంతో ఆహా..ఓహో..అంటూ అందరూ నమ్మారు. వెనుకా..ముందూ చూసుకోకుండా లక్షల రూపాయల చీటీలు కట్టారు. అంతా అనుకున్నట్టే జరగడంతో అందరినీ ముంచి రూ.2 కోట్లతో గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. మోసపోయామని గ్రహిం చిన సుమారు 250 మంది ఇప్పుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..కొడవలూరు మండలం చింతచెలికకు ఐదేళ్ల క్రితం కృష్ణారావు అనే వ్యక్తి ఓ మహిళతో కలసివచ్చి ఓ ఇంట్లో కాపురముంటున్నాడు. మొదట్లో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాడు. ఈ వ్యాపారంతో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్భాటంగా, అందరితో కలివిడిగా ఉండేవాడు. అందరి వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వస్తి చెప్పి చీటీల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో రూ.20 వేల చీటీతో వ్యాపారం ప్రారంభించాడు. ఖాతాదారులకు చెల్లింపులు సక్రమంగా చేస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. వ్యాపారాన్ని కూడా రూ.50 వేలు, లక్ష రూపాయల చీటీలకు విస్తరించాడు. ఇలా సుమారు రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నడుపుతున్నాడు. పక్కా ప్లాన్‌తోనే.. ప్రస్తుతం కృష్ణారావు రూ.లక్ష చీటీలు 8, రూ.50 వేల చీటీలు రెండు, రూ.30 వేల చీటీలు ఒకటి నడుపుతున్నాడు. వీటిలో దాదాపు 250 మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ లబ్ధిదారులు మహిళలే. పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతున్న కృష్ణారావు కొన్ని నెలలుగా చీటీలు పాడుకున్న వారికి నగదు చెల్లింపులు నిలిపేశాడు. గట్టిగా అడిగిన వారికి స్థలాలు కొన్నందున నగదు బ్లాక్ అయిందని, త్వరలోనే చెల్లిస్తానంటూ నమ్మిస్తూ వచ్చాడు. నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అనుమానంతో ఖాతాదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనితో కలిసి ఉంటున్న మహిళను బాధితులు నిలదీయగా తనకే మీ తెలియదంటూ ఆమె సమాధానమిచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ లావాదేవీలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కృష్ణారావు ఎక్కడా స్థలాలు కొనలేదని నిర్ధారణకు వచ్చారు. రూ.2 కోట్లకు పైగా మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కృష్ణారావు ఇంట్లోని పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం గ్రామంలోకి వెళ్లి విచారించాను. కృష్ణారావును నమ్మి చాలా మంది చీటీలు కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి వద్దా రశీదులు లేవు. ఆయనేమి ప్రభుత్వ అనుమతి పొందిన వ్యాపారి కాదు. దీన్ని సివిల్ విషయంగా పరిగణించాల్సి వస్తోంది. కాని చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితుడి కోసం గాలిస్తాం. నరేష్, ఎస్సై, కొడవలూరు