న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉద్యమం మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను వారు ఈ సందర్భంగా షిండే దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారు.
భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను మరోసారి షిండేకు తెలిపామని, తెలంగాణపై ఇంకా నోట్ తయారు కాలేదని షిండే తమతో చెప్పారన్నారు. మరి కొద్దిరోజుల్లో ఆంటోనీ కమిటీ మరిన్ని చర్చలు జరుపుతుందన్నారు. ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకు వెళ్తామని షిండే తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదు, రాబోదని సీమాంధ్ర ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రత షిండేకే ముందే తెలుసునన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాదు.... రాబోదు'
Published Sat, Sep 21 2013 12:54 PM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement