‘జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి’ | bosta satyanarayana condemns tdp mp jc diwakar reddy comments on president | Sakshi
Sakshi News home page

‘జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి’

Published Fri, Apr 7 2017 4:21 PM | Last Updated on Sat, Aug 11 2018 4:30 PM

‘జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి’ - Sakshi

‘జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి’

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఉద్దేశించి టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం  ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ వ్యవస్థకు కళంకం తెస్తున్నారని, జేసీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని బొత్స సూటిగా ప్రశ్నించారు.

గవర్నర్‌, ముఖ్యమంత్రి, స్పీకర్‌ వ్యవస్థలతో పాటు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అదే విషయాన్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, స్పీకర్ల అధికారాలకు పరిమితి ఉండాలని బొత్స అన్నారు.

కాగా  ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement