ఇలాగైతే ‘ఫ్యాన్’దే హవా | JC Diwakar Reddy quarrel with CM Ramesh | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ‘ఫ్యాన్’దే హవా

Published Tue, Apr 15 2014 9:49 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ఇలాగైతే ‘ఫ్యాన్’దే హవా - Sakshi

ఇలాగైతే ‘ఫ్యాన్’దే హవా

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి, టీడీపీ రాయలసీమ ఇన్‌చార్జ్ సీఎం రమేష్ మధ్య సోమవారం హైదరాబాద్‌లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

* సీఎం రమేష్‌తో జేసీ దివాకర్‌రెడ్డి వాగ్వాదం
 
అనంతపురం : మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి, టీడీపీ రాయలసీమ ఇన్‌చార్జ్ సీఎం రమేష్ మధ్య సోమవారం హైదరాబాద్‌లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంతకల్లు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని వార్తలు రాగానే జేసీ దివాకర్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని సీఎం రమేష్ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేను కోట్ల రూపాయలు కుమ్మరించి టికె ట్ సంపాదిస్తే.. మీరు బీజేపీకి గుంతకల్లు అసెంబ్లీ టికెట్ కేటాయించడంవల్ల అనంతపురం పార్లమెంటులో టీడీపీ అడ్రస్సు గల్లంతవుతుందయ్యా.. అనంతపురం లోక్‌సభ పరిధిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది.. అనంత వెంకట్రామిరెడ్డి కచ్చితంగా గట్టిపోటీ ఇస్తారు.. గుంతకల్లు టీడీపీ టికెట్ మధుసూదన్‌గుప్తాకు ఇవ్వండని చెబితే ఇలా చేశారేంటి? ఈ పరిస్థితిలో గుంతకల్లు అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇస్తే ఆయన ఈజీగా గెలిచేస్తారు. నన్ను మీరే ఓడగొట్టేట్టున్నారు.. అనంతపురం లోక్‌సభ పరిధిలో బీజేపీకి ఏ అసెంబ్లీ కేటాయించవద్దు. వాళ్లకు మడకశిర ఇచ్చుకోండ’ని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం అధిష్టానం తీసుకుందని, ఇందులో తన ప్రమేయం లేదని సీఎం రమేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement