కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.
‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.
అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్‌లో తృణమూల్‌కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment