
వాళ్లే వచ్చి పచ్చ కండువాలు కప్పుకుంటున్నారు
సాక్షి, విజయవాడ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో చేరాలని తాము ఎవ్వరినీ రమ్మనలేదని, వాళ్లే వచ్చి పచ్చ కండువాలు కప్పుకుంటున్నారని ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్ అన్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయం మీడియా పాయింట్‌లో ఆదివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెరిగే 50 అసెంబ్లీ స్థానాల్లో కొత్తగా చేరుతున్న ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు.