
సాక్షి,విజయవాడ : ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చూపించడంలో చంద్రబాబు దిట్ట అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టి స్కాముల పేరుతో కాలయపన చేస్తోంది. ఉద్యోగుల అంశాలపై చర్చ పక్కన పెట్టి ..మొన్న జరిగిన 2019- 2024 స్కామ్స్ మీద చర్చ పెట్టారు. 2019 నుండి 2024 కాదు.. 2014 నుండి 2024 వరకు చర్చకి సిద్ధం అని చెప్పాం. 2019 నుండి 2024 అంటూ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చి 9నెలల కాలంలో కొన్ని ఆరోపణలు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ జరగకుండానే ఆరోపణలు చేస్తున్నారు. .. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా కోర్టులో ఉన్న కేసులు కూడా విత్‌డ్రా చేసుకుంటున్నారు’అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment