ఎన్నికల వేళ హింస,13మందికి గాయాలు | Violence hits West Bengal, clash between Trinamool Congress, CPM workers in Haroa | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ హింస,13మందికి గాయాలు

Published Mon, May 12 2014 12:18 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Violence hits West Bengal, clash between Trinamool Congress, CPM workers in Haroa

కోల్కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ హింస చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హరోవాలో సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతున్నారు. బసిర్హత్‌ లోక్‌సభ పరిధిలోని మినాఖా అసెంబ్లీ నియోజకవర్గంలోని బ్రహ్మంచక్‌ పోలింగ్‌ స్టేషన్‌కు సమీపంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఆ ప్రాంతంలో మరోసారి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement