Seemandhra Congress leaders
-
టీ కాంగ్రెస్‌లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కల నియామకంలో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకున్నారని వీహెచ్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, పార్టీ అంతర్గత విషయాలను బాహాటంగా బయటపెట్టడంపై వీహెచ్‌ను ఎమ్మెల్సీ రంగారెడ్డి తప్పుబట్టారు. -
కేసీఆర్ మర్యాద నేర్చుకో
టీఆర్ఎస్ అధినేతపై ఏపీ పీసీసీ నేతల ఫైర్ సాక్షి, హైదరాబాద్: ‘‘కేసీఆర్.. మేమూ ఆంధ్రావాళ్లమే.. మా ఉద్యోగ సంఘాల తరఫున సవాల్ విసురుతున్నాం. రాజ్యాంగానికి లోబడి మాట్లాడండి... మర్యాదగా ప్రవర్తించండి. ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు. మీ రాష్ట్రం.. మీరేమైనా చేసుకోండి.. మా వాళ్లనంటే ఊరుకునేది లేదు’’ అని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనీయమని కేసీఆర్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యల్ని ఏపీపీసీసీ నేతలు తప్పుబట్టారు. మాజీ మంత్రులు మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్, ఎమ్మెల్సీ పాలడుగు, ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు, మరో ప్రతినిధి గౌతమ్‌లు శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. -
రుణమాఫీ పై డ్రామాలాడుతున్నారని విమర్శ
-
మొన్న ఢిల్లీ పెద్దల చుట్టూ...నేడు శ్రీవారి ఆలయం చుట్టూ
-
మార్కెటింగ్ పాఠాలు నేర్చుకుంటున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు
-
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బస్ యాత్ర
-
డీసీసీ అధ్యక్షులతో భేటీ అరుున బొత్స
-
అంతా అయోమయం..
ఒకవైపు ఖాళీ అవుతున్న పార్టీ.. మరోవైపు పోటీకి అభ్యర్థులే లేని పరిస్థితి డీసీసీ అధ్యక్షులతో భేటీ అరుున బొత్స కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదన్న నేతలు సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని ప్రచారం చేస్తున్న సమయంలో లోక్‌సభతో పాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకూ షెడ్యూల్ విడుదల కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఒకవైపు మున్సిపల్, మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడమెలాగో వారికి అంతుబట్టడం లేదు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోవడం, పార్టీకి పెద్ద దిక్కంటూ లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు వారిని బెంబేలెత్తిస్తున్నారుు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు చివరివరకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సమయంలో ఎన్నికలను ఎదుర్కోలేమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ వంటి పార్టీలతో పొత్తుకు అవకాశమున్నప్పటికీ సీమాంధ్రలో ఆ దారి కూడా లేదని వాపోతున్నారు. ఇటీవలి అనేక సర్వేలు సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని పేర్కొనడం నేతల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ తరఫున పోటీ చేయకుండా ముఖం చాటేసే యోచనలో ఉన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ పెద్దలకు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. సీమాంధ్రకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని హైకమాండ్ సూచించింది. అందరిలోనూ నిరాశ, నిస్పృహే: ఈ నేపథ్యంలోనే బుధవారం బొత్స సీమాంధ్ర ప్రాంత డీసీసీల అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో పరిస్థితిపైనా ఆరా తీశారు. పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఈ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని నేతలంతా ముక్తకంఠంతో చెప్పారు. రాష్ట్ర విభజన పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిందన్నారు. లోక్‌సభ బరిలో తాజా మాజీ మంత్రులు: రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర తాజా మాజీ మంత్రులను ఆ ప్రాంతంలో లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేయించే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు బొత్స చెప్పారు. తాజా మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే సీమాంధ్రలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌కు కొంత ఊపు వస్తుందని, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున అంగ, అర్ధబలంతో జనాన్ని సమీకరించగలరని డీసీసీల నేతలు సూచించడంతో బొత్స ఈ విషయం వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, డీసీసీ ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. -
రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపును స్వాగతిస్తున్నామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, విప్ రుద్రరాజు పద్మరాజులతో కలసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బలం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. మరో మూడ్నాలుగురోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో సర్కారును ఏర్పాటు చేయడం వల్ల లాభం లేదన్నారు. పైగా అధికార దుర్విని యోగానికి పాల్పడ్డామన్న అపవాదు మోయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందన్నారు. నిలకడ లేనివారు, రాజకీయ అజ్ఞానులు, అధికారమే పరమావధిగా ఉన్నవారే ఎన్నికల ముందు ఇతర పార్టీల్లో చేరుతుంటారన్నారు. వారిది అవకాశవాదం, కప్పదాటుగా అభివర్ణించారు. కిరణ్ ఐనా వేరొకరైనా ఇవే అంశాలు వర్తిస్తాయన్నారు. ‘‘పాలనా వ్యవహారాలు సాగేందుకు వీలుగా ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరితే.. తానుండబోనంటూ వ్యవస్థను చులకన చేసిన కిరణ్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రపతి పాలనపై అధికారిక నిర్ణయం జరిగాక కొత్త పార్టీ పెడతానంటున్న కిరణ్ వైఖరేదో తేలిన వెంటనే.. ఇకరోజూ ఆయన గురించే చెబుతాం. మీకు(మీడియాకు) తెలిసినవి చాలా తక్కు వ. మేము నోరు విప్పితే అనేకాంశాలు బయటికొస్తాయి’’ అని అన్నారు. -
సోనియాతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
-
'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'
హైదరాబాద్: సీఎం పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు అన్నారు. కిరణ్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర రాష్ట్రాన్ని నడపలనుకోవడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. 15, 25 రోజుల్లో సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అనేది కేంద్రమే తేల్చాలన్నారు. రాజధాని అంశంపై సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదని చెప్పారు. -
16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 16న సీమాంధ్ర ఎమ్మెల్యేలు... ఎమ్మెల్సీలు... మంత్రుల సమావేశం జరుగుతుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎం కొత్తపార్టీపై చర్చ.... ఎలక్షణ్ ఎజెండా కాదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని కాసు కృష్ణారెడ్డి తెలిపారు. -
క్లైమాక్స్ అదిరింది!
-
క్లైమాక్స్ అదిరింది!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ క్లైమాక్స్ అదిరింది. బిల్లు నెగ్గాలి. కానీ సీమాంధ్రలోనూ తమ ఎంపీలకూ మైలేజ్ రావాలి. నాటకం రసవత్తరంగా సాగాలి. ఇదీ వార్‌రూమ్ వేదికగా కాంగ్రెస్ అధిష్టా నం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు చేసిన దిశానిర్దేశం. తెలంగాణ బిల్లు తుది ఘట్టానికి చేరేసరికి కాంగ్రెస్ తనదైన శైలితో రాజకీయానుభవాన్ని ప్రదర్శిస్తోంది. సభలో ఎవరు ఎలా నడుచుకోవాలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, జీఓఎం సభ్యుడు జైరాం రమేశ్‌లు సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు. తెలంగాణ బిల్లుపై విపక్షాలు తమవైపే వేలెత్తుతున్న నేపథ్యంలో.. సీమాంధ్రకు చెందిన సొంత పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా ఎలా నడుచుకోవాలో చెప్పేందుకు మంగళవారం రాత్రి ఇరుప్రాంతాల నేతలతో కాంగ్రెస్ అధిష్టానం ఒక భేటీ ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో సీమాంధ్రలో పార్టీ పరిస్థితి, గెలుపోటములను ఆ ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రస్తావించారు. బిల్లు ప్రస్తుత రూపంలో వద్దని, సవరణలు కావాలని పట్టుబట్టారు. ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రలోనే ఉండేలా చూడడం వంటి సవరణలన్నీ కేంద్ర మంత్రులు ప్రతిపాదిస్తారని, వీటిని కేంద్రమంత్రి జేడీశీలం చూడాలని అధిష్ఠానం పెద్దలు సూచించారు. ఇక సీమాంధ్రలో తదుపరి ఎన్నికల పర్వంలో గట్టెక్కాలంటే ఎంపీలు సభలో ప్రతిఘటించాలని.. అయితే ఇది సభావ్యవహారాలను నిలువరించే రీతిలో ఉండకూడదని ఆదేశించారు. ప్రభుత్వ, పార్టీ గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ సహకరించాలని అధిష్ఠానం పెద్దలు ఎంపీలను కోరారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలు దాదాపు 10 సవరణలు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉంటే ఏంటి?, యూటీగా ఉంటే ఏంటి? అని వాదించినట్టు సమాచారం. కర్నూలు, అనంతరపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కొందరు కోరారు. ఇక రెవెన్యూ విషయంలో సీమాంధ్ర వాటా ఎంత? ఆర్థిక ప్యాకేజీ ఎంతిస్తారు? నీటి పంపకాలపై స్పష్టత ఏదీ? ఇక్కడి ఉన్న కేంద్ర సంస్థలు అక్కడ నెలకొల్పుతారా? లేదా?వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు. విభజన చేసే పరిస్థితులలో హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో రాష్ట్ర ప్రతిపత్తితో కూడిన కేంద్ర పాలితంగా ప్రకటించాలని, హైదరాబాద్‌లో ఉద్యోగులు, విద్యార్ధుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సహా 10 సూచనలను కేంద్రమంత్రి చిరంజీవి పార్టీ పెద్దల ముందుంచారు. వాటిలో కొన్నింటి పైనైనా బిల్లులో మార్పులు తీసుకువస్తే సీమాంధ్ర ప్రజలను తాము ఒప్పించే ప్రయత్నం చేస్తామని చిరంజీవి చెప్పారు. ఈ సమయంలోనే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర స్వరంతో అగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లు జోక్యం చేసుకుని ‘ఎవరి అభిప్రాయాలను వారు చెప్పనీయండి’ అనడంతో పాల్వాయి మిన్నకుండిపోయారు. భేటీ అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు. ‘తిరస్కరించిన బిల్లును తెస్తే వ్యతిరేకంగా ఓటేస్తాం’ ‘ప్రస్తుత విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించింది. తిరస్కరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదని కోరాం. అలాకాకుండా బిల్లు తెస్తే పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేస్తామని కచ్చితంగా చెప్పాం. బిల్లులో సీమాంధ్రకు న్యాయం చేస్తామని, అవసరమైన సవరణలు తెస్తామని జైరాం రమేశ్ చెప్పారు. అయితే మా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. బుధవారం రాష్ట్రపతిని కూడా కలుస్తాం’ - సీమాంధ్ర ఎంపీలు అనంత, మాగుంట శ్రీనివాసులురెడ్డి ‘సీమాంధ్రులకు న్యాయం జరగాలని మేమే కోరుతున్నాం’ ‘రాష్ట్ర విభజన బిల్లు కచ్చితంగా ఆమోదిస్తామని, కీలకమైన ఐదారు బిల్లుల తర్వాత దీన్ని ప్రవేశపెడతామని అధిష్టాన పెద్దలు హామీ ఇచ్చారు. ఇది శుభపరిణామం. సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు సిధ్దమని జైరాం, దిగ్విజయ్ తెలిపారు. రాయలసీమకు ప్యాకేజీ, హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని అన్నారు. మేము సైతం సీమాంధ్రకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం. అయితే బిల్లును అడ్డుకుంటామనడం మాత్రం సరైంది కాదు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలి’- తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చలు ఫలప్రదమే ‘సమస్య పరిష్కారం కోసం ఇలాంటి సమావేశాలు జరపాలని ఎప్పుడో కోరాం. ఇరుప్రాంతాల నేతలను కూర్చోబెడితేనే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటివరకైతే చర్చలు ఫలప్రదమేనని భావిస్తున్నాం’ - కేంద్ర మంత్రి జేడీ శీలం మంచి సమావేశం: దిగ్విజయ్ ‘మంచి సమావేశం జరిగింది. అభిప్రాయాలు తెలుసుకున్నాం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధం. రెండు ప్రాంతాల ప్రజలు తాము గెలిచామని భావించే పరిస్థితి ఉంటుంది’. -
రాజ్యసభకు ఇండిపెండెంట్‌గా పోటీ: ఉండవల్లి
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్టు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతివ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆయన పలువురు ఎమ్మెల్యేలను కోరారు. ‘సమైక్య ఎంపీ’గా బరిలో దిగాలని ఆయన భావిస్తున్నారు. సమైక్యవాదం పేరుతో ఇటీవల రాజీనామా చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన ఎంపీల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. సీమాంధ్ర లోక్‌సభ సభ్యుల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకోవడం మంచి పరిణామమని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పోటీకి దించితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. -
ప్రతి క్లాజ్‌కు సవరణలు కోరదాం
-
ప్రతి క్లాజ్‌కు సవరణలు కోరదాం
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో పునర్విభజన బిల్లుపై చర్చలో పాల్గొని ప్రతి క్లాజ్‌పైనా సవరణలు ప్రతిపాదించాలని సీవూంధ్ర కాంగ్రె స్ నేతలు నిర్ణరుుంచారు. బిల్లుపై కూలంకషంగా చర్చించడంతోపాటు అంతివుంగా ఆ బిల్లును వ్యతిరేకిస్తూ స్పష్టమైన అభిప్రాయూలు వ్యక్తపరచాలని తీర్మానించారు. వుంగళవారం న్యాయుశాఖ వుంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నివాసంలో సీవూంధ్ర నేతలు కొందరు సమావేశమై బిల్లులోని చర్చలో పాల్గొనాల్సిన అంశాలపై చర్చించారు. వుంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఉండవల్లి అరుణకువూర్, ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, వుల్లాది విష్ణు, వుుత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లు పై చర్చ సాగించడమే వుంచిదని, బిల్లుపై ఎంత ఎక్కువవుంది వ్యతిరేకత వ్యక్తపరిస్తే పార్లమెంటులో అంత గట్టిగా ఎంపీలు వూట్లాడేందుకు ఆస్కారవుుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్, ఉద్యోగులు, పెన్షనర్లు, 371 డి ఇలా అనేకాంశాలను సభ్యులంతా వుుక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరవుుందన్నారు. క్లాజులకు సవరణలు ప్రతిపాదించి డివిజన్ కోరడం ద్వారా బిల్లును వ్యతిరేకించ వచ్చని, అది బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానించినట్లే అవుతుందని గాదె అన్నారు. -
రేపు,ఎల్లుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష
-
దేనికైనా రెఢీ
-
బిల్లును వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది: సిఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. బిల్లును పూర్తిగా అద్యయనం చేయండని సీఎం వారికి చెప్పారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం రావొచ్చునన్నారు. క్లాజుల వారీగా మనకున్న అభ్యంతరాలను సభలో నమోదు చేద్దాం అని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చకు పూర్తిగా సహకరించాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం వారికి సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా, శాసన సభలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తామని సీమాంధ్ర మంత్రి కాసు కృష్ణా రెడ్డి చెప్పారు. సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు ఇచ్చారు. -
చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు
-
అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని తెలిపారు. బిల్లును వ్యతిరేకించి ఓటింగ్ కోసం పట్టుబడతామన్నారు. దీనికోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ బాధ్యతలను ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస్, శైలజానాథ్లకు అప్పగించామని తెలిపారు. రాయల తెలంగాణ అనే అంశాన్ని పక్కకు పెట్టి, సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యంగా కలిసిరావాలని సూచించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా విభజన బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పేలా రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోకుంటే పెంచేందుకు కూడా మరింత సమయం కోరతామన్నారు. విభజన బిల్లును వ్యతిరేకించిన అనంతరం ఆ బిల్లును పార్లమెంటుకు పంపరాదని రాష్ట్రపతిని కోరాలని మంత్రులు తెలిపారు. ఒకవేళ ఆ బిల్లును రాష్ట్రపతి పంపితే దానిపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులతో మాట్లాడి వారి పదవులకు రాజీనామా చేయాలా?...లేకపోతే పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించాలా?...అన్నదానిపై చర్చించాలన్నారు. ఈ విషయాలనే సీఎంతో భేటీలో చర్చించామన్నారు. -
కాసేపట్లో సీమాంద్ర మంతులు సీఎంతో భేటి
-
విభజనపై ఎవరి వాదన వారిదే: బొత్స
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణవాళ్లు విభజనను సమర్థిస్తూ మాట్లాడతారు. సీమాంధ్ర వారు విభజనను వ్యతిరేకిస్తారు. మేం మాత్రం హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వివరిస్తాం’’ అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా ఉన్న మీరు హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కరెక్టేనా? అని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై మీరు కాదు నన్ను ప్రశ్నించాల్సింది. మా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ అడిగితే సమాధానం చెబుతా. ఇది మా పార్టీ అంతర్గత విషయం. మీరు అడగాల్సిన అవసరంలేదు. ఇదే విషయం రాసుకోండి’’ అని సమాధానమిచ్చారు. అంతకుముందు బొత్స రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ‘‘తెలంగాణలోని నాయకులంతా విభజనకు అనుకూలంగా మాట్లాడండి. సీమాంధ్ర నేతలంతా సమైక్యంగా ఉండాలని చెప్పండి. తద్వారా ఇరు ప్రాంతాల్లో ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించండి. రాష్ట్రం విడిపోయినా, సమైక్యంగా ఉన్నా పార్టీని గెలిపించే దిశగానే మనం పనిచేయాలి. ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌కే సాధ్యమని చెబుతూ ప్రజలను నమ్మించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని పార్టీ కార్యదర్శులకు బొత్స దిశానిర్దేశం చేశారు. ‘‘2014 ఎన్నికలు కాంగ్రెస్‌కు కచ్చితంగా సవాలే. దీనిని స్వీకరించే అవకాశం మనకు రావడం కూడా ఓ సవాలే. అర తమాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే లేదనుకోవద్దు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉంది. వారిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా కృషి చేయాలి’’ అని బొత్స వారికి సూచించారు. పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు.. 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బొత్స సోమవారం పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించారు. సోషల్ మీడియా, మీడియా మేనేజ్మెంట్, పబ్లిసిటీ టీం, ఎలక్షన్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అనాలసిస్, సర్వే పేరిట మొత్తం ఐదు కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఐదు నుంచి ఏడుగురు సభ్యులను నియమించారు. పీసీసీ అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ఆ కమిటీల్లో నియమించారు. మీడియా మేనేజ్మెంట్ కమిటీ పీసీసీ అధికార ప్రతినిధులు మహేష్‌కుమార్‌గౌడ్, సీహెచ్ ఉమేశ్‌రావు, జంగా గౌతమ్, కాట్రగడ్డ ప్రసూన, డి.అనురాధ, టి.కల్పనారెడ్డితోపాటు పీసీసీ కార్యదర్శి నేతి శ్యాంసుందర్. సోషల్ మీడియా: పీసీసీ కార్యదర్శులు దిలీప్ సి.బైరా, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అనిత జక్కని, ఎన్.దిలీపాచారి, చరణ్జోషి, మద్దుల గాల్‌రెడ్డి. పోల్ మేనేజ్మెంట్: మర్రి ఆదిత్యారెడ్డి, నందిమండలం వేణు, బోయినపల్లి కృష్ణమూర్తి, ఎస్వీ సుధీర్, కొణిదల ఇందిర. రీసెర్చ్ అనాలసిస్, సర్వే కమిటీ ఎ. శ్రీరాంయాదవ్, ఎన్. పద్మావతిరెడ్డి, వి. శ్రీరాంనాయక్, జయదేవ్ గల్లా, కె.కృష్ణ, జి.రఘునందన్బాబు. ఎన్నికల ప్రచార, వ్యూహ కమిటీ: ఎస్.జగదీశ్వర్‌రావు, ఎన్.కరణ్‌గౌడ్, గున్నం రాంబాబు, ఆర్.స్వామినాయుడు, కేబీఎస్ శివాజీ, ఎస్.మాధవి. -
జై సమైక్యాంధ్ర అనండి, పార్టీని తిట్టకండి: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపధ్యంలో ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచనలతో సొంత పార్టీనే విమర్శిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాల మేరకు జై సమైక్యాంధ్ర అనొచ్చు గానీ పార్టీని తిట్టకూడదన్నారు. సమైక్యాంధ్ర పేరుతో కాంగ్రెస్‌నే విమర్శించే పార్టీ నేతలపై వేటు తప్పదన్నారు. పార్టీపై విమర్శలు చేస్తున్న నాయకులను గుర్తించి తుది జాబితాను సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే కొందరు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లను పదవుల నుంచి తప్పిస్తామని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు వ్యవహరించొచ్చని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే విధంగా వ్యవహరిస్తే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. -
విభజన పై స్పష్టత ఇచ్చీ ఇవ్వనట్టున్న కేంద్ర వైఖరి
-
బిల్లు పూర్తయ్యేదాకా ఢిల్లీలోనే: తెలంగాణ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు తుదిరూపు దిద్దుకుంటున్న తరుణంలో హైదరాబాద్, భద్రాచలం తదితర అంశాలపై కేంద్రమంత్రుల బృందంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒత్తిళ్లు పెంచుతున్నందున తామూ ఢిల్లీలోనే ఉండి ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. టీ కాంగ్రెస్ నేతలు ఆదివారం లే క్వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు.ఈ నెలాఖరులోగా జీవోఎం తెలంగాణ బిల్లును కేబినెట్‌కు సమర్పించే అవకాశమున్నందున అంతకుముందే అంతా ఢిల్లీ చేరుకోవాలని నిర్ణయించారు. కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్, జాతీయ విపత్తుల నివారణ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలోని 117 అసెంబ్లీ స్థానాల సంఖ్యను 153కు పెంచాలని కేంద్రమంత్రుల బృందాన్ని కోరాలని నిర్ణయించారు.ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సెగ్మెంట్లు చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై జీఓఎంను కలిసేందుకు సోమవారమే ఢిల్లీ వెళ్లనున్నామని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. జిల్లా యూనిట్‌గా ఎమ్మెల్యే నియోజకవర్గాలను కేటాయించాలని, అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు స్థానాలు కేటాయించాలని బలరాంనాయక్ పేర్కొన్నారు. క్యాంపు కేపిటల్ గానే అనుమతిద్దాం విభజన తర్వాత హైదరాబాద్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తదితర నేతలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ం ప్రకారం అందుకు అవకాశాల్లేవని, ఉమ్మడి అనడం వల్ల సాంకేతికంగా అనేక సమస్యలు కూడా తలెత్తుతాయని వివరించారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబాల్ ఉమ్మడి రాజధాని సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీకి నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ నివేదికలో ఉమ్మడి అని కాకుండా కేవలం క్యాంపు కేపిటల్‌గా మాత్రమే చేయాలని సూచించి నట్లు తెలుస్తోందని చెప్పారు. విభజన అనివార్యమని ప్రతి ఒక్కరికీ తెలిసినా సీఎం మాత్రం ఇంకా ప్రజలను మోసగించే తీరులోనే మాట్లాడుతున్నారని వారు దుయ్యబట్టారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించడం ద్వారా వారం పదిరోజులు అసెంబ్లీ బిల్లును ఆలస్యం చేయించాలని సీఎం ఎత్తుగడ వేస్తున్నారని, దీన్ని తెలంగాణ మంత్రులెవరూ అంగీకరించరాదని సమావేశంలో నేతలు స్పష్టంచేశారు. -
'సీఎం, స్పీకర్ నిమిత్తమాత్రులే'
విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆదేశం మేరకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్దే అని ప్రభుత్వ విప్ అనిల్ స్పష్టం చేశారు. ఆ విషయంలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు నిమిత్తమాత్రులేని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పడు ప్రొరోగ్ పేరుతో రాజకీయాలు చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన స్పీకర్ స్థానాన్ని రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాల్లోకి లాగడం సరికాదని అనిల్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు పై చర్చ
-
రాష్ట్రకాంగ్రెస్ నేతల ప్రతిపాదనల పై చర్చ
-
విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే
-
కార్టూన్
పార్లమెంటులో బిల్లు పాసైనా సరే ప్యాకేజీలు సాధించి విభజనను అడ్డుకుంటామని హామీ ఇస్తున్నాం! -
విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే
సమైక్య రాష్ట్రాన్ని కాపాడతామని నేతల మాయమాటలు విభజనను అడ్డుకునేందుకే కొనసాగుతున్నామని సీఎం బుకాయింపు కేబినెట్ నోట్ వచ్చినా, జీవోఎం ఏర్పాటైనా రాజీనామాలు చేయలేదు ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందంటూ ప్యాకేజీల కోసం డిమాండ్ ఇన్నాళ్లూ మభ్యపెట్టి, ఇప్పుడు విభజనకు సహకరిస్తున్నారంటూ సీమాంధ్ర ప్రజల మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఇంతకాలం చెబుతూ వస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చివరకు తోకముడిచారు. ఇంతకాలం విభజనను అడ్డుకుంటామని మభ్యపెట్టిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఆ ప్రాంత ఎంపీలు, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల ఫోరం ఒక్కొక్కరుగా తమ నిజస్వరూపాల్ని ఆవిష్కరిస్తున్నారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందన్న కారణాన్ని చూపుతూ గడిచిన కొన్ని రోజులుగా ప్యాకేజీ కోరడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని, దానికోసం ఎంతవరకైనా వెళతామని గొప్పలు చెప్పారు. సమైక్యం కోసం రాజీనామాలకు వెనకాడబోమని, కేంద్రం విభజనపై ముందడుగువేస్తే రాజీనామాలు చేస్తామంటూ రకరకాల ప్రకటనలు చేసిన నాయకులే ఇప్పుడు ఒక్కొక్క గ్రూపుగా కేంద్ర పెద్దల ముందుకు వెళ్లి ప్యాకేజీలు కోరుతున్నారు. రాజీనామాలు చేసైనా సరే విభజనను అడ్డుకుంటామని ప్రకటించిన సీమాంధ్ర ఎంపీలు కొద్దిరోజులుగా తమ హడావిడిని తగ్గించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కొద్ది రోజుల కిందటే కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి ప్యాకేజీపై ఏకంగా నివేదికనే సమర్పించి చేతులు దులుపుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. మొదటినుంచీ మోసపూరిత మాటలే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం పోటాపోటీగా సీమాంధ్ర ప్రజలను మోసగిస్తూ వచ్చారు. రాజీనామా డిమాండ్ వచ్చిన ప్రతిసారీ... కేబినెట్‌కు తెలంగాణ నోట్ రాకుండా అడ్డుకోవడానికే పదవుల్లో కొనసాగుతున్నామని సీమాంధ్ర కేంద్రమంత్రులు చెబుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తీర్మానం కోసం వస్తుందని, దాన్ని ఓడించాలంటే రాజీనామాలు చేయకూడదని పక్కదారి పట్టిస్తూ వచ్చారు. కానీ బిల్లు అసెంబ్లీ అభిప్రాయం కోసం మాత్రమే వస్తుందని, దానిపై తీర్మానం చేయడం కోసం కాదని కేంద్ర హోమ్ మంత్రి షిండే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌లు తేల్చిచెప్పారు. కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం, మంత్రుల బృందం ఏర్పాటుకావడం తదితర పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ సీమాంధ్ర కేంద్ర మంత్రులుకానీ, ముఖ్యమంత్రికానీ రాజీనామాలు చేయలేదు. ఇపుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పట్టిందని ప్రచారం చేస్తూ నెమ్మదిగా సమైక్యాన్ని విడిచిపెట్టి విభజనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రధాని మన్మోహన్సింగ్ను కలసి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని నివేదిక ఇచ్చారు. ఇప్పుడదే బాటలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు విభజనతో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. కేంద్ర మంత్రుల బృందం రాసిన లేఖకు సమాధానంగా పంపిన నివేదికలో, అఖిలపక్షానికి పీసీసీ తరఫున అందించిన నివేదికలోనూ విభజనకు అనుకూలంగా సీమాంధ్ర నేతలు పలు ప్రతిపాదనలను పొందుపరిచారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన దాదాపు 30కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం సీమాంధ్రలో ఏర్పాటుచేయాలని, ప్రైయివేటు పరిశ్రమలు, పెట్టుబడులు సీమాంధ్రకు వచ్చేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ఎండీయే పరిధిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకంచడంతో పాటు అక్కడి ఆదాయ వనరుల్లో జనాభా ప్రాతిపదికన తెలంగాణ, సీమాంధ్రులకు వాటా కల్పించాలని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరమని, పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు మరో లక్ష ఎకరాలు కావాలని, ఇంత భూమిని కేంద్రం సమకూర్చాలంటే రెండు లక్షల ఎకరాలున్న అటవీప్రాంతాన్ని కేంద్రం డీనోటిఫై చేయాల్సి ఉంటుందని చెబుతూ రకరకాలుగా కేంద్రానికి నివేదిస్తున్నారు. ఇవన్నీ విభజన జరిగాక కావాల్సిన వనరుల గురించి మాత్రమేననే విషయం గమనార్హం. కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ గోదావరి తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇవ్వడం కూడా ఇందులో భాగమే. మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి రెండురోజుల కిందట సీమాంధ్రను సింగపూర్‌లా మారుస్తానని, బాపట్లను భాగ్యన గరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం అంతా ఒక పథకం ప్రకారమే నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ డిమాండ్లన్నీ అసాధ్యమన్న విషయం తెలిసినా... విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కాలయాపన కోసమే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారా? అన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజల్లో తలెత్తుతున్నాయి. తమను ఇన్నాళ్లూ మభ్యపెట్టే ప్రకటనలతో కాలయాపన చేసి ఇప్పుడు విభజనకు సహకరిస్తూ నట్టేట ముంచారని మండిపడుతున్నారు. -
రాష్ట్ర కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ, మంత్రుల బృందానికి నివేదిక పంపే విషయంలో కసరత్తు నేపథ్యంలో కాంగ్రెస్‌లో కాక రేగింది. పోటాపోటీ సమావేశాలతో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పనిలో పనిగా ఒకరిపై విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయిన తెలంగాణ నేతలు సీఎం కిరణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు సమాచారం. జీఓఎం, అఖిలపక్ష భేటీపై చర్చిచేందుకు పార్టీ తరపున రెండు సమావేశాలు ఎందుకు పెట్టారని బొత్సను తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిలదీసినట్టు తెలిసింది. సీమాంధ్ర నాయకులతోనే సీఎం సమావేశం నిర్వహించడాన్ని వారు తప్పుబట్టారు. తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. పార్టీ తరపున జీఓఎంకు ఒకే నివేదిక పంపాలని వారు పట్టుబడుతున్నారు. అటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో భేటీ అయ్యారు. సాయంత్రం సీఎం కిరణ్ తో వారు సమావేశం కానున్నారు. బొత్సతో సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో మంతనాలు జరిపారు. -
సీఎం, బొత్సతో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం సమావేశమవుతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో జరిగే ఈ భేటీలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. విభజనతో ముడిపడిన 11 కీలక అంశాలపై పార్టీల అభిప్రాయాలు చెప్పాలంటూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కోరిన నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేసిన అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. దీనిపై ఎలా స్పందించాలనేది కిరణ్, బొత్సలే నిర్ణయం తీసుకుంటారని నేతలంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా బొత్స సత్యనారాయణతో సమావేశం అవుతున్నారు. -
రెండు ప్రాంతాల నేతలతో భేటీ కానున్న బొత్స
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రక్రియపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) రాసిన లేఖపై ఏం చెప్పాలనే అంశంపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం వేర్వేరుగా భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే అఖిలపక్ష సమావేశంలో వెల్లడించాల్సిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ, సాయంత్రం 4.30 గంటలకు సీమాంధ్ర నేతలతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అవుతారు. విభజన ప్రక్రియపై తగిన సలహాలు, సూచనలివ్వాల్సిందిగా కేంద్రహోంశాఖ గత నెల 30న అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో అదే విషయాన్ని బొత్స ఎదుట కూడా చెప్పాలని ఆయా నేతలు నిర్ణయించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అవసరం లేదని, 3 నుంచి 5 ఏళ్లకే పరిమితం చేయాలని, సరిహద్దులు కూడా మార్చాల్సిన అవసరం లేదని సూచించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి మేరకు శాంతిభద్రతల అంశాన్ని కేంద్రం పర్యవేక్షించినా తమకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని స్పష్టం చేయనున్నారు. బచావత్ ట్రిబ్యునల్ మేరకు నీటి వనరుల పంపకం జరపాలని, అదే విధంగా తెలంగాణతోపాటు సీమాంధ్రలోనూ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ తరపున ఒక్కరిని మాత్రమే పంపడంతోపాటు సీడబ్ల్యూసీ తీర్మానాన్నే పార్టీ అభిప్రాయంగా చెప్పాలని కోరనున్నారు. విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెల్లడిం చేందుకు పార్టీ తరపున పీసీసీ చీఫ్ వెళ్లడమే సరైనదనే భావనను వ్యక్తం చేయనున్నట్టు తెలిసింది. అయితే తాను వ్యక్తిగతంగా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెబుతున్న బొత్స అఖిలపక్ష సమావేశానికి వెళతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. సమైక్య వాదాన్ని విన్పిస్తున్న తాను అఖిలపక్ష సమావేశానికి వెళ్లి విభజన నిర్ణయాన్ని వెల్లడిస్తే ఇబ్బందికరంగా ఉంటుందనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమైనందున విభజన కోసం జరిగే అఖిలపక్ష సమావేశంపై స్పందించాల్సిన అవసరమే లేదని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఇటీవల వెల్లడించినందున సీఎం, బొత్సతో జరిగే భేటీలో జీవోఎం లేఖను, అఖిలపక్ష సమావేశాన్ని వ్యతిరేకించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే సీమాంధ్ర నేతల్లో ఈ అంశంపై విభేధాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. విభజన ప్రక్రియ అనివార్యమైన నేపథ్యంలో సమైక్య వాదనను పక్కనపెట్టి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించడమే మేలని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రకు దక్కాల్సిన ప్రయోజనాలపై సీరియస్‌గా దృష్టి సారిం చాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య వాదం పేరుతో సీఎం సహా సీమాంధ్ర నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మంత్రులు ఆనం , రఘువీరా, బాలరాజు, కొండ్రు తదితరులు విభజన అమలు అనివార్యమైన నేపథ్యంలో జీవోఎం లేవనెత్తిన అంశాలపై స్పందించి సీమాంధ్రకు కావాల్సిన ప్రయోజనాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర నేతల భేటీకి హాజరవుతున్న సీఎం తెలంగాణ నేతల భేటీకి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. విభజన విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వీరెవరూ కిరణ్‌ను కలిసేందుకు ఆసక్తి చూపకపోవడంవల్లే బొత్స వారితో భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రపతితో భేటీ కానున్న టీ మంత్రులు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనను కలవాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. రాత్రి 8.30 గంటలకు ఈ మేరకు రాష్ట్రపతి అపాయిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజనకు సంబంధించి సీఎం కిరణ్ ఇటీవల రాష్ర్టపతికి లేఖ రాసిన నేపథ్యంలో దానికి ధీటుగా రూపొం దించిన లేఖను వారు ప్రణబ్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. -
దిగ్విజయ్‌సింగ్‌ను నిలదీసిన సీమాంద్ర కాంగ్రెస్ నేతలు
-
సీమాంద్ర కాంగ్రెస్ నేతలతో ముగిసిన రాష్ట్రపతి భేటీ
-
'రాష్ట్రపతి గారు.. సీమాంధ్రుల మనోభావాల్సి పట్టించుకోండి'
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్‌తో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 30 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో రాష్ట్రాలను విభజించినపుడు పాటించిన పద్ధతిని ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్టు భేటి అనంతరం నాయకులు చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని తెలియజేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్టు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారు. -
'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'
న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగ విరుద్ధమని మంత్రి ఎస్ శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని రాష్ట్రపతిని కోరానున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సాయంత్రం 7 గంటలకు కలవనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదని స్పష్టం చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, పలువురు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో సీమాంధ్ర నాయకులు భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం చివరివరకు ప్రయత్నాలు చేస్తామని శైలజానాధ్ అంటున్నారు. -
విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది: గంటా
న్యూఢిల్లీ : సమైక్య రాష్ట్ర అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పలువురు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాత్రి ఏడుగంటలకు కలువనున్నారు. 60 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని.... విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తోందంటూ సీమాంధ్ర నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని...అప్రజాస్వామిక విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి, ఎనిమిది గంటలకు దిగ్విజయ్‌ను కలుస్తామన్నారు. విభజనపై అసెంబ్లీ తీర్మాణం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆరోపణ. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ వ్యతిరేకిస్తే విభజన ప్రక్రియను ఆపాలంటూ రాష్ట్రపతిని సీమాంధ్ర నేతలు కోరనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌తో భేటీ కానున్న నేతలు... విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కుదేలైన కాంగ్రెస్‌ను ఎలా బతికిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించనున్నారు. విభజన ముసాయిదా బిల్లు నవంబర్ అఖరుకల్లా అసెంబ్లీకి రానున్న నేపధ్యంలో సమైక్య రాష్ట్ర డిమాండ్‌పై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఈ తాజా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన చేరుకున్న వారిలో మంత్రులు గంటా శ్రీనివాసరావు,టీజీ వెంకటేష్,ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
రాష్ట్రపతిని కలువనున్న నేతలు
-
రేపు ఢిల్లీకి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానం పెద్దలతోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురు, శుక్రవారాల్లో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నారు. విభజన విషయంలో కేంద్రం దూకుడు పెంచినందున తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించాలని వారు నిర్ణయించారు. మొదటి నుంచీ రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటున్నామని, కానీ తమ అభిప్రాయంతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా విభజన నిర్ణయాన్ని తీసుకుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తలపోస్తున్నారు. విభజనపై కేంద్రం ముందుకు వెళ్లినా.. బిల్లు ఆమోదం కోసం వచ్చినప్పుడు ఆమోదించకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని రాష్ట్రపతికి విన్నవించాలని వారు భావిస్తున్నారు. ఈ మేరకు 24, 25వ తేదీల్లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు. అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయి: రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రం లోని పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా పునరాలోచనలో పడ్డాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాదని తెలుస్తోందని, కేంద్రం నిర్ణయాన్ని అది వ్యతిరేకించే పరిస్థితి ఉందని గంటా చెప్పారు. ఇతర పార్టీలు కూడా విభజనపై వ్యతిరేక అభిప్రాయానికి వస్తున్నందు న తెలంగాణ ప్రక్రియ నిలిచిపోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం కూడా దీనిపై పడుతుందన్నారు. పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రాకపోవచ్చు: నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదని గంటా అభిప్రాయపడ్డారు. ‘‘చిరంజీవి తన హయాంలో మెగాస్టార్‌గా ఉన్నారు. ఇప్పుడాయన రాజకీయాల్లోకి వచ్చేశారు కనుక ఆ స్థానాన్ని పవర్ స్టార్ ఆక్రమించారు. ఆయన అన్ని ప్రాంతాల్లో మంచి ఇమేజ్ సంపాదించుకొని ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారని నేను భావించడం లేదు’’అని మంత్రి పేర్కొన్నారు. -
రాష్ట్ర విభజన వద్దంటున్న సీమాంధ్ర నేతలు
-
17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ
సమైక్యాంధ్ర ఎజెండా నుంచి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జారిపోవచ్చని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అలా సీమాంధ్ర నేతలు జారి పోయిన మిగిలిన వారితో కలసి సమైక్య పోరు కొనసాగిస్తామని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ నెల 17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్యయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చర్చిస్తామని శైలజానాథ్ పేర్కొన్నారు. విభజనపై ఏర్పాటు అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ( జీఓఎం)పై తమకు నమ్మకం లేదని శైలజానాథ్ వెల్లడించారు. -
కాంగ్రెస్ మరో కహానీ కమిటీ!
సాక్షి, హైదరాబాద్: విభజనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమన్వయ కమిటీ పేరిట మరో కొత్త కహానీకి తెర తీశారు. అధిష్టానం విభజన ప్రక్రియపై వడివడిగా అడుగులు ముందుకేస్తుండగా దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సమైక్య ఉద్యమ కార్యాచరణ కోసమంటూ కొత్తగా ఒక కమిటీని తెరపైకి తెస్తున్నారు. విభజనకు రాష్ట్రంలోని ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలూ అంగీకరించారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు ప్రకటించగా.. రాష్ట్ర నేతలు సమైక్యం పేరిట ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు వేస్తున్నారన్న అనుమానాలు పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నా యి. సమైక్యవాద కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఈ కమిటీలోని నేతల జాబితాను బుధవారం విడుదల చేశారు. మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కె.పార్థసారథి, టీజీ వెంకటేశ్, తోట నర్సింహం, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, బాలరాజు, అహ్మదుల్లా, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు అప్పల నర్సయ్య, కన్నబాబు, కాండ్రు కమల, కె.వి.నాగేశ్వరరావు, బీఎన్ విజయకుమార్, ఆనం వివేకానందరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమన్వయకర్తగా మంత్రి శైలజానాథ్ వ్యవహరించనున్నారు. రాష్ట్ర విభజనపై రెండు నెలలకు పైగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నా, సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాల వుతూనే ఆందోళనలు సాగిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం వాటిని పట్టించుకోకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోతోంది. రాష్ట్ర పార్టీ నేతలు కూడా కనీసం సంఘీభావం తెలపకుండా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటిస్తూ వస్తున్నా రు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వెళ్తే సంక్షోభం తీవ్రమై రాష్ట్రంలో ప్రభుత్వం కూలితే విభజనపై కేంద్రం ముందుకెళ్లే దారుండదన్న ఉద్దేశంతో.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్తుత్తి రాజీనామాలతో ఇప్పటి వరకూ డ్రామాను నడిపించారు. రాజీనామాలు ఆమో దం పొందకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కనీసం సీమాంధ్ర ప్రజల్ని పలుకరించే పాపాన పోలేదు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తీవ్రాఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా విభజన ప్రక్రియకు సంబంధించిన నోట్‌ను ఆమోదించడంతోపాటు మంత్రుల కమిటీనీ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో రాష్ట్ర కాం గ్రెస్ నేతలు ఈ కమిటీని ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. కేం ద్రమంత్రుల కమిటీ రాష్ట్రానికి రానున్నట్లు వార్త లొస్తున్న తరుణంలో ఉద్యమకారుల నుంచి నిరసన లు మిన్నంటకుండా.. ఉద్యమాన్ని పక్కదారి పట్టించి కేంద్ర కమిటీ పనిని సుగమం చేసేందుకే రాష్ట్రంలో కమిటీని ఏర్పాటు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యం పేరిట ప్రజల్లోకి చొరబడి.. ఉద్యమకారులకు బదులు తామే ప్రతినిధులుగా కేంద్ర కమిటీ ముందుకు వెళ్లి.. విభజనకు సానుకూల వాతావరణం కల్పించడానికే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ ఢిల్లీ పెద్దల సూచనల మేరకే ఇది ఏర్పాటైనట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి వచ్చినప్పుడు.. ఈ కమిటీని సమైక్య ఉద్యమకారులు, సమైక్యవాద పార్టీలు వ్యతిరేకించే ఆస్కారముంటుందని భావిస్తున్న కేంద్రం పెద్దలు.. వ్యూహాత్మకంగానే ఈ సమన్వయ కమిటీకి తెరతీసినట్లుగా కనిపిస్తోంది. విభజన సాఫీగా సాగిపోయేలా అధిష్టానం పెద్దలు, రాష్ట్ర నేతలు కూడబలుక్కొని ఈ కమిటీని ముందుకు తెచ్చారని తెలుస్తోంది. 2 నెలలకుపైగా ఉద్యమం సాగుతున్నా అటుచూడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా ఉద్యమ కమిటీని ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశమిదేనని సీనియర్ నేతలు చెబుతున్నారు. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కార్యక్రమాల రూపకల్పన కోసం ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని శైలజానాథ్ మీడియాకు తెలిపారు. పీసీసీ చీఫ్ బొత్స సూచనల మేరకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ రెండు రోజుల్లో సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. -
ప్రజల్లోకి ఎలా వెళ్దాం?
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమంలోకి ఎలా చొచ్చుకుపోవాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై వారు ఆలోచనలు సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి కొంతమంది మంత్రులు చర్చలు సాగించారు. మంత్రులు సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు సహా కొంతమంది మంత్రులు సీఎంను క్యాంపు కార్యాలయంలో కలసి దీనిపై చర్చించారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నందున కాంగ్రెస్ అనే పేరెత్తకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. దీనిపై చర్చించి వివిధ కార్యక్రమాలు రూపొందించేందుకు పది మంది మంత్రులు, కొందరు సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ తదితరులతో ఈ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ‘‘మా కమిటీ సభ్యులంతా త్వరలోనే సమావేశమై ఉద్యమం గురించి లోతుగా చర్చిస్తారు. ఉద్యమంలో మేమంతా ఏ రీతిన భాగస్వాములం కావాలో కార్యాచరణను రూపొందిస్తారు. ఆదిశగా తదుపరి కార్యక్రమాలు చేపడతాం’’ అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమప్రధాన డిమాండ్ అని వివరించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో తొలి నుంచీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే గట్టిగా నినదిస్తున్నారని చెప్పారు. ఒకటిరెండు రోజుల్లోనే ఈ కమిటీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశముందంటున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఉద్యమం మరింత తీవ్రమవుతుండడంతో దాన్ని తప్పించుకొనేందుకే ఈ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పేరుతో వెళ్లాలా? లేదా వేరే వేదిక ద్వారా ప్రజల్లోకి పోవాలా? అన్నదానిపై చర్చలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ పేరు లేకుండా కొత్త పార్టీ: వీరశివారెడ్డి కాంగ్రెస్ పేరు వినిపించకుండా కొత్త పార్టీ త్వరలో రూపుదిద్దుకోనుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పేరుతో వెళ్తే ప్రజలు ఛీత్కరిస్తున్నారని, ఏ ఒక్కరూ గెలిచే పరిస్థితే లేదని చెప్పారు. సోమవారం ఆయన సీఎల్పీలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అదే సందర్భంలో మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆమోస్ మరికొందరు నేతల మధ్య ప్రస్తుత పరిస్థితిపై ఇష్టాగోష్టిగా చర్చ సాగింది. సీమాంధ్రలో కాంగ్రెస్, సోనియా పేరు చెబితే ప్రజలు తిరగబడుతున్నారని జేసీ తన అనుభవాలను వివరించారు. మరో నేత మాట్లాడుతూ ఇటీవల ఒక వృద్ధురాలు తన వద్దకు వచ్చి రాష్ట్రాన్ని చీల్చేస్తున్న సోనియాకు ఆ ఉసురుతగలకతప్పదని, ఆమె ఎన్నాళ్లు బతుకుతారని శాపనార్థాలు పెట్టారని పేర్కొన్నారు. దీనిపై పక్కనే ఉన్న ఆమోస్ అందుకొని మీకు చాతకాక సోనియాను ఎందుకు దూషిస్తారని అభ్యంతరం వ్యక్తపరిచారు. ‘‘తెలంగాణ విభజన అయిపోయింది. ఇక ఎన్ని చేసినా ఆగబోదు. మీకేం సమస్యలున్నాయో చెప్పుకోండి. అంతే తప్ప ఉద్యమాలు, ఆందోళనలు అంటూ ముందుకు వెళ్లడం వృథా. దీనివల్ల మీప్రాంతాలకే నష్టం’’ అని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా సమస్యలు చెబుతాం తీరుస్తారా? అవి తీరేవే అయితే ఇంత ఉద్యమం ఎందుకు? ఒకే ఒక్కటి అడుగుతాం. ముందు హైదరాబాద్ గురించి తేల్చండి. ఆ తరువాత తక్కిన అంశాలపై మాట్లాడుకుందాం’’ అని దివాకర్‌రెడ్డి పాల్వాయిని అడిగారు. ‘‘హైదరాబాద్ సంగతి మర్చిపోండి. దానిపై మీకెలాంటి అధికారమూ లేదు. కావాలంటే మూసీని ఇచే ్చస్తాం తీసుకోండి’’ అని పాల్వాయి పేర్కొన్నారు. ‘‘మూసీకి ఒకవైపు ఆంధ్ర, మరోవైపు తెలంగాణ ఉంటే తమకు అంగీకారమే’’నని జేసీ అందుకు సమ్మతించారు. అయితే తాను మూసీలోని మురికిని ఇస్తానని చెబుతున్నానని, అది తీసుకుపోండని పాల్వాయి నవ్వుతూ అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కేంద్ర మంత్రుల కమిటీకి చె ప్పుకోవచ్చని సూచించారు. -
కేంద్రమంత్రి షిండే సారధ్యంలో కమిటి
-
తీర్మానం ఓడించేవరకు రాజీనామాలు చేయం: గంటా
హైదరాబాద్ : తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం వచ్చేవరకూ రాజీనామాలు చేయరాదని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పదవుల్లో కొనసాగుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం రాకుండా పోదని.... తీర్మానం వస్తే ఓడించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందన్నారు. ఒకవేళ రాకుంటే రాష్ట్రపతిని కలవనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
సీమాంధ్ర నేతల ముందు మూడు ప్రతిపాదనలు!
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు నోటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో... భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై నాయకులు మల్లాగుల్లాలు పడుతున్నారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ చేతులెత్తేయడంతో సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే మంచిదనే ఆలోచన చాలా మంది చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద రెండు, మూడు ప్రతిపాదనలు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేయడం ఒక ప్రతిపాదనైతే.. పదవుల్లో కొనసాగుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడం మరో ప్రతిపాదన. ఇవేవి కాకపోతే... విభనజకు సహకరించడం ఉత్తమమనే ప్రతిపాదన కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిశీలనలో ఉంది. -
'తెలంగాణ నోట్'పై భగ్గుమన్న సీమాంధ్ర
-
'తెలంగాణ నోట్'పై భగ్గుమన్న సీమాంధ్ర
తెలంగాణ నోట్ కథనాలపై సీమాంధ్ర భగ్గుమంది. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నివాసాలపై సమైక్యవాదులు దాడులు చేయవచ్చనే అనుమానాలతో వారి నివాసాల వద్ద భద్రత పెంచారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం అయిందన్న వార్తల నేపథ్యంలో సమైక్యవాదులు నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేశారు. ఈరోజు ఉదయం గుంటూరు, విశాఖలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అనంతపురం, కడప, ఉభయ గోదావరి జిల్లాలో దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మంత్రులు, కేంద్రమంత్రులు తక్షణమే పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో విజయనగరం జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇక కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, బొత్స ఝాన్సీ నివాసాలను సమైక్యవాదులు ముట్టడించారు. ఇక అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఆకస్మిక బంద్‌కు పిలుపు నిచ్చారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నివాసాన్ని విద్యార్థులు, సమైక్యవాదులు ముట్టడించారు. -
జోరందుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మంతనాలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆపార్టీ సీమాంధ్ర నేతల మంతనాలు పోటీ పోటీగా జోరందుకున్నాయి. ఓ వైపు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి, వట్టి వసంత్‌కుమార్, బాలరాజు, సి. రామచంద్రయ్య, రఘువీరారెడ్డి భేటీ కాగా..... మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మంత్రులు శైలజానాథ్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయటంతో పాటు... మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఏమాత్రం సడలకపోవటంతో ఆ ప్రాంత నేతలు భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం కూడా మంత్రి సి. రామచంద్రయ్య నివాసంలో పలువురు నేతలు, మంత్రులు భేటీ అయ్యారు. -
కార్యాచరణ కోసం త్వరలో నేతలు భేటీ
-
మొదటి వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరం సమావేశం కానున్నట్టు మంత్రి శైలజానాథ్ తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ సమావేశం ఉంటుందన్న వివరాలను తరువాత తెలియజేస్తామన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉంచడానికి తాము సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తామని, అందులో విజయం సాధిస్తామని తమకు గట్టి నమ్మకం ఉందన్నారు. 56 రోజులలో ప్రక్రియ ఏమి ముందుకెళ్లింది?: మంత్రి గంటా తెలంగాణ విభజన ప్రక్రియ నుంచి కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. అందరూ అవే మాటలు చెబుతున్నారు తప్పితే.. సీడబ్లూసీ నిర్ణయం తీసుకొని ఇప్పటికి 56 రోజులవుతుందని, ఇన్ని రోజులలో ఆ ప్రక్రియ ఏమైనా ముందుకెళ్లిందా అని ప్రశ్నించారు. పదో ఇరువై సార్లు మాత్రం నోట్ తయారవుతుందంటూ ప్రకటనలు మాత్రం వచ్చాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. -
హస్తినలో కాంగ్రెస్ సీమాంధ్ర నేతల తర్జనభర్జన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్టానం వెనక్కితగ్గే పరిస్థితి కానరాకపోవటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం పెరుగుతోంది. ఓవైపు ప్రజల నుంచి ప్రతిఘటన, మరోవైపు అధిష్టాన పెద్దల నుంచి ఏమాత్రం సానుకూల సంకేతాలు కానరాని నేపథ్యంలో సీమాంధ్ర నేతలు సోమవారం ఢిల్లీలో ఏపీభవన్‌లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళి, పితాని సత్యానారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధిష్టానం పునరాలోచన చేస్తుందన్న నమ్మకం కలగటం లేదని.. ఈ దశలో మనకేం కావాలో కోరటం తప్ప మార్గం లేదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు తలొగ్గక తప్పదని, అలాకాని పక్షంలో రాజకీయ నేతలే సంక్షోభాన్ని సృష్టించాలని మరికొందరు పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు రాజీనామాలు చేసేందుకు ముందుకు వస్తే సంక్షోభం తప్పదని.. కేంద్రం కచ్చితంగా దిగివస్తుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డట్లు చెప్తున్నారు. అయితే ఎలాంటి నిర్ణయాలు లేకుండా, భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక లేకుండానే ఈ సమావేశం ముగిసింది. అనంతరం ఆయా నేతలు.. ఏపీభవన్లోనే ఉన్న ముఖ్యమంత్రి కిర ణ్కుమార్రెడ్డిని విడివిడిగా కలసి మాట్లాడారు. చివరి ప్రయత్నంగా మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సహా ఇతర పెద్దలను కలసి సమైక్య రాష్ట్ర అవసరాన్ని మరోమారు తెలియజేస్తానని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీలో ఆందోళన చేస్తేనే కదలిక: టీజీ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ఆందోళనలు చేస్తే కేంద్రం నుంచి స్పందన వస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ ఏపీభవన్‌లో విలేకరులతో వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయాన్ని అసెంబ్లీలో ఓడించేందుకే తామంతా పదవుల్లో కొనసాగుతున్నామని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. రాజీనామాలు ఆమోదించుకుంటే నష్టపోతామని సీఎం చెప్పినందునే పదవుల్లో ఉన్నామన్నారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుందని తాను భావించటం లేదని బాలరాజు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఉండి సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్యలు హైకమాండ్‌కు తెలియజేస్తామని, పరిష్కరించాలని కోరతామన్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీ నామాలు అవసరం లేదు
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు అవసరం లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల చేసినంత మాత్రాన యూఏపీ ప్రభుత్వం పడిపోదని ఆయన తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజీనామాల అంశం తెరపైకి వచ్చిన నేపధ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కొందరు ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రాన యూపీఏకు ఎటువంటి ఢోకాలేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై రాజీనామా ఒత్తిడి ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్లమెంటులో విభజన బిల్లు, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా పదవుల్లో కొనసాగాల్సిన అవసరం ఉందని జేసీ తెలిపారు. -
రాజీనామాలపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, కేబినెట్ నోట్ కూడా సిద్ధమైందని కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై రాజీనామాల ఒత్తిడి పెరుగుతోంది. 24న లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించుకుంటామని కొందరు ఎంపీలు ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ఎంపీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే తాము కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని వారు భావిస్తున్నారు. తాము ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశామని, వాటిని ముఖ్యమంత్రే ఆమోదించడం లేదంటూ ఇప్పటివరకు నెట్టుకొచ్చిన మంత్రులు... ఇకపై అలా చెబితే ప్రజలు ఏమాత్రం నమ్మరని భావిస్తున్నారు. కనీనం నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలెవరూ రాజీనామా చేయకుండా కట్టడి చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఒక్కరు రాజీనామా చేసినా తమపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమనే ఆందోళనతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ‘‘రాష్ట్రాన్ని విభజింజేందుకే కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నందున దానిని అడ్డుకోవడానికి రాజీనామాలు చేయడం పరిష్కారం కాదు. చేసినా ఆమోదించేలా ఉన్నారు. అందువల్ల పదవుల్లో కొనసాగుతూనే బిల్లులు వ్యతిరేకించి విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిద్దాం. ఆ తర్వాత కూడా హైకమాండ్ మనసు మార్చుకోకుంటే అందరం కలిసి పార్టీని వీడే విషయంపై నిర్ణయానికి వద్దాం’’అని సీఎం రెండురోజుల కింద తనను కలిసిను ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన సీమాంధ్ర మంత్రులు సాకే శైలజానాథ్, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రాజీనామా మాటలన్నీ డ్రామాలేనని ఆ పార్టీవర్గాలే కొట్టిపారేస్తున్నాయి. ఎలాగైనా సాధారణ ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగాలన్నదే వారి వ్యూహమని చెబుతున్నాయి. కేవలం ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యానే రాజీనామాల డ్రామాలాడుతున్నారని అభిప్రాయపడుతున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని భావిస్తున్నప్పటికీ సీఎం మోకాలడ్డుతున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విభజన తథ్యమని సీఎంకు పూర్తిగా అర్థమైపోయిందని, అందుకే చివరిక్షణం వరకు పదవిలో కొనసాగడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు విభజన నిర్ణయం ఖాయమని తేలడంతో రాయలసీమకు చెందిన కొందరు నేతలు మరోసారి రాయల తెలంగాణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజీనామా చేస్తే తల నరుక్కున్నట్లే: టీజీ పదవులకు రాజీనామా చేయడమంటే తమ తలలు తాము నరుక్కున్నట్లేనని మంత్రి టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఏరాసు ప్రతాపరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజీనామాలు చేస్తే తెలంగాణ బిల్లును అడ్డుకునే అవకాశం ఉండదు. ఈ విషయం తెలుసుకున్న ఏపీఎన్జీవోలు రాజీనామా చేయొద్దని చెబుతున్నారు. ఈ మాట ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. సోమవారం సీఎంతోపాటు ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలని భావించినప్పటికీ సీఎం వద్దనడం వల్లే ఆగిపోయామని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రులు, ఎంపీలెవరూ రాజీనామా చేయొద్దని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కోరారు. రాజీనామా చేస్తే ఢిల్లీ పెద్దలు తమను చీపురు పుల్లల్లా తీసిపారేస్తారని చెప్పారు. విభజన అనివార్యమైతే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామని పేర్కొన్నారు. -
'తెలంగాణ రాష్ట్రం రాదు.... రాబోదు'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉద్యమం మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను వారు ఈ సందర్భంగా షిండే దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరారు. భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను మరోసారి షిండేకు తెలిపామని, తెలంగాణపై ఇంకా నోట్ తయారు కాలేదని షిండే తమతో చెప్పారన్నారు. మరి కొద్దిరోజుల్లో ఆంటోనీ కమిటీ మరిన్ని చర్చలు జరుపుతుందన్నారు. ఏకాభిప్రాయం వచ్చాకే ముందుకు వెళ్తామని షిండే తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదు, రాబోదని సీమాంధ్ర ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రత షిండేకే ముందే తెలుసునన్నారు. -
నేడు తెలంగాణ నేతలతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంలో పలు అనుమనాలు, చిక్కుముడులతో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిన తరుణంలో సమస్య పరిష్కారానికి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పరస్పర సహకారం, సామరస్యపూర్వక భేటీకి సిద్ధమవుతున్నారు. గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ భేటీ జరగనుంది. మంగళవారం సీఎల్పీలో భేటీ అయిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఈ భేటీలపై ఆలోచనలు సాగించడం తెలిసిందే. విభజన నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలు, చీలిక అనంతరం ఏర్పడే ఇబ్బందులు ముఖ్యంగా నీరు, విద్యుత్, హైదరాబాద్‌తో పాటు ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశాలను ఈ భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ఇరుప్రాంతాలకు శ్రేయస్కరమైన రీతిలో పరిష్కారం ఉండేలా భేటీలో చర్చించనున్నామని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. తెలంగాణ నేతలు విభజన కోరుకోవడానికి దారితీసిన పరిస్థితులు, అందుకు గల కారణాలపై లోతుగా చర్చించాలని భావిస్తున్నారు. విభజన డిమాండ్ రావడానికి కారణమైన అంశాలను, వాటికి పరిష్కారాలను అన్వేషించనున్నారు. ఇందుకు సంబంధించి అనేక ప్రతిపాదనలను తెలంగాణ నేతల ముందుంచేందుకు సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణకు రాజకీయంగా, అభివృద్ధిపరంగా లేదా మరే ఇతర అంశాల్లో అన్యాయం జరిగిందనుకుంటే వాటిని సమైక్యంగా ఉంటూనే సరిదిద్దుకోవచ్చని ప్రతిపాదించనున్నారు. ఆయా అంశాలను పరిష్కరించుకొనేందుకు అవసరమైనంతకాలం రాజకీయ అధికారాన్ని పూర్తిగా తెలంగాణ నేతలకు అప్పగించే అంశాన్ని కూడా వారి ముందు పెడతామని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. ‘‘విభజనపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నా దానివల్ల తలెత్తే సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని తెలంగాణ సోదరులకు వివరిస్తాం. అక్కడి ప్రజలను నొప్పించని రీతిలో పరిష్కారాన్ని అన్వేషిస్తాం. ఇది ఒక్క భేటీతోనే తేలిపోతుందనుకోవడం లేదు. హైదరాబాద్‌లో భేటీ తర్వాత తిరుపతి, విశాఖపట్నంల లో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నాం’’ అని రాయలసీమకు చెందిన మంత్రి ఒకరు తెలిపారు. విభజనకు ఇతర పార్టీలు సానుకూలత ప్రకటించినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది కాంగ్రెసే కాబట్టి తమ పార్టీపైనే ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొన్నారు. -
'రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయింది'
న్యూఢిల్లీ : సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి వీరప్పమొయిలీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమ ఉధృతిని గమనించామని.... న్యాయం చేస్తామని మొయిలీ హామీ ఇచ్చారన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేంతవరకూ విభజన ప్రక్రియ ఆగుతుందనే నమ్మకం ఉందన్నారు. విభజన ప్రక్రియ నిలిచిపోయిందనే పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల వివరాలను మొయిలీకి అందచేసినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆంటోనీ కమిటీ సభ్యులతో పాటు సోనియాగాంధీని కలుస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. -
సీమాంధ్ర నేతల భేటీకి బొత్స ఝాన్సీ డుమ్మా
హైదరాబాద్ : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌజ్‌లో భేటీ అయ్యారు. అయితే మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే ఉన్నా భేటీకి రావడం ఇష్టంలేని ఎంపీ బొత్స ఝాన్సీ బయటకు వెళ్లిపోయారు. కాగా అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు వీరంతా సమావేశమయ్యారు. ఈ భేటీకి కావూరి, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి, బాపిరాజు, కేవీపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరయ్యారు. అయితే రాజీనామాలు చేయాలా? వద్దా? అనే విషయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీల్లో ఏకాభిప్రాయం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంతకు ముందు వెల్లడించారు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంత మంది సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని చెప్పారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ సమావేశం నిర్వహించాలని భావించినా ఎంపీలు, కేంద్రమంత్రులకే పరిమితమైంది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై వీరంతా తర్జనభర్జన పడుతున్నారు. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని సమైక్యవాదులు రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నెపంతో కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో గడిపారు. సమావేశాలు ముగియడం, ఎన్నికల సంవత్సరం కావడంతో వారు ప్రజల ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. సమావేశ నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం తదితర మంత్రులు తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజు, పురందేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష వాయిదా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 48 గంటల పాటు హైదరాబాద్‌లో దీక్ష చేయాలని సంకల్పించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈనెల 3న అసెంబ్లీ ఆవరణలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఫోరం కన్వీనర్ శైలజానాథ్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనంలోపే 48 గంటల దీక్ష చేపడతామని ప్రకటించారు. అయితే దీక్ష ఎక్కడ నిర్వహించాలో నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతోపాటు నిమజ్జనంలోపు దీక్షకు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేయడంతో.. దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీక్ష ఎప్పుడు, ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని శుక్రవారం వెల్లడించనున్నారు. -
విడిపోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకూ ఉంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోవాలని కోరుకునేవాళ్లలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలూ ఉన్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు ఢిల్లీలో తిష్టవేసి రాష్ట్రాన్ని తెగ్గొట్టేయాలంటూ చెబుతున్నారన్న విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండు చోట్లా సీఎం పదవులుంటాయన్న దురుద్దేశంతో.. నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడదీసినా ఫరవాలేదన్నట్లుగా, పదవులకోసం గోతి కాడ నక్కల మాదిరి కాచుకొని కూర్చున్నారని మండిపడ్డారు. వారిని తలచుకుంటేనే తనకు బాధేస్తోందన్నారు. అయితే, ఆ నేతల పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. విభజించాలంటూ ఉత్తరాలు రాసి పొలిట్‌బ్యూరో నిర్ణయాలను మార్చుకోకుండానే ప్రజల దగ్గరకు వె ళుతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. కేంద్ర హోంమంత్రి షిండే తాజా ప్రకటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించేదిగా ఉందని లగడపాటి అన్నారు. హైదరాబాద్ విషయంలో తమ వద్ద రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూనే విభజన ప్రక్రియలో ముందుకెళుతున్నారని చెప్పారు. ఆంటోనీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామంటూనే తెలంగాణ విభజన నోట్ తయారవుతోందనడమేమిటన్నారు. పరిస్థితులు చూస్తోంటే రాష్ట్రంలో దాదాపు సగం ఆదాయాన్నిచ్చే హైదరాబాద్‌ను ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రాకు కాకుండా కేంద్రం తన్నుకుపోతుందేమోనన్న ఆందోళన తమలో ఉందన్నారు. -
కిరణ్‌తో సీమాంధ్ర నేతల భేటీ
సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కలిశారు. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం రాత్రి పదింటికి ఏపీభవన్‌కు వచ్చిన ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు వీరిలో ఉన్నారు. రాష్ట్ర విభజనపై మరింత ముందుకే తప్ప కేంద్రం వెనక్కు వెళ్లబోదనే స్పష్టమైన సంకేతాల నేపథ్యంలో భావి కార్యాచరణపై సమాలోచన జరిపారు. -
చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమే: దాడి
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై దాడి వీరభద్రరావు మరోసారి మండిపడ్డారు. పార్లమెంట్ లో తెలుగుదేశం సభ్యులు ఆడుతున్న నాటకానికి సూత్రధారి చంద్రబాబేనన్నారు. లోక్ సభలో సోమవారం టీడీపీ సభ్యలు సృష్టించిన గందరగోళాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి బయటపడిందని వైఎస్సార్ సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. లోక్ సభ, రాజ్యసభలో టీడీపీ నేతలను రెండుగా విడగొట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దాడి మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం వస్తేనేగాని విభజన నిర్ణయం ఆగదని దాడి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటుందని తెలిపారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారు
-
చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమే: దాడి
-
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
-
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభమైంది. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు మంగళవారం దీక్ష చేపట్టారు. ముందుగా సీమాంధ్ర నేతలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ఆరంభించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ పదవులు ప్రజలు ఇచ్చినవేనని... వారి డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. రాజీనామాలపై వెనకాడే ప్రసక్తే లేదని.... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమైక్యాంధ్ర, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలు 12మంది మంత్రులు, 39మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు ఇప్పటివరకూ పాల్గొన్నారు. ఇక సీమాంధ్ర నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. -
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
-
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష
-
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రలు, ఎంపీలు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ ముందు వాదించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలా.... లేక సోనియాగాంధీకి లేఖ రాయాలా అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. అయితే రాజీనామాలపై పలువురు కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉండదంటూ కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై ముందుకే వెళతామని కేంద్రం స్పష్టం చేయడంతో.. ఆంటోనీ కమిటీతో ఇవాళ జరగబోయే సీమాంధ్ర ఎంపీల భేటీ ఆసక్తికరంగా మారింది.ఆంటోనీ కమిటీ ముందు సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఎంపీలంతా.. కమిటీ ముందు ఉంచాల్సిన డిమాండ్లపై ముమ్మర కసరత్తు చేశారు. రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. -
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షకు సన్నద్ధం అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన దీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, అక్కడే బైఠాయించాలని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతిని నిరాకరిస్తున్నారు. ఒకవేళ అనుమతి లభించకుంటే గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ అనుమతించకుంటే, అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పీ కార్యాలయం సమీపంలో లేదా మంత్రులు సభలోకి వెళ్ళే దారిలో దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మినహా మిగతా వారంతా హాజరు అవుతారని ఫోరం నేతలు చెబుతున్నా.... మంత్రులంతా హాజరయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. మరోవైపు ఈ దీక్షకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. -
సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్‌తో మంతనాలు జరిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం ముందు తమ వాదనలు బలంగా వినిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే వీరు ఎప్పుడు ఢిల్లీ వెళతారనే దానిపై స్పష్టత లేదు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మరో ఇద్దరు సీమాంధ్రకు చెందిన మంత్రులు కూడా రేపు గవర్నర్‌ను కలసి తమ రాజీనామా లేఖలను అందజేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని చేస్తున్న విజ్ఞప్తులను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా సత్యాగ్రహ దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరడంతోపాటు ఇందుకోసం సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ గత రెండ్రోజులుగా ఈ విషయంపై ఆ ప్రాంత నాయకులతో చర్చిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలు 25 రోజులుగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కార్యక్రమాలు రూపొందించుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని సత్యాగ్రహ దీక్ష చేయాలని యోచిస్తున్నారు. -
సీఎం, సీమాంధ్ర బృందంతో విడిగా భేటీ
-
మా చేతిలో లేదు
* విభజనపై పునఃపరిశీలన మా పరిధిలోకి రాదు * సీఎం, సీమాంధ్ర నేతలకు ఆంటోనీ కమిటీ స్పష్టీకరణ * విభజనలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచించడమే మా పని * సీఎం, సీమాంధ్ర బృందంతో విడిగా భేటీ * విభజన తదనంతర పరిణామాలపై కమిటీకి రెండు నివేదికలిచ్చిన కిరణ్ * రాష్ట్రాన్ని విడదీస్తే ప్రమాదకరమేనన్న సీమాంధ్ర నేతలు * రెండో ఎస్సార్సీ వేసి అందరికీ న్యాయం చేయాలని వినతి * రాయల తెలంగాణకు జేసీ బృందం విజ్ఞప్తి * 26 నుంచి 3 రోజులు భేటీలు: దిగ్విజయ్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల బృందానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. విభజన నిర్ణయం అమలులో ఎదురుకాగల సమస్యలను పరిశీలించి వాటికి తగిన పరిష్కారమార్గాలను సూచించటమే తమ కర్తవ్యమని కమిటీ స్పష్టంచేసినట్లు తెలిసింది. సీఎం కిరణ్, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి ఢిల్లీలో ఆంటోని కమిటీతో విడివిడిగా భేటీ అయ్యారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను వివరిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. అయితే.. విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అంశం తమ అజెండాలో లేదని స్పష్టంచేసిన కమిటీ సభ్యులు.. రాష్ట్ర విభజన అమలులో ఎదురుకాగల సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాల్సిందిగా వారికి నిర్దేశించినట్లు చెప్తున్నారు. ఈ భేటీ అనంతరం కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేతల అభిప్రాయాలను, ఆందోళనలను కమిటీ తెలుసుకొందని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించామని చెప్పారు. పరిపాలనా పరంగా సీఎం, మంత్రులు ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలను చూశామని, పరిస్థితులు క్రమంగా చక్కబడతాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఆంటోని కమిటీ 26-28 తేదీల్లో మూడు రోజుల పాటు సమావేశమై మరికొంత మంది పార్టీ నాయకుల, ఇతరుల అభిప్రాయాలను సేకరిస్తుందని దిగ్విజయ్ చెప్పారు. ఇదిలావుంటే.. ఆంటోని కమిటీతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల బృందం భేటీ ముగిసిన తర్వాత.. జె.సి.దివాకర్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, తిప్పేస్వామి ముగ్గురూ విడిగా వెళ్లి కమిటీ సభ్యులను కలిశారు. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు కోరినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంది... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంపై మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో అరగంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఆంటోనీ కమిటీ సభ్యులతో ముందుగా సీఎం సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీతో పాటు సభ్యులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్ పటేల్‌లు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే పలు కీలక సమస్యలను వివరిస్తూ సీఎం రెండు నివేదికలను కమిటీ సభ్యులకు సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని వాదించినట్లు సమాచారం. రాజధాని నగరం కావటంతో దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమైనందున.. విభజనానంతరం చాలా కాలం పాటు సీమాంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేని దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం పేర్కొనట్లు తెలిసింది. హైదరాబాద్ నగరం నుండే రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం లభిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కూడా పలు ఇతర అంశాలలో నష్టపోయే అవకాశం ఉందని ఆయన వాదించినట్లు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీ పలు చిక్కుముడులతో కూడుకొని ఉన్న అంశం కావడంతో భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పినట్లు సమాచారం. సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం భారీగా ఆర్థిక సహాయాన్ని అందించగలుగుతుందా అన్న సందేహాన్ని కూడా ముఖ్యమంత్రి లేవనెత్తినట్లు చెప్తున్నారు. రెండో ఎస్సార్సీ వేయాలి... అనంతరం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కమిటీతో భేటీ అయినపుడు.. దిగ్విజయ్ మాట్లాడుతూ విభజన నిర్ణయం ఏ పరిస్థితుల్లో తీసుకున్నామో వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 2001లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నోట్ అందిందని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని అమలు చేయటానికి వీలుగా సూచనలు, పరిష్కారాలు సూచించాలని ఆయన చెప్పినట్లు తెలిసింది. తొలుత మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారని.. దాని వెనుక ఎవరి ప్రోద్బలమూ లేదని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన రెండు ప్రాంతాల ప్రగతి మీదే కాకుండా, దేశ ప్రగతి మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమావేశమై రెండుసార్లు తీర్మానాలు చేశామంటూ ఆ తీర్మాన పత్రాలను కమిటీకి అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమగా చెప్తున్న ప్రాంతాలు కూడా ఒకప్పుడు నిజాం సంస్థానంలోనివేనని.. ఆ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించిన నిజాం అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని పేర్కొన్నట్లు తెలిసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడు ప్రాంతాల ప్రజల ఉమ్మడి కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన వాదించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. అలాగే.. రెండు ప్రాంతాలు కలిసి ఉంటేనే కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందని ఆయన వాదించారు. ఇప్పుడు విభజనతో నదీ జలాల విషయంలో భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. 1969, 1972 ల్లో తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధి, దేశ సమగ్రత దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం, ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు తిరస్కరించారని ఆయన వివరించినట్లు సమాచారం. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో కూడా చర్చించలేదని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఆ నివేదికలో అత్యుత్తమ మార్గంగా రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ఆరో ప్రత్యామ్నాయంలో పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసినట్లు తెలిసింది. అందరికీ న్యాయం చేసేందుకు 2001లో సీడబ్ల్యూసీ తీర్మానం చేసినట్లు రెండో ఎస్సార్సీ వేయాలని.. ఒక్క తెలంగాణ విషయంలోనే కాక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక డిమాండ్లపై రెండో ఎస్సార్సీ ఎలా చెప్తే అలా చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా జలాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని.. లక్షలాది ఎకరాల సాగుభూమి ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విడదీయలేని అనుబంధముందని.. రాత్రికి రాత్రే హైదరాబాద్ సీమాంధ్రులది కాదన్న ప్రకటన చూసి వారంతా నిశ్చేష్టులైపోయారని పేర్కొన్నట్లు సమాచారం. సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరించే సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతే దారుణంగా మారిందని.. ఇది చేజేతులా చేసుకున్నదేనని వివరించినట్లు తెలిసింది. సమైక్యంగానే ఉంచాలని కోరాం: మంత్రులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల ప్రజానీకం కూడా గట్టిగా కోరుకొంటున్న విషయాన్ని ఆంటోని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, విభజనతో ఏ సమస్యా పరిష్కారం కాకపోగా మరిన్ని కొత్త, తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమౌతాయని స్పష్టం చేశామని కమిటీతో చర్చల అనంతరం శైలజానాథ్ మీడియాకు తెలిపారు. రాష్ట్రాన్ని విడగొడితే మావోయిస్టు తీవ్రవాదుల ప్రాబల్యం పెరగడంతో పాటు మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదంతో జతకలిస్తే ఊహించలేని విపత్కర పరిణామాలు నెలకొంటాయని కమిటీకి చెప్పినట్లు సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వపరంగా చేసిన ప్రకటనను ఇప్పటికే వెనక్కు తీసుకొన్నందున ప్రస్తుతం తాజాగా పార్టీ పరంగా తీసుకొన్న విభజన నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారటం ఖాయమన్న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తమ ప్రాంత సమస్యలను ఎలా పరిష్కరించదలిచారో వెల్లడించాలని కమిటీని కోరినట్లు తెలిపారు. -
యూటీ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: దానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ తోసిపుచ్చారు. సీమాంధ్ర నేతల వాదనకు తలొగ్గి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. గాంధీభవన్ ఆవరణలో మంగళవారం దానం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని, ఈ విషయంలో సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గతంలో విజ్ఞప్తి చేస్తే కొత్త వాదనలను తీసుకురావొద్దని సోనియాగాంధీసహా హైకమాండ్ పెద్దలు చెప్పారని అన్నారు. అందుకే ఆ అంశం జోలికి తాము వెళ్లడం లేదన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ర్ట చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క బీసీ నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా తొంగలో తొక్కారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాను తెలంగాణ అంతటా విస్త్రతంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు.