
వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం : హోదాపై చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు సైతం రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలే ఉన్నా చిత్తశుద్ధితో హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
తమ అధినేత సూచనల మేరకు పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన రోజే ఏంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో తమతో కలిసి రావాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment