సాక్షి, న్యూఢిల్లీ : రాముడి పేరును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత ఆయనను పూర్తిగా మరిచిపోయిందని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ ఆరోపించారు. రాముడిని బీజేపీ మోసం చేసిందని దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాలంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని అన్నారు. మందిర నిర్మాణం ప్రారంభించకుంటే ఆ పార్టీకి ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యమేనన్నారు.
మందిర నిర్మాణం తక్షణం చేపట్టకుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని చవానీ ఆలయ పూజారి మహంత్ పరమహంస్ దాస్ హెచ్చరించిన నేపథ్యంలో ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హిందుత్వ, రామమందిర నిర్మాణం ప్రధానాంశాలు కావని, సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి అంశంపైనే బీజేపీ ముందుకెళుతుందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొనడంపై మహంత్ పరమహంస్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రామమందిర నిర్మాణం నుంచి బీజేపీ దూరం జరిగితే ఆ పార్టీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఏర్పాటు చేసిన హిందూ యువ వాహిని సైతం హెచ్చరించింది. ప్రస్తుతం మందిర్-మసీదు వివాదం సుప్రీం కోర్టులో తుది విచారణలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment