సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయంలో మార్పు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ సోవువారం స్పష్టం చేశారు. తెలంగాణపై పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకొంటే,... ఆ అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకొంటుందన్నారు.
ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో వూట్లాడారు. విభ జనతో తలెత్తే కీలకాంశాలపై సంప్రదింపుల ద్వారా కనుగొనే పరిష్కారాలను ఆంటోనీ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుందని, తెలంగాణ ముసాయిదా బిల్లు రూపకల్పనలో, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంటుందని సందీప్ దీక్షిత్ చెప్పారు. నేరచరితుల రక్షణకు రూపొందించిన ఆర్డినెన్స్ అర్థరహితమైనదని, దాన్ని చించివేసి, విసిరేయూలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరినట్లుగా, తెలంగాణ తీర్మానాన్ని కూడా చించి, విసిరేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయుడాన్ని విలేకరులు ప్రస్తావించగా, తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే కాంగ్రెస్ వైఖరి అని దీక్షిత్ స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం అమలులో ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడాన్ని ప్రశ్నించినపుడు,... విభజన అంశాలపై ఆంటోనీ కమిటీ చర్చలు జరుపుతోందని, అరుుతే, చర్చల ప్రక్రియ వివరాలు తనకు తెలియువని చెప్పారు.
ముసాయిదా బిల్లు తయారీపై కేంద్ర హోమ్‌శాఖ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందన్నారు. ఆంటోనీ కమిటీ పనిపూర్తయ్యేంత వరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని చెప్పడంలేదని మరో ప్రశ్నకు సమాధానంగా దీక్షిత్ చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలేవీ ఇంకా ఆమోదం పొందలేదని, అవి లోక్‌సభ స్పీకర్ పరిశీలనలో ఉన్నాయో లేక వారు, ఉపసంహరించుకొన్నారో కూడా తనకు తెలియదని విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా దీక్షిత్ చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి రాజీనామా ఆమోదంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
మా వైఖరిలో మార్పు లేదు
Published Tue, Oct 1 2013 3:40 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement