హైదరాబాద్ : ప్రధానమంత్రి పదవిని కించపరచటం వల్లే మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేత, 20 సూత్రాల పథకం చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆయన శనివారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనపై సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదని తులసిరెడ్డి అన్నారు. తెలంగాణ కంటే రాయలసీమ వెనకబడి ఉన్నా ఎవరూ మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.