మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Shares Special Wishes On International Womens Day, Check Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Published Sat, Mar 8 2025 7:45 AM | Last Updated on Sat, Mar 8 2025 10:20 AM

YS Jagan wishes On International womens day

సాక్షి, తాడేపల్లి: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు. “మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ  పాల‌న చేశాం. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించాం.

నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశాం. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’ అన్న‌ నానుడిని న‌మ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్ర‌స్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement