
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో వైబీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఇంటికి బయలుదేరారు.
తమ మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, యర్రం పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment