Tulasi Reddy
-
పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
సాక్షి, అనంతపురం: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాజకీయ బ్రోకర్ అంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ పెట్టుకుని మరో పార్టీ రూట్ మ్యాప్ కోసం చూడటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడమేమిటని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. చదవండి: మమత వ్యాఖ్యలపై మౌనమేల బాబు? -
కాంగ్రెస్ నాయకుడి తులసీరెడ్డిపై మండిపడ్డా మంత్రి జయరాం
-
‘పెట్రోల్, డీజిల్ 100 మార్కు దాటబోతోంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం ఫలితాల కోసం బెట్టింగులలో తేలియాడుతున్నారని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్ధితులలో భూగర్భజలాలు అడుగంటాయని, నీళ్లు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. పెనుగాలులు, వడగండ్ల వానల వలన చేతికొచ్చిన పంట నాశనమవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మే 23 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయల మార్కు దాటబోతోందని చెప్పారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీలేదని, ప్రత్యేక హోదా ఏమైనా తేగలరా ? వెనుక బడిన జిల్లాలకు నిధులేమైనా తేగలరా ? అని ప్రశ్నించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు మేలు చేసే పార్టీకే కేంద్రంలో మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్ధ నిర్వీర్యమైపోయింది రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్ధ నిర్వీర్యమయిపోయిందని కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో మరొక ప్రభుత్వం వచ్చే వరకు ఉన్న ప్రభుత్వం పాలించొచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైవిధ్యం వస్తే గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల మీద ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
టీడీపీతో పొత్తు.. ఏపీ కాంగ్రెస్ నేతల స్పందన!
సాక్షి, విజయవాడ: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జతకట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఖండించకుండా.. వాస్తవమేనన్నట్లుగా ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. బుధవారం ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై అధిష్టానందే తుదినిర్ణయమన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ దుష్ట పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనికి అనుగుణంగానే రాహుల్ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో సంకీర్ణయుగం నడుస్తోందన్నారు. అవినీతి ఎమ్మెల్యేలకు టీడీపీ సీట్లు ఇవ్వోద్దని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని టీడీపీ పొత్తును పరోక్షంగా ప్రస్తావించారు. -
'సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి'
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీలు ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఐదేళ్లలో ఏపీకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిందని.. అయితే ఇప్పటివరకు రూ. 12,700 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏపీకి చేస్తున్న అన్యాయంలో బీజేపీ పాపమెంతో.. టీడీపీది కూడా అంతే ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యమనే సంగతి మర్చిపోకూడదని తెలిపారు. టీడీపీ తన పాపాలను బీజేపీ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎన్టీఏలో భాగస్వామి అయిన టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతోందన్నారు. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బాగా సహాయం చేస్తుందని టీడీపీ నేతలు అసెంబ్లీలో స్వీట్లు పంచుకున్నారని తులసీ రెడ్డి గుర్తుచేశారు. -
'ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోంది'
సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాల్సి ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. 2018 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ పూర్తి అవాస్తవాలని కొట్టి పారేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలన్నారు. మూడున్నర ఏళ్లలో కేంద్రం నుంచి రూ. 4,329 కోట్లు మాత్రమే పోలవరం నిర్మాణానికి విడుదలయ్యాయని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు సర్కారు ఖర్చు చేసింది రూ. 7,431 కోట్లు అని, అందులో కేంద్రం రూ.3,102 కోట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం ఎలా పూర్తి అవుతుంది అని ఆయన ప్రశ్నించారు. -
రాష్ట్రానికి శని చంద్రబాబు: తులసిరెడ్డి
వేంపల్లె: రాష్ట్రానికి, ప్రజలకు సీఎం చంద్రబాబు ఒక శనిలాంటి వారని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాలోల గెలుస్తామంటూ బాబు పగటి కలలు కనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే హోదా రావాలన్నారు. సీమకు, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు రావాలన్నారు. -
అవినీతీలో ఏపీ ఫస్ట్
టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఇన్చార్జ్ తులసిరెడ్డి బేతంచెర్ల : మూడు సంవత్సరాల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గన సీతారామిరెడ్డి స్వగృహంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలోపార్టీ విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. నోట్ల రద్దు , ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థ తీరు చూస్తుంటే ప్రచార అర్భాటానికే కేంద్ర ప్రభుత్వం పరిమితమైందన్నారు. రాష్ట్రంలో నీరు చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఎ న్నికల హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అందుకు అద్దంకి, పత్తికొండ, ప్రొద్దుటూరులో జరిగిన హత్య సంఘటనలే నిదర్శనమని చెప్పారు. -
'బాబుకు ఓటమి భయంతోనే'
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం లేకే సీఎం చంద్రబాబు ఎన్నికలు నిర్వహించడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లకు, మరో 5 పుర పాలక సంఘాలు, ఏడు జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ, 129 సర్పంచ్ స్థానాలకు, 36 మున్సిపల్ వార్డులు, 1109 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని చట్టంలో ఉన్నా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సాహసించకపోవడానికి ఓటమి భయమే కారణమని తులసిరెడ్డి పేర్కొన్నారు. -
'చంద్రబాబు చేతకానితనం వల్లే'
విజయవాడ: చంద్రబాబు చేతకానితనం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. శుక్రవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పార్లమెంట్ ముందు ధర్నాకు దిగాలన్నారు. లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ
-
'తెలుగు దద్దమ్మల పార్టీగా పేరు మార్చుకోండి'
హైదరాబాద్: తెలుగు దద్దమ్మల పార్టీగా పేరు మార్చుకోమని టీడీపీకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు' అని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకంటే టీడీపీ మీదనే ఎక్కువ ఉందని చెప్పారు. ఈ ప్రైవేట్ బిల్లు ఏపీ భవిష్యత్తుకు సంబంధించిందని పేర్కొన్నారు. టీడీపీ ఏపీలో అధికార పార్టీగా ఉండి, కేంద్రంలో భాగస్వామ్యగా పార్టీగా ఉందని అన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలను ఒప్పించి ప్రైవేట్ బిల్లును ఆమోదింపచేయాల్సిన బాధ్యత టీడీపీకి ఉందని స్పష్టం చేశారు. టీడీపీకి చేతకాకపోతే కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకోవాలి. అలాగే రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీని తప్పించాలని అన్నారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ పేరు మార్చుకోవాలి.. తెలుగు దద్దమ్మల పార్టీ, లేదా తెలుగు ద్రోహుల పార్టీ'' అని పేరు మార్చుకోవాలని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరు పట్ల 87.14 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు తన సర్వేలో వెల్లడైనట్టు చంద్రబాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు.. చంద్రబాబు సర్వేలో నిజం ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన సర్వే నిజమని నమ్మితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడాలని కాంగ్రెస్ సవాల్ చేస్తోందని తులసిరెడ్డి తెలిపారు. -
తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్ : తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. దిలీప్‌కుమార్ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది. ముఖ్య అతిథి తులసిరెడ్డి మాట్లాడుతూ పద కవితకు అన్నమయ్య ఆద్యుడని, ఆయన సాహిత్యం నిండా సామాజిక స్పృహ నిండి ఉంటుందని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి గురుంచి మాట్లాడుతూ 179 పుస్తకాలకు పైగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథాన్ని రచించారని, జ్యోతిష్య అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువ జ్యోతిష్య శాస్త్రవేత్త వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిషోర్ తదితరులు మాట్లాడారు. భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భాగంగా గాయకుడు దిలీప్‌కుమార్ స్వరపరిచిన సంకీర్తనలను గాయనీమణులు టీవీఎస్ శ్రీదేవి, జ్యోతి, కొమ్మినేని రత్నకుమారి ఆలపించారు. -
'విదేశీ పర్యటనలతోనే బాబు కాలం వెళ్లదీస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బాబు ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమకు నీరందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని తులసిరెడ్డి అన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లుయినా రాయలసీమకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. సీమకు నీరు ఇవ్వకపోతే ప్రజలను మోసం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. నీటి కోసం సీమ రైతులు ఎదురుచూస్తున్నారని... ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ఏపీలోని 45 రిజర్వాయర్లు బాబు హాయాంలో వట్టి కుండల్లా మారయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారన్నారు. ఆస్పత్రుల్లో పందులు, కుక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను పీక్కుతింటున్నాయని, పుట్టిన పిల్లలను దొంగలు ఎత్తికెళ్లిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీడీపీ జెండా వాలిపోకుండా చూసుకో!
పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సాక్షి, హైదరాబాద్ : పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయడం దేవుడెరుగు కాని ఆ జెండా కుప్పంలో వాలిపోకుండా చూసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారని బాబు చేయించిన సర్వేలో వెల్లడి కావడం విడ్డూరంగా ఉందని, ఇదే నిజమైతే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 600 వాగ్దానాల్లో ఆరింటినైనా నెరవేర్చలేదన్న విషయం ఆ పార్టీ నేతలందరికీ తెలిసినా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. -
‘పులివెందుల సంగతి దేవుడెరుగు...కుప్పం సంగతి చూసుకో’
పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయడం దేవుడెరుగు కాని ఆ జెండా కుప్పంలో వాలిపోకుండా చూసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్ర వారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారని బాబు చేయించిన సర్వేలో వెల్లడి కావడం విడ్డూరంగా ఉందని ఇదే నిజమైతే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలు, ఆరు స్థానాల్లో జడ్పీటీసీ, వందకు పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తన ప్రభుత్వంపై 80 శాతం ప్రజలు అసంతప్తితో ఉన్నారని చంద్రబాబుకు తెలిసే ఎన్నికలకు పోవడం లేదన్నారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 600 వాగ్ధానాల్లో ఆరింటినైనా నెరవేర్చలేదన్న విషయం ఆ పార్టీ నేతలందరికీ తెలిసినా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారని ఆయన ఆరోపించారు. -
'హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజం లేదు'
విజయవాడ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలోనే వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారన్న హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజంలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి 2013లో జీవో 72ను జారీ చేసిన విషయం వాస్తవమే అని, అయితే ఇది కేవలం సర్వే కోసం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా 2007లో జారీ చేసిన జీవో కేవలం సర్వే కోసమే అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలకు, పాత జీవోలకు అసలు పోతన లేదని తులసి రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు పూర్తిగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినవి అని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కావాలన్నారు. ఒకవేళ ఆ అనుమలు ఉంటే చూపించాలని హరీష్ రావుకు ఈ సందర్భంగా తులసి రెడ్డి సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టుల వల్ల నిర్మితమై ఉన్న, నిర్మాణంలో ఉన్న పాత ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడరాదని, అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాల్లో 8 ప్రాజెక్టుల క్రింద 48 లక్షల ఆయకట్టుపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తోంటే.. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం చచ్చిన పాములా ఉలుకూ పలుకూ లేకుండా పడివుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమన్నారు. -
'చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎస్.శైలజానాథ్, తులసీరెడ్డి శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్రమంత్రి ప్రకటించినా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబును బాబును భయపెడుతోందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కొడుకు లోకష్‌ను సీఎం చేసేందుకు ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ... ప్రతిపక్షాలనే లేకుండా చేయాలనుకుంటున్నారని వారు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రేవేట్ నెంబర్ బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు వారు సూచించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారో... తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారో లేదా సీఎంగా దిగిపోతారో చంద్రబాబే తేల్చుకోవాలని శైలజానాథ్, తులసీరెడ్డి స్పష్టం చేశారు. -
కె బి వెంకట్‌రెడ్డి సహా 8 మందిపై కేసు నమోదు
కర్నూలు : నంద్యాల టీడీపీ నేత తులసిరెడ్డిపై దాడి కేసులో నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఎ.రవికృష్ణ వెల్లడించారు. ఈ కేసులో కొత్తపల్లి బాలవెంకట్‌రెడ్డి సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగిన ఘటన స్థలాన్ని మంగళవారం రవికృష్ణ పరిశీలించారు. ఈ కేసులో నిందితులెవరైనా వదిలి పెట్టమని... కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. నంద్యాల టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన తులసిరెడ్డిపై సోమవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. తులసిరెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొత్తపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. -
నంద్యాల టీడీపీలో కలకలం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో కలకలం మొదలైంది. స్థానిక టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఆయన్ని దుండగులు అడ్డగించి.... కళ్లలో కారం కొట్టి.... కత్తులతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. తీవ్ర గాయాలతో తులసిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... తులసిరెడ్డి.. పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ దాడి చేసింది... ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని.... తులసిరెడ్డి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మాయల పకీర్ వేషాలు మానుకో బాబూ’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయల పకీర్ వేషాలు మానుకుంటే మంచిదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి హితవు పలికారు. రాజధాని నిర్మాణం పేరుతో బాబు చేస్తున్న హంగామా అరచేతిలో వైకుంఠం లాంటిదేనన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సింగపూర్ కంపెనీకి రూ.15 కోట్లు చెల్లించిన బాబు, భవనాల డిజైన్ల కోసం జపాన్‌కు చెందిన మకి కంపెనీకి రూ.97.50 లక్షలు చెల్లించారన్నారు. రాజధానికి నిధులు ఎలా సేకరించాలన్న సలహా ఇచ్చినందుకు మెకిన్సీ కంపెనీకి రూ.112 కోట్లు చెల్లించేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీకి బాబు తెరతీశారని పేర్కొన్నారు. విభజన చట్టంలో సెక్షన్-6 ప్రకారం రాజధాని నిర్మాణానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలని స్పష్టంగా ఉందన్నారు. మాస్టర్‌ప్లాన్, డిజైన్లు, ప్రజాభిప్రాయం, భూమి పూజలు, శంకుస్థాపనల పేరుతో బాబు ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇలాంటి చీప్‌ట్రిక్స్ ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం చేతకాని బాబు రాజధాని నిర్మాణమెలా పూర్తి చేయగలరో చెప్పాలని తులసిరెడ్డి ప్రశ్నించారు. -
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే
- ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. విభజన జరిగిన 19 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో వృద్ధి సాధించిందని, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తొలి అర్థ సంవత్సరంలోనే 27.17 శాతం వృద్ధి నమోదైందని, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రకెక్కుతుందని.. ఇలా పచ్చి అబద్ధాలతో అధికార టీడీపీ రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ యథాతథంగా చదవటం హాస్యాస్పదమన్నారు. బుధవారం ఇందిరాభవన్ లో విలేకరులతో మాట్లాడిన తులసిరెడ్డి.. రాష్ట్రం రెవెన్యూ లోటు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, పన్ను రాయితీ, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు, కొత్త రైల్వే జోన్ లాంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతుండగా, వాటికి పరిష్కారాలు కనిపెట్టాల్సిందిపోయి లేనిది ఉన్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారి కాబోతున్నప్పటికీ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉలుకు పలుకూ లేకుండా పడిఉన్నారని విమర్శించారు. -
కాల్ మనీ పాపం చాంద్రబాబుదే
-
'మొదటి ముద్దాయి చంద్రబాబే'
హైదరాబాద్: కాల్ మనీ కేసులో మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి సోమవారం ఆరోపించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. టీడీపీ మేనిఫెస్టోను రెండో ముద్దాయిగా ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందునే మహిళలు కాల్ మనీ రుణాలను ఆశ్రయించారన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరపాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. -
హోదా కోసం రాహుల్ లేఖ రాస్తే తప్పా : తులసి రెడ్డి
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాస్తే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఉలుకెందుకని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశ్నించారు. హోదా అమలు చేయాలని లేఖ రాయడాన్ని తప్పుపట్టడం గర్హనీయమన్నారు. హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని, ప్రణాళిక సంఘం ఆమోదం ఎందుకు తీసుకోలేదని అప్పటి ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు ప్రశ్నించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా అమలవుతున్న 11 రాష్ట్రాల్లో దేనికీ చట్టంలో పొందుపరచలేదని అడిగారు. ఆ విషయాన్ని నిజంగానే చట్టంలో పొందుపరచాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా చట్టం ఎందుకు చేయలేదన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చి ఉంటే 2014 జూన్ 2 నుంచే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలయ్యేదని ఆయన పేర్కొన్నారు. -
'రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టుపెట్టారు'
వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ ప్రతినిధులకు తాకట్టు పెట్టారని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వారికి లబ్ధి చేకూర్చి తద్వారా ఆయన లాభపడటానికి రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం మంచిది కాదన్నారు. చంద్రబాబు.. సింగఫూర్ వ్యాపార ప్రతినిధులతో లాలూచీ పడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధానికి సంబంధించి ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరించారన్నారు. అగ్ర రాజ్యమైన అమెరికా రాజధాని కూడా 7,422 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకూ చంద్రబాబు ఒకే చోట రాజధానులు కడుతున్నారా అని ఎద్దేవా చేశారు. సేకరించిన భూమి చాలదన్నట్లు మూడు పంటలు పండే రైతుల భూములనూ లాక్కోవాల్సిన అవసరం ఏముందన్నారు. సింగఫూర్ కంపెనీలకు ఇక్కడి భూమిని 99 ఏళ్లు లీజుకు ఇస్తున్నారంటే మరో ఈస్టిండియా కంపెనీ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మంగళవారం ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు సాధించుకుని రావాలన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. -
'బాబు భూదందాలో మునిగితేలుతున్నారు'
వేంపల్లె: రైతుల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం సిరులు పండే భూములను రాజధాని పేరుతో రైతుల నుంచి లాక్కుంటోందని ఆరోపించారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించే భూమిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రాజధానులను నిర్మించవచ్చని తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ విస్తీర్ణం 7వేల ఎకరాలేనని తెలిపారు. భూ దందా కార్యక్రమంలో మునిగి తేలుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను విస్మరించారన్నారు. రెండేళ్ల నుంచి ఇన్పుట్ సబ్సిడీ పైసా విడుదల చేయలేదని, కనీసం రైతులకు సరిపడా విత్తనాలను కూడా పంపిణీ చేయలేక పోయారని ఆరోపించారు. మొత్తం 9 వేల క్వింటాళ్లు అవసరం కాగా 1500 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందజేశారని వివరించారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రాష్ర్ర్టంలో వ్యవసాయం చతికిలపడిందని తులసిరెడ్డి అన్నారు. -
'చీమ కుట్టినట్లైనా లేదే!'
వేంపల్లె: రైతులు వరుస కరువులతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో నిండా మునిగి తేలుతూ ప్రచార ఆర్భాటానికే ఆసక్తి చూపుతున్న సీఎం చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని రైతులకు 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పంటల బీమా రూ.2,560 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. 2012-13 రబీ సీజన్లో వైఎస్ఆర్ జిల్లాలో 70 వేల మంది శనగ, పొద్దుతిరుగుడు రైతులు బీమా ప్రీమియం చెల్లించారని.. రెండేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం జపాన్, చైనా, సింగఫూర్ దేశాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్తాన్ని నిలదీసేందుకు ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. అప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రత్యక్ష ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛ భారత్.. అంటుంటే, చంద్రబాబు చెత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. -
మోడి ప్రభుత్వం అవినీతికి ఆజ్యం పోస్తోంది
తులసిరెడ్డి వేంపల్లె : టీడీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి ఆజ్యం పోస్తోందని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. పొలాలు పదున్లు కూడా అయ్యాయని.. ప్రధానంగా రైతులకు విత్తనాలు, ఎరువులకు పెట్టుబడులు అవసరమన్నారు. పైసాలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం సబ్సిడీ వేరుసెనగ విత్తన కాయలు ప్రభుత్వం అరకొరగా అందిస్తోందన్నారు. 2014 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రాష్ట్రంలో రూ.1200కోట్లు, జిల్లాకు రూ.45కోట్లు రావాల్సి ఉందన్నారు. వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మండలాధ్యక్షుడు మురళీమోహన్‌రెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ తీరు దారుణం: తులసిరెడ్డి
వైఎస్ఆర్జిల్లా : నాగార్జున సాగర్ జలాలు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కోరుతున్నా కేంద్రం జోక్యం చేసుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రాజ్యసభ మాజీ సభ్యులు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు రైతులకు ఎంతగానో ఉపయోగపడగా నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతుల ఘర్షణలకు కారణం కావడం బాధాకరమన్నారు. రైతులను తీసుకొనివెళ్లి సాగర్ గేట్లను పగులగొడతామని ప్రజాప్రతినిధులు అంటున్నారంటే సమస్య పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొని వచ్చి బచావత్‌కమిటీ తీర్మానం ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ పునర్ఃవ్యవస్థీకరణ చట్టంలోని 84, 85, 86, 87, 88, 89సెక్షన్ల ప్రకారం చెప్పార న్నారు. ఆ ప్రకారం ఆ రెండు ప్రాజెక్టులను కృష్ణా నది బోర్డు పరిధిలోకి తెస్తూ కేంద్రం నోటిఫై చేయాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు కృష్ణా నది బోర్డు కేంద్రానికి లేఖలు రాసిన వాటిపై స్పందించకపోవడం మోడి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందన్నారు. పంటలు ఎండక ముందే సమస్యను పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. (వేంపల్లె) -
'రాజధాని పేరుతో హైప్ క్రియేట్ చేయడం సరికాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన తులసిరెడ్డి.. కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాజధాని భూసేకరణ అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు. ముందు రైతులు, రైతు కూలీలు గురించి ఆలోచించాలని.. రాజధాని పేరుతో ఏదో హైప్ క్రియేడ్ చేయడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని తులసిరెడ్డి అన్నారు. -
పీలేరులో జేఎస్పీదే గెలుపు: తులసిరెడ్డి
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ విజయబావుటా ఎగుర వేయనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఎన్.కిషోర్‌కుమార్‌రెడ్డి 20 వేల మెజార్టీతో పీలేరులో గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలోని రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, అనంతపురం లోక్‌సభ స్థానాల పరిధిలోని ఏడెనిమిది అసెంబ్లీ స్థానాల్లోని ప్రధాన పార్టీలకు జేఎస్పీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి అభ్యర్థులు గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. పదవుల కోసం తాము పార్టీ పెట్టలేదనీ, ఉన్న పదవుల్ని త్యజించి సమైక్యాంధ్ర కోసం ప్రజల్లోకి వచ్చామన్నారు. గెలుపోటముల సంగతెలాగున్నా, ప్రజల్లో సమైక్యభావన ఏ మేరకు ఉందో అంచనా వేసుకునేందుకు ఎన్నికలు దోహదపడతాయన్నారు. -
దళితులకే జెడ్పీ పీఠం
సాక్షి, కడప : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దళితులకే దక్కనుంది. జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ శనివారం ప్రకటించారు. ఇంతవరకు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి ఓసీ, బీసీలను మాత్రమే వరించింది. తొలిసారిగా దళితులకు దక్కనుండటం గమనార్హం. గతంలో జెడ్పీ అధ్యక్షులుగా తులసిరెడ్డి (జనరల్) కె.సురేష్‌బాబు(బీసి), జ్యోతిరెడ్డి (ఓసి మహిళ) పనిచేసి ఉన్నారు. -
కాంగ్రెస్ కు నూకలు చెల్లుతాయి: తులసి రెడ్డి
కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు విధించడాన్ని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణులను, నేతలను కాంగ్రెస్ పార్టీ మోసగిస్తోంది అని తులసి రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు నూకలు చెల్లుతాయని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా రాష్ట్రాని విభజిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది అని ఆయన అన్నారు. ఇప్పటికైనా విభజన అంశంపై మరోసారి ఆలోచించాలని పార్టీ హై కమాండ్ కి తులసి రెడ్డి సూచించారు. -
కాంగ్రెస్‌కు పరాభవమే
భీమవరం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుని ఘోర తప్పిదం చేసిందని, ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డి స్పష్టం చేశారు. భీమవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అసెంబ్లీలో అడ్డుకుంటామన్నారు. విభజన బిల్లు శాసనసభలో వీగిపోతే రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్రలో ఇంతగా ప్రజావ్యతిరేకత వస్తుందనే విషయూన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అధినేత సోనియాగాంధీ ఊహించలేకపోయూరని అన్నారు. రాష్ట్ర విభజనకు శ్రీకా రం చుట్టి కాంగ్రెస్ పెద్ద తప్పు చేశారన్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి చవిచూసినట్టే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదన్నా రు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు తమ తెలుసుకుని విభజన నిర్ణయూన్ని విరమించుకోవాలని కోరారు. ఒకప్పుడు సమైక్యవాదులైన కేసీఆర్, జైపాల్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని చెప్పారు. 20 సూత్రాల అమలులో మనమే టాప్ 20 సూత్రాల కార్యక్రమం అమలులో వరుసగా మూడుసార్లు జాతీయస్థాయి పురస్కారాన్ని మన రాష్ట్రం దక్కించుకుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 సూత్రాల కార్యక్రమం అమలుకు రూ.14వేల 154 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. -
బీజేపీలో మోడీ భజన ఎక్కువైంది
భారతీయ జనతాపార్టీలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భజన ఎక్కువ అయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి రేకులు రాలిన కమలంగా ఆయన అభివర్ణించారు. 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీకి మెజార్టీ రాదని ఆయన జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు రాజకీయంగా ఎదగడానికే రాష్ట్ర విభజన వైపు మొగ్గు చుపుతున్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు సమైక్యాంధ్ర కోసం సీఎం పదవినే తృణ ప్రాయంగా విడిచిపెట్టిన మహానీయుడని తులసీ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్ : ప్రధానమంత్రి పదవిని కించపరచటం వల్లే మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేత, 20 సూత్రాల పథకం చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆయన శనివారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనపై సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదని తులసిరెడ్డి అన్నారు. తెలంగాణ కంటే రాయలసీమ వెనకబడి ఉన్నా ఎవరూ మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
‘రాయలసీమను విభజిస్తే అగ్ని గుండమే’
హైదరాబాద్: రాయలసీమను విభసిస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని ఆయన తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కర్నూలును రాజధానిగా వదులుకున్నామన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని చారిత్రాత్మక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలని తులసీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అనంతరంసీమాంధ్రలో సమైక్యాంధ్రా ఉద్యమ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి.