
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీలు ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఐదేళ్లలో ఏపీకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిందని.. అయితే ఇప్పటివరకు రూ. 12,700 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏపీకి చేస్తున్న అన్యాయంలో బీజేపీ పాపమెంతో.. టీడీపీది కూడా అంతే ఉందని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యమనే సంగతి మర్చిపోకూడదని తెలిపారు. టీడీపీ తన పాపాలను బీజేపీ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎన్టీఏలో భాగస్వామి అయిన టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతోందన్నారు. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బాగా సహాయం చేస్తుందని టీడీపీ నేతలు అసెంబ్లీలో స్వీట్లు పంచుకున్నారని తులసీ రెడ్డి గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment