సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరుబాట కొనసాగిస్తుండగా.. అధికార టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు తమ ఆందోళన విరమించారు. మరోవైపు.. టీడీపీ ఎంపీలు నిర్వహించిన ఆందోళనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి దూరంగా ఉండటం గమనార్హం.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఆందోళన కొనసాగించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిర్ణయించారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో కొత్త విషయం లేదని వారు స్పష్టం చేశారు. గతంలో చెప్పినవాటినే జైట్లీ మళ్లీ చెప్పారని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము వెనక్కితగ్గబోమని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. పార్లమెంటు లోపల, బయట తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment