Telugu Desam MPs
-
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన జీవీఎల్ నరసింహారావు
-
ప్రత్యేకహోదాపై జగన్ చెప్పిందే సత్యం
పెనగలూరు: ప్రత్యేకహోదాపై నాలుగున్నర సంవత్సరాల నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే సత్యమని తేలిందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ పేర్కొన్నారు. కొండూరులో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై జగన్ ఏమైతే ప్రజలకు చెప్పారో.. అవే మాటలు పార్లమెంటులో గల్లా జయదేవ్ ఇంగ్లిష్‌లో చెప్పారన్నారు. జగన్ చెప్పిన మాటలు అప్పుడు కాదనుకున్న టీడీపీ ఇప్పుడు అవే మాటలు పార్లమెంటులో చెప్పడం చూస్తే జగన్ మాటలే సత్యమని తెలుస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉండి కూడా ప్రత్యేకహోదాపై విఫలం చెందారని ఆమె విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ చెపుతుంటే టీడీపీ కనీసం నిరసన కూడా తెలుపకపోవడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్‌ను విమర్శించడం మానుకుని, ప్రత్యేకహోదా కోసం పోరాడాలని ఆమె హితవు పలికారు. అలాగే ఈనెల 24న వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌లో టీడీపీ కూడా పాల్గొనాలని కోరారు. ప్రత్యేకహోదా అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని ప్రతి పార్టీ నిలబెట్టేలా కృషి చేయాలన్నారు. అలాగే మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌ను రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రభావతమ్మ కోరారు. కార్యక్రమంలో పెనగలూరు జెడ్పీటీసీ విజయ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కేతా చక్రపాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నోరు మెదపని టీడీపీ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్‌నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. నిధులిచ్చామని రాజ్‌నాథ్ చెబుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. చరిత్రలో కర్ణాటక అనుభవ్ మండపం, తంజావూరు చోళుల వ్యవస్థ నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, ప్రజాస్వామ్య పునాదులు భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘దేశంలో నాలుగేళ్లుగా ఉగ్రదాడులు జరగకుండా అణచివేశాం. చరిత్రలో అతిపెద్ద మూక దాడులు 1984లో జరిగాయి. కొందరు నేతలు హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు తాలిబన్ గుర్తుకురాలేదా..? కౌరవులను చంపిన పాండవులే వారి కర్మకాండలు నిర్వహించారు. అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న దేశ మనది. పాకిస్తాన్ ఒక దేశం కాదు.. ఒక దరిద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయితీ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. నిరుపేద తల్లిగర్భం నుంచి పుట్టిన మోదీలాంటి వ్యక్తే రైతుల నిజమైన బాధను అర్థం చేసుకోగలరని’రాజ్‌నాథ్ అన్నారు. డైలమాలో కాంగ్రెస్!! మరోవైపు అవిశ్వాసంలో ఓటు వేయాలా.. వద్దా.. అనే దానిపై కాంగ్రెస్ సందిగ్దంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసానికి ఓటేయడంపై కాంగ్రెస్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటుండగా.. మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
తొలిరోజే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్‌సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్‌లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. కొత్త సభ్యుల ప్రమాణం సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్ఎల్డీ) ప్రమాణం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
టీఆర్ఎస్ ఎంపీలతో టీడీపీ ఎంపీలు భేటీ
-
‘ఆ దారుణాలన్నీ అద్వానీకి తెలుసు’
సాక్షి, రాజమహేంద్రవరం : ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. సభ (పార్లమెంట్)లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. ‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు. -
హోదాపై టీడీపీ దొంగ దీక్షలు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దొంగ దీక్షల తీరు తేటతెల్లమైందని, ఇక వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు కిలోల బరువు తగ్గడానికి దీక్షలు చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అంటే, హోదానా గీదానంటూ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించి వారి దొంగ దీక్షల గుట్టును విప్పారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సాధించేందుకు తాము చిత్తశుద్ధితో దీక్షలు చేస్తున్నామంటూ ప్రగడ్భాలు పలుకుతున్న తీరును ప్రజ లు నిశితంగా గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పా టు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు. కొత్త డ్రామాలకు సీఎం తెర.. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం దీక్షల పేరిట భారీ సెట్టింగ్‌లతో వేదికలు వేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక విశాఖ గల్లీలో తూతూ మంత్రపు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి ఢిల్లీలో దీక్షలు చేసే సత్తా లేకే విశాఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం ముందు సినీ సెట్టింగ్‌లను తలదన్నే రీతిలో సెట్ వేసి బూటకపు దీక్షలు చేసి ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం తలపెడుతున్నారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌వి అవగాహన రహిత వ్యాఖ్యలు.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు విసురుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. టీడీపీ గెలుపునకు బాటలు వేసి, కేంద్రానికి మద్దతిచ్చి నాలుగేళ్లగా వారి సహవాసం చేసినప్పుడు చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చోడవరం సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంటే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీ అడుగులు మడుగులొత్తి పవన్ ఎన్నికల్లో తన హవాను మళ్లీ చాటుకునేందుకు టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆ మేరకే వైఎస్సార్సీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్న విషయం ఇప్పటికే పవన్‌కల్యాణ్‌కు స్పష్టమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించి అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలో టీడీపీని దానికి మద్దతిస్తున్న పార్టీలను రాష్ట్రం నుంచి జనం తరమి కొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి సమన్వయకర్త వరుధు కల్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, షరీఫ్, బర్కత్ ఆలీ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్ గౌడ్, కాంతారావు, తడ్డబారికి సురేష్, బాబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీలకు వైఎస్సార్సీపీ నేత సవాల్
సాక్షి, విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందో, లేక రైల్వేశాఖ మంత్రి ఇంటి ముందో ధర్నా చేయాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేతల డ్రామాలను జనాలు గుర్తించారని, ఇక స్థానిక రైల్వేస్టేషన్లలో రైల్వే జోన్ గురించి దీక్ష చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలతో ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని, నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ అంశాన్ని ఆరు నెలల్లోగా తేల్చాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. అదే విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీపై కూడా 6 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఉండగా.. ఈ నాలుగేళ్లు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతల డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో నేడు టీడీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నట్లు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేసిన పోరాటాన్ని గుర్తుకుచేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులను కలుపుకుని పోరాటం చేస్తే వైఎస్సార్సీపీ నేతలను అధికార టీడీపీ నేతలు అవహేళన చేశారు. ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు నిజంగా సిగ్గుందా అని ప్రశ్నించారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందనగా ఇప్పుడు దీక్షలేందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా ఏం లాభం లేదు. ఈ ఏడాది మార్చి వరకు టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించారు. కానీ ఏం సాధించారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలరోజుల్లో ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఆ ఎంపీ ఇటీవల ఢిల్లీలో ఏం మాట్లాడారో ఏపీ మొత్తం చూసింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలను ఏపీ ప్రజలు ఓసారి గుర్తుచేసుకోవాలి. జోను లేదు.. గీను లేదు అంటూ చాలా చులకనగా మాట్లాడి అవంతి శ్రీనివాస్ దొరికిపోయారు. మరో ఎంపీ మురళీమోహన్ అయితే 5 కేజీల బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి అనడం వీడియోల్లో స్పష్టంగా చూశాం. ఎన్డీఏ నుంచి బయటకొచ్చినప్పటికీ బీజేపీకి టీడీపీ ఎంపీలు రహస్య మిత్రులుగా ఉన్నారు. టీడీపీ చేసిది దీక్షలు కాదు కిట్టీ పార్టీల్లా ఉన్నాయంటూ’ ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని టీడీపీ నేతలపై గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
నాలుగేళ్లుగా టీడీపీ నేతలు నిద్రపోతున్నారా..?
-
తుంపాల షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దిరించాలి
-
చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా?
-
‘తీవ్ర భయాందోళనలో చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన టీడీపీ నేతలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హోదా కంటే ప్యాకేజీ కోసం పాకులాడింది వాస్తవం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అబద్దాలు చెప్పారో నిరూపించగలరా? చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కుట్రలు, కుతంత్రాలు అంటారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందా అన్నారు. చంద్రబాబు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్ధసారథి డిమాండ్ చేశారు. -
డామిట్ కథ అడ్డం తిరిగింది!
-
వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ
సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. తమ మాటలను మార్ఫింగ్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు క్లాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలక అంశాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రదర్శిస్తున్న చులకన భావం, వారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కీలకమైనవేవీ ఇప్పటివరకు నెరవేరకపోగా, కడప ఉక్కు కర్మాగారం, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి వాటి విషయంపై టీడీపీ ఎంపీల నైజం తేటతెల్లం చేసే వీడియో బయటకుపొక్కడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకించి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేయాలన్న అంశంపై టీడీపీ ఎంపీలు సమావేశమైన సందర్భంగా ఒక్కక్కరు తేలిక భావంతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో లీక్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు. అలాంటి వీడియో లీక్ కావడంపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీలు చాటుమాటుగా మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారు? ఎలా బయటకు పొక్కింది? అన్న విషయాలపై విచారణ చేయించాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప ఉక్కు కర్మాగారం కోసం ఏదో పోరాటం చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికొచ్చారు. ఆ క్రమంలో వారంతా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై చాలా తేలికగా, చులకన భావంతో స్పందించారు. పార్టీ అధినేత చెప్పినట్టుగానే తమ వంతుగా నిరాహార దీక్ష చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ అంటూ ఒక్కో ఎంపీ ఒక్కో రకంగా తమలోని ఆలోచనలు బయటపెట్టారు. అంతా సరదాగా సమావేశాన్ని ఎంజాయి చేశారు. అయితే తమ నిజస్వరూపం బయటపెట్టేలా వీడియో రికార్డవుతుందని వారు ఊహించలేకపోయారు. వారు మాట్లాడిన మాటల వీడియో మీడియాలో దర్శనమీయడంతో పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తమ నాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతం కావడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నివ్వెరపోయారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలా వీడియో తీస్తుండగా గమనించకుండా ఎలా ఉన్నారు? ఇంతకు ఆ వీడియో తీసిందెవరు? అంటూ వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. తమ వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారమయ్యాయని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో రికార్డింగ్ ఎవరు చేశారో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి బయటకు పొక్కడం వల్ల పార్టీ పరువు పోతుందంటూ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలకు వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ ఏదో చెబుతుండగా, ఇకనుంచి బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇలాంటివి బయటకు రావడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. సంబంధిత కథనం : బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీలకు బాబు క్లాస్
-
మెకాన్ తుది నివేదిక తరువాతే ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిన సమర్పించిన తరువాతే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై తదుపరి ప్రకటన చేయగలుగుతామని, అప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు గురువారం కూడా కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, ముడిసరుకు సరఫరాపై వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి ఒక్కరే విడిగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై మెకాన్‌కు పూర్తి సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు సూచించానన్నారు. సదురు సంస్థ ముసాయిదా నివేదిక సమర్పించిన అనంతరం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమై చర్చించాక తదుపరి ప్రకటన చేయగలుగుతామన్నారు. ప్లాంట్ ఏర్పాటుపై నాలుగేళ్లుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలనుకుంటే ఇన్నిసార్లు కమిటీలు నియమించి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అవకాశాలపై ఎందుకు అధ్యయనం జరిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ‘1966లో మా రాష్ట్రం (హరియాణా) ఏర్పడింది. ఇప్పటికి కూడా మా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. అలాంటిది నాలుగేళ్లకే ఏపీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పడం సరైందికాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. టీడీపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఎంపీ రమేశ్‌తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించాలని సూచించారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఎకరం రూ. నాలుగు లక్షలకు ఇస్తామని, రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెకాన్‌కు ఇవ్వాలని ఆయన సూచించారన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో మెకాన్‌కు వివరాలిస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని కోరగా ఆయన తిరస్కరించారంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అయితే ప్రధాని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. -
బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా?? కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్‌ను మించిన వాడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. -
బట్టబయలైన టీడీపీ ఎంపీల కపట దీక్ష
-
కడప జిల్లాపై వివక్ష చూపుతున్నారు
సాక్షి, రాజంపేట : వైఎస్సార్ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్సీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఉన్న అనుకూలత ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ నేతలకు ఉక్కు పరిశ్రమ గుర్తొచ్చిందా అని నిలదీశారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టే టీడీపీ నేతలు దీక్షలు చేసేవారా అంటూ ఎద్దేవా చేశారు. ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ, సీఎం రమేష్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలని.. దానికి తాము కూడా మద్ధతు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చిత్తశుధ్దితో పోరాటం చేస్తోందని అన్నారు. తాను, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఎన్నోసార్లు ఉక్కు పరిశ్రమ కోసం గట్టిగా నిలదీశామని చెప్పారు. ఆరోజు నోరు కూడా తెరవని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమతో పాటు టీడీపీ ఎంపీలు కలిసి రావాలని కోరితే ఎదురు దాడికి దిగుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్క రోజుకూడా పదవిని వదులుకోవడానికి టీడీపీ ఎంపీలు సిద్ధంగా లేరని విమర్శించారు. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రవీంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, రాజంపేల పార్లమెంట్ అద్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలకు రాజంపేట న్యాయవాదుల అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. -
టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలి
-
ఆత్మగౌరవం కాపాడేందుకే రాజీనామా
పొదలకూరు: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో శని వారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్æ ప్రజలం దరూ రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలను కీర్తిస్తున్నట్టు తెలి పారు. టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి దొంగ దీక్షలు చేస్తూ, పూటకో మాట, రోజుకో ఎత్తుగడతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి ప్రత్యేకహోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గార్చి, ఇప్పుడు ఎంపీ ల రాజీనామాలపై తన మంత్రులతో ఎదురు దాడి చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాను సజీవంగా ఉంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. యుద్ధం, స్నేహం సోమిరెడ్డికి బాగా తెలుసు యుద్ధం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా టీడీపీకే తెలుసని మం త్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే కాకాణి తిప్పికొట్టారు. కాంట్రాక్టర్లు, మిల్లర్లు ముడుపులు ఇవ్వకుంటే యుద్ధం చేయడం, ముడుపులు చెల్లింస్తే స్నేహం చేయడం ఆయనకు మామూలేనన్నారు. నాలుగు పర్యాయాలు వరుసగా ఓటమి చవిచూసి, దొడ్డిదారిన మంత్రైన సోమిరెడ్డికి ప్రజల ఓట్లతో వచ్చిన పదవి విలువ తెలియదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను జీతాలు వదులుకున్నారని సోమిరెడ్డి అవహేళన చేయడాన్ని చూస్తే ఆయన జన్మలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదన్నారు. జేబులు నింపుకోవడం తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి తెలియని నాయకుడికి తమ ఎంపీల త్యాగాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, పలుకూరు పోలిరెడ్డి పాల్గొన్నారు. -
‘టీడీపీ ఎంపీలు దోషులుగా మిగులుతారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్ బాషా అన్నారు. హోదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తే, టీడీపీ దుష్ప్రచారం చేసిందని ధర్మాన మండిపడ్డారు. హోదా కోసం ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు హోదాతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎంపీ పదవులను త్యాగం చేయడం ఆషామాషీ కాదని అంజాద్ బాషా అన్నారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో తమ ఎంపీలు చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలని బాషా డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారు
-
చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పోరాటం ఉధృతం చేయాలనుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎంపీలు షాక్ ఇచ్చారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు. ఆ దిశంగా టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఎంపీల బస్సు యాత్ర ద్వారా హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతోపాటు ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రపై నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవండంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎంపీల బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన చంద్రబాబుకు ఎంపీలు ...యాత్రకు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణ దిశగా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.