సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో గురువారం పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు దర్శనమిచ్చాయి. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతో చెట్టపట్టాల్ వేసుకొని తిరగడం కనిపించింది. పార్లమెంటు ఆవరణలో గురువారం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్, ఎస్పీ సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పక్కన నిలబడి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్లకార్డు ప్రదర్శించారు. మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వగా.. తోట నర్సింహం చేతిలో చెయ్యేసి జైరాం సన్నిహితంగా ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని పైకి టీడీపీ ఆరోపిస్తున్నా.. అంతర్గతంగా ఆ రెండు పార్టీలు సన్నిహితంగా మెసులుతున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. తాజా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ కాంగ్రెస్-టీడీపీ అనుబంధం బయటపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో చంద్రబాబు భేటీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాంగ్రెస్‌తో కలవనని చెబుతూనే ఆ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కావడం గమనార్హం. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌తో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment