హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభమైంది. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు మంగళవారం దీక్ష చేపట్టారు. ముందుగా సీమాంధ్ర నేతలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ఆరంభించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ పదవులు ప్రజలు ఇచ్చినవేనని... వారి డిమాండ్లో న్యాయం ఉందని అన్నారు. రాజీనామాలపై వెనకాడే ప్రసక్తే లేదని.... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమైక్యాంధ్ర, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలు 12మంది మంత్రులు, 39మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు ఇప్పటివరకూ పాల్గొన్నారు. ఇక సీమాంధ్ర నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్లను అధికారులు సిద్ధంగా ఉంచారు.
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
Published Tue, Sep 3 2013 10:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement