trunamul congress
-
టీఎంసీ నేతపై అటాక్ ప్లాన్.. సీన్ రివర్స్ కావడంతో..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అధికార టీఎంసీ నేతను టార్గెట్ చేసి దుండగులు చంపే ప్రయత్నం చేయగా.. ప్లాన్ విఫలమైంది. దీంతో, సదరు నేత.. వారికి పట్టుకోవడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.వివరాల ప్రకారం.. టీఎంసీ నేత సుశాంత ఘోష్ కోల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్లో 108 వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్నాడు. సుశాంత.. శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం, ఇంటి బయటే వారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు షూటర్లు బైక్‌పై వచ్చి సుశాంతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి తన జేబులో నుంచి తుపాకీ తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు.అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అది మొరాయించింది. అప్పటికి తేరుకున్న సుశాంత వెంటనే లేచి అతడిని పట్టుకున్నాడు. అక్కడే ఉన్న మరికొందరు టీఎంసీ నేతలు కూడా అలర్ట్ అయ్యి.. వారిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం, వారిని ఎవరు పంపారని ప్రశ్నించగా.. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని అడిగారని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.దీంతో, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌన్సిలర్‌ను చంపేందుకు బీహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. #Shocking| #CCTV| Miraculous escape for #TMC leader Sushanta Ghosh after two bike borne youths appeared in front of him & one of them tried to shoot him at point blank range this evening in #Kolkata. However, the 9mm pistol got locked & he couldn’t open fire. Ghosh escaped unhurt… pic.twitter.com/onSn1TxYcd— Pooja Mehta (@pooja_news) November 15, 2024 -
నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చర్చకు జూనియర్ డాక్టర్ల మరోసారి నిరాకరించారు. ఈ క్రమంలో సీఎం మమత సంచలన కామెంట్స్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నట్టు మమత చెప్పుకొచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అభయ ఘటనపై ఆందోళనల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో మరోసారి చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30మంది కాకుండా.. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. దీంతో డాక్టర్లు ఎవరూ చర్చలకు రాలేదు. ఈ సందర్భంగా డాక్టర్ల కోసం సీఎం దీదీ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశారు. అనంతరం, సీఎం మమత మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. ఇప్పుడు కూడా వారితో చర్చించేందుకే ముందుకు వచ్చాం. అభయ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కారణంగా చేతనే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నట్టు వారితో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కాగా.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. చివరగా.. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. డాక్టర్లతో చర్చించేందుకు దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. అయితే, వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. వైద్యులకు దేశ ప్రజలు అండగా నిలవండి. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైద్యులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రయోజనం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee says "I tried my best to sit with the junior doctors. I waited 3 days for them that they should have come and settle their problem. Even when they didn't accept the verdict of the… pic.twitter.com/qLD207vSd6— ANI (@ANI) September 12, 2024కాగా, బెంగాల్లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూడాల ఆందోళనలు చేపట్టారు. దీంతో బెంగాల్లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపించేందకు మమతా సర్కార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా గురువారం లేఖను పంపారు. ఈరోజు ఐదు గంటలకు చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చివరగా ట్విస్ట్ ఇస్తూ.. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. అయితే, ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవడంతో ముఖ్యమంత్రి మమతతో చర్చించేందుకు జూనియర్ డాక్టర్లు ఎవరూ సీఎం ఆఫీసుకు వెళ్లలేదు. West Bengal CM Mamata Banerjee says "I am ready to resign from the Chief Minister of West Bengal. I am not concerned about the post. I want justice, I am only concerned about justice getting served"#MamtaBanerjee #Westbangal #RGKarDoctor #RGKarProtestpic.twitter.com/KjaJzWcGXC— Vijay Singh (@VijaySikriwal) September 12, 2024 -
అభయ కేసు... సీబీఐకి మమత సూటి ప్రశ్నలు!
కోల్‌కతా: ఆర్జీకార్ వైద్యురాలి ఘటన కేసులో సీబీఐ దర్యాప్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడా? అంటూ సీబీఐని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన దీదీ.. వైద్యురాలి కేసుపై పలు ప్రశ్నలు సంధించారు. "BJP is trying to defame Bengal," CM Mamata Banerjee condemns 12-hour 'Bengal Bandh'Read @ANI Story | https://t.co/bJMNXfPdD2 #MamataBanerjee #Bengalbandh #WestBengal #BJP pic.twitter.com/gCr6FFBGWa— ANI Digital (@ani_digital) August 28, 2024‘‘ఆర్జీ కార్ ఆస్పత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై దారుణం జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లి దండ్రులను కలిశాను. కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు రోజులు సమయం కావాలని వారిని అడిగాను. కానీ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది’’ అని అన్నారు. సీబీఐని ఉద్దేశిస్తూ..‘‘వాళ్లు మనకు న్యాయం చేయరు. కేసు దర్యాప్తు మరింత ఆలస్యం చేయడం వాళ్లకు కావాల్సింది’’ అని విమర్శించారు.నేరస్తులకు ఉరిశిక్ష.. త్వరలో అసెంబ్లీలో తీర్మానంబాధితురాలిపై దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని, నేరస్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.విద్యార్థుల ముసుగులో బీజేపీ కుట్రఅభయ ఘటనకు వ్యతిరేకంగా ‘నబన్న మార్చ్’ పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి.నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీ గందరగోళానికి దారి తీసింది. సంతర్గాచి వద్ద పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నబన్న మార్చ్‌కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా.. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ-ఏబీవీపీ కుట్ర అని’ఆరోపించారు. ప్రభుత్వ పరువు తీయడమే బీజేపీ ప్లాన్రాష్ట్రంలో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వాళ్లకు కావాల్సింది మృతదేహాలు. కానీ మనం అభయ కేసు నిందితుల్ని ఉరిశిక్ష పడేలా న్యాయం చేయాలని కోరుతున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలనే లక్ష్యం నుంచి వాళ్లు (బీజేపీ) దూరమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పరువు తీస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు మరిన్ని కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ధ్వజమెత్తారు.రాష్ట్ర పోలీసులకు నా సెల్యూట్అనంతరం నగర పోలీసులపై మమత బెనర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. దాడులకు గురైనప్పటికీ ఉచ్చులో పడకుండా.. ప్రాణ నష్టం లేకుండా విధులు నిర్వహించిన పోలీసులకు నా సెల్యూట్ మరణాలను నిరోధించిన పోలీసులకు నా అభినందనలు’ అని మమతా బెనర్జీ ప్రసంగించారు. -
రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్ బెనర్జీ సెటైర్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్లో తృణమూల్‌కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి. -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
మోదీకి ప్రశ్నలు.. ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ మహువా మోయిత్రా
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎథిక్ కమిటీ విచారణను తాను ఇప్పుడు రాలేనని ఆమె లేఖ రాశారు. ఈ మేరకు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వ్యవహరం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా పార్లమెంట్ ఎథిక్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎంపీ మహువా స్పందిస్తూ ఎథిక్స్ కమిటీకి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నాకు సమన్లు ఈ-మెయిల్ చేయడానికి ముందే టీవీల్లో వాటిని ప్రసారం చేశారు. నాపై నమోదైన ఫిర్యాదులు, సుమోటో అఫిడవిట్లు మీడియా సంస్థలకు అందాయి. నా నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు నవంబరు 4న ముగిసిన వెంటనే విచారణకు హాజరవుతాను అని తెలిపారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల అక్టోబరు 31న కమిటీ విచారణకు హాజరుకాలేనని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ ఎంపీ రమేష్ భిధూరీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు. Chairman, Ethics Comm announced my 31/10 summons on live TV way before official letter emailed to me at 19:20 hrs. All complaints & suo moto affidavits also released to media. I look forward to deposing immediately after my pre- scheduled constituency programmes end on Nov 4. pic.twitter.com/ARgWeSQiHJ — Mahua Moitra (@MahuaMoitra) October 27, 2023 మరోవైపు మొయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు గురువారం కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ సభ్యుల ముందు నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. మొయిత్రాపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. లంచం తీసుకుని ప్రధాని మోదీని ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 అదానీపైనే ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపిస్తూ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే మోయిత్రాకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ వేరే వ్యక్తుల చేతికి వెళ్లినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అయితే మోయిత్రా చేసిన విదేశీ పర్యటన వివరాలను హోంమంత్రిత్వ శాఖను నుంచి పార్లమెంట్ ప్యానెల్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో టీఎంసీ.. ఎంపీ మహువా మోయిత్రాకు సపోర్టు చేయలేదు. విచారణ జరుగుతుందని ఏం జరుగుతుందో చూడాలనే ధోరణిని టీఎంసీ ప్రదర్శిస్తోంది. -
Parliament Monsoon Session 2023: తొలి రోజే గరంగరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. మణిపూర్‌లో హింసాకాండ, ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానం సహా ఇతర అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దుచేసి, మొదటి అంశంగా మణిపూర్ హింసపైనే చర్చించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ పార్లమెంట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులరి్పంచిన కొద్ది నిమిషాలకే రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు, లోక్‌సభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. అంతకంటే ముందు మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరపున మాణిక్యం ఠాగూర్, ఆప్ నేత సంజయ్ సింగ్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, ఎంఐఎం నుంచి ఒవైసీ, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం వాయిదా తీర్మానిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్షాల సభ్యులు మణిపూర్ హింసపై చర్చించాలని కోరారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని ప్రాధాన్యతగా చర్చకు చేపట్టాలని, దీనిపై మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రియన్ సైతం ఆయనకు మద్దతు పలికారు. ఛైర్మన్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. సభ తిరిగి ఆరంభమైన తర్వాత కూడా ఖర్గే మరోసారి తమ నోటీసులపై చర్చించాలని కోరారు. ఆయన మైక్‌ను కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభాపతి జగదీప్ ధన్‌ఖడ్ సభను శుక్రవారానికి వాయిదావేశారు. ఇక లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమైన తర్వాత మణిపూర్ హింసపై విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. చర్చకు సిద్ధమే: పీయూష్ గోయల్ విపక్షాల ఆందోళనపై రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. ‘‘పార్లమెంట్ సక్రమంగా కొనసాగకూడదన్నదే ప్రతిపక్షాల ఉద్దేశంగా కనిపిస్తోంది. మణిపూర్ సంఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసినా.. నిబంధనల ప్రకారం చర్చ జరగనివ్వకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి’’ అని ఆక్షేపించారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు లోక్‌సభలో ప్రధాని మోదీ విపక్ష నేతలను పలకరించారు. వారి యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్‌లోని గోల్‌పోఖార్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
బేల్దార్.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి..
తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదగడం సినిమాల్లో చూశాం! బీర్భూమ్ ప్రధాన నిందితుడు అనరుల్ హుస్సేన్ కథ కూడా అలాంటిదే! చిన్న గుడిసెలో ఉండే బేల్దార్ అనరుల్ మూడంతస్తుల భవనంలో ఉండే దాదాగా మారిన తీరు అనూహ్యం. తానుండే ప్రాంతంలో చాలామందికి అనరుల్ ఒక దైవదూత. కానీ ఈ దైవదూత వెనుక చీకటి కోణాలు అనేకం. సజీవ దహనం కేసులో సీబీఐ అరెస్టు చేసేవరకు అనరుల్‌ను తాకడానికి స్థానిక పోలీసులు కూడా భయపడేవారు. ఆ ప్రాంతానికి అతను మకుటం లేని మహారాజు. చిన్నతనంలో తండ్రితో కలిసి అనరుల్ తాపీ పనులకు వచ్చేవాడని, తర్వాత మేస్త్రీగా ఎదిగాడని స్థానికులు గుర్తు చేసుకుంటారు. అప్పటినుంచే ఏదో సాధించాలన్న కసి అతనిలో ఉండేదని అనరుల్ చిన్నప్పటి స్నేహితుడు స్వపన్ మండల్ చెప్పారు. లక్ష్యసాధన కోసం తొలుత అన్రుల్ కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం మమత నేతృత్వంలోని టీఎంసీలోకి వచ్చి రామ్‌పుర్హాత్ బ్లాక్1 ప్రెసిడెంట్ అయ్యాడు. సజీవ దహనం కేసు దర్యాప్తునకు పోలీసులు బోగ్తుయ్ ఊర్లోకి రాకుండా అనరుల్ అడ్డుకున్నాడంటే అతని పరపతి అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు చివరకు సీబీఐ చేతికి చిక్కాడు. అవినీతి సోపానాలు అనరుల్ హుస్సేన్ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలున్నాయని, స్థానికంగా నర్సరీ నడిపే కార్తీక్ మండల్ చెప్పారు. పలు సంవత్సరాలుగా అనరుల్ అక్రమ సంపాదన కొనసాగిందన్నారు. ‘‘ఆయన ఇల్లు చూడండి. ఒక మేస్త్రీ ఇల్లులాగా ఉందా అది? గడిచిన రెండు దశాబ్దాల్లో అతను ఇంత శక్తిని, ఆస్తిని కూడబెట్టాడు. నిజాయితీపరుడెవరూ స్వల్పకాలంలో ఇంత కూడబెట్టలేడు’’ అని కార్తీక్ వ్యాఖ్యానించారు. తన స్థలాన్ని కబ్జా చేసి మరీ అనరుల్ ఇల్లు కట్టాడని ఆరోపించారు. స్థానిక ఎంఎల్ఏ, అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి హుస్సేన్ చాలా ఆప్తుడని పుకార్లున్నాయి. మంచి పనివంతుడని అనరుల్‌కు పార్టీలో పేరుందని స్థానిక నాయకులు చెప్పారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనరుల్‌కు అడ్డం లేకుండా పోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, స్థానిక సిండికేట్ నిర్వహణ తదితరాల్లో అనరుల్ హస్తం ఉంది. 2019లో అతన్ని బ్లాక్ ప్రెసిడెంట్‌గా తొలగించాలని స్థానిక నేత భావించినా, ఎంఎల్ఏ అండతో గండం తప్పించుకున్నాడు. ఈర్ష్యతో ఆరోపణలు తన తండ్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అనరుల్ కుమార్తె ముంతాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరిన పనల్లా ఆయన చేశాడని, అందుకు ప్రతిగా ఆయనపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన చెందా రు. అయితే అనరుల్ లాంటివాళ్లు టీఎంసీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం ఇతనొక్కడే బయటపడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆశిష్ కింద చాలామంది అనరుల్ హుస్సేన్ లాంటి వాళ్లున్నారన్నారు. టీఎంసీ పాలనలో ఇలాంటి బాహుబలులు చాలామంది పుట్టుకువచ్చారని దుయ్యబట్టారు. వీరంతా స్థానిక సామంతరాజులని విమర్శించారు. ప్రస్తుతం అనరుల్‌ను పోలీసు కస్టడీలో ఉంచారు. ఇకపై ఆయన్ను సీబీఐ విచారించనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
టీఎంసీ సీనియర్ నేత కన్నుమూత.. ఆవేదనలో సీఎం మమత బెనర్జీ
కోల్కత్తా: మాజీ మంత్రి, తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత సాధన్ పాండే(71) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాండే ముంబైలోని ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందినట్టు ఆయన కూతురు శ్రేయ వెల్లడించారు. కాగా, పాండే మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీనియర్ లీడర్, కేబినెట్ మంత్రి పాండే మరణం ఎంతగానో బాధించిదన్నారు. సాధన్ పాండేతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాండే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం సీనియర్ నేత సలహాలను తాము కోల్పోయామంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆయన మృతిపట్ల బెంగాల్ గవర్నర్ సహా, జగదీప్ ధన్కర్ సహా టీఎంసీ నేతలు సంతాపం తెలిపారు. ఇక, సాధన్ పాండే ఉత్తర కోల్‌కత్తాలోని బుర్టోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
21న దేశవ్యాప్తంగా మమత ప్రసంగం ప్రసారం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికార పీఠమెక్కిన టీఎంసీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఏటా జూలై 21న జరిగే అమరవీరుల దినోత్సవం రోజు సీఎం మమతా బెనర్జీ ప్రసంగం బెంగాల్‌తోపాటు వివిధ రాష్రాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. బెంగాల్‌తోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, త్రిపురల్లో ఏర్పాటయ్యే భారీ స్క్రీన్లపై ఈ ప్రసంగాన్ని ప్రసారం చేయనుంది. అమరవీరుల దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ వర్చువల్‌గా బెంగాలీలో చేసే ప్రసంగం వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి, ప్రసారం చేస్తామని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. 21న దీదీ ప్రసంగాన్ని ప్రజలంతా చూసేలా గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ స్క్రీన్ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపై కన్నేసిన టీఎంసీ.. దివంగత జయలలిత మాదిరి గా, మమతా బెనర్జీని ‘అమ్మ’గా పేర్కొంటూ ఇప్పటికే చెన్నైలో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. 1993లో ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్‌తో అప్పటి యూత్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ఆ ఘటన చోటుచేసుకున్న జూలై 21ని అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది. -
బెంగాల్: మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశంలో భాగంగా మండలి ఏర్పాటు తీర్మానానికి 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 69 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక బెంగాల్లో 1952లో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే 1969లో లెఫ్ట్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక ఇటీవల జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణముళ్ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలి ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో ఆరు రాష్ట్రాల్లో( బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) శాసన మండలి అమలులో ఉంది. ఇక మండలి ఏర్పాటు తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో 23 రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదని, కొంతమంది టీఎంసీ నాయకులు మండలిలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకోసమే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారని తెలిపారు. -
West Bengal: మళ్లీ టీఎంసీలోకి వస్తాం.. వినతుల వెల్లువ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, బీజేపీ గెలుపు ఖాయమని నమ్మి కాషాయ కండువాలు కప్పుకున్న నాయకులంతా ఇప్పుడు ‘బ్యాక్ టు హోం’ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నాయకులు మళ్లీ మమత కరుణ కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరైతే బహిరంగంగానే ‘తప్పనిసరై’ బీజేపీలోకి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు సరికాదని రాష్ట్ర ప్రజలు సరైన, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన టీఎంసీ మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మళ్లీ తనను టీఎంసీలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సొనాలి గుహ కోరారు. ‘ఒకవైపు, రాష్ట్రం కరోనాతో అల్లకల్లోలమవుతుంటే, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చేపట్టింది. నారద కేసులో టీఎంసీ నేతలను అరెస్ట్ చేసింది. అదే రోజు నేను బీజేపీని వదిలేశాను’ అని ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు, బషిర్హట్ దక్షిణ్ ఎమ్మెల్యే దీపేందు బిశ్వాస్ మమతకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. టీఎంసీలోకి మళ్లీ వస్తామని బహిరంగంగా ఆకాంక్ష వ్యక్తం చేసిన నాయకుల్లో సరళ ముర్ము కూడా ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు టీఎంసీలో నెంబర్ 2 స్థాయి నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మౌనం అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ విజయం ఖాయమైనప్పటి నుంచీ.. ఆయన నుంచి రాజకీయ ప్రకటనలేవీ రాలేదు. అయితే, బీజేపీలోనే కొనసాగుతానని ఒక ట్వీట్ మాత్రం చేశారు. ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి రాబోతున్నారనే వార్తలు ఇటీవల ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ కోవిడ్‌తో బాధపడుతున్న ముకుల్ రాయ్ భార్య కృష్ణను ఇటీవల కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తరువాత, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆసుపత్రికి వెళ్లడం, ఆ మర్నాడే ప్రధాని మోదీ ముకుల్ రాయ్‌కు ఫోన్ చేసి పరామర్శించడం వెంటవెంటనే జరిగాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ముకుల్ రాయ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. -
West Bengal: కొలువుదీరిన మమత జంబో కేబినెట్
కోల్‌కత: ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా ఆమె జంబో కేబినెట్ కొలువుదీరింది. 43 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణం చేశారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమత పాల్గొన్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిలో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. మమత కేబినెట్లో చాలా మంది పాతమంత్రులు మళ్లీ బెర్తులను దక్కించుకోగా.. బంకిమ్ చంద్ర హజ్రా, రతిన్ ఘోష్, పులక్ రాయ్, బిప్లబ్ మిత్రాను పదవులు వరించాయి. ఇక 2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న అమిత్ మిత్రా సైతం మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్ని సైతం మంత్రి (స్వతంత్ర) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ మనోజ్ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల వెలువడిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ జయభేరీ మోగించింది. తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకోగా బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ.. ఓటమి తప్పలేదు. అయితే, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం గమనార్హం. (చదవండి: Tamil nadu: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే పోస్టర్లు) -
అది నేతాజీని అవమానించడమే
సోనార్పూర్: బీజేపీ నాయకులను బయటి వారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలను, భారత రాజ్యాంగ విలువలను అవమానించడమేనన్నారు. బీజేపీ గెలిస్తే ఈ గడ్డపై పుట్టినవారే సీఎం అవుతారన్నారు. బెంగాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘బ్రిటిషర్లు భారత్‌ను విభజించాలని చూసినప్పుడు భారతదేశం అంతా ఒక్కటే. భారతీయుల ఆకాంక్షలు ఒక్కటే అని నేతాజీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు నేతాజీ ఆదర్శాలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బదులుగా బయటివారు అంటూ దీదీ మాట్లాడుతున్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారతీయులంతా భరతమాత పిల్లలని, భారతీయులెవరూ ఇక్కడ బయటివారు కాదని స్పష్టం చేశారు. ‘మీ గూండాలకు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మోదీ వచ్చాడు.. మీ ఆటలు సాగవని వారికి చెప్పండి’ అని మమతకు సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మోదీకి పోటీగా వారణాసిలో పోటీ చేస్తారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. దాంతో మమత దీదీ ఇక్కడ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమైందన్నారు. యూపీ, వారణాసి ప్రజలు బెంగాలీల మాదిరిగానే సహృదయులని, మమతను వారు బయటి వ్యక్తి అని అవమానించబోరని ఎద్దేవా చేశారు. ‘మమతా బెనర్జీ తరచూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు అంపైర్‌ను తప్పుబడితే.. ఆట ముగిసినట్లే అన్న విషయం మీకు తెలుసు కదా’ అని మోదీ హూగ్లీ జిల్లాలో జరిగిన ఒక ప్రచార సభలో వ్యాఖ్యానించారు. సింగూర్‌లో టాటా నానో కారు ప్లాంట్‌ను అడ్డుకోవడాన్ని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీ, టీఎంసీల నిరోధక మనస్తత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుని, అదే గొప్పగా చెప్పుకునే పార్టీని ఎక్కడా చూడలేదన్నారు. అస్సాంలో.. ఇంకా లొంగిపోని మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలవాలని మోదీ కోరారు. అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌లో ఉన్న బక్సా జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. మిగిలిన మిలిటెంట్లు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలని, అది ఆత్మనిర్బర్ అస్సాంకు అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహించిందని, అయితే, రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి, శాంతికి, సుస్థిరతకు ఓటేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ సభలకు పెద్ద ఎత్తున మహిళలు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కోక్రాగఢ్ జిల్లాలో గురువారం జరిగిన సభకు కూడా మహిళలు భారీగా రావడంపై ఒక విశ్లేషకుడిని ప్రశ్నించగా.. తమ పిల్లలు ఇక మళ్లీ ఆయుధాలు పట్టి అడవుల్లోకి వెళ్లరనే విశ్వాసంతో వారు బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన చెప్పారని మోదీ వివరించారు. -
టీఎంసీతో కుంభకోణాలు!
భాగ్‌ముండి: సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఎన్నికల్లో మోదీకి మద్దతునివ్వాలని బెంగాల్‌లోని ఆదివాసీలకు హోంమంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. టీఎంసీ.. కుంభకోణాలు చేసిందన్నారు. బెంగాల్లో ఆదివాసీలు, కుర్మీ జాతి కోసం అభివృద్ది బోర్డును ఏర్పాటు చేస్తామని, ఉచిత విద్య కల్పించడంతో పాటు ఉపాధి కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ ప్రభుత్వ హయంలో ఆదివాసీల హక్కులు, భూముల హరణ జరిగిందని, గిరిజనుల భూములను లాక్కొని చొరబాటుదారులకు కట్టబెట్టారన్నారు. ఒక ప్రత్యేక వర్గాన్ని సంతోష పరచడం కోసం బెంగాల్లో ఉర్దూను బోధనామాధ్యమంగా చేయాలని మమత కోరుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన ఘోరంగా దెబ్బతిన్నదని, ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగకుండా మమత అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రజాపయోగ పథకాలు కావాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల హత్యలకు కారకులైనవారంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కుటుంబానికో ఉద్యోగం టీఎంసీ ప్రభుత్వం ఆదివాసీలు, కుర్మీలు, బీసీలకు ఏమీ చేయలేదని, తాము అధికారంలోకి వస్తే ఈ వర్గాల్లో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. జంగిల్‌మహల్ బోర్డు ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జంగిల్‌మహల్ ప్రాంతంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మమత రాజకీయాల కారణంగా మహిష్య, తెలి వంటి పలు వర్గాలు రిజర్వేషన్ కేటగిరీలోకి రాకుండా పోయాయన్నారు. ఇలా రిజర్వేషన్లు పొందలేని హిందూ బీసీ వర్గాలన్నింటినీ ఓబీసీల్లో చేరుస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే దుర్గాపూజ, సరస్వతి పూజను భయం లేకుండా జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్టవేస్తామన్నారు. ఆదివాసీలకు స్థానిక భాషలోనే ఉచిత విద్య అందిస్తామని, ఉచిత స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో లెఫ్ట్, తర్వాత టీఎంసీలు ఆదివాసీలకు తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. మోదీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని, కుంభకోణాలు కావాలంటే టీఎంసీకి ఓటేయాలని చెప్పారు. జంగిల్‌మహల్ ప్రాంతంలో తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చాక రూ.10వేల కోట్లతో క్లీన్ వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. -
దొంగల రాజ్యానికి రాజులు
పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను ఉద్దేశిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్దిఖీ ఇటీవల ఐఎస్ఎఫ్ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అమలును తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు. -
రవీంద్రుడి గడ్డపై పరాయివారు ఉండరు
కాంథీ(పశ్చిమబెంగాల్): వందేమాతరం అంటూ దేశాన్ని ఒక్కటి చేసిన నేల పశ్చిమబెంగాల్ అని, అలాంటి గడ్డపై ‘పరాయివారు’ అనే మాటలు వినిపిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక నాయకుడినే సీఎం చేస్తామని మోదీ తెలిపారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంథీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కుటుంబానికి కాంథీ ప్రాంతంలో గట్టి పట్టుంది. మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను బెంగాల్‌కు పరాయివారంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పరాయివారు పాలించడాన్ని బెంగాలీలు అంగీకరించబోరని మమత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎన్నికల పర్యాటకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు జన్మించిన బెంగాల్ గడ్డపై భారతీయులెవరూ పరాయి వారు కావని మోదీ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని టూరిస్ట్‌లంటున్నారు. అవహేళన చేస్తున్నారు. రవీంద్రుడి బెంగాల్లో ప్రజలు ఎవరినీ పరాయివారుగా చూడరు’ అని పేర్కొన్నారు. దాడి చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసి నందిగ్రామ్ ప్రజలను మమత బెనర్జీ అవమానపర్చారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లో హింస, బాంబులు, తుపాకీల సంస్కృతిని రూపుమాపుతామన్నారు. ‘ఇంటి ముందుకు ప్రభుత్వం’ అని మమత ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న ఆమె అధికారం కోల్పోయి ఇంటికి వెళ్లనున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రానికి చీకటినే మిగిల్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో రాష్ట్రాన్ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. -
వాళ్లే ‘పరాయి శక్తులు’!
బిష్ణుపుర్: రాబోయే ఎన్నికల్లో సమస్యలు, అరాచకం సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతైనవాళ్లనే తమ పార్టీ ‘బయట వ్యక్తులు’(అవుట్‌సైడర్స్)గా అభివర్ణించిందని, తరాలుగా బెంగాల్లో జీవనం గడుపుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలను కాదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వివరించారు. బెంగాల్లో జీవించేందుకు భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లంతా తమ దృష్టిలో స్థానికులేనన్నారు. బీజేపీని అవుట్‌సైడర్స్ పార్టీ అంటూ టీఎంసీ విమర్శించడం తెల్సిందే. ఈ నినాదం రాష్ట్రంలో నివాసముండే ఇతర రాష్ట్రాలవారిపై ప్రభావం చూపవచ్చన్న అంచనాతో మమత తాజాగా వివరణ ఇచ్చారు. ‘‘తరాలుగా ఇక్కడే ఉంటున్నవారిపై బయటవారనే ముద్ర ఎందుకు? వారు బెంగాల్లో భాగం, కేవలం యూపీలాంటి రాష్ట్రాల నుంచి ఎన్నికలు చెడగొట్టేందుకు వచ్చిన అల్లరిమూకలనే మేము బయటి శక్తులుగా భావిస్తాం’’ అని మమత చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇలాంటి బయట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిని దునుమాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్, సీపీఎంపైన కూడా ఆమె నిప్పులు చెరిగారు. మైనార్టీలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లను చీల్చడం ద్వారా ఈ పార్టీలు బీజేపీకి లబ్ది చేకూరుస్తాయని విమర్శించారు. ప్రధాని కుర్చీపై తనకు అమిత గౌరవం ఉందని, కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అతిపెద్ద అబద్ధాలకోరని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేసే హామీ ఏమైందని ప్రశ్నించారు. -
ఐదు రాష్ట్రాల్లో అధికారం ఆ పార్టీలదే..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్ నౌ – సీ ఓటర్’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్డీఏ, కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది. పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్ గౌతమ్ ఘోష్ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు. యూపీఏకు 46%, ఎన్డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్కు 46.2% మంది, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు. కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్డీఎఫ్ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. -
ఇక్కడ గెలిచాక ఢిల్లీలో ‘పరివర్తన్’
కలైకుందా/గర్బేటా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక, ఢిల్లీలో పరివర్తన్ (మార్పు) తీసుకొస్తానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచాక తాను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడతానని, ప్రత్యామ్నాయంగా మారుతానని బీజేపీ భయపడుతోందని, అందుకే ఆ పార్టీ పెద్దలంతా బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పరివర్తన్ అంటూ తాను ఇచ్చిన నినాదాన్ని బీజేపీ దొంగిలించిందని, దాన్ని అసోల్ పరివర్తన్ (అసలైన మార్పు) అంటూ రీమోడలింగ్ చేసిందని విమర్శించారు. మమతా బెనర్జీ గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. బీజేపీతో కూటమి కుమ్మక్కు ‘‘పోలీసులపై నాకు గౌరవం ఉంది. వారు తప్పుడు పనులు చేయరు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో గోల్మాల్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన జంగల్‌మహల్ సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. బెంగాల్లో సీపీఎం–కాంగ్రెస్ కూటమి మతతత్వ బీజేపీతో చేతులు కలిపింది. అందుకే మార్క్సిస్టు మిత్రులు కూడా ఆ కూటమి అభ్యర్థులకు ఓటేయవద్దు. గాంధీజీని హత్య చేసిన వారితో సంబంధాలున్న వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దు. దుర్గాపూజకు రూ.50,000 ఇస్తాం తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే బెంగాల్లో ఓడరేవులు, పరిశ్రమలు స్థాపిస్తాం. భారతీయ రైల్వేను అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రైల్వే ఉద్యోగులు ఆ పార్టీని ఓడించాలి. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి తక్కువ వడ్డీతో రూ.10 లక్షల రుణం మంజూరు చేస్తాం. దుర్గాపూజ చేసుకోవడానికి కమ్యూనిటీ క్లబ్‌లకు రూ.50 వేల చొప్పున ఇస్తాం. డబ్బు సంచులు తెస్తున్నారు బీజేపీ అబద్ధాల పార్టీ, ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నెరవేర్చదు. నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా రూ.15 లక్షలు ప్రజలకు అందాయా? ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కాక ఆయన తన çహామీని తుంగలో తొక్కారు. బెంగాల్లో కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రిస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర సంస్కృతిలో భాగమైన ‘కోల్‌కతా కాఫీ హౌస్’పై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ గూండాలు కుట్ర పన్నుతున్నారు. దాని గొప్పదనం వారికి తెలియదు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతలు నాపై దాడి చేశారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కోట్లాది రూపాయల అక్రమాలు సాగించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతోంది. ఆ డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు హెలికాప్టర్లు, విమానాల్లో తీసుకొస్తున్నారు. బెంగాల్లో ఎలాగైనా నెగ్గాలని కుట్ర పన్నుతున్నారు’’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. -
బీజేపీ గూటికి చేరిన దినేశ్ త్రివేది
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన మరో కీలక నాయకుడు బీజేపీలో చేరారు. తృణమూల్ మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన దినేశ్ త్రివేది శనివారం బీజేపీలో చేరారు. మమత ప్రభుత్వంలో అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని ఆరోపించిన దినేశ్ అందుకే తాను పార్టీ వీడినట్టుగా చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆయన బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా త్రివేదిపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్నాళ్లూ రాంగ్ పార్టీలో రైట్ మ్యాన్ ఉన్నారని, ఇప్పుడు రైట్ పార్టీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అనంతరం దినేశ్ త్రివేది విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడే అసలైన మార్పు చూస్తారని అన్నారు. జీవితంలో ఇలాంటి బంగారు క్షణాల కోసమే తాను ఎదురు చూశానని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీల్లో కుటుంబమే సుప్రీంగా ఉంటుందని, కానీ బీజేపీలో ప్రజలే సుప్రీం అని కితాబునిచ్చారు. ఆట మొదలైంది అన్న తృణమూల్ కాంగ్రెస్ నినాదాన్ని ఎద్దేవా చేసిన త్రివేది రాజకీయాలంటే సీరియస్‌గా పని చేయాలని, కానీ మమత రాజకీయాన్ని ఆటని చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు దినేశ్ త్రివేది పార్టీ మారడాన్ని తృణమూల్ తప్పు పట్టింది. ఎన్నికల వేళ పార్టీని వెన్ను పోటు పొడిచారంది ఒకప్పుడు దీదీకి కుడి భుజం దినేశ్ త్రివేది తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత కాలంలో విభేదాలు తలెత్తడంతో మమత ఆయనని కేబినెట్ నుంచి తొలగించారు. మళ్లీ 2019లో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఆయనని రాజ్యసభకు పంపింది. ఇలా ఉండగా, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సొనాలి గుహ కూడా బీజేపీలో చేరనున్నట్టుగా సూచనప్రాయంగా వెల్లడించారు. -
కేంద్రంతో మమత ఢీ
కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్ హార్బర్లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. నిప్పుతో చెలగాటం వద్దు.. బెంగాల్ గవర్నర్ ధన్కర్ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. -
మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మమతాకు ఎంత నష్టం? బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. -
‘కరోనా వస్తే మమత బెనర్జీని కౌగిలించుకుంటా’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరోనా కేసుల విషయంలో టీఎంసీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ హజ్రా మాట్లాడుతూ, ‘నాకు ఏదో ఒక సమయంలో కరోనా వస్తుంది. నేను అప్పుడు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, ప్రియమైన వారిని కోల్పోతే కలిగే బాధ తెలుస్తాయి’ అని వ్యాఖ్యానించారు. అయితే బెంగాల్‌లోని బీజేపీ నాయకులు హజ్రా వ్యాఖ్యలపై నోరు మెదపడంలేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బీజేపీకి నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ అన్నారు. ఇదిలా వుండగా మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సిలిగురికి వెళ్లారు. ఉత్తర బెంగాల్లో పరిస్థితులపై మమతా సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు బెంగాల్లో 2.4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 4,721 మంది మరణించారు. చదవండి: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
బెంగాల్లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
-
బెంగాల్ హింస తృణమూల్ రౌడీయిజానికి నిదర్శనం
-
కోల్‌కతాలో బీజేపీ వర్సెస్ తృణమూల్
-
బెంగాల్ వార్
మోదీ సర్కారుపై జనం అంచనాలు... రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో తృణమూల్ ఎన్ని సీట్లు సాధిస్తుంది? బీజేపీ బలం రెండు నుంచి 15 సీట్లకు దాటుతుందా.... అనే కీలక అంశాలుండటంతో బెంగాల్ ఎన్నికలపై రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చ సాగుతోంది. పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లలో 15 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటే దేశ తూర్పు ప్రాంతంలో కూడా బలమైన శక్తిగా అవతరించడానికి వీలవుతుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో కాషాయపక్షం అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. హిందీ రాష్ట్రాల్లోని 225 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 190 గెలుచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ ఈ ప్రాంతాల్లో తనకు తగ్గే సీట్లను పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భర్తీ చేసుకోవాలనే పట్టుదలతో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ముస్లింలు 27 శాతానికి పైగా ఉండడం, 2009 లోక్‌సభ ఎన్నికల నుంచీ సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు ఎన్నికల్లో చతికిలపడడం, మరో పక్క అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ మధ్య బలహీనం కావడం బీజేపీకి ఇప్పుడు కలిసొచ్చే అంశాలయ్యాయి. కిందటి ఎన్నికల్లో మోదీ గాలిలో సైతం బీజేపీ కేవలం రెండు సీట్లనే బెంగాల్లో గెలుచుకోగలిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగకపోయినా కమ్యూనిస్ట్ పార్టీల పునాదులు మరింత కదిలిపోయాయి. బెంగాల్ బెబ్బులి దీదీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 34 ఏళ్లు ఏలిన మార్క్సిస్టుల బాటలోనే పయనిస్తూ ప్రతిపక్షాలను ప్రధానంగా వామపక్షాల ఉనికిని బాగా దెబ్బతీస్తోంది. తృణమూల్ పాలనలో మార్క్సిస్టుల స్థానంలోకి నెమ్మదిగా బీజేపీ చేరుకోగలిగింది. మమత సర్కారును, తృణమూల్ కాంగ్రెస్ పోకడలను ఢీకొనే స్థితికి బీజేపీ చేరుకోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలన్న పట్టుదల మోదీ–షా ద్వయంలో పెరిగింది. మోదీ, మమతా హోరాహోరీ ప్రచారం మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా ఉధృత స్థాయిలో ప్రచారం చేశారు. మమతపైన వ్యక్తిగత స్థాయిలో వారు తీవ్ర ఆరోపణలు చేశారు. మమత సైతం అంతే దీటుగా బీజేపీ విమర్శలకు జవాబిచ్చారు. పూర్వపు వామపక్షాల సర్కార్ల కంటే ఎక్కువగా మమత ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగోవంతుకుపైగా జనాభా ఉన్న ముస్లింలను బుజ్జగించే విధానాలు అమలు చేస్తోందనీ, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను అనుమతిస్తోందంటూ బీజేపీ నిప్పులు చెరుగుతోంది. గతంలో జరిగిన శారద, నారద కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ తృణమూల్ సర్కారును ఇరుకున పెడుతోంది. అయినా, బీజేపీ ఆర్థికబలం, అంగబలం తృణమూల్‌కు సమానంగా ఉంటాయని మమత ఊహించలేదు. తృణమూల్ నేతలు, కార్యకర్తల దూకుడు ముందు నిలబడలేక పోతున్న సీపీఎం ఒక దశలో తన ఉనికి కాపాడుకోవడానికి బీజేపీకి పరోక్షంగా సాయపడింది. కొన్ని వారాల క్రితం మాల్దాలో అమిత్‌షా బహిరంగ సభను ప్రభుత్వ మైదానంలో జరుపుకోవడానికి మమతా బెనర్జీ సర్కారు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో సీపీఎం సీనియర్ నేత ఒకరు తన సొంత స్థలాన్ని బీజేపీ నేత సభకు అద్దెకు ఇచ్చారని కూడా వార్తలొచ్చాయి. ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో బలపడుతున్న బీజేపీ ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో బీజేపీ బలపడుతోందని ఈ పార్టీ ఎన్నికల సభలకు హాజరయ్యే జనం, ఎన్నికల ప్రచారం తీరు చూస్తే అర్థమౌతోంది. ఉత్తర బెంగాల్లో కమ్యూనిస్టులు ఊహించని స్థాయిలో పట్టు కోల్పోయారు. ఫలితంగా పాలకపక్షాన్ని ధైర్యంగా ప్రతిఘటించే అవకాశం బీజేపీకి లభించింది. సరిహద్దు జిల్లాల్లో ముస్లింల జనాభాతోపాటు ప్రజల్లో మతపరమైన చీలిక ఉండడం కూడా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన పునాదులు బలోపేతం చేసుకోవడానికి దోహదం చేసింది. బీజేపీ కేంద్ర నాయకత్వం బెంగాల్‌పై ఎప్పుడూ లేనంతగా దృష్టి కేంద్రీకరించింది. మొదటి ఐదు దశల పోలింగ్ సమయంలోనూ తృణమూల్ నేతలు, కార్యకర్తలతో బీజేపీ ఢీ అంటే ఢీ అనేలా పోటీపడింది. ఎనిమిదేళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల కొన్ని రంగాల్లో సాధించిన విజయాలతో కొన్ని చోట్ల బాగా బలపడింది. కొన్ని రంగాల్లో దీదీ సర్కారు విధానాల వల్ల కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నాయి. పెరుగుతున్న బీజేపీ బలం పశ్చిమబెంగాల్లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో ఈసారి బీజేపీ పట్టుబిగిస్తోంది. 2014 ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అంచనా వేసినా ఈసారి బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుందని నిపుణులు తేల్చి చెపుతున్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానంలో కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది. బీజేపీ ఓట్ల శాతం 2014లో 16.8 శాతం ఉంటే అది ఈ ఎన్నికల్లో 23.32 శాతానికి పెరగవచ్చునని భావిస్తున్నారు. అలాగే బీజేపీ సీట్ల శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశాన్ని సర్వేలు నొక్కి చెపుతున్నాయి. దాదాపు 12.7 శాతం ఓట్లు బీజేపీకి పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ నెల 12, 19 తేదీల్లో జరిగే చివరి రెండు దశల ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఆరో దశలో పోలింగ్ కనీసం నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీలదే అధిక జనాభా కావడంతో తృణమూల్ కాంగ్రెస్ వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. చివరి రెండు దశల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఆరోదశలో జరిగే 8 స్థానాల్లో నాలుగింటిలో ఆదివాసీలదే కీలక భూమిక. సరిహద్దు స్థానాల్లో గట్టి పోటీ మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన జార్ఖండ్ సరిహద్దుల్లోని మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన ప్రాంతాన్ని జంగిల్ మహల్ గా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ సీపీఎం ప్రభావవంతమైన పాత్ర నిర్వహించింది. ప్రస్తుతం ఉనికిని కోల్పోయిన పరిస్థితి.ఈ ప్రాంతంలోని స్థానాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. 2014లో తృణమూల్‌కి అత్యధికంగా 54 శాతం ఓట్లను తెచ్చిపెట్టిన స్థానం ఝర్గ్రామే. 42ఏళ్ళపాటు సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల పట్టులోనుంచి 2014 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి పులిన్ బిహారీ బాస్కే నుంచి ఈ లోక్‌సభ స్థానాన్ని తృణమూల్ ఉమాసోరెన్ కైవసం చేసుకున్నారు. ఈసారి సీపీఎం అభ్యర్థి దెబ్లీనా హెమ్బ్రామ్పై తృణమూల్ కాంగ్రెస్ బీర్భా సోరెన్‌ను బరిలోకి దింపింది. బీజేపీ నుంచి ఇక్కడ కునార్ హెమ్బ్రం పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మమత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనీ విశ్లేషకుల అంచనా. అందుకే మావోయిస్టు ప్రాబల్యంలోని ఈ ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకునేందుకు మమతా బెనర్జీ నగదు పంపిణీ పథకాలు, ఆదివాసీలకు 2 కిలోల బియ్యం లాంటి పథకాలను ప్రవేశ పెట్టింది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీ వాసనలే లేని ఈ ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీ తన బలం పెంచుకుంటోందనడానికి ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. చివరి దశలో పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల్లో తృణమూల్‌కి కీలకస్థానంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీచేస్తోన్న స్థానం డైమండ్ హార్బర్. ఇక్కడ బీజేపీ తరఫున నీలంజన్ రాయ్, సీపీఎం నుంచి ఫౌద్ హలీమ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అభిషేక్ బెనర్జీ మళ్లీ బరిలో నిలిచారు. కమ్యూనిస్టులకు పెట్టని కోటలాంటి జాదవ్‌పూర్‌లో ఈసారి టాలీవుడ్ సినీతార మీమీ చక్రవర్తిని తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సీపీఎంకి పట్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బికాష్ రంజన్ భట్టాచార్యను బరిలోకి దింపారు. బీజేపీ నుంచి అనుపమ్ హజ్రా బరిలో ఉన్నారు. ఆరో దశ పోలింగ్ జరిగే ప్రాంతాలు తామ్లుక్, కాంతి, ఘాటల్, ఝర్గ్రామ్, మేద్నీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణూపూర్ చివరి దశ డమ్‌డమ్, బారాసాత్, బసిర్హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, దక్షిణ కోల్‌కతా, ఉత్తర కోల్‌కతా -
నిరూపించకుంటే 100 గుంజీలు తీయాలి
బంకురా/పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలను రుజువుచేయలేకపోతే ఆయన వంద గుంజీలు తీయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే మోదీ తాను చేసిన ఆరోపణలను ఏ ఒక్క అభ్యర్థిపైనైనా రుజువు చేస్తే లోక్‌సభ బరిలో ఉన్న మొత్తం 42 మంది టీఎంసీ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరిస్తానని ఆమె సవాల్ విసిరారు. గురువారం బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మమత కూడా అదే నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ ‘బొగ్గు గనుల తవ్వకాల వ్యవహారమంతా కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. గనులకు కాపలాగా ఉండేది కూడా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతున్నది బీజేపీ వాళ్లే’ అంటూ మోదీపై ఎదురుదాడి చేశారు. తన దగ్గర ఒక పెన్‌డ్రైవ్ ఉందనీ, దాన్ని బయటపెడితే బొగ్గు మాఫియా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూస్తాయని మమత హెచ్చరించారు. ఓ కేంద్ర మంత్రి, మరో బీజేపీ ఎంపీకి సంబంధించిన వివరాలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో టీఎంసీ నేతలపై వచ్చిన ఆరోపణలు కూడా రుజువుకాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ దేశాన్ని దుర్యోధన, దుశ్శాసనులు పాలిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోదీని కొడతానని నేను అనలేదు.. మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పుడూ అనలేదని మమత స్పష్టం చేశారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తనకు ఏంటని ఆమె ప్రశ్నించారు. బుధవారం మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని అనడం తెలిసిందే. దీనిపై మోదీ గురువారం మాట్లాడుతూ ‘మమత నన్ను కొడతానంటున్నారు. ఆమె నాకు అక్క వంటివారు. ఆమె కొట్టినా నాకు అది ఆశీర్వాదమే’ అని పేర్కొన్నారు. దీంతో మమత మాట్లాడుతూ మోదీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని తాను అన్నానే తప్ప, తానే మోదీని చెంపదెబ్బ కొడతానని కాదని వెల్లడించారు. ప్రజలే తమ ఓటుతో మోదీకి బుద్ధి చెబుతారనే అర్థంలో తాను ‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ అన్నానని తెలిపారు. -
బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు
-
బెంగాల్ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం?
సాక్షి, నేషనల్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ‘దీదీ వర్సెస్ మోదీ’ తాజా ఎపిసోడ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది బీజేపీయేనని, బెంగాల్ రాజకీయాల్లో వేళ్లూనుకోవాలనే ఆ పార్టీ ఆకాంక్ష ఈ ‘ఘర్షణ’తో తీరనుందని విశ్లేషకుల అంచనా. శారద స్కామ్ విచారణ ఎలా జరగనుంది?, సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలేంటి? అనే విషయాలను పక్కనబెట్టి.. కేవలం రాజకీయ కోణంలో ఈ ఘర్షణను విశ్లేషిస్తే.. అంతిమంగా ఇది బీజేపీకి జాక్‌పాట్ లాంటిదేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో జీరోతో ప్రారంభమైన బీజేపీ ఉనికికి దీనివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని, పెరిగే సానుకూల ఓటు.. సీట్ల సంఖ్యను పెంచుకునేలా బీజేపీకి లాభిస్తుందని వాదిస్తున్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్లు ఇంకా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి. తృణమూల్‌కు బీజేపీ, ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి మోదీ.. బలమైన ప్రత్యర్థులుగా అవతరించారు. ప్రజల్లోనూ ఆ భావన వ్యక్తమవుతోంది. మమతను, తృణమూల్‌ను ఎదుర్కొనే సత్తా మోదీ, షా నేతృత్వంలోని బీజేపీకే సాధ్యమనుకుంటున్నారు. శారద స్కామ్‌లో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించడాన్ని మమత అడ్డుకోవడం.. అవినీతికి మద్దతివ్వడమేనన్న భావన కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఇదంతా బీజేపీకే లాభిస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 10 నుంచి 15 సీట్లు గెలుచుకోగలదు’ అని బెంగాల్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఒక విశ్లేషకుడు వివరించారు. బీజేపీని అడ్డుకునేందుకు మమత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నేతల సభలు రాష్ట్రంలో జరగనివ్వకుండా అధికారికంగా, రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా వచ్చిన చాపర్ ల్యాండింగ్‌ను, సోమవారం మరో రాష్ట్ర(యూపీ) ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ను అడ్డుకున్నారు. మరోవైపు, సీబీఐ అధికారుల విధులను అడ్డుకుని, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని తట్టుకోలేక, మమత నిరాశ, నిస్పృహలతో చేస్తున్న చర్యలుగా భావిస్తున్నారు. మరోవైపు, లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌ల నిస్తేజం నేపథ్యంలో.. రాష్ట్రంలోని మమత వ్యతిరేక వర్గాలు బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వేలాది రాష్ట్ర ప్రజలు బాధితులుగా ఉన్న ఒక కుంభకోణానికి సంబంధించిన విచారణను ఆమె అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయం ఉంది. ఆ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు అధికారికి మద్దతుగా నిలవడం.. రాజకీయంగా తటస్థులైన వారి లోనూ మమత పట్ల వ్యతిరేకత పెంచుతోందని భావిస్తున్నారు. తెరపైకి ఫైర్ బ్రాండ్.. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మమతలో కనిపించిన ఫైర్, ఉద్యమ వైఖరి, ప్రజా పోరాటాలు నిర్వహించిన నాటి ఆవేశం.. మళ్లీ ఈ ధర్నాతో మరోసారి వెలుగులోకి వచ్చాయని మరి కొందరి భావన. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వం.. ఎన్నికల ముందు.. ఒక్కసారిగా తెరపైకి రావడం తృణమూల్‌కు లాభిస్తుందని, కార్యకర్తల్లో మనోస్థైర్యం పెరుగుతుందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ధర్నా వేదికపై మమత చూపిన ఆవేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా సింగూరు రైతుల కోసం 12 ఏళ్ల క్రితం ఇదే వేదికపై 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిననాటి ఉద్యమ నేత మమత ఇప్పుడు ఈ దీక్షతో మళ్లీ ప్రత్యక్షమైందని కార్యకర్తలు అంటున్నారు. -
నేడే విపక్ష మహా ప్రదర్శన
కోల్‌కతా: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏయేతర పక్షాలను సంఘటితపరచడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ‘ఐక్య విపక్ష ర్యాలీ’ పేరిట శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీల అధినేతలే స్వయంగా ఈ ర్యాలీకి హాజరవుతోంటే, మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(ఎస్పీ), స్టాలిన్(డీఎంకే), కుమార స్వామి, దేవెగౌడ(జేడీఎస్), కేజ్రీవాల్(ఆప్) ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), శరద్‌పవార్(ఎన్సీపీ), చంద్రబాబు(టీడీపీ), తేజస్వి యాదవ్(ఆర్జేడీ), మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, దళితనేత జిగ్నేశ్ మేవానిసహా 20 పార్టీల నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గైర్హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకులు ఖర్గే, బీఎస్పీ తరఫున సతీశ్ మిశ్రా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న టీఆర్ఎస్, బిజూ జనతా దళ్(బీజేడీ) నుంచి ఎవరూ హాజరుకావడం లేదు. వామపక్ష పార్టీలు ర్యాలీలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాయి. కాగా, కోల్‌కతా ర్యాలీని బీజేపీ ఎగతాళి చేసింది. విపక్ష కూటమి తొలుత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని, ఆ తరువాతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం గురించి ఆలోచించాలని హితవు పలికింది. లక్షలాదిగా వస్తున్న టీఎంసీ కార్యకర్తలు కోల్‌కతా విపక్ష ర్యాలీకి తృణమూల్ కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. బహిరంగ సభలకు సంబంధించి పాత రికార్డులను బద్దలుకొట్టేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. శుక్రవారం నాటికే రాష్ట్రం నలుమూలల నుంచి రైలు, రోడ్డు, జల మార్గాల ద్వారా సుమారు 5 లక్షల మంది కోల్‌కతాకు చేరుకున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను పార్టీ నాయకులే ఏర్పాటుచేస్తున్నారు. ర్యాలీకి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో మొత్తం ఐదు పెద్ద వేదికలను సిద్ధం చేశారు. 3000 మంది వలంటీర్లను నియమించారు. సభా ప్రాంగణంలో రెండ్రోజుల ముందే ఎల్ఈడీ లైట్లు, బారికేడ్లు, తోరణాలు పెద్ద సంఖ్యలో అమర్చారు. మమతా బెనర్జీ బలం చాటేందుకేనా? లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీ రాజకీయాల్లో మమతా బెనర్జీని తిరుగులేని నాయకురాలిగా చూపేందుకు ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ‘దేశంలోని ప్రముఖ విపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరనేది కాదనలేని సత్యం. బీజేపీ వ్యతిరేక పోరులో ఇతర పార్టీలను ఆమె కలుపుకుపోగలరు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే’ అని తృణమూల్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఆమె నేతృత్వంలోనే ఏర్పడాలని ర్యాలీ ప్రచార సమయంలో ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కోల్‌కతాలో విపక్షాల భారీ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘విపక్షాల ఐక్యతా ప్రదర్శన ర్యాలీ విషయంలో మమతా దీదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా మనం ఐక్యభారతానికి సంబంధించి గట్టి సందేశం ఇస్తామని ఆశిస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. -
అసమ్మతి స్వరాలు
సార్వత్రిక ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో కూటముల్లో కదలికలు మొదలయ్యాయి. అసంతృప్తి సణుగుడు స్థాయిని దాటింది. వేర్వేరు పార్టీలు మీడియా ముందుకొచ్చి తమ తమ డిమాండ్లను బాహాటంగా ఏకరువు పెట్టే ధోరణి మొదలైంది. కేంద్రాన్ని ఏలుతున్న కూటమి కనుక ఎన్డీఏకు ఈ తాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడ్డాక ఇది మరీ ఎక్కువైంది. తాను ఏ పక్షమో మరిచి నట్టుగా మొదటినుంచీ అడపా దడపా బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్న శివసేనను మినహా యిస్తే... బిహార్‌లో జేడీ(యూ), ఎల్జేపీ, ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్(ఎస్), ఎస్బీఎస్పీ వంటి పార్టీలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎస్ ఎల్పీ) ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పింది. దేశంలో అందరికన్నా తానే సీనియర్‌నని తరచు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం రాగల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రాజకీయ మరణశాసనం లిఖించనున్నదని గుర్తించి, తన వైఫల్యాల న్నిటినీ బీజేపీపైకి నెట్టి తొమ్మిదినెలలక్రితమే ఎన్డీఏ నుంచి బయటపడ్డారు. బిహార్‌లో ఎప్పుడూ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సింహభాగం తీసుకుంటుంది. 2014లో అది 30 స్థానాలకు పోటీచేసి 22 గెల్చుకుంది. కానీ మూడు రాష్ట్రాల ఓటమి తర్వాత బీజేపీ ఆత్మరక్షణలో పడటాన్ని గుర్తించిన జేడీ(యూ), ఎల్జేపీలు స్వరం పెంచాయి. దాంతో బీజేపీ రాజీకి రాక తప్పలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలు మాత్రమే తీసుకోవాలని అది నిర్ణయించుకుంది. జేడీ(యూ)కు తనతో సమానంగా 17 సీట్లిచ్చి, ఎల్జేపీకి 6 కేటాయించింది. అంతేకాదు... ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం జేడీ(యూ)కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. నాలుగునెలలక్రితం జేడీ(యూ) తిరిగి ఎన్డీఏలో చేరినా ఆ పార్టీకి కేంద్ర కేబినెట్లో చోటివ్వకుండా అవమానించిన బీజేపీ ఇప్పుడిలా ‘పెద్ద మనసు’ చేసుకోవడం గమనించదగ్గది. ఈసారి ఎన్నికల్లో సైతం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 272ను సొంతంగా సాధించితీరాలని బీజేపీ సంకల్పించుకుంది. కానీ బిహార్‌లో ‘కోల్పోయిన’ ఈ స్థానాలను ఎక్కడ భర్తీ చేసుకోవాలని పథక రచన చేస్తున్నదో చూడాలి. తాము కూటమిలో ఉండాలంటే లోక్‌సభ సీట్లలో సగం ఇవ్వాలని మహా రాష్ట్రలో శివసేన కోరుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి 48 స్థానాల్లో బీజేపీ 24, శివసేన 20 స్థానాలకు పోటీచేశాయి. నాలుగు స్థానాలు ఇతర మిత్రులకు ఇచ్చారు. అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శివసేన ఒంటరిగా పోటీచేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 122 గెల్చుకుంటే, శివసేనకు 63 మాత్రమే దక్కాయి. అయితే ఆ తర్వాత శివసేన మళ్లీ కూటమిలో చేరి మంత్రి పదవులు తీసుకుంది. ఈసారి శివసేన డిమాండ్లు పెద్దవే. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలని, రెండు చట్టసభల్లోనూ తనకు సగం చొప్పున ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ సంగతి తేలేవరకూ అది బహిరంగ విమర్శలు చేస్తూనే ఉంటుంది. రామ మందిరం, గోరక్షణ వగైరా అంశాల్లో తమ వైఖరినే ప్రదర్శించే శివసేనను వేరే పార్టీలేవీ దరిచేరనీ యబోవని, చివరికది తమ గూటికి రాకతప్పదని బీజేపీకి తెలుసు. అందుకే అది ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ నినాదాన్ని అందుకున్నా ఎక్కడలేని సహనాన్నీ ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు మళ్లీ దగ్గరకాబోతున్నాయని తెలిశాక శివసేనకు బీజేపీతో వెళ్లడం మినహా గత్యంతరం లేదు. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీకి ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 80 స్థానాల్లో బీజేపీ 73 కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలు రెండూ కలిస్తే బీజేపీ రాజకీయంగా ఎదురీదక తప్పదు. ఇదే అదునని అప్నాదళ్(ఎస్), ఎస్బీఎస్పీ పార్టీలు ఇక్కడ కూడా సీట్ల పంపకం త్వరగా మొదలుపెట్టాలని డిమాండు చేస్తు న్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిత్రపక్షాలైన తమను తరచు అవమానిస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీకి మిత్ర పక్షాలను గౌరవించడం తెలియకపోతే ఎస్పీ–బీఎస్పీ కూట మివైపు వెళ్తామని ఎస్బీఎస్పీ హెచ్చరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్(ఎస్) పార్టీ రెండు చోట్ల పోటీచేసి రెండూ గెల్చుకుంది. ఎస్బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టింది. అధికార ఎన్డీఏ కూటమికి ఎదురవుతున్న ఒత్తిళ్లు చూసి నిజానికి యూపీఏ ఉత్సాహంతో ఉరకలెత్తాలి. కానీ దాని కష్టాలు దానివి. గతంతో పోలిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వక్తగా మెరుగుపడినా... నరేంద్రమోదీకి దీటైన నాయకుడని జనం అనుకునే స్థాయికి ఆయనింకా ఎద గలేదు. పైగా కాంగ్రెస్‌కు డీఎంకే, ఆర్జేడీలు మాత్రమే బలమైన మిత్రపక్షాలు. ఎన్సీపీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చిన్న పార్టీలే. కర్ణాటకకు చెందిన జనతాదళ్(ఎస్) ఎంతకాలం కలిసి ప్రయాణం చేస్తుందో తెలియదు. లోక్‌సభ ఎన్నికలకు ముందో, వెనకో అది తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కొత్తగా వచ్చి చేరిన చంద్రబాబు యూపీఏను తానే నడుపుతున్నంత హడావుడి చేస్తున్నారు గానీ... ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తల బొప్పికట్టాక రాహుల్‌కి అర్ధమై ఉంటుంది. కాకపోతే నిండా మునిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాత్రం ఆసరా అయినా దొరికిం దన్న తృప్తి దక్కినట్టుంది. యూపీఏ ప్రధాని అభ్యర్థి రాహుల్ అని డీఎంకే చెప్పడంతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ ఆ కూటమి దరిదాపుల్లోకి కూడా వచ్చే సూచనలు కనబడటం లేదు. విపక్ష కూటమిలో ఇన్ని లుకలుకలున్నాయి కనుకనే, సొంతింటి సమస్యలు ఎన్ని ఉన్నా...అక్కడక్కడ రాజీ పడాల్సివస్తున్నా ఎన్డీఏ ధీమాగా ఉంది. బలాబలాల సమీకరణలో మున్ముందు ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. -
‘ప్రధాని లక్షణాలు ఆమెకే ఉన్నాయి’
కోల్కత్తా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగల శక్తి బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మాత్రమే ఉందని మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆదివారం కోల్‌కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మమత నాయకత్వ లక్షణాలను కొనియాడారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల సత్తా ఉన్న నాయకురాలు మమత బెనర్జీ అని సిన్హా అన్నారు. రాజకీయ చతురత, ధైర్యం ఉన్న నాయకురాలనీ, దేశ ప్రధాని కావడానికి ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటని, జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ ప్రభావం చూపగలదని సిన్హా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతో కీలకమైన మంత్రిమండలిని మోదీ పక్కన పెట్టారని, మంత్రులకు కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలు ఆయన సొంతగా తీసుకుంటున్నారని ఆరోపించారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మమత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనేకపార్టీల జాతీయ నేతలతో చర్చలు జరిపిన మమత, జనవరిలో బెంగాల్లో జరిగే భారీ ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. -
పశ్చిమ బెంగాల్లో డమ్‌డమ్‌లో పేలుడు కలకలం
-
కోల్‌కత్తాలో భారీ పేలుడు
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో గాంధీ జయంతి నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. డమ్‌డమ్ సమీపంలోని నగర్‌బజార్‌లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం భారీ శబ్ధంతో బాంబు పేలగానే దానిలోంచి గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని వచ్చాయని స్థానికులు చెపుతున్నారు. మార్కెట్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు పేలుడు పదార్ధాలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాండ్ డిస్పోజల్ స్వాడ్ తనికీ నిర్వహించారు. ఘటనలో గాయపడ్డ వారిని దగ్గరలోని జీకే కౌర్ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డమ్ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ పంచూ రాయ్ పార్టీ కార్యాలయం సమీపంలో ఈ పేళుల్లు సంభవించాయి. దీంతో అధికార తృణమూల్ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. తమను రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించాలిన బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు లండన్ లాంటి నగరం అవసరంలేదని.. బెంగాల్లోనే భద్రత కల్పిస్తే చాలని సీపీఎం నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
దీదీపై కాంగ్రెస్ ఫైర్
కోల్‌కతా : పెట్రో భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ భారత్ బంద్‌పై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రజలపై పెనుభారం మోపుతుండగా, ఇంధనంపై వ్యాట్ వసూలు చేస్తూ తృణమూల్ సర్కార్ పరిస్థితిని మరింత దిగజార్చిందని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపు ఇచ్చిన అంశాలను తాము సమర్ధిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంటూనే సమ్మెకు తాము వ్యతిరేకమని, భారత్ బంద్ సందర్భంగా జనజీవనం యధావిధిగా సాగేందుకు అన్ని చర్యలూ చేపడతామని పేర్కొంది. సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ్ ఛటర్జీ వెల్లడించారు. మరోవైపు భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. -
తృణమూల్‌కే డిప్యూటీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో విపక్షాలు ఐక్యతకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా డిప్యూటీ చైర్మన్‌గా తృణమూల్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీకి కాంగ్రెస్ తెలియజేసినట్లు సమాచారం. మమత ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 13 మంది సభ్యులున్న తృణమూల్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీ వ్యతిరేక అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తోందని సమాచారం. ఎగువసభలో పార్టీ ఉపనేత, రెండోసారి ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌ని పోటీలో ఉంచే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటోంది? 245 మంది సభ్యులున్న ఎగువ సభలో కాంగ్రెస్‌కు 51మంది ఎంపీలున్నారు. సహజంగానే విపక్ష పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థే బరిలో ఉండాలి. కానీ ఎన్డీఏయేతర పక్షాల అభ్యర్థి గెలవాలంటే యూపీఏయేతర పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం తక్కువే. బిజూ జనతాదళ్ (9), టీఆర్ఎస్ (6) వంటి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ పార్టీలూ టీఎంసీ అభ్యర్థి బరిలో ఉంటే మద్దతిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంటున్న ఏఐఏడీఎంకే (13) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కాంగ్రెస్ నేతలంటున్నారు. 123 ఎంపీల మద్దతుంటేనే విజయం దక్కే ఈ ఎన్నికలో బీజేపీ, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది ఎంపీలుండగా.. 5–10 ఎంపీలున్న పార్టీలు కనీసం 8 వరకున్నాయి. మిగిలిన పార్టీలకు ఇద్దరు, ముగ్గురు సభ్యుల బలముంది. బీజేపీలో తర్జన భర్జన ఈ ఎన్నికలపై 69 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అధికార పార్టీ చెబుతోంది. జూన్ 15న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన భేటీలో టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావును బరిలో దించడంపై చర్చించినట్లు వార్తలొచ్చాయి -
ఎన్నికల వేళ హింస,13మందికి గాయాలు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హరోవాలో సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతున్నారు. బసిర్హత్ లోక్‌సభ పరిధిలోని మినాఖా అసెంబ్లీ నియోజకవర్గంలోని బ్రహ్మంచక్ పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఆ ప్రాంతంలో మరోసారి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. -
మమత బెనర్జీకి హ్యాండిచ్చిన అన్నా హజారే