
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో తాజాగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వమే టీడీపీ ఎంపీలతో ఆందోళన చేయిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు తమ ముందు కాదు.. ప్రధాని మోదీ ముందు ప్రదర్శించాలని ఖర్గే సూచించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్లమెంటులో ఆందోళనకు దిగడంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం రాజ్యసభ జరిగిన తీరుకు నిరసనగా సభను విపక్షాలు బహిష్కరించాయి. మంగళవారం రోజంతా సభను బహిష్కరించాలని నిర్ణయించాయి.