'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు' | We will Meet Pranab Mukherjee: Sailajanath | Sakshi
Sakshi News home page

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'

Published Thu, Oct 24 2013 3:49 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు' - Sakshi

'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'

న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగ విరుద్ధమని మంత్రి ఎస్ శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని రాష్ట్రపతిని కోరానున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సాయంత్రం 7 గంటలకు కలవనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదని స్పష్టం చేశారు.

మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్‌, పలువురు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో సీమాంధ్ర నాయకులు భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం చివరివరకు ప్రయత్నాలు చేస్తామని శైలజానాధ్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement