కొడవలూరు : ట్రాక్టర్ - బైక్ ఢీకొని రైల్వేస్టేషన్ మాస్టర్ మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన మునిస్వామి(50) తలమంచిలో రైల్వేస్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఆయన డ్యూటీకి బైక్‌పై వెళ్తుండగా కొడవలూరు రైల్వే గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.