హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం సమావేశమవుతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో జరిగే ఈ భేటీలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
విభజనతో ముడిపడిన 11 కీలక అంశాలపై పార్టీల అభిప్రాయాలు చెప్పాలంటూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కోరిన నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేసిన అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. దీనిపై ఎలా స్పందించాలనేది కిరణ్, బొత్సలే నిర్ణయం తీసుకుంటారని నేతలంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా బొత్స సత్యనారాయణతో సమావేశం అవుతున్నారు.
సీఎం, బొత్సతో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు
Published Mon, Nov 4 2013 10:18 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement