హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షకు సన్నద్ధం అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన దీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, అక్కడే బైఠాయించాలని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతిని నిరాకరిస్తున్నారు.
ఒకవేళ అనుమతి లభించకుంటే గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ అనుమతించకుంటే, అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పీ కార్యాలయం సమీపంలో లేదా మంత్రులు సభలోకి వెళ్ళే దారిలో దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మినహా మిగతా వారంతా హాజరు అవుతారని ఫోరం నేతలు చెబుతున్నా.... మంత్రులంతా హాజరయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. మరోవైపు ఈ దీక్షకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష
Published Tue, Sep 3 2013 8:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement