
బాలయ్య వ్యాఖ్యలతో ఇరకాటంలో టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళల పట్ల అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలను మంగళవారం ఇరకాటంలో పడేశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలపై చర్చ జరుగుతున్న సమయంలోనే కొన్ని జాతీయ ఛానళ్లలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ జరిగింది. దీంతో పలువురు ఇతర పార్టీ ఎంపీలు బాలకృష్ణ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలతో ఆసక్తిగా వాకబు చేసారు.
బాలకృష్ణ ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చారని, విచారం వ్యక్తం చేసారని టీడీపీ ఎంపీలు ఇబ్బందిగానే జవాబివ్వాల్సివచ్చింది. బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారనే విషయంపై టీడీపీ ఎంపీల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.