కలకత్తా: సొంత పార్టీ నేత, పశ్చిమబెంగాల్ జైళ్ల మంత్రి అఖిల్‌గిరిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరి ఓ మహిళా అధికారిని బెదిరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సీరియస్ అయింది. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గిరిని పార్టీ ఆదేశించింది.
ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సంతనుసేన్ మాట్లాడుతూ ‘ఒక మహిళా అధికారితో మా మంత్రి అనుచితంగా ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తనను మేం సమర్థించం. ఆ మంత్రిని మహిళా అధికారికి క్షమాపణ చెప్పడంతోపాటు మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాం.
తృణమూల్ కాంగ్రెస్ రాజధర్మాన్ని పాటిస్తుంది. మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ సొంత పార్టీ నేతలపై ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీపీఎం కూడా ఈ విషయాల్లో రాజధర్మాన్ని పాటించలేదు’అని సంతనుసేన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment