Rammandir
-
రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్ బెనర్జీ సెటైర్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్లో తృణమూల్‌కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి. -
బాలరాముడి సన్నిధిలో వ్యాపారవేత్తలు..
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ శుభకార్యానికి దేశంలోని దాదాపు 7000 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. మరికొందరు కాసేపట్లో చేరుకుంటారని తెలిసింది. కార్యక్రమానికి హాజరైన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల గురించి తెలుసుకుందాం. ముఖేశ్ అంబానీ దంపతులు Mukesh Ambani, chairperson of Reliance Industries, and Nita Ambani, founder and chairperson of Reliance Foundation, arrived at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya for the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha #Ambani pic.twitter.com/6JrXhw41yG — Jist (@jist_news) January 22, 2024 #Thalaivar #Superstar #Rajinikanth - @sachin_rt - #Ambani #NitaAmbanipic.twitter.com/F7v7kKcqu2 — Rajinikanth Fans (@Rajni_FC) January 22, 2024 ఆకాశ్ అంబానీ దంపతులు #WATCH | Akash #Ambani, Chairman of #RelianceJio Infocomm Ltd along with his wife #ShlokaMehta, arrives at Shri Ram Janmabhoomi Temple in #Ayodhya to attend #RamMandirPranPrathistha ceremony He says, “This day will be written in the pages of history, we are happy to be here.”… pic.twitter.com/etNXVXYBUM — Hindustan Times (@htTweets) January 22, 2024 జోహో వ్యవస్థాపకులు శ్రీధర్వెంబు దంపతులు #AyodhyaRamMandir consecration: 'Very blessed to be here,' says Zoho founder Sridhar Vembu | #RamMandirPranPrathistha #Ayodhya |https://t.co/Ojp14JxdIA — Business Today (@business_today) January 22, 2024 ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకులు, నిశాంత్పిట్టి #WATCH | Ayodhya, Uttar Pradesh: Co-founder of EaseMyTrip, Nishant Pitti says "This is like a historic moment for every Indian. We got goosebumps as soon as we came here..." pic.twitter.com/dDHkUzuzIz — ANI (@ANI) January 22, 2024 జీ సంస్థల ఎండీ, పునీత్గోయెంకా As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 -
Ram Mandir: ‘కాంగ్రెస్ పశ్చాత్తాపడటం తప్పదు’
అయోధ్యలో జనవరి 22న జగిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడటంలో కూరుకుపోయిందని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వాళ్లు ఎందుకు సీరియస్‌కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీవాళ్లే తీవ్రంగా పశ్చాత్తాపపడతారని అన్నారు. రామ మందిర ప్రారంభ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ తీరుపై మరో బీజేపీ నేత నలిన్ కోహ్లి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఊహించిందేనని అన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అయోధ్య ఆలయం కోసం ఎటువంటి సానుకూలమైన అడుగులు వేయలేదని అన్నారు. రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తూ.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును సైతం జాప్యం చేసిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా హాజరుకామని ప్రకటించటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మజీందర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. కానీ, రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇక.. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ సోనియా గాంధీ,లోక్‌సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తమ నిర్ణయంపై ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. బుధవారం హాజరు కావటంలేదని ప్రకటించింది. ఆయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమం ఆర్ఎస్ఎస్, బీజేపీ చెందిన కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్నిమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రాజెక్టుగా మలుచుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు చేసింది. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
Ayodhya Temple: కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
చిత్రదుర్గ: అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకలు మొదలైన వేళ రాజకీయపార్టీలు ఈ విషయంలో విమర్శలకు తెర తీశాయి. బీజేపీ రామమందిర పప్రారంభోత్సవాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక ప్లానింగ్, స్టాటిస్టిక్స్ మంత్రి దశరథయ్య సుధాకర్ ఇదే విషయమై బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘గత ఎన్నికల సమయంలో బీజేపీ పుల్వామాలో సైనికులపై జరిగిన దాడిని వాడుకుని ఓట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే తరహాలో రామ మందిర ఓపెనింగ్‌పై ఇదే వ్యూహాన్ని అవలంబిస్తోంది. రాముడు అందరి దేవుడు. బీజేపీ దేశంలో మత విశ్వాసాలను వాడుకొని ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోంది. రామ మందిర ఓపెనింగ్ ఒక ఎన్నికల స్టంట్. నేను కూడా మందిర నిర్మాణానికి విరాళంతో పాటు ఇటుకలు అందించా’ అని చిత్రదుర్గలో సుధాకర్ మీడియాతో అన్నారు. ఇదీచదవండి..అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
అయోధ్యలో మసీదు..
లక్నో: వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల చేసింది. గత యేడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా వచ్చే యేడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది. ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ పేర్కొంది. ఈ ట్రస్ట్ ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని అయోధ్యలో మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ని విడుదల చేసింది. -
ఆ తర్వాతే అయోధ్య కేసు విచారణ..
సాక్షి, న్యూ ఢిల్లీ : మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే అయోధ్య రామ జన్మభూమి వివాదం విషయంలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వివాదంలో సమస్య పరిష్కారం కోసం నియమించిన మధ్యవర్తుల కమిటీ నివేదిక సమర్పించడానికి ఆగస్టు18 వరకు సమయం ఇచ్చారు. మధ్యవర్తుల కమిటీ జరిపిన చర్చల సారాంశాన్ని ఈ నెల 18వ తేదీ వరకంతా సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. -
మధ్యవర్తిత్వ గడువు పెంపు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ జస్టిస్ కలీఫుల్లా కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన బెంచ్ ఆగస్టు 15లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేయాలని కమిటీని ఆదేశించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ కమిటీ అయోధ్య కేసుకు సంబంధించిన నివేదికను తమకు అందించినట్లు తెలిపింది. అయితే ఈ నివేదికలో ఉన్న విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చింది. అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. -
మందిర్ కోసం ఉద్యమానికి వెనుకాడం : ఆరెస్సెస్
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అవసరమైతే 1992 తరహాలో భారీ ప్రజా ఉద్యమానికి వెనుకాడబోమని ఆరెస్సెస్ అగ్రనేత స్పష్టం చేశారు. రామ మందిర నిర్మాణం త్వరలో జరుగుతుందని తాము భావిస్తున్నామని, దీని కోసం సుదీర్ఘంగా వేచిచూసే ఓపిక ఇక తమకు లేదని ఆర్సెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం అవసరమైతే 1992 నాటి ప్రజాందోళనకు సంసిద్ధమవుతామని తేల్చిచెప్పారు. మందిర నిర్మాణం వంటి సున్నితమైన కేసులను ప్రాధాన్యతాపరంగా కోర్టులు చేపట్టాలని కోరారు. మందిర నిర్మాణానికి ఎదురువుతున్న న్యాయపరమైన అడ్డంకులు సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలన్న ఆరెస్సెస్ డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం భేటీ అయ్యారు. -
ఆరెస్సెస్ చీఫ్‌తో అమిత్ షా భేటీ
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సంఘ్ పరివార్ నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. మందిర నిర్మాణంపై వీరిరువురూ సంప్రదింపులు జరిపారు. మోహన్ భగవత్‌తో పాటు పలువురు సంఘ్ నేతలతోనూ అమిత్ షా సమాలోచనలు చేపట్టారు. కాగా, సుప్రీం కోర్టులో రామమందిర అంశం పెండింగ్‌లో ఉన్నందున ఆర్డినెన్స్ ద్వారా మందిర నిర్మాణానికి పూనుకోవాలని ఆరెస్సెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్ధానం మందిర్ వ్యవహారంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని, ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి రామజన్మభూమి స్ధలంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆరెస్సెస్ ప్రతనిధి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సోమనాధ్ ఆలయాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించిన తరహాలో మందిర నిర్మాణానికి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ పట్టుబడుతోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం ఇదే తరహా డిమాండ్లను ప్రభ్తువం ముందుంచింది. రామ మందిర నిర్మాణం ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఈనెల 25న అయోధ్య యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. -
హిందువులకు కాంగ్రెస్ వ్యతిరేకం : బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : హిందువులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. పంజాబ్ మంత్రి సిద్ధూ దక్షిణ భారతదేశం కంటే పాకిస్తాన్ మేలని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆలయాల చుట్టూ తిరిగితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు హిందువులు చులకనగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. రామమందిరంపై కాంగ్రెస్ వైఖరి ఏంటో వెల్లడించాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దక్షిణ భారతీయులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ ఏడు తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దమననీతిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. -
అయోధ్య సందర్శనకు సీఎం యోగి
లక్నో : 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి తెరపైకి రానుంది. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. వీహెచ్‌పీ నుంచి తొగాడియాను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని తొగాడియా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కావాలనే రామమందిర నిర్మాణాన్ని ఆలస్యం చేస్తోందని పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఇదిలావుండగా యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిమ్ రిజ్వి ఆదివారం నాడే ఆయోధ్యను సందర్శించి రామమందిర నిర్మాణం కొరకు పదివేల రూపాయల విరాళం అందజేశారు. దేశంలో కొంతమంది రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని, వారు దేశద్రోహులతో సమానమని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం కచ్చితంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రతిపక్షాలన్ని జట్టు కడుతున్న నేపథ్యంలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎలాంటి వ్యూహన్ని అమలు చేస్తోందో వేచి చూడాలి. -
మందిర్‌ను మరిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : రాముడి పేరును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత ఆయనను పూర్తిగా మరిచిపోయిందని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ ఆరోపించారు. రాముడిని బీజేపీ మోసం చేసిందని దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాలంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని అన్నారు. మందిర నిర్మాణం ప్రారంభించకుంటే ఆ పార్టీకి ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యమేనన్నారు. మందిర నిర్మాణం తక్షణం చేపట్టకుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని చవానీ ఆలయ పూజారి మహంత్ పరమహంస్ దాస్ హెచ్చరించిన నేపథ్యంలో ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హిందుత్వ, రామమందిర నిర్మాణం ప్రధానాంశాలు కావని, సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి అంశంపైనే బీజేపీ ముందుకెళుతుందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొనడంపై మహంత్ పరమహంస్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణం నుంచి బీజేపీ దూరం జరిగితే ఆ పార్టీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఏర్పాటు చేసిన హిందూ యువ వాహిని సైతం హెచ్చరించింది. ప్రస్తుతం మందిర్-మసీదు వివాదం సుప్రీం కోర్టులో తుది విచారణలో ఉన్న విషయం తెలిసిందే. -
‘మందిర్ నిర్మాణానికి వారు వ్యతిరేకం కాదు’
సాక్షి,అయోధ్య: రామ మందిర నిర్మాణాన్నిముస్లింలు సైతం వ్యతిరేకించడం లేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ‘కొన్ని సార్లు అయోధ్య సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కనిపించకపోయినప్పటికీ, మన యువత, ఇరు వర్గాల ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యమే’ నన్నారు. మందిర్ వివాదానికి ముగింపు పలికే క్రమంలో రవిశంకర్ గురువారం అయోధ్యలో మతపెద్దలు సహా పలువురితో ముచ్చటించారు. డిసెంబర్ 5న అయోధ్య కేసును సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని అయితే ఇవి ఎప్పటికి తుదిరూపు తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో ప్రతిఒక్కరితో సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంలో తనకు ఎటువంటి అజెండా లేదని అందరి అభిప్రాయాలను కూలంకషంగా తెలుసుకుంటానన్నారు. కాగా రవిశంకర్ పర్యటనను బీజేపీ నేతలు స్వాగతించగా, విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయోధ్య అంశంపై అందరి మనోభావాలను తెలుసుకునే ముందు రవిశంకర్ బుధవారం లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. -
'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మందిర నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని అశోక్ సింఘాల్, సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.