అయోధ్యలో జనవరి 22న జగిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడటంలో కూరుకుపోయిందని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వాళ్లు ఎందుకు సీరియస్‌కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీవాళ్లే తీవ్రంగా పశ్చాత్తాపపడతారని అన్నారు.
రామ మందిర ప్రారంభ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ తీరుపై మరో బీజేపీ నేత నలిన్ కోహ్లి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఊహించిందేనని అన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అయోధ్య ఆలయం కోసం ఎటువంటి సానుకూలమైన అడుగులు వేయలేదని అన్నారు. రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తూ.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును సైతం జాప్యం చేసిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా హాజరుకామని ప్రకటించటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి మజీందర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. కానీ, రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు.
ఇక.. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ సోనియా గాంధీ,లోక్‌సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తమ నిర్ణయంపై ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. బుధవారం హాజరు కావటంలేదని ప్రకటించింది. ఆయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చెందిన కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్నిమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రాజెక్టుగా మలుచుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు చేసింది.
చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..!
Comments
Please login to add a commentAdd a comment