Samaikhyandhra
-
కదంతొక్కిన కర్షకులు
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు సంఘీభావంగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు, పార్టీ నాయకులు బుధవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతమైంది. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే తొలుత నష్టం రైతుకేనన్నారు. ప్రస్తుతం కాస్తో.. కూస్తో తడుస్తున్న పంట పొలాలు సైతం బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు రైతులు కదిలి రావడం అభినందనీయమన్నారు. ర్యాలీలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఖాజా, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నాయకులు సింగరాజు వెంకట్రావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. దర్శిలో తాజామాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడి ఆధ్వర్యంలో ట్రాక్లర్ల ర్యాలీ నిర్వహించారు. గడియారస్తంభం సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన ఆగిందంటే వైఎస్సార్సీపీ, ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలే కారణమన్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని అన్ని ఫ్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ఇప్పటికైనా సీమాంధ్ర ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. యర్రగొండపాలెంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు పాల్గొన్నారు. భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. మార్కాపురం నియోజకవర్గ ట్రాక్టర్ల ర్యాలీ పొదిలిలో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులను విస్మరించిన పార్టీలకు పుట్టగతులుండవంటూ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి హెచ్చరించారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని, అటువంటినాయకుడి అడుగుజాడల్లో నడవడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, సజ్జాహేమలత, ఎడం చినరోశయ్యలు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సమైక్యాంధ్రకు సంఘీభావంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు సమైక్యాంధ్రకు ఎమ్మెల్యే మద్దతు తెలపాలని డిమాండ్ చేసినందుకు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారని తెలిసి ‘ఎమ్మెల్యే సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలి’ అని నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆందోళనకారులపై నోటి దురుసుతనం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీని విమర్శించడంతో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని చెంచిరెడ్డిని జీపు ఎక్కించేందుకు యత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను నడిపించుకుని స్టేషన్ వైపునకు తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. ఒంగోలు రూరల్ సీఐ భూషణం హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకు దిగిన 11 మంది వైఎస్ఆర్ సీపీ నాయకులను అరెస్టుచేసి నాలుగు గంటలపాటు స్టేషన్లోనే ఉంచుకొని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడం గమనార్హం. -
యమహో యమా....శివన్న
*మొన్న శ్రీకృష్ణుడి వేషం... *నిన్న కొరడతో దెబ్బలు.... *ఆ తరువాత చేతిలో చిడతలతో చెక్కభజన *అనంతరం ముసలి వితంతువు వేషం, గంగమ్మ అవతారం తాజాగా యమధర్మరాజు..... ఇవన్నీ తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ వేస్తున్న వేషాలు. వేషాలు అంటే అపార్థం చేసుకోకండి. ఇవన్నీ రాష్ట్రాన్ని వీడదీయవద్దంటూ ఆయన తనకు తోచిన రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా శివప్రసాద్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో యముడి గెటప్‌లో నిరసన తెలిపారు. జానపద నాటక రూపంలో ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఆయన వివరించారు. సమైక్యంధ్ర ఉద్యమం నేటికి వంద రోజులుకు చేరుకున్న నేపథ్యంలో శివప్రసాద్ మరోసారి తనదైన శైలిలో సమైక్యాంధ్ర వాణిని వినిపించారు. సాధారణంగా నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శ్రీకృష్ణుడి వేషధారణలో సభకు వెళ్లి పద్యాలు పాడి సభ్యులకు వినోదాన్ని కూడా కలిగించారు. ఆతర్వాత పార్లమెంట్ ఆవరణలో చెర్నాకోలాతో తనకు తానే కొట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర విభజన విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తెచ్చేందుకు శివప్రసాద్ వినూత్న పోకడలకు పోయారు. ఇందిరాగాంధీ మాస్క్ వేసుకుని సభలోకి వెళ్లి సహచర ఎంపీలను సైతం నివ్వెరపోయేలా చేశారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని శివప్రసాద్ చెక్క భజన చేస్తే..... ఆయనకు సహచర ఎంపీలు తాళం వేయటం విశేషం. ఆ తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముసలి వితంతువు వేషం వేశారు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. శివన్న ఏం చేసినా వెరైటీ అన్నట్లు ఇప్పుడు కూడా యముడి వేషంలో అందర్నీ అలరించారు. -
వచ్చే ఏడాది వేడుకలు జరుగుతాయో లేదో: కిరణ్
-
వచ్చే ఏడాది వేడుకలు జరుగుతాయో లేదో: కిరణ్
హైదరాబాద్ : రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, వచ్చే ఏడాది మళ్లీ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయా? లేదా అనే అనిశ్చితి, అయోమయం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ జాతీయ జెండా ఎగురువేశారు. అనంతరం ముఖ్యమంత్రి క్లుప్తంగా, ముక్తసరిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..కలకాలం జరగాలని కోరుకుంటున్నట్లు కిరణ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంతోనే అభివృద్ధి జరుగుతుందన్న ముఖ్యమంత్రి రాష్ట్రం కలిసి ఉండటం వల్లే సాగునీటికోసం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రజెక్టులను నిర్మించుకోగలిగామన్నారు. బలమైన రాష్ట్రం ఉండటం వల్లే శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ మతసామరస్యాన్ని కాపాడగలుగుతున్నామన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో త్యాగాలు చేశారని కిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పార్లమెంట్లో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో తాను సమైక్యవాదినని ఇందిర గట్టిగా చెప్పారని, వందేళ్ల భవిష్యత్‌ను ఆమె ముందే ఊహించారన్నారు. -
వైఎస్ జగన్ సమైక్య శంఖారావం సభకు అనుమతి
-
వైఎస్ జగన్ సమైక్య శంఖారావం సభకు అనుమతి
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. డీసీపీ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులను కొట్టివేసి, తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఈరోజు ఉదయం తీర్పు వెల్లడించారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
విశాఖపట్నంలో సెగలు కక్కుతున్న 'సమైక్యం'
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సమైక్యవాదులు చేస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. సమైక్య ఉద్యమానికి మద్దతుగా నగరంలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్,ఐఓసీ కంపెనీలల్లోని చమురు కేంద్రాలు మూతపడ్డాయి. ఆ కేంద్రాల నుంచి చమురును ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన దాదాపు 750 లారీలు నిలిచిపోయాయి. దాంతో ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చమురు రవాణా నిలిచిపోయింది. సమైక్యానికి సంఘీభావంగా విశాఖపట్నంలోని 12 రైతు బజార్లు మూసివేశారు.కేజీహెచ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను వైద్యులు నిలిపివేశారు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
'రాష్ట్రం విభజిస్తే మేము ఆకులు కట్టుకుని బతకాలి'
-
తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుల దీక్ష
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దీక్షలు కొనసాగిస్తున్నారు. తుడా సర్కిల్లో చేపట్టిన దీక్షల్లో మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు తాము సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో కళాకారులు తమ పాటలతో అలరిస్తున్నారు. తుడా సర్కిల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన దీక్షలకు వారు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో గేయాల ద్వారా తెలియజేశారు. -
సీమాంధ్రలో సోనియా భజన దర్బార్
-
సీమాంధ్రలో సోనియా భజన దర్బార్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తగ్గేది లేదంటూ సమైక్యవాదులు శివాలెత్తుతున్నారు. రోజుకో తీరులో ఉద్యమిస్తూ కేంద్రానికి నిరసనను తెలియజేస్తున్నారు. మంగళవారం కూడా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు జరిగాయి. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వినూత్నంగా తమ నిరసనలు తెలుపుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. నిరసనలు తెలియచేయటంలోనూ సృజనాత్మకత కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నాయకులపై చురకలు, సెటైర్లు, వేయడంలో సమైక్యవాదులు వెనకడుగు వేయట్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల తీరుని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సీమాంధ్రలో సోనియా భజన దర్బార్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ సోనియా, రాహుల్ వేషధారణతో సమైక్యవాదులు తమ నిరసనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమవుతోంది. అల్లూరు మండలంలో సమైక్యవాదుల సకల జనుల మహాధర్నా చేశారు. భారీ జాతీయ పతాకం చేతబూని సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతన్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు నేడు సీమాంధ్ర ప్రజలను మోసం చేయటానికే బస్సుయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరులో ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. వివిధ ప్రజా సంఘాలు.. విద్యార్థి, ఉపాధ్యాయ జేఏసీల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ర్యాలీలు జరిగాయి. కళాకారులు వివిధ వేషదారణలతో తమ నిరసన తెలిపారు. డప్పు చప్పుళ్ళు, మేళతాళాలతో పట్టణమంతా హోరెత్తించారు. ఇటు విజయవాడలో డాక్టర్లు కదం తొక్కారు. సమైక్యాంధ్ర నినాదాలతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 'మహా వైద్య గర్జన' పేరుతో పదమూడు జిల్లాలకు చెందిన ఐఎమ్ఎ కార్యవర్గ సమావేశం జరుగుతుండగానే... సబ్ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయాలే అంతిమంగా అమలు చేయాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు కేంద్రం సమైక్య ఉద్యమ విషయంలో స్పందించకపోయినా... త్వరలో తల వంచక తప్పదని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో 'మహా వైద్య గర్జన' ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా ప్రైవేటు ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. ర్యాలీగా వచ్చిన వైద్యులు సబ్‌కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఇక విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ... స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో రోజుకో వినూత్న రీతిలో నిరసన జరుగుతోంది. ఇవాళ బెంజి సర్కిల్ వద్ద గొర్రెలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో ఉద్యోగ జెఎసి చేస్తున్న ఆందోళనలతో హోరెత్తుతోంది. పలు శాఖల ఉద్యోగులు రిక్షాలు తొక్కి తమ నిరశన వ్యక్తం చేసారు. సీమాంధ్ర వాసుల్ని నిరుపేదలను చేయడానికే విభజన నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ జెఎసి ఆరోపించింది. ఇక టీడీపీ నేత అంబిక కృష్ణను సమైక్య వాదులు నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమైక్యవాదుల దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన ఆయనను నిలదీశారు. టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విజయనగరం మయూరి జంక్షన్లో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. విద్యార్థులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. రెండో బొబ్బిలిగా పేరొందిన భీమవరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు లక్షగళ ఘోషకు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. నిరసనకారులతో పట్టణం నిండిపోయింది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులనే తేడాలేకుండా అంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశనాయకులు, తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో భీమవరం మార్మోగిపోయింది. ఇక రాష్ట్ర విభజనకు నిరసనగా రాజమండ్రి మహిళా కళాశాల విద్యార్థినులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోనియాగాంధీకి చెప్పులు, కేంద్రమంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు బహుకరించి తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంకు మద్దతుగా అనంతపురంలో ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదులు, విద్యార్ధులతో అనంతపురం కిక్కిరిసిపోయింది.సమైక్య వాదం బలంగా వినిపించేందుకు ఉద్యోగులు, విద్యార్ధులు, ఉద్యమకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉద్యమాన్ని బలంగా రూపోందిస్తున్నామని ఉద్యోగ జేఏసీ తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిపోతోంది. పెద్దఎత్తున ప్రజలు లక్ష గళ ఘోషలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకఠంతో స్పష్టం చేశారు. -
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
-
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభమైంది. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు మంగళవారం దీక్ష చేపట్టారు. ముందుగా సీమాంధ్ర నేతలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ఆరంభించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ పదవులు ప్రజలు ఇచ్చినవేనని... వారి డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. రాజీనామాలపై వెనకాడే ప్రసక్తే లేదని.... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమైక్యాంధ్ర, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలు 12మంది మంత్రులు, 39మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు ఇప్పటివరకూ పాల్గొన్నారు. ఇక సీమాంధ్ర నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. -
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష
-
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షకు సన్నద్ధం అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన దీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, అక్కడే బైఠాయించాలని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతిని నిరాకరిస్తున్నారు. ఒకవేళ అనుమతి లభించకుంటే గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ అనుమతించకుంటే, అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పీ కార్యాలయం సమీపంలో లేదా మంత్రులు సభలోకి వెళ్ళే దారిలో దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మినహా మిగతా వారంతా హాజరు అవుతారని ఫోరం నేతలు చెబుతున్నా.... మంత్రులంతా హాజరయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. మరోవైపు ఈ దీక్షకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. -
రెండోరోజు విశాఖ మన్యంలో బంద్
-
రెండోరోజు విశాఖ మన్యంలో బంద్
విశాఖ : విశాఖ మన్యంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండోరోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఉదయమే ఉద్యోగ సంఘ నాయకులు, వర్తకులు, స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు సంస్థల ఉద్యోగులు గుండ్లు గీయించుకుని, అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇటు పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్‌లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ టూర్లను ఆపేశారు. మ్యూజియం, గార్డెన్లు మూతబడ్డాయి. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటు బంద్ ప్రభావంతో జనజీవనం స్తంభించింది. ఇక విజయనగరం జిల్లాలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. మానవహారాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిక్కోలులో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మహామానవహారం విజయవంతం కావడంతో అడుగడుగునా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ, మానవహారంతోపాటు జాతీయ రహదారిపై స్నానాలు చేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. వరదయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. నేటి నుంచి ఈనెల 9 వరకూ అన్ని పాఠశాలలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. ఇక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎన్జీవోలు, ఉపాధ్యాయలు, అన్ని శాఖల జేఏసీలు మహాధర్నాకు దిగాయి. నెల రోజులుగా సీమాంద్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని, కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరముందని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు. -
'సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్ : ప్రధానమంత్రి పదవిని కించపరచటం వల్లే మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేత, 20 సూత్రాల పథకం చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆయన శనివారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనపై సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదని తులసిరెడ్డి అన్నారు. తెలంగాణ కంటే రాయలసీమ వెనకబడి ఉన్నా ఎవరూ మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
రహదారిని దిగ్బంధించిన న్యాయవాదులు
కర్నూలు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కర్నూలు జాతీయ రహదారిని గురువారం న్యాయవాదులు దిగ్బంధం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల జేఏసి తుంగభద్ర బ్రిడ్జ్‌పై ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప... సమైక్యాంధ్ర ఉద్యమం కోసంకాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనకపోతే సీమాంధ్రలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. మూడు ప్రాంతాల భవిష్యత్ కోసం ప్రజా ఉద్యమం ఉధృతమైందని...కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా స్పందించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'దేవుడు' కనిపిస్తున్నాడు!
ఆపద మొక్కుల వాడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు మార్గమధ్యంలోనే 'దేవుడు' కనిపిస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో వెంకన్న భక్తులకు తిరుమల కొండ ఎక్కకుండానే 'స్వామి' దర్శనమవుతోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న సమైక్య ఆందోళనలతో కలియుగ వైకుంఠానికి భక్తుల రాక తగ్గింది. ధైర్యం చేసి వస్తున్న శ్రీవారి భక్తులు ఉద్యమ వేడికి విలవిల్లాడుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేడు, రేపు తిరుపతి బంద్‌కు స్వచ్చంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ 'అష్ట దిగ్బంధం'కు పిలుపునివ్వడంతో భక్తులు ఇక్కట్లు రెట్టింపయ్యాయి. తిరుపతి అష్ట దిగ్బంధంలో చిక్కుకోవటంతో తిరుపతి నుంచి నుంచి తిరుమలకు బస్సులు పరిమితంగానే నడుస్తున్నాయి. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్లు ..... తిరుమతి వరకూ చేరుకున్న భక్తులు.... అక్కడ నుంచి కొండపైకి వెళ్లేందుకు నానావస్థలు పడుతున్నారు. అలిపిరి బస్టాండ్ నుంచి తిరుమలకు కేవలం 15 బస్సులు నడుస్తున్నాయి. తిరుమల ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించకపోవడంతో అలిపిరి బస్టాండ్ వద్ద భక్తులు అవస్థలు పడుతున్నారు. బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ పది ఉచిత బస్సులు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. ఉన్న బస్సుల్లోనే ఎక్కేందుకు భక్తులు ఎగపడుతుండడంతో తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా టీటీడీ ఉచితంగా ఆహార పొట్లాలు, ప్రసాదాలు అందచేస్తోంది. ఇక రోజు వాహనాలతో కిటకిటలాడే అలిపిరి ప్రధాన ద్వారం బోసిపోయింది. మరోవైపు తిరుపతిలోకి అలిపిరి నుంచి బెంగళూరు మార్గం నుంచి ఎవరైనా తిరుమలకు చేరాలంటే బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరికి చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు తిరుపతిలోనూ జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యాసంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. ఉద్యోగుల నిరసనలతో సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరూ స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు కూడా తిరగటం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక తిరుపతి, తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే వారు వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్, పెళ్లి కార్డుతోపాటు, పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఫొటోలు అతికించాలని నిబంధనలు కూడా పెట్టడం గమనార్హం. తిరుమల వెళ్లే భక్తులకు బంద్ నుంచి మినహాంపు ఇచ్చామని చెబుతున్నా పెద్దగా తిప్పలు తప్పడం లేదు. ఏ విఘ్నాలు లేకుండా దర్శనభాగ్యం కలగజేయాలని కలియుగ దైవాన్ని వేడుకుంటున్నారు భక్తులు. -
విశాఖలో సుబ్బరామిరెడ్డికి చేదు అనుభవం
విశాఖ : రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డికి సోమవారం విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు... సుబ్బరామిరెడ్డిని ఘొరావ్ చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌కు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్ర కోసం మదనపల్లెలో ఏర్పాటు చేసిన లక్షగళ సమరభేరి కార్యక్రమంలో పాల్గొనేందకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిర్వాహకులు షాజహాన్‌ను అక్కడి నుంచి పంపేసారు. -
ఆంటోనీ కమిటీని కలవనున్న ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు
హైదరాబాద్ : ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు ఆంటోనీ కమిటీకి తమ వాదనను వినిపించేందుకు నేడు ఢిల్లీకి పయనం అయ్యారు. రాష్ట్ర విభజన వద్దని... అలాగే రూ.5వేల కోట్ల ఆర్టీసీ అప్పులు మాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా ఆంటోనీ కమిటీకి విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే సీమాంధ్ర ఆర్టీసీకి రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎన్ఎంయూ నేతలు కోరనున్నారు. విభజన సెగల దెబ్బ ఆర్టీసీని నష్టాల్లో ముంచింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గత 20 రోజులుగా ఆర్టీసీకి 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు 120కు పైగా డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దాదాపు 60 వేలమంది సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారు. విభజనకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్టు అంతంత మాత్రంగా నడుస్తున్న ఆర్టీసీని కృంగదీసింది. అవసరమైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినా, ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ సంస్థలకు బేరం పెట్టేస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆజమాయిషీ అయ్యేపనికాదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. -
మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి
-
మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి
మదనపల్లి : సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు. లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు జేఏసీ నేతలు, ఆర్టీసీ, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, మహిళ సంఘాలు, ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు, వ్యాపారులు, రైతులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
విద్యుత్ సౌధ వద్ద టెన్సన్.. టెన్సన్
-
వీహెచ్‌కు సమైక్య సెగ
అలిపిరి వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు -
అనంతపురంలో బీజేపీ కార్యాలయం ముట్టడి
అనంతపురం : అనంతపురంలో సమైక్యవాదులు శనివారం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలంటూ బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. దీంతో సమైక్యవాదులకు..బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. పోలీసులు సమైక్యవాదులను అదుపులోకి తీసుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా రోడ్డెక్కారు. మరోవైపు శ్రీ కృష్ణదేవరాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు, అధ్యాపకులు రోడ్డెక్కారు. జై సమైక్యాంధ్రప్రదేశ్ అనే బ్యానర్లు ప్రదర్శించారు. విభజన వద్దు ...సమైక్యమే ముద్దు అనే ప్లే కార్డులు ప్రదర్శించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల యూనివర్శిటీ ప్రధాన గేట్ దగ్గర సోనియా గాంధీ బొమ్మతో కూడిన వినూత్నమైన ప్లెక్సీని ప్రదర్శించారు. -
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత
-
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత, ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈరోజు ఉదయం జేఎండీ పి.రమేష్‌కు సమ్మె నోటీసు అందచేశారు. అయితే ఆ నోటీసును ఆయన ఉద్యోగులపై విసిరి వేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళితే జేఎండీ తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు దిగారు. జేఎండీ రమేష్ తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
సమైక్యం కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
-
సమైక్యాంధ్ర కోసం విశాఖలో జర్నలిస్టుల ర్యాలీ
విశాఖ : సమైక్యాంధ్ర కోరుతూ విశాఖలో జర్నలిస్ట్‌లు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో మానవహారం చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు స్వప్రయోజనం కోసం ఉద్యమాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని జర్నలిస్టులు ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పాడేరులో కుల్గాంధీ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్వతీపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. అలాగే సుమారు 15వేల మంది విద్యార్థులు రహదారిని దిగ్భందించి తమ నిరసనలు తెలిపారు. శ్రీకాకుళంలో గాయత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలాసలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ టెక్కలిలో సంపూర్ణ బంద్ కొనసాగుతుండగా, రణస్థలం మండల కేంద్రంలో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహిస్తున్నారు. -
ముందస్తు అరెస్ట్‌కు పోలీసుల కుట్ర: దేవినేని ఉమ
విజయవాడ : తనను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. మీడియాను చూసి తనను గొల్లపూడి వద్దే అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని ఉమ నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గొల్లపూడి నుంచి దీక్షా శిబిరానికి బయల్దేరారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి దేవినేని ఈరోజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. అయితే ఈసారి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. -
'సీమాంధ్రుల్ని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది'
హైదరాబాద్ : సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమం వల్ల తీవ్ర పరిణమాణాలు ఎదురు అవుతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అన్ని పార్టీలు కారణమని సోమిరెడ్డి అన్నారు. ఓ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందనటం సరికాదన్నారు. విభజన ప్రకటన అనంతరం తెలంగాణపై పలు పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు. -
ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి
కడప : సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ కుయుక్తులు, టీడీపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పోరాటం సాగించేందుకు వారు దీక్షకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతోందని తెలిసినా అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవండంతో ఆమరణదీక్ష చేపట్టారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్క చేయమని శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. -
'బొత్స కూడా తన వైఖరిని బయటపెట్టాలి'
విజయనగరం : సమైక్యాంధ్రపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వైఖరిని బయటపెట్టాలని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా సమైక్యాంధ్రపై తన వైఖరిని తెలియ చేశారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. బొత్స ఇప్పటికైనా నోరు విప్పాలని, లేకుండా ఆయన ఇంటిని ముట్టడిస్తామని గద్దె బాబూరావు హెచ్చరించారు. మరోవైపు సమైక్యవాదులు చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్లో కేసీఆర్ పేరుతో బెల్టుషాపును ఓపెన్ చేసి తమ నిరసన తెలిపారు. కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగలో నిరసన కార్యక్రమాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రాములప్పుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మార్మోగుతున్న సమైక్యనాదం
-
సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఎన్జీవోలు
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సంఘం సమ్మెకు సిద్ధమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని మున్సిపల్ ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మెకి దిగనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవోల సంఘం ఈరోజు ప్రభుత్వ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతోంది. దాదాపు ఆరులక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించబోయే సమ్మెపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె కొనసాగుతోంది. -
సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి సతీమణి దీక్ష
కాకినాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణీ శనివారం కాకినాడలో ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. వాణీ దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యేలు వంగా గీతా, శేషారెడ్డి, పంతం గాంధీ మోహన్ చేరుకుని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలని వాణీ పిలుపు నిచ్చారు. చిన్నారులు సైతం సమైక్యవాదం వినిపిస్తూ పోరుబాట పడుతున్నారని అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని టీవీలు చూసే పెద్దలు సైతం ఉద్యమంలో పాల్గోవాలని వాణీ కోరారు. ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని సమైక్యవాద ఉద్యమకారులకు వాణీ విజ్ఞప్తి చేశారు సమైక్యాంధ్రకు మద్దతుగా కాకినాడలో జర్నలిస్టులు వినూత్న నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట మూడు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు.. ఇవాళ వేదపండితులతో యాగాలు నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ పూజలు నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి జూనియర్ డాక్టర్లు మద్దతు పలికారు. యాగం చుట్టూ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో వరుసగా 11రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా ప్రజాసంఘాలు, విద్యా సంస్థలు, వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో విద్యార్థులు, టీచర్లు మానవహరంగా ఏర్పడి... సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏలూరు ఆటోమోబైల్ మెకానిక్స్ భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమైక్య నినాదాలతో తిరుపతి హోరెత్తుతోంది. అన్ని వర్గాల వారు ఉద్యమ బాట పట్టడంతో.. 11రోజులుగా జనజీవనం స్తంభించింది. కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలుచోట్ల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఓరియంటల్ కళాశాల ఎదుట సమైక్యవాదులు సకలజనుల సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, సినీ నటులు, వైద్యులు, అధ్యాపకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ర్టవిభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని వైస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ ని ప్రధానిని చేసేందుకు, రాష్ర్టాన్ని విభజించాలను కోవడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని సోనియాగాంధీ వెనక్కి తీసుకోవాలని లేదంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని నాయకులు హెచ్చరించారు. సమైక్య ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కంచరపాలెం మెట్టులో ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్సనతో రిలేదీక్షలు చేపట్టారు. సమైక్యవాదుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. -
తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
తిరుపతి : రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో మహాధర్నా చేపట్టింది. తిరుపతి నలుమూల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకే జనం ప్రభంజనంలా రోడ్లపైకి వస్తున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికే రాష్ట్ర విభజన చేపట్టారని దుయ్యబట్టారు. కపట నాటకాలు ఆడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. -
పలాసలో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు
శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రను కోరుతూ పలాసలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు వెటర్నరీ, వ్యవసాయ, విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా సీమాంధ్ర జిల్లాల్లో విభజన సెగలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పత్తిపాడు మండలం వానపల్లిలో సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కాగా విభజనను నిరసిస్తూ కోరుకొండ మండలం నర్సాపురంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంద్రకు మద్దతుగా ఎర్రగుంట్లలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే నెల్లూరుజిల్లా కావలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు కదలటం లేదు. -
సీపీఐ నారాయణకు సమైక్య సెగ
అనంతపురం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సమైక్య సెగ తగలింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయనను అనంతపురం పర్యటనకు రావద్దంటూ పార్టీ నేతలు సూచించారు. సీపీఐ తెలంగాణకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దాంతో నారాయణ అనంతపురంలో పర్యటిస్తే సమైక్యవాదులు నిరసనలతో పాటు అడ్డుకుంటారనే అనుమానంతో పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా పార్టీనేతలు నారాయణను కోరారు. అయితే రాష్ట్ర విభజన అనివార్యమనే అంచనాకు వచ్చిన సీపీఐ సీమాంధ్రుల్ని సముదాయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. మరోవైపు అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు కూడా బంద్ కొనసాగుతోంది.త జిల్లావ్యాప్తంగా 940 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కాగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేపీ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. -
12 అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్
విశాఖపట్నం/గుంటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ (ఈయూ) మద్దతు ప్రకటించింది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలో బస్సులు తిరగకుండా నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ నేతలు బుధవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణను బీచ్‌రోడ్ క్యాంప్ కార్యాలయంలో కలసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ వలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, మంగళవారం ఒంగోలులో చేసిన తీర్మానం మేరకు జోనల్ ఈడీలకు బుధవారం సమ్మె నోటీసులిచ్చినట్టు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే వరకూ పోరాడతామన్నారు. సమైక్యాంధ్ర సాధనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాచేసి ప్రజలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పెదమజ్జి సత్యనారాయణ, కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ, జోన్లో ఉన్న 27 డిపోల్లో, జోనల్ వర్క్‌షాపుల్లో నిరవధిక సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. బుధవారం నుంచి అన్ని డిపోల్లో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కాగా, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఈనెల 12 నుంచి సమైక్య ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు సీమాంధ్రలోని 13 జిల్లాల యూనియన్ నాయకులు బుధవారం గుంటూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం అన్ని జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు సమ్మె నోటీసులను అందజేయాలని నిర్ణయించారు. అదేరోజున సీమాంధ్రలోని 123 డిపోల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. 11న నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన జరపాలనీ, 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలతో కలసి జేఏసీగా ఏర్పడి ఉద్యమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ఇందుకోసం సీమాంధ్రలోని నాలుగు జోన్లలోని ఎన్ఎంయూ కార్యదర్శులను స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు. -
'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'
కర్నూలు: పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి....సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎమ్మినూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన హైలెవల్ కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని భూమన వ్యాఖ్యానించారు. అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ఆటోమోబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
సీమాంధ్ర ఆందోళనలపై కేంద్రం ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర నిఘావర్గాలు నేరుగా రంగంలోకి దిగాయి. సమైక్యాంధ్ర కోరుతూ జరుగుతున్న ఆందోళనలు రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నాయా, స్వచ్ఛందంగా ప్రజలే పాల్గొంటున్నారా, ఆందోళనలను ప్రేరేపించేలా తెర వెనక ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నాయి. విద్యార్థులు, యువతతో పాటు ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఆందోళనల్లో భాగస్వాములవుతున్నట్టు నిఘా పరిశీలనలో స్పష్టమైంది. ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆందోళనలు మరింత ఉధృత రూపు దాల్చుతున్నాయని, అక్కడ పరిస్థితి చేయి దాటేలా కన్పిస్తోందని నిఘా అధికారులు ప్రాథమిక ంగా అంచనా వేశారు. కడప, చిత్తూరుతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఆందోళనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వారు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఆందోళనలు పెరుగుతున్నా శాంతిభద్రతలు మాత్రం ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన తర్వాత సీమాంధ్రలో తొలి మూడు రోజుల ఆందోళనపై రాష్ర్ట నిఘా వర్గాలు తొలుత కేంద్ర హోం శాఖకు ప్రాథమిక నివేదిక అందించాయి. ఆందోళనలు కొనసాగుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అనంతపురంలో మాత్రం కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. పరిస్థితి వారంలోపే కుదుట పడవచ్చని పేర్కొన్నాయి.అయితే రోజురోజుకూ సీమాంధ్రలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం, నిరసనలు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల వరకూ విస్తరించడంతో కేంద్ర నిఘా అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. అత్యధిక ప్రాంతాల్లో ఆందోళనలు పార్టీలు, నేతల ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వస్తున్నారని వారి అధ్యయనంలో తేలింది. గ్రామ స్థాయిల్లో కూడా నిరసన ర్యాలీలు కొనసాగడం మరింత ఆందోళనకరమై అంశమని భావిస్తున్నారు. ఆందోళనలు ఎన్ని రోజుల పాటు కొనసాగవచ్చేనే అంశాలపై వివిధ వర్గాల ప్రతినిధుల ద్వారా నిఘా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. రాజధానిలో పరిస్థితులపై అధ్యయనం హైదరాబాద్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిఘా అధికారులు ప్రత్యేక పరిశీలనకు దిగాయి. సీమాంధ్రకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, వ్యాపారులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల భయాందోళనలపై కూడా పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడిన మర్నాటి నుంచే సచివాలయంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండటం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన వారిలో మరింత అలజడి రేపడం తెలిసిందే. ఉద్యోగుల నిరవధిక సమ్మె మొదలైతే విభజనకు వ్యతిరేకంగా ఆగస్టు 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవో నేతలు ప్రకటించడం ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చనే అంశంపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉద్యోగుల సమ్మె వల్ల శాంతిభద్రతల పరంగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ సీమాంధ్రలో ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని భావిస్తున్నాయి. ‘‘ఉద్యోగులు సచివాలయంతో పాటు ఆయా కార్యాలయాల్లోనూ నిరసనలు, ఆందోళనలకు దిగవచ్చు. దాంతో హైదరాబాద్‌లో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనవచ్చు’’ అని అనుమానిస్తున్నాయి. శాంతిభద్రతలపై డీజీపీ సమీక్ష సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సమీక్షించారు. అన్ని రీజియన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలతో ఫోన్లో మాట్లాడారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆందోళనలు కొనసాగుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఎస్పీల నుంచి నివేదికలందాయి. -
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ
విశాఖపట్నం: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన వెలువడగానే సీమాంధ్రలో విభజన సెగ రగులుకుంది. పెద్దఎత్తున ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలతో అట్టడుకిపోతోంది. రాష్ట్ర విభజనపై సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా తమ కార్యాచరణను రూపొందిస్తోంది. రేపటి నుంచి ఈనెల 11 వరకు జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ కేంద్రాల్లో ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా డివిజన్ సర్కిల్ స్థాయిలో భారీ ర్యాలీలు చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఈ నెల 9న జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుపై అనుకులంగా కేంద్రం జూలై 30న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు’
ఢిల్లీ: మంత్రులు రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్లు ఎవరని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను బ్యాలెన్సుడుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. రైతులు, హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై ప్రస్తుతం తాము దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఓ దశలో సీమాంధ్ర నేతలు రాజీనామాల బెదిరింపులపై ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సమస్యలు వీధుల్లో పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతలు లేవనెత్తిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్‌లను కలిసి వివరిస్తానని ఆయన తెలిపారు. -
టీఆర్ఎస్కు పది సీట్లు మించిరావు: విజయశాంతి
వచ్చే 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)పార్టీకి పది సీట్లు మించి రావని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. సోమవారం 'సాక్షి'తో మాట్లాడిన విజయశాంతి పలు విషయాలను వెల్లడించారు. ఉద్యమంలో క్రెడిట్ అంతా కేసీఆర్ అంటే తాను ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నడవడానికి అనేక మంది తెలంగాణ వాదులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు షోకాజ్ నోటీస్ అందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయశాంతి తెలిపారు. తెలంగాణ సాధన టీఆర్ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్ఎస్ అధినాయ కత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమ వుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని గతంలోనే ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాల చుట్టూ తిరిగే పార్టీలకు తాను క్రెడిట్ ఇవ్వదలచుకోలేదని, త్యాగాలు చేసిన అమరులకే క్రెడిట్ ఇస్తానని అన్నారు. తెలంగాణ కోసం తాను 16 ఏళ్లుగా కష్టపడ్డానని, టీఆర్ఎస్ 13 ఏళ్లుగానే, పోరాడుతోందని అన్నారు. తెలంగాణకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయంపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు. -
మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ
కడప : మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో సమైక్య శిబిరాన్ని సందర్శించిన ఆయనకు సోమవారం అవమానం ఎదురైంది. పదవులు పట్టుకుని వేళ్లాడే నేతలు ఎందుకు వచ్చారంటూ నినాదాలు చేశారు. నిరసనకారులు మంత్రికి చెప్పు చూపి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆయన నిరసనకారులకు సర్ధి చెప్పారు. రాజీనామా చేయటానికి తాను సిద్ధమేనని తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు. తక్షణమే మంత్రి పదవికి రఘువీరా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం మున్సిపల్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయ్ కుమార్ రాజీనామా చేశారు. కేబుల్ ఆపరేటర్లు హిందూపురంలో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బెలుగుప్పలో సమైక్యాంధ్రకు మద్దతుగా 4 వేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మంత్రి టీజీ వెంకటేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అవుకులో సమైక్యవాదుల భారీ ర్యాలీ చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం బాధాకరమని, శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో మూడువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఆళ్లగడ్డలో రవి అనే వికలాంగుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆళ్లగడ్డ నాలుగురోడ్ల సెంటర్లో ఉపాధ్యాయులు.... విద్యార్థులకు పాఠాలు చెప్పి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రాజమండ్రిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించొద్దని నినదిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మరో 72 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వారు మానవ హారం నిర్వహించారు. కాగా విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు వాహనాలను తుడిచి నిరసన తెలిపారు. -
ఉండవల్లి, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు
రాజమండ్రి: జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యతిరేకంగా సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో సమైక్య వాదులు గందర గోళ సృష్టించారు. సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను పెట్టాలని ఆందోళన కారులు నిరసనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. జై సమైక్యాంధ్రా నినాదంతో ఆ ప్రాంతమంతా హోరుత్తెంది. ఈ సదస్సులో సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రా కోరుతూ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఐదు రోజులుగా చేస్తున్న సమైక్యాంధ్ర హోరు ఉధృతమైంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. -
రాష్ట్ర విభజన తీరు బాధాకరం: సబ్బం హరి
-
రాజీనామా డ్రామాలొద్దు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి