కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆపార్టీ సీమాంధ్ర నేతల మంతనాలు పోటీ పోటీగా జోరందుకున్నాయి.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆపార్టీ సీమాంధ్ర నేతల మంతనాలు పోటీ పోటీగా జోరందుకున్నాయి. ఓ వైపు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి, వట్టి వసంత్కుమార్, బాలరాజు, సి. రామచంద్రయ్య, రఘువీరారెడ్డి భేటీ కాగా..... మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మంత్రులు శైలజానాథ్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు.
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయటంతో పాటు... మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఏమాత్రం సడలకపోవటంతో ఆ ప్రాంత నేతలు భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం కూడా మంత్రి సి. రామచంద్రయ్య నివాసంలో పలువురు నేతలు, మంత్రులు భేటీ అయ్యారు.